6.- శొంటి , వస ఈ రెండింటిని ఉండలగా చేసి రాసిన యెడల పంటి జబ్బులు అన్ని శీఘ్రంగా పోవును .
7.- గిద్దెడు గంధపు పొట్టు ఒక కల్వంలో వేసి నూరి అందు ఒక తులమెత్తు కర్పూరం జేర్చి ఉదయమున దంతధావనం చేయునపుడు రాసి తోమిన యెడల పళ్ళు సందుల నున్న కల్మషం పోయి తెల్లబడును.
8.- ఉదయం దంతదావనం చేసి నూనె పుక్కిలించి వేసిన యెడల దంతముల చివరలు నెత్తురు జిమ్ముట ఎన్నడును బుట్టకుండా ఉండటయే కాక దంత పటుత్వం నూరేండ్ల వరకు చెడదు.
9.- పొడవుగా ఉన్న లవంగములు పిడక నిప్పుల మీద వెచ్చజేసి వెంటనే వానికి తగినంత శొంటి గంధములో బోసి మూడు దినములు ఉరబెట్టి పిమ్మట ఎండబెట్టి మునిపంటితో బట్టి ద్రవం దంతములు తడియునట్లు రాచిన యెడల తెల్లబడిన దంతములు పటుత్వం కలిగియుండును.
10.- ఒక తులం ఉప్పు నీరు సెగ మీద పెట్టి సగం అగునట్లు కాచి దింపి నాలుగు చిన్న కాకర కాయ పేడులు వేచి ఒక గడియ నాననిచ్చి అవి ఒక్కొకటి తీసి దంతములు నుండి ద్రవం ఉరునట్లు గీచిన యెడల కల్మషం పోవును .
11.- నిమ్మపండ్ల రసము, వేప పువ్వు రసము, చింతాకు రసము, నేరెడు వ్రేళ్ల రసము, ఇవి కలిపి దంతములకు రాసిన యెడల తెల్లబడును.
12.- జీలకర్ర, సైంధవ లవణం, పిప్పలి, ఇవి సమాన బాగాలుగా నూరి పండ్లకు రాచిన యెడల పోటు, వాపు , కదులుట, దురద, రక్తస్రావం, దుర్భలథ్వమ్ పోయి స్వచ్చంగా ఉండును.
13.- జీలకర్ర, ఉప్పు , వస, హారతి కర్పూరం ఇవి నీటితో నూరి దంతములకు రాసిన యెడల గార , పుప్పి, కదలిక వెంటనే మానును .
14.-తేనే , నిమ్మపండు రసము, మాదిఫల రసము ఇవి సమాన బాగములుగా గల్పి పుప్పి పండ్లకు రాచి రుద్దిన యెడల చూచు చుండగానే పురుగులు చచ్చి పడుటయే కాక దురద, వాపు ఇవి కూడా శాంతించును.
15.- పుప్పు పంటిలో దురదలు పుట్టిన యెడల మిరియాలు, వస నీటిలో అరగదీసి కొంచెం కవిరి కలిపి నూరి ఒక జాము విడవకుండా రాచిన యెడల దురద తగ్గుది 
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.