సారాంశం
వీర్య గణన అనేది, ఒక వీర్య విశ్లేషణ పరీక్షలో వీర్యము యొక్క నాణ్యతను నిర్ధారించుటకు ఉపయోగించబడే పారామితులలో ఒకటి. వీర్య విశ్లేషణ పరీక్ష అనేది, ఒక పురుషుడి యొక్క సంతాన అర్హతను నిర్ధారించడానికి సహాయపడే ఒక ముఖ్యమైన పరీక్ష. పరీక్షించు ఒక నమూనా (వీర్యము)లో కనిపించిన సగటు వీర్యకణాల సంఖ్యగా అది కొలవబడుతుంది. తక్కువ వీర్య గణనలు, వీర్యము యొక్క నమూనాలో ఆశించబడిన విలువకంటే తక్కువ సంఖ్యను సూచిస్తాయి. తక్కువ వీర్య గణనతో ఉన్న ఒక వ్యక్తి ఎటువంటి లక్షణాలు లేకుండానూ ఉండొచ్చు లేదా వృషణాల వాపు లేదా ఇతర లక్షణాలను కలిగి ఉండవచ్చు. తక్కువ వీర్య గణనలు ఉండటానికి కారణం పునరుత్పత్తి అవయవానికి సంబంధించి ఉండవచ్చు లేదా అధిక ఉష్ణోగ్రతకు గురి కావడం వంటి బాహ్య అంశాలు కావచ్చు. ఒక లేబొరేటరీలో జరిపే వీర్య అధ్యయనం ద్వారా ఈ నిర్ధారణ చేయబడుతుంది. కారణమైన వాహకమునకు (ఏదైనా ఉంటే) గురి కావడం తప్పించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించుకోవడం మరియు డాక్టరు సూచించిన మందులను తీసుకోవడం ద్వారా తక్కువ వీర్య గణనను మెరుగుపరచుకోవచ్చు
తక్కువ వీర్యకణ గణన అంటే ఏమిటి?
నపుంసకత్వము అనేది, సహజ ప్రక్రియ ద్వారా పునరుత్పత్తి చేయలేని ఒక వ్యక్తి యొక్క అసమర్థత. ఇది, ప్రపంచవ్యాప్తంగా అనేకమంది దంపతులను ప్రభావితం చేస్తున్న ఒక నిరంతర సమస్యగా ఉంది. ఈ స్థితికి పురుషుడు లేదా స్త్రీ ఎవరో ఒకరు లేదా ఇద్దరూ బాధ్యులు కావచ్చు. పురుష వంద్యత్వము అనేది, కొన్ని జన్యుపరమైన లేదా వాతావరణ కారణాల వల్ల వీర్యములో కలిగే నిర్మాణాత్మక మరియు విధులపరమైన లోపాలవల్ల ఏర్పడవచ్చు. ఇవి సరిచేయదగినవి లేదా శాశ్వతంగా ఉండిపోయేవి కావచ్చు. కనీసం ఒక సంవత్సరం పాటు అసురక్షిత సంభోగము తర్వాత కూడా దంపతులు సంతానం పొందే అర్హత సాధించకుంటే, డాక్టరు వారిని వంద్యత్వముతో ఉన్నట్లుగా నిర్ధారణ చేస్తారు. సమస్య పురుష భాగస్వామిలో ఉందా లేదా స్త్రీలో ఉందా లేదా ఇద్దరిలోనూ ఉందా అనే విషయం ప్రయత్నించి కనుక్కోవడానికి పరిశోధనలు చేపట్టబడతాయి. పురుషులలో తక్కువ వీర్య గణనలు,20-30% వ్యక్తులలో వీర్యములోని లోపాల వల్ల గమనించబడ్డాయి. లోపల దాగియున్న సమస్యను కనిపెట్టడానికి, జీవనశైలి, అలవాట్లు, మరియు వృత్తి గురించి డాక్టరుచే ఒక వివరమైన చరిత్ర పరిశోధన చేపట్టబడుతుంది. ఒకసారి ఒక వ్యక్తి తక్కువ వీర్య గణనలతో నిర్ధారించబడ్డారంటే, ఆరోగ్యకరమైన అలవాట్లు, కొన్ని జాగ్రత్తలు, అనుబంధ పోషకాహారాలు, అవసరమైతే మందుల ద్వారా డాక్టరు నుండి సముచితమైన మార్గదర్శనముతో సమస్యకు చికిత్స చేయవచ్చు.
తక్కువ వీర్య గణన అనేది, పరీక్షించు ద్రవము (వీర్యము) యొక్క నమూనాలో ఉండవలసిన మొత్తం వీర్యకణాల సగటు సంఖ్య కంటే తగ్గుదల ఉన్నట్లుగా చెప్పబడుతుంది. ఇది, పురుషుల యొక్క సంతానోత్పత్తి (పురుషుల మగతనము) సామర్థ్యమును నిర్ధారించుటకు ఒక ముఖ్యమైన ప్రాతిపదిక. ఒక్కో నమూనాకు సాధారణ సగటు వీర్య గణన 15-39 మిలియన్లు. తక్కువ వీర్య గణన అనగా, ఒక్కో నమూనాకు వీర్య గణన 15 మిలియన్ల కంటే తక్కువగా ఉందని అర్థం.
తక్కువ వీర్యకణ గణన యొక్క చికిత్స -
తక్కువ వీర్య గణనకు చికిత్స, లోపల దాగియున్న కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ లోపల దాగియున్న కారణము గనక చికిత్స చేయగలిగినదైతే, అప్పుడు తక్కువ వీర్య గణనకు చికిత్స చేయవచ్చు. చికిత్సలో ఈ క్రిందివి చేరి ఉంటాయి:
- ఒక వివరమైన చరిత్ర
ఇది, దైహిక వైద్య రుగ్మతల గురించి తెలుసుకోవడానికి సహాయపడగలదు- (ఉదా., మధుమేహవ్యాధి మెల్లిటస్ మరియు పైభాగం శ్వాస సంబంధిత వ్యాధులు).
- గతంలో జరిగిన ఏవైనా శస్త్రచికిత్సలు.
- సుఖవ్యాధుల ఇన్ఫెక్షన్లతో సహా లైంగిక చరిత్ర
- వేడిమి, ఏవైనా విషపదార్థాలు లేదా పురుగుమందులకు గురి అయి ఉండుట.
- పని చేయు సమయములో దేనికైనా గురయ్యారా అనేదానితో కూడిన వృత్తిపరమైన చరిత్ర
- కౌన్సెలింగ్
మీ స్థితి గురించి మీ డాక్టరు మీకు బాగా వివరించగలుగుతారు. మీ సమస్యలు మరియు వ్యక్తిగత చరిత్ర గురించి చెప్పడానికి మీరు వెనుకాడకూడదు, ఎందుకంటే కారణాన్ని గుర్తించడానికి మరియు చికిత్స చేయడానికి అది సహాయకారి కావచ్చు. అత్యంత ముఖ్యంగా, తక్కువ వీర్యగణనకు కారణం కాగలిగిన ఒత్తిడితో వ్యవహరించడంలో మీ డాక్టరు మీకు సహాయపడగలరు.
- అత్యధిక ఉష్ణోగ్రత, రేడియేషన్లు మరియు విషకారక పదార్థాలకు గురి కావడాన్ని నివారించడం వీర్యగణనను పెంచగలదు.
- భారీ లోహ పరిశ్రమలలో పని చేస్తున్నప్పుడు మరియు పురుగుమందులను వాడునప్పుడు సముచితమైన శ్రద్ధ మరియు రక్షణను తీసుకోవడం.
- పొగత్రాగడం లేదా పొగాకు నమలడాన్నిమానేయడం సహాయకారిగా ఉండగలదు.
- మద్యము వీర్య పరిపక్వతతో జోక్యం కలిగి ఉంటుందని ఋజువయింది కాబట్టి మద్యాన్ని మానివేయడం మంచిది.
- అనుబంధ పోషకాహారాలతో పాటుగా తగిన ఆరోగ్యకర ఆహారము మరియు వ్యాయామము స్థూలకాయాన్ని నియంత్రించగలదు మరియు తక్కువ వీర్య గణనతో వ్యవహరించుటలో సహాయపడగలదు.
- ఒకవేళ వెరికోసెల్ కారణంగా తక్కువ వీర్య గణన ఏర్పడినట్లయితే, శస్త్రచికిత్స ద్వారా నయం చేయవచ్చు.
- జన్యుపరమైన రుగ్మతలు ఉన్న పక్షములో, వ్యాధిని బట్టి తగిన మదింపు మరియు వీర్యాన్ని గ్రహించు ప్రత్యామ్నాయ పద్ధతులు సహాయకారి కాగలవు.
- మీరు తీసుకుంటున్న కొన్ని రకాల మందులు గనక తక్కువ వీర్య గణనకు కారణమై ఉంటే, ఆ మోతాదు తగ్గించమని లేదా వాడకాన్ని ఆపివేయమని మీ డాక్టరు అడగవచ్చు.
జీవనశైలి యాజమాన్యము
తక్కువ వీర్య గణన విషయములో జీవనశైలి మార్పులు సహాయపడగలవు. వీటిలో ఈ క్రిందివి చేరి ఉంటాయి:
- ఒక ఆరోగ్యకరమైన మరియు పోషక సహితమైన ఆహారము మరియు డాక్టరు సూచించి ఉంటే అనుబంధ పోషకపదార్థాల వాడకము.
- ధ్యానము, దీర్ఘ శ్వాస, మరియు యోగా వంటి ఒత్తిడి-తగ్గించు చర్యలను ఎంచుకోవడం ద్వారా ఒత్తిడిని నివారించుకొనుట.
- మీ రోజువారీ దినచర్యలో 30-45 నిముషాల దినసరి వ్యాయామమును చేర్చుట.
- పొగత్రాగడం ఆపివేయుట మరియు మద్యపానము తగ్గించుకొనుట.
- పొగాకు వాడకమును నివారించుట.
- ఎక్కువ వేడిగా ఉండే నీటితో స్నానం చేయడం నివారించుట.
తక్కువ వీర్యకణ గణన కొరకు మందులు
తక్కువ వీర్యకణ పెరగడం కోసం కొన్ని మందులు వాడాలి అనుకొంటే డాక్టర్ సలహాలు తీసుకొని వాడాలి నేను చెప్పిన మందులు అన్ని హై డోస్ మందులు
Medicine Name | Pack Size | |
---|---|---|
Folisurge | Folisurge 1200 Iu Injection | |
Humog Hp | Humog Hp 150 Iu/150 Iu Injection | |
Menopur | Menopur Injection | |
Diva Fsh | Diva Fsh 150 Iu Injection | |
Eema R Fsh | Eema R Fsh 300 Iu Injection | |
Foligem | Foligem 150 Iu Injection | |
Gonal F | GONAL F 150IU INJECTION | |
Newmon R | Newmon R 150 Iu Injection | |
Ovitrop R | Ovitrop R 300 Iu Injection | |
Recagon | Recagon 100 Iu Injection | |
Stimufol P | Stimufol P 150 Iu Injection | |
Bravelle | Bravelle 100 Iu Injection | |
Endogen | Endogen 150 Iu Injection | |
Fostirel | Fostirel 1200 Iu Injection | |
Fshsp | Fshsp 150 Iu Injection | |
Ftrop | Ftrop 150 Mg Injection | |
Gonarec | Gonarec 75 Iu Injection | |
Grafyrec | Grafyrec 1200 Iu Injection | |
Humegon | Humegon 75 Iu Injection | |
Luveris (Merck) | Luveris 75 Iu Injection | |
Metrodin Hp | Metrodin Hp 75 Iu Injection | |
Neogentin | Neogentin 150 Iu Injection | |
Zy Fsh Hp | Zy Fsh Hp 150 I.U Injection | |
Follitec | Follitec 75 Mg Injection | |
Grafova | Grafova 150 Mg Injection |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి