13, అక్టోబర్ 2020, మంగళవారం

ఫిషర్స్ పైల్స్ తదితర సమస్యలు కు ఆయుర్వేదం సలహాలు ఈ లింక్స్ లో చుడండి

ఫిషర్ పైల్స్ సమస్య కు  త్వరగా తగ్గించే ఆయుర్వేదంలో నవీన్ నడిమింటి సలహాలు 

      పైల్స్, హెమరాయిడ్స్.. మలద్వారం దగ్గర మొదలయ్యే ఈ సమస్య ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. సరిగా కూర్చోలేరు.. నిలబడలేరు అన్నట్లుగా ఉంటుంది వీటితో బాధపడేవారి పరిస్థితి. అయితే, ఈ సమస్యని తగ్గించుకునేందుకు కొంతమంది అలోపతి వంటి మందులను ఆశ్రయిస్తారు. అలా కాకుండా ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
    
మలద్వారం లోపల, చుట్టూ వాపువచ్చి పెరిగే కణితులనే పైల్స్, హెమరాయిడ్స్, మొలలు అంటారు. ఇవి రక్తనాళాలు, కండ మొదలైనవాటితోనే ఏర్పడే కణసముదాయాలు. ఇవి రకరకాల సైజుల్లో ఉంటాయి, మలద్వారం బయట కూడా ఇవి పెరగొచ్చు. ఇది తీవ్ర సమస్య కాదు, ఎందుకంటే సాధారణంగా వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ, గుర్తించాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు మొలల సమస్యను తగ్గించుకునేందుకు ఆపరేషన్ కూడా అవసరం అవుతుంది. సాధారణంగా మొలలు జన్యు కారణాలు, వృద్ధ్యాప్యంకి చేరుకుంటున్నకొద్దీ ఎక్కువ అవుతుందని చెబుతారు. గర్భవతుల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది. తరచుగా పొట్ట భాగంలో వచ్చే ఒత్తిడి వల్ల మలద్వారం దగ్గరి సిరలు పొంగి, వాచి మొలలుగా మారతాయి. ఊబకాయం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మరో ముఖ్యకారణం, ఆహారపు అలవాట్లు. మన జీవనశైలిలో ఆహారం చాలా ముఖ్యమైన అంశం, అనారోగ్యకరమైన ఆహారం తినటం వల్ల అనేక ఆరోగ్యసమస్యలు వస్తాయి. మొలలు కూడా వాటిల్లో ఒకటి.


చాలామందికి మొలల సమస్య ఉందని కూడా తెలియదు. కొన్ని లక్షణాలతో సమసయని గుర్తించొచ్చు. మలద్వారం వద్ద నొప్పి, రక్తస్రావం చాలా సాధారణం. చాలామందికి మలద్వారం వద్ద వాపు లేదా పెద్ద బొడిపెలలాగా పెరుగుతాయి.. వాటినే పైల్స్ అంటారు. ఈ సమస్య కారణంగా దురద, స్రావం కూడా సాధారణమే.

అదృష్టవశాత్తూ, ఈ సమస్యకి పరిష్కారం మన ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి.. మనం బాధపడాల్సిన అవసరం లేదు.

పైల్స్ తగ్గించే నవీన్ ఆయుర్వేదం సలహాలు  ఇవే..

ఆయుర్వేద నిపుణులైన బిఎన్ సిన్హా మొలలకి ఏకైక కారణం మలబద్ధకమని అందుకు గల కారణాలు తెలిపారు. ఎక్కువగా కూర్చుని పనిచేసేవారికి ఇది మరింత సాధారణం. ఏ రకమైన వ్యాయామం చేయని వారికి, శరీరం కదపని వారికి ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.


2-3 వారాల వ్యవధిలోనే సమస్యని మెరుగుపర్చే నవీన్ గారు సలహాలు :

1) త్రిఫల చూర్ణం పొడి – మొలల సమస్యకి ప్రధాన కారణం మలబద్ధకం. కాబట్టి త్రిఫల చూర్ణం పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది, అలాగే పైల్స్ కూడా పెరగకుండా ఉంటాయి.
ఎలా వాడాలి? 4గ్రాముల త్రిఫల పొడిని వేడినీటిలో కలిపి ప్రతిరోజూ నిద్రపోయేముందు తీసుకోమని బిఎన్ సిన్హా సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా తీసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి. .

2) ఆముదం నూనె- ఆముదంలో యాంటీఆక్సిడెంట్లు, ఫంగస్, బ్యాక్టీరియా అలాగే వాపు వ్యతిరేక లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకనే ఇది మొలల పరిమాణాన్ని, నొప్పిని తగ్గించటంలో సాయపడుతుంది.

        ప్రతిరోజూ రాత్రిపూట పాలల్లో 3 ఎంఎల్ ఆముదం నూనెను కలిపి తీసుకోమని బిఎన్ సిన్హా సూచిస్తున్నారు. అలాగే మొలల ప్రాంతంలో కూడా ఈ నూనెను రాయాలి. బయటనుండి నూనెను రాయడం, లోపలకేమో పాలలో కలిపి తీసుకోవటం వలన అది ప్రభావవంతంగా నొప్పి, ఇతర మొలల లక్షణాలను తగ్గిస్తుంది.

3) రాత్రిపూట అధిక భోజనం వద్దు –మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అన్ని ఆరోగ్య సమస్యలకి మూలం మన ఆహారపద్ధతులే. మొలలను కారణమయ్యే మలబద్ధకాన్ని ముందుగా తగ్గించాలి. అందుకు తగ్గ ఆహారాన్నే తీసుకోవాలి. అలా అని ఎక్కువ పీచుపదార్థమే (ఫైబర్) ఉన్న ఆహారం తీసుకోకూడదు. పీచు పదార్థానికి ఆహార పరిమాణాన్ని పెంచే లక్షణం ఉంది. అందుకని దానికి దూరంగా ఉండాలి. అలాగే ఎక్కువగా విరోచనకారులైన పదార్థాలు తింటే మలం మరీ పల్చగా మారి, మొలలతో బాధపడుతున్నవారికి అసౌకర్యంగా మారుతుంది. బాగా వేయించిన పదార్థాలు హెమరాయిడ్లను (మొలలను) మరింత తీవ్రతరం చేస్తాయి. అవి జీర్ణవ్యవస్థను మందగించేలా చేసి,ప్రేగులు సరిగ్గా పనిచేయనివ్వకుండా చేసి, లోపలి వాపులను పెంచుతాయి. దీనివల్ల మరింత చికాకుగా, నొప్పిగా ఉంటుంది. రాత్రి పూట అధికభోజనం, ఎక్కువ కారాలు, మసాలాలు ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. ముఖ్యంగా రక్తస్రావం ఉన్న పైల్స్ కి అయితే ఇవి భరించలేని బాధని కలిగిస్తాయి. అందుకని కేవలం ఆరోగ్యకరమైన,తేలికైన ఆహరాన్నే తీసుకోండి.

4) నీరు ఎక్కువగా తాగడం – పైల్స్ ని అరికట్టడానికి ఇది చాలా సులభ పద్ధతి. సరిపడినంత నీరు తీసుకోవటం, అలాగే మంచి ఆరోగ్యకరమైన ఆహారం వలన ప్రేగులు కూడా చక్కగా పనిచేస్తాయి. ఎక్కువ నీరు తాగటం వలన మలబద్ధకం, దాని ద్వారా పైల్స్ రెండూ నివారించబడతాయి. రోజూ 8-10 గ్లాసుల నీరు తాగితే జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. నివారణే చికిత్స కన్నా మెరుగైనది అని అంటుంటారు కదా, మరి ఈ సింపుల్ చిట్కాని అమలుచేసి ఆరోగ్యకర జీవనశైలితో మీరెందుకు జీవించకూడదు?

5) సలాడ్లు – మొలలతో బాధపడేవారు... ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన వెంటనే దోసకాయ వంటి సలాడ్లను తినమని సలహా ఇస్తున్నారు బిఎన్ సిన్హా. క్యారట్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా వాపు వ్యతిరేక లక్షణాలు ఉంటాయి, ఇవి మొలలను తగ్గించటంలో సాయపడతాయి. వీటిలోని విటమిన్ సి, కె లు రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

6) ఇంగువ – మొలల సమస్య ఉన్నవారిని రోజువారీ ఆహారంలో ఇంగువను చేర్చుకోవడం మంచిదని చెబుతున్నారు బిఎన్ సిన్హా. అది కూరల్లోనైనా వేసుకోవచ్చు. లేదా గ్లాసు నీటిలోనైనా కలుపుకుని తాగొచ్చు. మన దేశవాళీ వంటదినుసు అయిన ఇంగువకి కొన్ని జబ్బులను నయం చేసే గుణం ఉంది. ఇది జీర్ణక్రియని మెరుగుపరిచి మొలల సమస్యని కూడా తగ్గిస్తుంది.

మలం చుట్టూ రక్తం అంటుకుపోయి కనిపిస్తుంటే మలద్వారం తాలూకు వెలుపలి ప్రదేశాల నుంచి రక్తం కారుతున్నట్లు లెక్క. ఉదాహరణకు అర్శమొలల్లో ఇలా జరుగుతుంది. మలంతోపాటు రక్తంకనిపించడానికి ఇది అత్యంత సాధారణమైన కారణం. దీనికి తోడు, అర్శమొలల్లో మలద్వారం వద్ద నొప్పి. వాపులు ఉంటాయి. అసనద్వారంలో రక్తనాళాలు ఉబ్బిపోయి తగులుతాయి. దీనిని ప్రత్యక్షంగా పరీక్షించి నిర్ణయించవచ్చు.

నవీన్ సలహాలు : 1. వాము, శొంఠి సమతూకంగా తీసుకొని పొడిచేయాలి. దీనిని అరచెంచాడు మోతాదుగా గ్లాసు మజ్జిగతో కలిపి తీసుకోవాలి. 2. కరక్కాయల నుంచి గింజలను తొలగించి కేవలం పెచ్చులు మాత్రమే గ్రహించి పొడిచేయాలి. దీనిని పూటకు అరచెంచాడు చొప్పున రెట్టింపు భాగం బెల్లంతో కలిపి మూడు పూటలా తీసుకోవాలి. 3. ఉత్తరేణి గింజలను రెండు చెంచాలు పొడి చేసి బియ్యపు కడుగు నీళ్ళతో తీసుకుంటే రక్తం ఆగిపోతుంది. 4. నాగాకేశ్వర చూర్ణం (చెంచాడు), పంచదార (2 చెంచాలు), వెన్న (ఐదు చెంచాలు) అన్నీ కలిపి తీసుకుంటే అర్శమొలల్లో స్రవించే రక్తం ఆగుతుంది.

ఔషధాలు: అర్శకుఠార రసం, కాంకాయనగుటిక, నూరణ పటకములు, అభాయారిష్టం. బాహ్యప్రయోగం - కాసీసాదితైలం.

2. స్థానికంగా చర్మం కోసుకుపోవటం (ఫిషర్):

మలవిసర్జనతో పాటు నొప్పి ఉంటే మలాశయం లేదా పెద్ద పేగు చివరి భాగంలో సమస్య ఉన్నదని అర్థం. అర్శమొలలున్నప్పుడు, మలాశయం లోపలి పొర చీరుకుపోయినప్పుడు (ఫిషర్ / గుదవిదారం) ఇలాంటి నొప్పి వస్తుంది. ఉదర ప్రదేశంలో నొప్పి కేంద్రీకృతమై మలబద్దకంతో కూడి కనిపిస్తున్నట్లయితే కోలైటిస్ వంటి ఇన్ ఫ్లమేషన్లను, పేగుల్లో పెరిగే గడ్డలను లేదా ట్యూమర్లనూ అనుమానించాలి.

సూచనలు: దీనికి పైన పేర్కొన్న 'అర్శమొలల చికిత్స' తీసుకుంటే సరిపోతుంది.

3. చర్మ వ్యాధి (స్కిన్ డిసీజ్):

ఎగ్జమా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి కారణాల వల్ల స్థానికంగా చర్మం రేగి దురద, రక్తస్రావాలు కలుగుతాయి. దీనికి కండూహర తైలాలు చక్కగా పనిచేస్తాయి.

ఔషధాలు: బాహ్యప్రయోగాలు - జాత్యాదితైలం, మహామరీచ్యాది తైలం, కాసీసాదితైలం.

4. కడుపులో మంట / పేగు పూత (గ్యాస్ట్రైటిస్):

మలంతోపాటు రక్తం కనిపించడానికి ప్రధాన కారణం పెగుపూత. ఇది గ్యాస్ స్ట్రైటిస్, పెక్టిక్ అల్సర్, వంటి భేదాలతో వ్యక్తీకృతమవుతుంది. ఈ వ్యాధితో బాధపడేవారు మద్యం, కెఫిన్ కలిగిన పదార్థాలు, సిగరెట్లు, నూనె పదార్థాలు, మసాలాలు మానివేయాలి.

నవీన్ సలహాలు : 1. పిల్లిపీచర గడ్డలు (శతావరి) పచ్చవి తెచ్చి, దంచి రసం తీసి పూటకు అరకప్పు చొప్పున రండు పూటలా పుచ్చుకోవాలి. 2. శతవారి చూర్ణాన్ని పూటకు అరచెంచాడు చొప్పున అరగ్లాసు పాలతో కలిపి రెండు పూటలా తీసుకోవాలి. 3. ఉసిరి చూర్ణాన్ని అరచెంచాడు మోతాదుగా పాలతో కలిపి రోజుకు రెండుసార్లు పుచ్చుకోవాలి. 4. శొంఠి, నువ్వులు, బెల్లం అన్నీ సమభాగాలు తీసుకొని ముద్దచేసి పూటకు చెంచాడు చొప్పున రెండు పూటలా గోరువెచ్చని పాలతో పుచ్చుకోవాలి. 5. నత్తగుల్లలను శుభ్రంగా కడిగి, పొడిచేసి చిటికెడు (500 మి.గ్రా) పొడిని వేడినీళ్ళతో కలిపి తీసుకోవాలి. దీనిని వాడేటప్పుడు నోరు పొక్కే అవకాశం ఉంది కనుక నోటికి నేతిని పూసుకోవాలి.

ఔషధాలు: కామదుఘారసం, సూతశేఖరరసం, ధాత్రిలోహం, నారికేళలవణం, శతావరి ఘృతం.

5. మందుల దుష్ఫలితాలు:

అనేక రకాల అల్లోపతి మందులు పేగుల్లోపల రక్తస్రావాన్ని కలిగిస్తాయి. జంటామైసిన్, ఎరిత్రోమైసిన్, ళినోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్ తో పాటు కీళ్ళనొప్పులకోసం వాడే స్టీరాయిడ్స్, యాస్ప్రిన్ మందులకు ఈ నైజం ఉంది. డిజిటాలిస్ (గుండె స్పందనలను క్రమబద్దీకరించడం కోసం వాడే పదార్ధం(తో తయారైన మందుల వల్ల, మూత్రాన్ని జారీ చేసే మందులతో పాటు అనుబంధంగా ఇచ్చే పొటాషియం వల్ల రక్తస్రావమై మలంతో పాటు కనిపిస్తుంది. మందుల వల్ల రక్తస్రావ సమస్య వస్తున్నదని తేలితే వాటి వాడకం గురించి మీ డాక్టరుతో చర్చించండి. ఇక్కడో విషయాన్ని గమనించాలి; ఐరన్ క్యాప్సుల్స్ వాడే వారిలోనూ, గ్యాస్ ను తగ్గించుకోవడం కోసం చార్కోల్ టాబ్లెట్స్ వాడే వారిలోనూ, నేరేడు తదితర ఆహార పదార్థాలు తిన్న వారిలోనూ మలం ముదురు రంగులో కనిపిస్తుంది. ఐతే, ఈ స్థితిల్లో రక్తస్రావముండదు కనుక కంగారు పడాల్సిన పనిలేదు.

6. పేగులు చిద్రమవటం (ఇంటస్ట్రెనల్ పర్ఫరేషన్):

స్పృహ తప్పడం, నీరసం వంటి లక్షణాలతో పాటు రక్తం మలంతో కూడి కనిపిస్తుంటే రక్తస్రావం తీవ్రస్థాయిలో అవుతున్నట్లుగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పెప్టిక్ అల్సర్స్ చిద్రమై రక్తస్రావమవుతున్నప్పుడు ఇలా జరుగుతుంది. దీన్ని ఆయుర్వేదంలో చిద్రోదరం అంటారు. దీనికి అత్యవసరమే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయాల్సి ఉంటుంది.

7. పేగుల్లో వ్రణాలు (ఇన్ ఫ్లమేటరీ బొవల్ డిసీజెస్):

పేగులను వ్యాధిగ్రస్తం చేసి, అల్సర్లను కలిగించే వ్యాధులను ఇన్ ఫ్లమేటరీ బొవెల్ డిసీజెస్ (ఐ.బి.డి.) అంటారు. ఇలాంటి వ్యాధి చిన్న పేగుల్లో వస్తే క్యాన్స్ డిసీజ్ అనీ, పెద్ద పేగుల్లో వస్తే అల్సరేటివ్ కొలైటిస్ అనీ వ్యవహరిస్తారు. వీటిల్లో కడుపునొప్పితో పాటు బరువు తగ్గటం, రక్తాల్పతలు ఉంటాయి. మలంతో పాటు రక్తం కనిపించడం ఈ వ్యాధుల్లో ప్రధాన లక్షణం. చిన్న పేగులో రక్తస్రావమవుతున్నప్పుడు మలం నల్లగానూ, పెద్దపేగుల్లో రక్తస్రావమవుతున్నప్పుడు మలం ఎర్రగానూ కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో మలం లోహపు రంగులో కనిపిస్తుంటుంది. ఈ వ్యాధులు సాధారణంగా యుక్తవయసులో ప్రారంభమై దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. పేగుల లోపలి గోడల్లో వ్రణాలనేర్పరచి గోడలను దళసరిగా చేస్తాయి, ఈ వ్యాధులకు ఇంతవరకూ స్పష్టమైన కారణాలు తేలియరాలేదు. ఇన్ఫెక్షన్లు తాత్కాలికంగావ్యాధిరూపాన్ని తీవ్రతరం చేస్తాయి తప్పితే కేవలం ఇన్ఫెక్షన్లనే కారణాలుగా భావించలేము. ఈ వ్యాధులల సమూహాన్ని ఆయుర్వేదంలో వివరించిన గ్రహణి అనే వ్యాధితో పోల్చవచ్చు. ఈ వ్యాధికి ఆయుర్వేదంలో పర్పటి కల్పాలను చెప్పారు. వీటిని నిర్దేశిత ,మోతాదులో పరిమిత కాలం పాటు ప్రత్యేకమైన ఆహారాలతో కలిపి ఇస్తే ఈ వ్యాధి నిశ్చయంగా తగ్గుతుంది.

సూచనలు: ఆహారాన్ని కొద్దిమొతాల్లో తరచుగా తీసుకోవాలి. మషాలాల వాడకం తగ్గించాలి. మాంసం, గుడ్లు, వంటివాటికి కుళ్లిపోయిన మాలాశయాన్ని కల్లోల పరిచే నైజం ఉంటుంది కాబట్టి వాడకూడదు. పంచదార, పెసలు, పిండి పదార్థాలు కూడా ఈ వ్యాధిలో మంచివికావు, మజ్జిగ, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. తగినంతగా విశ్రాంతి తీసుకోవాలి.

నవీన్ సలహాలు : శల్లకి (అందుగు) నిర్యాసాన్నిగాని లేదా యష్టి మధుకాన్నిగాని లేదా కలబంద గుజ్జుకాని పావు చెంచాడు మోతాదులో తేనె చేర్చి తీసుకోవాలి.

8. పేగుల్లో రక్తస్రావం:

రక్తం మలంతో పూర్తిగా కలిసిపోయి 'ఏకరూపంగా' కనిపిస్తుంటే జీర్ణావయవాల పైభాగంలో ఎక్కడో రక్తస్రావమవుతున్నట్లు అర్థం. ఉదాహరణకు అమాశయం (స్టమక్)లో గాని, ప్రథమాంత్రాల్లో (డుయోడినం)గానీ అల్సర్లు ఏర్పడినప్పుడు ఇలా జరగవచ్చు. ఇంతే కాకుండా అన్నవాహిక (ఇసోఫేగస్) పూసినా, దానిలోపాలి రక్తనాళాలు చిట్లిన రక్తయుక్తంగా కనిపించవచ్చు.

సూచనలు: దీనికి పైన పేర్కొన్న 'పేగుల్లో వ్రణాల' చికిత్స తీసుకోవాలి.

9. పేగుల్లో కణితులు, ఇతర పెరుగుదలలు:

మలవిసర్జన విధానంలోగాని, సంఖ్యలోగాని మార్పులు చోటుచేసుకోవడం ఆలోచించాల్సిన అంశం. ముఖ్యంగా ఆకలి తగటం, బరువు తగ్గటం, మలం, రిబ్బనులాగా బల్లపరువుగా రావటం, రక్తం కనిపించటం ఇవన్నీ పేగుల్లోపల పెరిగే కంతులను సూచిస్తాయి. కొన్ని సందర్భాల్లో, పేగుల్లోపల పెరిగే గడ్డల వల్ల, మల విసర్జన చేసినప్పటికీ మళ్లీ చేయాలని అనిపిస్తుంటుంది. పేగుల్లో తయారైన కంతి లోపలి ప్రదేశంలో ఒత్తిడి కలిగిస్తుండటం దీనికి కారణం. ఇవే లక్షణాలు ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (ఐ.బి.యస్.) లో కూడా కనిపిస్తాయి.

ఔషధాలు: లావణభాస్కర చూర్ణం, కాంకాయనవటి (గుల్మ), పీయూషవల్లీ రసం, ప్రాణదాగుటిక, సంజీవనీవటి.

10. పేగులో క్యాన్సర్:

పేగుల్లో పెరిగే క్యాన్సర్ కంతుల వల్ల అతిసారం, మలబద్దకం వంటివి కనిపించే అవకాశం ఉన్నప్పటికీ ఇన్ఫెక్షన్లు, ఇన్ ఫ్లమేషన్ల వల్లనే ఎక్కువగా రక్తస్రావం కనిపిస్తుంది.

సూచనలు: ఇన్ ఫ్లమేషన్ వల్ల సమస్య వున్నప్పుడు కుటజ అనే మూలిక అద్భుతంగా పని చేస్తుంది, ఈ మూలిక ప్రధాన ద్రవ్యంగా తయారయ్యే కుటజఘనవటి, కుటజారిష్ట వంటి మందులు అనేకం లభ్యమవుతున్నాయి. వీటిని అవసరానుసారం వాడాలి.

11. అమీబియాసిస్, ఇతర ఇన్ఫెక్షన్లు:

అమీబియాసిస్ మన దేశంలో అత్యధికంగా కనిపించే వ్యాధి. ఇది కలుషితమైన ఆహారపానీయాలను తీసుకునే వారికి వస్తుంది, అమీబియాసిస్ మలవిసర్జనతో పాటు రక్తం కనిపించడం సర్వసాధారణం. కడుపులో నులి నొప్పి, మల విసర్జనతో పాటు కడుపు నొప్పి కాస్త తగ్గినట్లనిపించడం, మలం పూర్తిగా పచనం కాకుండా అమయుక్తంగానూ కనిపించడం, గ్యాస్ తయారవ్వడం అనేవి అమీబియాసిస్ లో కనిపించే ప్రధాన లక్షణాలు.

నవీన్ సలహాలు : 1. మిరియాలపొడిని (అరచెంచా) పాలతో (ఒక కప్పు) కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. 2. మారేడుకాయ గుజ్జు (అరచెంచా), నల్లనువ్వులు (అరచెంచా) కలిపి పుల్లటి పెరుగుతో సహా నూరి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. 3. మారేడు గుజ్జు (అరచెంచా)ను బెల్లంతో (అరచెంచా) కలిపి రోజుకు మూడు సార్లు నీళ్ళు అనుపానంగా తీసుకోవాలి. 4. పిప్పళ్ళను (మూడు) వేయించి పొడిచేసి పాలతో (ఒక గ్లాసు) కలిపి పుచ్చుకోవాలి.

ఔషధాలు: కుటజఘన వటి, కుటజారిష్టం, చౌషష్టప్రహారపిప్పలి, పంచామృతపర్పటి, దాడిమాష్టక చూర్ణం, లఘుగంగాధర చూర్ణం.

12. కాలేయ కణజాలమ గట్టిపడి వ్యాధిగ్రస్తామవటం (సిరోసిస్):

అధిక మొత్తాల్లో మద్యం తాగే వారికి కాలేయం వ్యాధిగ్రస్తమై నారలాంటి పీచుపదార్థం కాలేయమంతా వ్యాపించే అవకాశం ఉంది. దీనిని వైద్య పరిభాషలో 'సిరోసిస్' అంటారు. అన్ని పీచుపదార్థాల మాదిరిగా కాలేయంలో తయారైన పీచుపదార్థానికి కూడా రక్తసరఫరా కుంటుపడుతుంది. రక్తనాళాలు పూడుకుపోతాయి. ఈ లక్షణం ఎగువ రక్తనాళాలకు కూడా వ్యాపించి గొంతులోని రక్తనాళాలను చిట్లిపోయేలా చేస్తుంది. ఫలితంగా పేగుల్లోకి రక్తస్రావమై మలం నల్లగా మారుతుంది. కాలేయం సంబంధ వ్యాధులకు ఆయుర్వేదంలో మంచి చికిత్సలు ఉన్నాయి.

ఔషధాలు: చించాది లేహ్యం, ధాత్రీ లోహం, గుడ పిప్పలి, కుమార్యాసవం, క్షీరపిప్పలి, కాంత వల్లభ రసం, సురక్షార కాసీస భస్మం, శోథారి మండూరం, సూతికాభరణ రసం, సప్తామృత లోహం, శిలాజిత్వాది లోహం, తాప్యాది లోహం.

13. రక్తనాళాలు బిరుసెక్కి సాగే గుణాన్ని కోల్పోవటం (ఎథిరోస్క్లీరోసిస్):

రక్తనాళాలు బిరుసెక్కి గట్టిగా తయారైనందువల్ల గుండెపోటు, పక్షవాతాలు వచ్చే అవకాశముందన్న విషయం తెలిసిందే. అయితే, ఇదే తరహాలో, వయసు పెరిగేకొద్దీ పేగులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం కూడా బిరుసెక్కి గట్టిపడే అవకాశం ఉంది. అదే జరిగితే అప్పుడు రక్తనాళం చిట్లి పేగుల్లోకి రక్తం కారుతుంది. ఇలా జరిగినప్పుడు రక్తస్రావంతో పాటు కడుపులో నొప్పి కూడా వస్తుంది.

నవీన్ సలహాలు : 1. శొంఠి కషాయానికి (అరకప్పు) ఆముదాన్ని (రెండు చెంచాలు) కలిపి రెండుపూటలా వారం లేదా పది రోజుల పాటు తీసుకోవాలి. 2. వావిలి ఆకు కషాయాన్ని పూటకు అరకప్పు చొప్పున మూడుపూటలా పుచ్చుకోవాలి. 3. పారిజాతం ఆకుల కషాయాన్ని పూటకు అరకప్పు చొప్పున మూడుపూటలా తీసుకోవాలి.

ఔషధాలు: త్రయోదశాంగ గుగ్గులు, మహారాస్నాదిక్వాథం, సమీరపన్నగ రసం, యోగరాజగుగ్గులు, వాతవిధ్వంసినీ రసం, అమృతభల్లాతక లేహ్యం, వాతగజాంకకుశ రసం.

14. రక్తనాళాల్లో అసాధారణత:

కొంతమందికి జన్మతః రక్తనాళాలు సున్నితంగా ఉండి తేలికగా చిట్లి రక్త స్రావమతుంటుంది. ఇటువంటి వారికి అకారణంగా చర్మం కమలడం, శరీరాంతర్గతంగా రక్తస్రావమవడం జరుగుతుంది. ఇదే విధానం పేగుల్లోపల కూడా జరిగి రక్తస్రావమై మలం నల్లగా మారుతుంది. హఠాత్తుగా, ఇతిమిద్ధమైన కారణం లేకుండా ఎవరిలోనైనా పేగుల్లోపల రక్తస్రావమై మలం నల్లగా మారితే ఇటువంటి జన్మతః ప్రాప్తించిన లక్షణాల గురించి ఆలోచించాలి. దీనిని ఆపడానికి ఆయుర్వేదంలో సంధాన, స్కందన, పాచన దహనాలనే చికిత్సలను చేస్తారు.

15. దెబ్బలు / గాయాలు:

యాక్సిడెంట్లు మొదలైన వాటి కారణంగా మలద్వారం చుట్టు పక్కల దెబ్బ తగిలినా, మలద్వారం లోనికి ఏదన్నా వస్తువు చొచ్చుకువెళ్లినా పేగుల్లోపల రక్తస్రావమై మలం నల్లగా మారుతుంది. దీనికి లక్షణానుగుణంగా వ్రణరోపణ చికిత్సలు చేయాల్సి ఉంటుంది.

ఔషధాలు: వ్రణరోపణ తైలం, జాత్యాదితైల, మర్మగుటిక (ఇవన్నీ బాహ్యప్రయోగాలు). 1

16. పెద్దపేగుల్లో సంచులవంటి నిర్మాణాలు తయారవ్వటం (డైవర్టిక్యులైటిస్):

వృద్ధాప్యంలో పేగులకు సంబంధించి కనిపించే ఒక ప్రధానమైన సమస్య డైవర్టిక్యులైటిస్. ఈ వ్యాధిలో పెద్దపేగు చివరిభాగంలో చిన్న చిన్న సంచుల మాదిరి కోశాలు తయారవుతాయి. మలాశాయపు గోడలు బలహీనపడటం వల్ల ఇవి తయారవుతాయి. వీటిల్లోకి ఆహారవ్యర్థాలు ప్రవేశిస్తే చుట్టుపక్కల కణజాలం వ్యాధిగ్రస్తమై డైవర్టిక్యులైటిస్ ప్రాప్తిస్తుంది. దీనితో కడుపునొప్పి, జ్వరం, రక్తస్రావాలు ప్రాప్తిస్తాయి. ఈ వ్యాధికి చికిత్సగా, పేగుల నిర్హరణ శక్తిని పెంచే మందులు వాడాలి.

ఔషధాలు: అగస్త్యహరీతకలేహ్యం, పంచామృతపర్పటి, మహాగంధకరసం, రసపర్పటి, స్వర్ణపర్పటి.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

*సభ్యులకు విజ్ఞప్తి*

******************

ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: