వృషణాలు[వరిబీజం వాపు నొప్పి ]సమస్య కు నవీన్ నడిమింటి సలహాలు
వరిబీజము --అండ వృద్ధి --వృషణాల వాపు
ఒక వైపు కిందికి జారిపోయి దానిలో చెడు నీరు, గాలి చేరడం వలన ఈ వ్యాధి వస్తుంది .
కరక్కాయ పొడి -------------- 10 gr
నేలవేము పొడి -------------- 10 gr
ధనియాల పొడి ------------- 10 gr
దో. వే. లవంగాల పొడి ------------- 15 gr
సునాముఖి ఆకు పొడి ------------ 40 gr
కలకండ పొడి ------------ 120 gr
తేనె ------------- తగినంత
కల్వంలో కలకండ పొడి వేసి దానిలో మిగిలిన పదార్ధాలను ఒక్కొక్కటిగా వేసి బాగా కలిపి తేనె పోస్తూ ముద్దగా నూరాలి.దీనిని తీసి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.ఎంత కాలమైనా నిల్వ వుంటుంది.
ప్రతి రోజు ఆహారానికి ముందు 5 గ్రాముల మందును చప్పరించి నీళ్ళు తాగాలి. ఎక్కువ తీసుకుంటే విరేచనాలు అవుతాయి.అందువలన 1,2 గ్రాముల నుండి ప్రారంభించి 5 గ్రాములకు పెంచాలి. 40 రోజులు వాడాలి. దీనితో మంచి నీళ్ళ కంటే మజ్జిగ మేలు.
ఈ మందు వాడుతుంటే మొదట మలబద్ధకం నివారింపబడుతుంది.తరువాత వృషణాల లోని నీరు తొలగింప బడుతుంది.
వృషణాలు పెద్దవైతే ---నివారణ
వావిలాకు
గచ్చకాయ ఆకు
అవిశాకు
అన్నింటిని నలగగొట్టి నువ్వుల నూనెలో వేసి వేయించి ఒక బట్టలో వేసి పైకి లాగి కట్టాలి.
వరిబీజం సమస్య తీవ్రత తగ్గడానికి --- చిట్కా
మునగ చెట్టు బంకను సేకరించి నానబెట్టి వరిబీజం పెరిగిన చోట లేపనం చేసి ఎండిన తరువాత కడుగుతూ వుంటే సమస్య తీవ్రత తగ్గుతుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి