పురుషులు ఎదుర్కొంటున్న ప్రధానమైన లైంగిక సమస్యలలో శీఘ్ర స్ఖలనం ఒకటి. ఇది హెచ్చు శాతం మందిని మానసికంగా కృంగదీస్తున్నది. పురుషుడు సంభోగం సందర్భంగా అంగస్తంభనను నిలుపకోలేకపోవడం ఈ సమస్యకు కారణం. ఉద్వేగం పొందడానికి మునుపే స్ఖలనం జరగడం శీఘ్రస్ఖలనంగా చెప్పబడుతుంది. రతి ప్రారంభించిన నిమిషం లోపుగా వీర్య స్ఖలనం జరిగితే దానిని శీఘ్ర స్కలనం లేదా ప్రి-మెచ్యూర్ ఎజాక్యులేషన్ – ( పి ఐ) అంటారు. ఈ దుస్థితి పురుషునికి మానసికంగా ఇబ్బంది కలిగించి తన లైంగిక భాగస్వామితో సంబంధాలను త్రుంచివేస్తుంది శీఘ్ర స్ఖలనం ప్రాథమిక (యావజ్జీవ ప్రాతిపదిక ) స్థాయిలో లేదా సెకండరీ స్థాయిలో ( తెచ్చుకొన్నది) ఉంటుంది. ఈ దుస్థితికి కారణం శారీరక , మానసిక లేదా జన్యుపమైనది కావచ్చు. మానసిక ఒత్తిడి నిర్వహణ, ఔషధాల వాడకం, మానసిక వైద్య నిపుణుని సలహాలు మరియు సముచిత వ్యాయామం తో కూడిన విభిన్న చికిత్సలు పరిస్థితిని చక్కదిద్దుతాయి. శీఘ్రస్ఖలనం సమస్య హెచ్చు మోతాదులో ఉన్నప్పుడు, చికిత్స లోపం మానసిక ఒత్తిడిని మరింత తీవ్రం చేస్తుంది.. కొన్ని సందర్భాలలో , ఇది పుంస్త్వం/ పుంసకత్వం సమస్యకు దారితీస్తుంది. ఎందుకంటే వీర్యం యోనిలో ప్రవేశించడంలో విఫలమవుతుంది. ఎక్కువ మంది పురుషులలో శీఘ్ర స్ఖలనం సమస్యను వైద్య సహాయంతో నయం చేయవచ్చు
శీఘ్ర స్కలనం యొక్క లక్షణాలు
డి ఎస్ ఎం - 5 ప్రకారం ఇక వ్యక్తి శీఘ్ర స్ఖలనం సమస్యను ఎదుర్కోవడానికి క్రిందివాటిలో ఏదయి కావచ్చు :
- సంభోగం ప్రారంభించిన నిమిషంలోపుగా స్ఖలనం జరగడం
- ఆరు నెలల పాటు అంతకంటే హెచ్చు కాలం శీఘ్రస్ఖలనం జరగడం
- 75% నుండి 100 % సంభోగం సందర్భాలలో శీఘ్రస్ఖలనం జరగడం
- లైంగిక భాగస్వాములలో లైంగికంపరమైన అసంతృప్తి, విసుగు, మానసిక ఒత్తిడి
- మానసిక దుస్థితి కలగడం, లేదా వైద్య చికిత్స పర్యవసానం అట్టి పరిస్థితికి దారి తీయడం
- లోగడ మాదక ద్రవ్యాలకు బానిస కావడం, శీఘ్ర స్ఖలనానికి దారితీసే కొన్ని మందులను సేవించడం
శీఘ్ర స్కలనం యొక్క చికిత్స
చికిత్సకు పెక్కు ఐచ్చికాలు లభిస్తున్నాయి. వాటిలో సలహాలు తీసుకోవడం, ఔషధాల సేవన, లైంగిక ప్రవర్తనలో కొత్త విధానాలు, సమయోచితంగా మత్తు పొందడం వంటివి.
- సలహాల కల్పన మరియు సెక్స్ థెరపీ.
సలహాల ప్రక్రియ మీ సలహాదారునితో (కౌన్సెలర్) మీ లైంగిక సమస్యలపై ముఖాముఖిగా మనసు విప్పి చర్చించడం. మీ సలహాదారు లేక డాక్టరు పరిస్థితిని సరిదిద్దుకోవడానికి ఎదురవుతున్న దుస్థితిని అధిగమించడానికి విధానాలను వివరిస్తారు. ఆందోళనకు, మానసిక ఒత్తిడికి మార్గం సూచిస్తారు.. సెక్స్ థెరపీ మరియి సంబంధాల సలహా ప్రక్రియ భాగస్వాముల మధ్య సత్సంబంధాన్ని పునరుద్ధరిస్తుంది. - ఔషధాలు
స్ఖలనం ఆలస్యం కావడంలో సహకరించడానికి వివిధ రకాల మందులు సూచింప బడతాయి. వీటిలో ఆంటీడిప్రెషంట్స్, అనాల్జెసిక్స్ మరియు ఫాస్ఫోడైయ్స్టరేస్- 5 నిరోధకాలు చేరి ఉంటాయి. ఇవి స్ఖలనాన్ని నిదానం చేసే గుణం కలిగి ఉంటాయి ( అయితే ఇవి ఎఫ్ డి ఏ ఆమోదం పొందలేదు). మీ ఆరోగ్య స్థాయిని అనుసరించి మీ డాక్టరు ఈ మందులను విడిగా గాని, లేదా ఇతర కొన్న మందులతోపాటుగా గానీ సూచించవచ్చు. స్వయంగా మందులను తీసుకోవడం వల్ల తీవ్రమైన వైద్యపరమైన సమస్యలు ఎదురుకావచ్చు. దీనితో ఈ జబ్బు ఎదుర్కొంటున్న వ్యక్తి వైద్యుని సలహా లేకుండా స్వయంగా మందులను తీసుకొనకూడదు - నడచుకోవడంలో విధానాలు
కొందరిలో శీఘ్రస్కలనాన్ని కేవలం నడవడిక విధానంలో మార్పులతో సరిదిద్దవచ్చు. యోనిలో సంభోగంతో కాకుండా లైంగికంగా ఇతర విధాలతో సాన్నిహిత్యం పెంపొందించుకోవడంపై దృష్టి నిలపడం ఒక ప్రక్రియ. ఇది పరిస్థితిని చక్కదిద్దుతుందని వెల్లడయింది. మీ డాక్టరు శీఘ్రస్ఖలనాన్ని అధిగమించడానికి అదుపుచేయడానికి వీటిలో కొన్ని మార్గాలను సూచించవచ్చు. - సమయోచితమైన అనీస్థిటిక్స్
మీ డాక్టరు అనీస్థిటిక్ క్రీములు, స్ప్రేలు సూచించవచ్చు. ఇవి జననాంగంపై వాడినప్పుడు అవి స్పర్శజ్ఞానాన్ని తొలగించి స్ఖలనాన్ని నివరిస్తాయి. వీటిని లైంగిక క్రియకు 10-15 నిమిషాల ముందు ఉపయోగించాలి. వీటిలో కొన్ని స్ప్రేలు మందుల దుకాణంలో మందుల సూచిక లేకుండా లభిస్తాయి. కొన్నిటికి సూచిక అవసరం. వీటిలో పెక్కు ఔషధాలు శీఘ్రస్ఖలనాన్ని అదుపు చేసినప్పటికీ, కొన్ని సందర్భాలలో అవి స్పర్శజ్ఞానం కోల్పోవడానికి, స్త్రీలు, పురుషులలో లైంగిక కోరిక తగ్గడానికి దారి తీస్తాయని కొన్నినివేదికలు పేర్కొంటున్నాయి. - వ్యాయామాలు
కటి కండరాలను ఒత్తిడి చేయడం వల్ల ఒక వ్యక్తి స్ఖలనాన్ని నిదానం చేయవచ్చు. బలహీనమైన కటి కండరాలు శీఘ్ర స్ఖలనానికి వీలు కల్పిస్తాయి.- సరియైన కండరాలను గుర్తించండి
ఈ ప్రక్రియలో చోటుచేసుకొన్న కండరాలను గుర్తించడానికి సంభోగానికి ముందుగా మూత్ర విసర్జనను నిలిపివేయండి. ఈ కండరం స్ఖలనాన్ని నిలుపుతుంది. వాయువును సమయానుసారం బయటకు వదలడాన్ని నిలపడం వల్ల కూడా స్ఖలనం అదుపుచేయబడుతుంది. - కండరాలను మీ దారికి మలచుకొనండి
మీ కటి కండరాలను 3 – 4 సెకన్లపాటు సంకోచం చేయండి తర్వాత సడలించందడి. ఈ వ్యాయామాన్ని 4-5 మార్లు కొనసాగించండి.. మీ కండరాలు గట్టి పడటంతో వ్యాయామాన్ని ప్రతి సమయంలో 10 మార్లు వంతున రోజుకు మూడు మార్లు జరపండి.
- సరియైన కండరాలను గుర్తించండి
- పాస్- స్వీజ్ ప్రక్రియ
ఈ ప్రక్రియ శీఘ్ర స్ఖలనం అదుపునకు సహకరిస్తుంది.. సంభోగానికి మునుపు తొలి ప్రక్రియలు యధావిధిగా జరపండి మీరు అంగస్తంభనను అదుపులో ఉంచుకొనలేక , స్ఖలనం జరిగితే, మీ భాగస్వామిని మీ జననాంగాన్ని ఒత్తిపట్టుకొనాలని చెప్పండి. స్ఖలనం జరపాలనే కోరిక తీరేవరకు కొన్ని సెకన్లు అలాగే ఉంచుకోవాలి. ఈ ప్రక్రియను వీలయినన్ని మార్లు కొనసాగించండి. స్ఖలనం జరపకుండా మీ లైంగిక భాగస్వామిలోనికి చొచ్చుకువెళ్లండి. తద్వారా మీరు మీ స్ఖలనాన్ని అదుపు చేసుకొనగలరు. తర్వాత మీరు స్ఖలనం నియంత్రణకు ఈ ప్రక్రియ అనుసరించే అవసరం ఉండదు. ఈ విధానాన్ని స్ఖలనం జరపకుండా మీ భాగస్వామి శరీరంలోకి చొచ్చుకు వెళ్ళేవరకు కొనసాగించండి. దీనిద్వారా మీరు స్ఖలనాన్ని అదుపులో ఉంచుకొనగలరు - తొడుగుల వాదకం
మందమైన పదార్థం చేయబడిన రబ్బరు తొడుగులు ( కాండోంలు ) జననాంగంలో స్పర్శజ్ఞానాన్ని జాప్యంచేసి స్ఖలనాన్ని అదుపు/ నిదానం చేస్తాయి కొన్ని దేశాలలో కాండోములలో ‘క్లైమాక్స్ కాండోము’ లు లభిస్తున్నాయి. ఇవి స్పర్శజ్ఞానాన్ని తగ్గిస్తాయి.
స్వయంగా శ్రద్ధ తీసుకోవడం :
శీఘ్రస్ఖలనం లైంగిక జీవితంపై , భార్యాభర్తల సాన్నిహిత్యంపై చెడుప్రభావం కలిగిస్తుంది. ఇది దంపతులలో మానసిక ఒత్తిడి కలిగించి వారి మధ్య దూరాన్ని పెంచుతుంది. ప్రతి ముగ్గురిలో ఒకరు తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు శీఘ్రస్కలనాన్ని ఎదుర్కొంటున్నారని పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. రెండు మూడు అనుభవాలతో దంపతులువారికివారే సరిపడుతున్నారు.
లైంగిక క్రియలో ఆందోళన సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ మనసును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి. సుఖ సాంసారిక జీవితం అనుభవించడానికి ప్రయత్నించండి. శీఘ్రస్ఖలనం సమస్య ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండండి. ఒక విషయం జ్ఞప్తిలో ఉంచుకోండి.మీ లైంగిక భాగస్వామిని సంతృప్తి పరచడానికి పెక్కు మార్గాలు ఉన్నాయి. మీలో దానికి అవసరమైన జ్వాల రగులుతూ ఉంటుంది. మీ సాన్నిహిత్యం దెబ్బతినకుండా ఉంటుంది. మీకు సహాయం కావాలనుకొంటే, మీ డాక్టరును సంప్రతించడానికి సందేహించకండి.
జీవన సరళి/ విధానం నిర్వహణ
శీఘ్రస్ఖలనానికి పెక్కు కారకాలు ఉంటాయి. అవి మానసికమైనవి మరియు శరీరకమైనవి కూడా. మానసిక ఒత్తిడి మరియు లైంగిక క్రియ సందర్భంగా ఆందోళన శీఘ్రస్ఖలనంలో కీలకమైన పాత్ర వహిస్తాయి. ఒత్తిడి స్థాయిని అదుపు చేసుకోవడం, మీ లైంగిక భాగస్వామితో నిజాయతీగా దేనినీ దాచిపెట్టకుండా చర్చించడం వల్ల ఈ దుస్థితి నుండి బయటపడవచ్చు. ఒత్తిడిని తొలగించుకొంటే పరిస్థితి చక్కబడుతుంది. కొన్ని జీవనసరళి జబ్బులైన మధుమేహం, హెచ్చు బి పి, థైరాయిడ్ సమస్యలు, ప్రొస్టేట్ సమస్యలు పరిష్కారమైతే శశీఘ్రస్ఖలనం సమస్యకు పరిష్కారం లభిస్తుంది..
శీఘ్ర స్కలనం కొరకు అలౌపతి మందులు
Medicine Name | Pack Size | |
---|---|---|
Xylo | Xylo 2% Infusion | |
Xylocaine Injection | Xylocaine Viscous Solution | |
Xylocaine Heavy | Xylocaine Heavy 5% Injection | |
Xylocard | Xylocard Injection | |
Corectil | Corectil Capsule | |
Xylox | Xylox Gel | |
ADEL Titanium Metallicum Dilution | ADEL Titanium Metallicum Dilution 1000 CH | |
Rexidin M Forte Gel | Rexidin M Forte Gel | |
Alocaine | Alocaine Injection | |
Dr. Reckeweg Titanium Metallicum Dilution | Dr. Reckeweg Titanium Metallicum Dilution 1000 CH | |
Lcaine | Lcaine Injection | |
Penetal | Penetal Tablet | |
Nircaine | Nircaine Injection | |
Unicain | Unicain Injection | |
Wocaine A | Wocaine A Injection | |
Xylonumb | Xylonumb 2% Injection | |
Xynova | Xynova Gel | |
Zelcaine | Zelcaine Injection | |
Smuth Cream | Smuth Cream | |
Quik Kool | Quik Kool Gel | |
Ora Fast | Ora Fast Cream | |
Orex Lo | OREX GEL 10GM |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి