- గర్భిణిగా ఉన్న సమయంలో, ప్రసవానికి ముందు, ప్రసవ సమయంలో, ప్రసవం తర్వాత కలిగే శారీరక ఇబ్బందులను ఎదుర్కోవటానికి, వాటిని అదుపులోకి తెచ్చుకోవటానికి ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగపడుతుంది.
- గర్భం దాల్చినప్పుడు శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. వెన్ను, నడుము నొప్పి, కాళ్ల వాపులు లాంటి ఇబ్బందులు ప్రారంభంలో ఉంటాయి. మూత్రాశయం మీద ఒత్తిడి పెరిగి మూత్రం ఆపుకోలేకపోవటం(యూరినరీ ఇన్‌కాంటినెన్స్)లాంటి సమస్య మొదలవుతుంది. ఇలాంటి వాటికి వేడి, చల్లని కాపడం పెట్టడం, స్ట్రెచెస్ చేయించటం లాంటి వ్యాయామాలు ఉపయోగపడతాయి.
- మూత్రాన్ని అదుపు చేయగలిగే కటి కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
- కొందరికి ఆరో నెలలోనే ఎనిమిది నెలల గర్భంలా పొట్ట ఎత్తుగా తయారవుతుంది. ఇందుకు కారణం వాళ్లు శరీరాకృతిని సరిగా అనుసరించకపోవటమే! ఇలాంటి శరీరాకృతి సమస్యల వల్ల కండరాల మీద ఒత్తిడి పెరిగి నొప్పులు మొదలవుతాయి. ఈ నొప్పులు రాకుండా ఉండాలంటే ఫిజియోథెరపిస్టులను సంప్రదించి శరీర భంగిమలను సరిదిద్దుకోవాలి.
- సుఖ ప్రసవం జరగాలంటే నడుములోని కండరాలు బలంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. ఇందుకోసం క్రమం తప్పకుండా కొన్ని వ్యాయామాలను చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రసవ సమయంలో ఎంతో ఆందోళనకు, ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఊపిరి ఎలా తీసుకోవాలి? ఎప్పుడు రిలాక్స్ అవ్వాలి? ఎప్పుడు గాలి లోపలికి తీసుకుని ప్రసవం జరిగేలా పుషింగ్ బ్రీతింగ్ చేయాలి? అనేది ఫిజియోథెరపిస్టులు సూచిస్తారు.
- ప్రసవం తర్వాత వదులైన కండరాలను తిరిగి బిగుతుగా చేసుకోగలిగే వ్యాయామాలు కూడా ఫిజియోథెరపిస్టుల సహాయంతో చేయాలి.
- ప్రసవం జరిగిన తీరును బట్టి త్వరగా కోలుకోవటానికి అనుసరించవలసిన పద్ధతులు, పాలిచ్చే విధానం, నొప్పిని అదుపులోకి తెచ్చుకోగలిగే పద్ధతులను కూడా ఫిజియోథెరపీలో తెలుసుకోవచ్చు.
భరించలేని నడుంనొప్పి (బ్యాక్ పెయిన్)తో బాధపడుతున్నారా..?
health tips for back pain : గంటల తరబడి కూర్చొని పనిచేయడం వల్ల కావొచ్చు. సరిగ్గా కూర్చోవడం వల్ల, ఇతరత్రా అనారోగ్యం సమస్యల వల్ల కావొచ్చు.ఇవ్వాళ మనలో చాలా మందికి నడుం నొప్పి అనేది ఒక పెద్దసమస్యగా మారిపోయింది. నడుంలో సూదులు గుచ్చుతున్న ట్లుగా అనుక్షణం నొప్పితో వేధిస్తూ నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు నడుం నొప్పి, వెన్నపూస నొప్పి ఎందుకు వస్తుందో..? వేధించే వెన్నునొప్పికి ఎలాంటి చికిత్స అవసరమో తెలుసుకుందాం.
నడుం నొప్పికి అసలు కారణాలు
నడుంలో రెండు ఎముకల మధ్య ఉండే డిస్కుల్లో నీరు శాతం తగ్గి కొంచెం వెనక్కి కదిలినా, లేదంటే వంగడం వల్ల డిస్కు లో ఉన్న వాటర్ లీక్ అయ్యి నరాలు(nerves), లేదా వెన్నపూసపై ఒత్తిడి తేవడం వల్ల మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎవరికైతే వెనకాల వీపు భాగంలో రెండు ఎముకల మధ్య ఉండే జాయింట్లు(facet joints)లో వాపు వచ్చినా, లేదంటే అరుగుదల, ఎముకల మధ్యలో ఉండే డిస్క్ లకు ఇన్‌ఫెక్షన్ వచ్చినా, వెన్నపూసల్లో కణతి లాంటివి పెరిగినా బ్యాక్ పెయిన్ వస్తుంది. దీంతో పాటు ఎముక ఎముక కనెక్ట్ చేస్తూ లెగిమెంట్ (interspinous ligament)లు దెబ్బతిన్న, ఎక్కువ బరువులు మోసినా, ట్రావెలింగ్ చేసేవాళ్లకి ఈ నడుం నొప్పి వస్తుంది.
బ్యాక్ పెయిన్ ఎవరికి ఎక్కువగా వస్తుందంటే
విపరీతంగా టూవీలర్ ను డ్రైవింగ్ చేయడం, వందల కిలోమీటర్లు ట్రావెల్ చేయడం, బరువులు మోయడం, వంగి పని చేయడం, ఒకటే ప్లేస్ లో గంటల తరబడి కూర్చొన్న వారందరికీ కామన్ గా బ్యాక్ పెయిన్ వస్తుంది.
నడుం నొప్పిని ఎప్పుడు పట్టించుకోవాలి
ఎప్పుడైతే డిస్క్ వెనక్కి జరిగి నరాలపై ఒత్తిడి తెస్తుందో అప్పుడు ఆ నరంలో వచ్చిన వాపు వల్ల మనకి ఆ నరం వెనక్కి వాలినట్లు, జారినట్లు గా అనిపిస్తుంది.
వైద్య పరిభాషలో ఈ సమస్యను (mild moderate severe) అంటారు. ఈ సమస్యను మూడు రకాలుగా వైద్యులు విభజిస్తారు.
Mild – early stage
Moderate – middle stage
Severe – last stage
పైన చెప్పిన విధంగా నడుంతో పాటు, కాలు కూడా జారిపోతున్నట్లు ఉంటే ఆర్థోపెడిక్ లేదా స్పై నల్ కార్డ్ సర్జరీ డాక్టర్స్ ను సంప్రదించాలి.
మసాజ్, ఫిజియో థెరపీ, పెయిన్ కిల్లర్ తో నడుం నొప్పి తగ్గుతుంది
పైన చెప్పిన విధంగా మైల్డ్, మోడరేట్ స్టేజ్ లో నడుం నొప్పితో బాధపడేవారు ట్యాబ్లెట్స్, జీవన విధానం, యోగా, ఫిజియో థెరపీ తో నయం చేసుకోవచ్చు. మూడో స్టేజ్ అంటే సివియర్ స్టేజ్ లో సమస్యతో బాధపడేవారికి ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా వారిలో కొంత మందికి బ్యాక్ పెయిన్ తగ్గదు. తగ్గకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.
బెల్ట్ పెట్టుకోవడం, కింద పడుకుంటే నడుం నొప్పి తగ్గుతోందా
బెల్ట్ పెట్టుకోవడం, కింద పడుకోవడం వల్ల వెన్నునొప్పి తగ్గదు. వెన్నపూస చుట్టు ఉండే నరాల్లో బ్లడ్ సర్కిలేషన్ జరిగే స్ట్రాంగ్ అయ్యేలా సాయం చేస్తుంది.ఇక ప్రమాదాలకు గురైన వాళ్లకు, నడుం జారినట్లు, బోను మెత్తబడినా, ట్యూమర్ ఉన్నవాళ్లకు బెల్ట్ యూజ్ అవుతుంది. కానీ నడుం నొప్పి ఉన్న ప్రతీ ఒక్కరు బెల్ట్ ను యూజ్ చేయడం వల్ల నడుంలోని నరాలు శక్తిని కోల్పోతాయి. ఇకపై బెల్ట్ పెట్టుకోకుండా ఉండలేని పరిస్థితి తలెత్తుతుంది.
బ్యాక్ పెయిన్ రాకుండా ఏం చేయాలి.
నడుం నొప్పి వచ్చినప్పుడు ముందుకు వంగి బరువులెత్తకుండా ఉండడం, కూర్చున్నసీట్లలోనే గంటల తరబడి కూర్చోకుండా చూసుకోవడం, ఎక్సర్ సైజ్ లు చేయడం వల్ల వైద్యుల అవసరం ఉండదు.
బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు
బరువును కంట్రోల్ చేయడం:బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు శరీరం ఫిట్ గా ఉండేలా చూసుకోవాలని న్యూరోలాజికల్ సర్జన్, మయామి న్యూరోలాజికల్ ఇనిస్టిట్యూట్ ఫౌండర్ శాంటియాగో ఫిగ్యురియో చెప్పారు. అధిక బరువు వీపుపై ఒత్తిడి తెచ్చి బ్యాక్ పెయిన్ వచ్చేలా చేస్తుంది. పండ్లు, కూరగాయలతో నిండిన ఆరోగ్యకరమైన ఆహారం తినడం, మసాలా దినుసులతో, బాగా ఉడికించిన ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల తగ్గిపోతుంది.
వ్యాయామం చేయాలి
అధిక బరువులు మోయడం, ఎక్కువ సేపు వంగడం, గంటల తరబడి టూవీలర్ డ్రైవింగ్ చేయడం వల్ల వెన్ను పూస పై ఒత్తిడి పెరిగి బ్యాక్ పెయిన్ వస్తుంది. అయితే శరీరంలోని కండరాలు స్ట్రాంగ్ ఉండేలా చూసుకుంటే బ్యాక్ పెయిన్ రాకుండా అరికట్టవచ్చు. అందుకోసం వ్యాయామం చేయాల్సి ఉంటుంది.
మీ కండరాలకు పని చెప్పండి
కండరాలను వ్యాయామంతో సాగదీయాలి. అలా చేయడం వల్ల బ్యాక్ పెయిన్ నుంచి బయటపడొచ్చు. హెవీ లిఫ్టింగ్ లేదా వ్యాయామం చేసే సమయంలో ముందుకు వంగడం, వెనక్కు వంగడం, పక్కకు వంగడం వల్ల బ్యాక్ పెయిన్ ను అరికట్టవచ్చు. ఫైనల్ గా వీటన్నింటి కంటే యోగా చేయడం ఉత్తమమని వైద్యులు సలహా ఇస్తున్నారు.
జాగ్రత్తగా కూర్చోవాలి
ఆఫీస్ ల్లో, ఎక్కడైన సరే కూర్చొనే పద్దతిలో మార్పులు చేయాలని వైద్యులు చెబుతున్నారు. ఎలా పడితే అలాకాకుండా జాగ్రత్తగా, వెన్నపూస నిటారుగా ఉండేలా కూర్చొవాలి. అలా కూర్చొడం వల్ల మీ భుజాలపై, మీ చెవులతో, మీ భుజాలు, కీళ్లపై, చీల మండలాలపై మీ నొప్పి లేకుండా సహాయ పడుతుంది.
బరువులను జాగ్రత్తగా ఎత్తాలి
బరువులను ఎత్తే సమయంలో మోకాళ్ల వద్దకు వంగి బరువును ఎత్తాలి. బరువును ఎత్తిన అనంతరం శరీరాన్ని అటు ఇటు తిప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి.
బ్యాక్ ప్యాకెట్లో బరువు లేకుండా చూసుకోవాలి
బ్యాక్ ప్యాకెట్లో, వ్యాలెట్, కార్డ్ లు ఉండడాన్ని నివారించాలి. ఇవేం చేస్తాయంటారా..? బ్యాక్ పాకెట్ బరువుగా ఉండి డిస్క్ లోని కండరాలపై ఒత్తిడి తెస్తుంది.
ఒత్తిడి లేకుండా చేసుకోవడం
శరీరం ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి. ఒత్తిడి పెరిగి వెన్నునొప్పి వస్తుంది. కాబట్టి ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల బ్యాక్ పెయిన్ రాకుండా జాగ్రత్తపడొచ్చు.
మంచి నిద్రను అలవాటు చేసుకోవడం
మంచి నిద్ర పోవడంవల్ల బ్యాక్ పెయిన్ రాకుండా నివారించవచ్చు. మనం పడుకునే బెడ్లు, కూర్చొనే ఛైర్లు మనకు అనువుగా ఉండేలా చూసుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి