హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవి) అనేది శరీరంలోని
వ్యాధులతో పోరాడే రోగనిరోధక కణాలను నాశనం చేసే వైరస్. సరైన
మందులతో, హెచ్‌ఐవి ని ఎయిడ్స్‌ (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ
వైరస్) గా అభివృద్ధి చెందకుండా అలాగే ఆపగలిగే అవకాశం ఉంది. హెచ్‌ఐవి
మరియు ఎయిడ్స్ చుట్టూ చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలెంటో వాటి

అస్సలు వాస్తవాలేంటో తెలుసుకోవడానికి దీనిని చదవండి.

1వ అపోహ

అపోహ: హెచ్‌ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తుల దగ్గర ఉండటం వల్ల హెచ్‌ఐవి
ఇతరులకి సోకుతుంది.

వాస్తవం: హెచ్‌ఐవి గాలి ద్వారా సంక్రమించే వ్యాధి కాదు. అదే గాలిని
పీల్చడం ద్వారా లేదా ఒకే చోట ఉండటం వల్ల కానీ హెచ్ ఐ వి సోకదు.
2 వ అపోహ
అపోహ: కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారా హెచ్ఐవి
వ్యాప్తి చెందుతుంది.
వాస్తవం: ఇది సుద్ద తప్పు. అలా గైతే మనం హెచ్ఐవి పాజిటివ్ మరియు
హెచ్ఐవి నెగిటివ్ వ్యక్తుల కోసం రెండు ప్రత్యేక ప్రపంచాలను
సృష్టించాలి. మీరు నిశ్చింతగా హెచ్ఐవి ఉన్నవారిని కౌగిలించుకోవచ్చు మరియు
ముద్దు పెట్టుకోవచ్చు. వీర్యం మరియు రక్తం వంటి శరీర ద్రవాలను
పంచుకోవడం ద్వారా మాత్రమే HIV వ్యాపిస్తుంది.

3వ అపోహ
అపోహ: దోమ కాటు ద్వారా హెచ్‌ఐవి వ్యాపిస్తుంది
వాస్తవం: దోమలు రక్తాన్ని పీల్చుకుంటాయి తప్పా, రక్తాన్ని ఒకరి నుంచి
ఒకరికి బదిలీ చేయవు. అలా చేస్తూ పోతే అవ్వి ఎలా బ్రతుకుతాయి? దోమల
ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందదు.

4వ అపోహ

అపోహ: హెచ్ఐవి సోకిన వారు కొంతకాలమే జీవిస్తారు
వాస్తవం: సైన్స్ మరియు శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. సరైన
మందులు మరియు సకాల చెక్ అప్లతో, ఒకరు హెచ్‌ఐవితో సుదీర్ఘ జీవితాన్ని
గడపగలరని మరియు హెచ్ఐవి ని ఎయిడ్స్‌కు అభివృద్ధి చేయకుండా
నిరోధించవచ్చని తెలుసుకోండి.

5వ అపోహ
అపోహ: భాగస్వాములిద్దరికీ హెచ్‌ఐవి ఉన్నప్పుడు సెక్స్ సురక్షితం

వాస్తవం: రక్షణ లేకుండా సెక్స్ ఎప్పుడూ సురక్షితం కాదు. మీకు అవాంఛిత
గర్భధారణ లేదా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. హెచ్‌ఐవి పాజిటివ్
రోగుల విషయంలో, వారు ఒకరికొకరు ఇతర హెచ్‌ఐవి జాతులను మరియు లైంగిక
సంక్రమణ వ్యాధులను వ్యాప్తి చేసుకునే అవకాశం ఉంది. ఇవి హెచ్‌ఐవి
వ్యతిరేక మందులకు నిరోధకతను కలిగి ఉంటాయి.

6వ అపోహ
అపోహ: మీకు హెచ్‌ఐవి ఉంటే మీరు పిల్లలను కనకూడదు
వాస్తవం: తల్లి నుంచి తన పుట్టబోయే బిడ్డకు, హెచ్‌ఐవి మరియు ఎయిడ్స్‌
సోకే అవకాశం ఉన్నప్పటికీ, సరైన మందులు వాడటం ద్వారా హెచ్‌ఐవి నెగటివ్
బిడ్డకు జన్మని ఇవ్వొచ్చు. సైన్స్ అభివృద్ధి చెందింది, హెచ్ఐవి పాజిటివ్
మహిళలకు హెచ్ఐవి నెగిటివ్ పిల్లల్ని కనే అవకాశాన్ని మరియు అలాంటివారికి
కుటుంబ జీవితాన్ని ఆస్వాదించే అవకాశాన

ధన్యవాదములు