క్రొవ్వు కరగడానికి తీసుకోవాలిసిన జాగ్రత్త లు అవగాహన కోసం నవీన్ నడిమింటి సలహాలు
అతిగా వున్న కొవ్వు నివారణకు
శరీరంలో కొవ్వు అతిగా పేరుకున్న వాళ్ళు నెలకొక సారి విరేచానానికి మందు వేసుకోవాలి.పగటిపూట నిద్రించ రాదు.రాత్రి పూట 4,5 గంటలు మాత్రమే నిద్ర పోవాలి.
కొర్రల గంజి మంచిది, యవలు మంచి ధాన్యము. బియ్యము, గోధుమలు వాడకూడదు. పాల ఉత్పత్తులు ,చెరకు ఉత్పత్తులు తినరాదు.
విరేచానానికి మందు
అల్లం రసం ------ 2 టీ స్పూన్లు
తేనె ------ 2 టీ స్పూన్లు
వంటాముదం ----- 4 టీ స్పూన్లు
అన్నింటిని కలిపి ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి మూడు పొంగులు రానిచ్చి దించి గోరువెచ్చగ వేకువ జామున తాగాలి. ఆ రోజంతా చారన్నం తినాలి.
శరీర భాగాలలో కొవ్వు కరిగించడానికి
.
.
వెల్లకిలా పడుకొని నిదానంగా కుడి కాలును పైకి లేపాలి.అదే విధంగా రెండవ వైపు కూడా గాలి పీలుస్తూ వదులుతూ చెయ్యాలి . మరల రెండు కాళ్ళను ఒకే సారి పైకేత్తాలి, నెమ్మదిగా దించాలి.ఈ వ్యాయామాన్ని రెండు, మూడు సార్లతో ప్రారంభించి హెచ్చించాలి.
ఈ విధంగా చెయ్యడం వలన నడుము నొప్పి తగ్గుతుంది, పొట్టలో వున్న కొవ్వు కరుగుతుంది.
ఉదయం, సాయంత్రం ఖాళి కడుపుతో మాత్రమే చెయ్యాలి.
ఆహార నియమాలు:-
అతి చల్లని పదార్ధాలు.నిల్వ ఉంచిన పదార్ధాలు,వేపుడు కూరలు, ఉడికి వుడకని పదార్ధాలు తినకూడదు.
జెర్సీ ఆవుల, గేదెల పాలలో కొవ్వు ఎక్కువగా వుంటుంది. కాబట్టి అవి వాడకూడదు, మాంసాహారం జీర్ణం కావడానికి 48 నుండి 72 గంటలు పడుతుంది
ఉదయం టిఫిను మానేసి ఉదయపు భోజనం 6 గంటల లోపు, రెండవ భోజనం 8 గంటల లోపు భోంచేయ్యాలిసాయంత్రం పండ్ల రసాలు తీసుకోవచ్చు.
ఉదయపు భోజనం :-
పాత గోధుమలు గాని, పాత రాగులు గాని, పాత బియ్యం గాని ఒక గ్లాసు తీసుకోవాలి.దానికి 14 గ్లాసుల నీటిని కలిపి మెత్తగా జావ లాగా ఉడికించాలి.దానికి చిటికెడు జిలకర, చిటికెడు ధనియాల పొడి,చిటికెడు వాము,చిటికెడు మిరియాల పొడి అర టీ స్పూను సన్నగా తురిమిన అల్లం ముక్కలు,కారెట్ ,బీట్రూట్, ఇతర కూరగాయల ముక్కలు అందులో వేసి కిచిడి లాగా చేసి కొత్తిమీర, కరివేపాకు వేసి తినాలి. సైంధవ లవణం కలపాలి.
దీని వలన ఒక్క గ్రాము కూడా అదనంగా కొవ్వు పెరగదు, పైగా కొవ్వు కరుగుతుంది.
శరీరంలో కొవ్వు కరిగించడానికి.
నూనె, నెయ్యి ఎక్కువగా వాడినపుడు దానికి తగిన శారీరక శ్రమ లేకపోవడం వలన శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కాని నూనె, నెయ్యి తగినంత వాడుకోవాలి. పూర్తిగా వాడడం మానేస్తే శరీరం ఎండి పోయినట్లు అవుతుంది., ఆహారం జీర్ణం కాదు.
దోరగా వేయించిన వాయు విడంగాలు
" " శొంటి
ఉసిరిక పొడి
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని విడివిడిగా చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
ప్రతి రోజు రెండు పూటలా అర టీ స్పూను పొడిని ఒక గ్లాసు బార్లీ జావాలో కలుపుకొని తాగాలి లేక తేనెతోకలుపుకొని తాగాలి. దీని వలన మూత్రము ఎక్కువగా వస్తున్నా భయపడవలసిన పని లేదు.
కొవ్వు కరగడానికి
తిప్ప తీగ పొడి
తుంగ గడ్డల పొడి
రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని మెత్తగా దంచి జల్లించి కలిపి భద్ర పరచుకోవాలి.
అర టీ స్పూను పొడిని ఒక టీ స్పూను తేనెతో ప్రతి రోజు తీసుకుంటే కొవ్వు అద్భుతంగా కరుగుతుంది.
1. త్రిఫలాలు
త్రికటుకాలు
సైంధవ లవణం
అన్ని చూర్ణాలను కలిపి ముద్దగా చేసుకోవాలి. ప్రతి రోజు కుంకుడు కాయంత ముద్దను తినాలి. లేదా ఉదయం బార్లీ నీళ్ళలో కలుపుకొని తాగ వచ్చు.
2. మధ్యాహ్న భోజనానికి రొట్టె
బార్లీ పిండి --- 125 gr
గోధుమ పిండి ---- పావు కిలో
మిరియాల పొడి --చిటికెడు
శొంటి పొడి -- "
పిప్పళ్ళ పొడి --- '
సైంధవ లవణం --- తగినంత
అన్నింటిని నీటితో కలిపి రొట్టె చేసుకుని తినాలి. దీనిలోకి పొన్నగంటి కూర గాని, మెంతి కూర గాని కలుపుకొని తినాలి.
3. సాయంత్రం ఉలవకట్టులో సైంధవ లవణం కలుపుకొని తాగాలి.
4. రాత్రి పుల్లటి పండ్లను తినాలి.
శరీరంలో కొవ్వు కరిగించడానికి.
ప్రాణాయామం ద్వారా :-- సుఖాసనంలో కూర్చొని బాగా దీర్ఘంగా గాలిని పీల్చి నెమ్మదిగావదలాలి.ఈ విధంగా చేసేటపుడు పొట్ట బాగా లోపలి పోవాలి.
1. ఒక కప్పు మెంతి ఆకుల రసం లో ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగాలి.ఈ విధంగా ఉదయం, సాయంత్రం రెండు పూటలా చెయ్యాలి.లేదా కనీసం రోజుకొకసారైనా చెయ్యాలి.
2. మామిడి, సపోటా, అరటి కొవ్వును పెంచుతాయి.
బొప్పాయి కొవ్వును కరిగించడంలో ప్రధానమైనది.
ఉదయం --పచ్చి ఆకుల రసం
సాయంత్రం --పండ్ల రసం
దీనితోబాటు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగాలి.దీని వలన నీరసం రాదు.తేనె, నీరు చాలా బలాన్నిస్తుంది.
కొవ్వును కరిగించడానికి తైలం
100 గ్రాముల ఆవాల నూనెను స్టవ్ ,\మీద పెట్టి వేడి చేసి దించి దానిలో 20 గ్రాముల మిరియాల పొడి, 10 గ్రాముల ముద్ద కర్పూరం కలిపి నిల్వ చేసుకోవాలి. ఇది అద్భుతంగా కొవ్వును కరిగిస్తుంది.
స్నానానికి గంట ముందు కొంత తైలం తీసుకొని కొవ్వు వున్న భాగంలో మర్దన చెయ్యాలి. ఒక అర గంట సేపు గాని, గంట సేపు గాని మర్దన చెయ్యాలి. దీనితో శరీరం మీద వున్న మచ్చలు కూడా నివారింప బడతాయి.అద్భుతమైన అందం, నిగారింపు వస్తాయి.
శరీరంలో అతిగా కొవ్వు చేరడం వలన వచ్చే దుర్గంధాన్ని నివారించడం
నల్ల తుమ్మ ఆకులను రుబ్బిన పేస్ట్
కరక పెచ్చులను రుబ్బిన పేస్ట్
నల్ల తుమ్మ ఆకుల పేస్ట్ ను ముందు ఒళ్లంతా పట్టించాలి. తరువాత కరక్కాయ పేస్ట్ రుద్దాలి. దీని వలన శరీర దుర్గంధము నివారింప బడుతుంది. కొవ్వు కర్గుతుంది.
అధిక క్రొవ్వును తగ్గించడం.
ఉల్లి గడ్డల రసం ----- పావు కిలో
ఆవాల నూనె ----- పావు కిలో
రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద రసం ఇంకి పోయి నూనె మాత్రమే మిగిలేట్లు కాచాలి. చల్లారిన తరువాత బట్టలో పోసి వడకట్టాలి.
శరీరంలో ఎక్కడ చెడు వాయువు, కొవ్వు చేరి ఉంటాయో అక్కడ ఈ తైలం తో బాగా మర్దన చెయ్యాలి.

Cellulite --- చర్మం కింద కొవ్వు చేరడం -- నివారణ
ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా వుంటుంది.
వయసు మీద పడినట్లుండడం, చర్మం కమలా పండు లాగా మందంగా తయారవడం జరుగుతుంది.
పిరుదులలో, ముంజేతుల పై భాగంలో, పొట్ట మీద ఎక్కువగా పేరుకుంటుంది.
ఈ సమస్య స్థూల కాయం , హార్మోన్ల లో తేడా, అతినీల లోహిత కిరణాల ప్రభావం మొదలైన కారణాల వలన వస్తుంది.
చర్మం లో బిగువు తగ్గి వేలాడుతున్నట్లు ఉండడం వీడియొ గేమ్స్ ఆడేటపుడు ప్రాణ వాయువు తగ్గడం ధూమ పానం , కెఫీన్ ఎక్కువగా వాడడం వలన శరీరంలోఆక్సిజెన్ తగ్గడం వంటివి జరుగుతాయి.
వయ్యారి భామ లేదా కాంగ్రెస్ గడ్డి ప్రభావానికి గురి అయినపుడు గర్భధారణకు, పాల ఉత్పత్తికి సమస్య
వయ్యారి భామ లేదా కాంగ్రెస్ గడ్డి ప్రభావానికి గురి అయినపుడు గర్భధారణకు, పాల ఉత్పత్తికి సమస్య
ఏర్పడుతుంది.
వయసు మీరడం కూడా ఒక ప్రధాన కారణం
ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అతి నీల లోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా వుంటుంది. కావున ఆ సమయం లో జాగ్రత్తలు పాటించాలి.
పాటించ వలసిన నియమాలు:--- క్రమంగా బరువు తగ్గాలి. రోజుకు ఆరు నుండి పది లీటర్ల నీటిని తాగాలి.
క్రొవ్వు పదార్ధాలు, నిల్వపదార్ధాలు, కాఫీ, టీలు, ఉప్పు తగ్గించి వాడుకోవాలి. వ్యాయామం చెయ్యాలి.
ఆరోగ్యదారి ( రేల పండు ) యొక్క గుజ్జుతో మర్దన చెయ్యాలి. తైల మర్దన తప్పని సరి.
నూనె, నెయ్యి ఎక్కువగా వాడినపుడు దానికి తగిన శారీరక శ్రమ లేకపోవడం వలన శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కాని నూనె, నెయ్యి తగినంత వాడుకోవాలి. పూర్తిగా వాడడం మానేస్తే శరీరం ఎండి పోయినట్లు అవుతుంది., ఆహారం జీర్ణం కాదు.
దోరగా వేయించిన వాయు విడంగాలు
" " శొంటి
ఉసిరిక పొడి
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని విడివిడిగా చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
ప్రతి రోజు రెండు పూటలా అర టీ స్పూను పొడిని ఒక గ్లాసు బార్లీ జావాలో కలుపుకొని తాగాలి లేక తేనెతోకలుపుకొని తాగాలి. దీని వలన మూత్రము ఎక్కువగా వస్తున్నా భయపడవలసిన పని లేదు.
కొవ్వు కరగడానికి
తిప్ప తీగ పొడి
తుంగ గడ్డల పొడి
రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని మెత్తగా దంచి జల్లించి కలిపి భద్ర పరచుకోవాలి.
అర టీ స్పూను పొడిని ఒక టీ స్పూను తేనెతో ప్రతి రోజు తీసుకుంటే కొవ్వు అద్భుతంగా కరుగుతుంది.
1. త్రిఫలాలు
త్రికటుకాలు
సైంధవ లవణం
అన్ని చూర్ణాలను కలిపి ముద్దగా చేసుకోవాలి. ప్రతి రోజు కుంకుడు కాయంత ముద్దను తినాలి. లేదా ఉదయం బార్లీ నీళ్ళలో కలుపుకొని తాగ వచ్చు.
2. మధ్యాహ్న భోజనానికి రొట్టె
బార్లీ పిండి --- 125 gr
గోధుమ పిండి ---- పావు కిలో
మిరియాల పొడి --చిటికెడు
శొంటి పొడి -- "
పిప్పళ్ళ పొడి --- '
సైంధవ లవణం --- తగినంత
అన్నింటిని నీటితో కలిపి రొట్టె చేసుకుని తినాలి. దీనిలోకి పొన్నగంటి కూర గాని, మెంతి కూర గాని కలుపుకొని తినాలి.
3. సాయంత్రం ఉలవకట్టులో సైంధవ లవణం కలుపుకొని తాగాలి.
4. రాత్రి పుల్లటి పండ్లను తినాలి.
త్రిఫలాలు
తుంగ గడ్డలు
మాని పసుపు
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని విడివిడిగా దంచి జల్లించి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను పొడిని కలిపి అర గ్లాసు కషాయం రానిచ్చి గోరువెచ్చగా అయిన తరువాత ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగాలి.
దీని వలన శరీరంలో అధికంగా వున్నకొవ్వు తగ్గుతుంది. రక్త నాళాలలో పెరిగిన కొవ్వు కూడా తొలగించబడుతుంది.
అధికంగా వున్న కొవ్వును, ఆకలిని తగ్గించడానికి సంజీవనీ రసాయనం
ఉత్తరేణి గింజల పొడి ---- అర టీ స్పూను
ఒక గ్లాసు నీటిలో ఈ పొడిని వేసి ఉడికించాలి. దానిలో పాలు, చక్కర కలుపుకోవాలి. దీనిని తాగితే 2 3 రోజులు ఆకలి కాదు. తరువాత ఆకలైతేనే తినాలి.
దీనిని విపరీతమైన లావు శరీరం వున్నవాళ్ళు, విపరీతమైన ఆకలి వున్నవాళ్ళు మాత్రమే వాడాలి. దీనితో విపరీతమైన ఆకలి తగ్గుతుంది, శరీరంలోని కొవ్వు కరుగుతుంది.
కొలెస్ట్రాల్ సమస్య --నివారణ
రెండు వెల్లుల్లి పాయలను సన్నని ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో వేసి ఒక కప్పు పాలు, ఒక కప్పు నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టి ఒక కప్పు మిగిలేట్లు కాచాలి. చల్లారిన తరువాత ఒక టీ స్పూను తేనె కలుపుకొని నిద్రించే ముందు తాగాలి. 40 రోజులు వాడాలి. దీని వలన కొలెస్ట్రాల్ అనబడే చెడు క్రొవ్వు నివారింప బడుతుంది.
కఫ శరీరము కలిగి లావుగా వున్నవాళ్ళు రెండు పాయలను, పైత్య (వేడి ) శరీరము కలిగిన వాళ్ళు ఒక వెల్లుల్లి పాయను వాడాలి.
కొలెస్ట్రాల్ కరగడానికి చిట్కా
తులసి గింజలు
జాజికాయ
రెండింటి చూర్ణాలను సమాన భాగాలుగా తీసుకుని కలిపి నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు ఒక టీ స్పూనుపొడిని నీటితో తీసుకుంటే కొలెస్ట్రాల్ నివారింప బడుతుంది.
శరీర భాగాలలోని కొవ్వును కరిగించడానికి లేపనం
తొడలలో కొవ్వు ఎక్కువైతే రాసుకుంటాయి. చర్మం లో కొవ్వు పెరుకున్నపుడు కమలాపండు
తొక్క మీద లాగా గుంటలు ఏర్పడతాయి.
ఈస్ట్రోజన్, హార్మోన్లు, ఒత్తిడి మొదలైన కారణాల వలన కొవ్వు ఏర్పడుతుంది.
కళ్ళ కింద వలయాలు, గడ్డం కింద కొవ్వు ( Double Chin), స్థూలకాయం మొదలైన
కారణాల వలన శరీర భాగాలలో కొవ్వు పేరుకుంటుంది.
కాఫీ పొడి పేస్ట్ ---ఒక కప్పు
కలకండ పొడి ---అర కప్పు
సముద్రపు ఉప్పు పొడి ---అర కప్పు
ప్రొద్దుతిరుగుడు గింజల నూనె --- అర కప్పు
కాఫీ పొడి లో వేడి నీళ్ళు కలిపి చిక్కటి పేస్ట్ లాగా తయారు చేయాలి. దీనికి కలకండ, ఉప్పు,
నూనె కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి.
కొవ్వు అధికంగా పెరుకున్న ( సెల్యులైట్ ) భాగాల మీద దీనిని రుద్దాలి .
కొవ్వు సహజంగా తొడల లో, మెడ మీద, గడ్డం కింద, పొట్ట మీద, ఎక్కువ ఏర్పడుతుంది.
మొదట ఆ భాగాలను వేడి నీటితో శుభ్రపరచాలి. ఈ లేపనాన్ని పూసి అదుముతూ పైకి
( గుండె వైపుకు ) రుద్దాలి.
ఉపయోగాలు :-- ఇది చర్మం కింద కొవ్వు ఏర్పడకుండా కాపాడుతుంది.
సూచనలు :-- గర్భధారణ సమయంలో, బహిష్టు కు ముందు రోజులలో కొవ్వు ఎక్కువగా తయారవుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.
తీపి పదార్ధాలను, నూనె పదార్ధాలను తగ్గించాలి. నడవాలి. ఉలవ కషాయం తాగాలి. నాలుగైదు మిరియాలను తమలపాకులలో పెట్టుకొని నమిలి తిని నీళ్ళు తాగాలి. భోజనానికి ముందు నీళ్ళు ఎక్కువగా తాగాలి.

ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి