10, అక్టోబర్ 2020, శనివారం

మూత్రపిండాల్లో సమస్య కు అవగాహన కోసం నవీన్ నడిమింటి సలహాలు ఈ లింక్స్ లో చూడాలి


మూత్రపిండాల సమస్యలు పై అవగాహన కోసం నవీన్ నడిమింటి సలహాలు 

మూత్రపిండాలు

మూత్రపిండాలలో రాళ్ళు

మూత్రపిండాలలో ఏర్పడే గట్టి పదార్ధాలను - మూత్రపిండాలలో రాళ్ళు అని అంటారు. సాధారణంగా ఈ రాళ్ళు మూత్రపిండాల లోపల ఏర్పడతాయి. ఒకటి కన్నా ఎక్కువ రాళ్ళు కూడా ఏర్పడతాయి. మూత్రాశయం, మూత్రనాళాలలో కూడా ఈ రాళ్ళు ఏర్పడతాయి. 20-30 సం. వయస్సు నుండి ఈ రాళ్ళు ఏర్పడతాయి.

రాళ్ళలో రకాలు

  • అధికశాతం కాల్షియం రాళ్ళు ఏర్పడతాయి.
  • కాల్షియం పదార్ధము - ఇతర ఆక్జలేట్లు ఫాస్పేట్లు, కార్బోనేట్ లవణాలతో కలిసి మూత్రపిండాల రాళ్ళుగా ఏర్పడతాయి.

ఎలా ఏర్పడతాయి

  1. రక్తంలో కాల్షియం, ఫాస్పేటు, యూరిక్ యాసిడ్ లవణాలు అధికం కావడం వలన మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి. అధికంగా వున్న లవణాలు స్పటిక రూపంగా మూత్రపిండాల పొరలలో ఆకారాలు మారుతూ నిలువ ఉంటాయి.
  2. కొన్ని సందర్భాలలో మూత్ర వ్యవస్ధ ఇన్ ఫెక్షన్ కారణంగా రాళ్ళు ఏర్పడతాయి.
  3. మూత్రపిండాలు, మూత్ర నాళము, మూత్రాశయ భాగములలో ఇసుక రేణువు సైజు మొదలుకొని బత్తాయి పండు సైజు వరకు ఈ రాళ్లు ఏర్పడతాయి. యూరిక్ ఆసిడ్ పురుషులలో అధికంగా ఏర్పడతాయి.

లక్షణాలు

  • వీపు క్రింది భాగములో తీవ్రమైన నొప్పి మొదలై పొత్తికడుపుకు వ్యాపించి, వృషణాలు, పురుషాంగము లేక స్త్రీ జననేంద్రియం వరకు వ్యాపిస్తుంది. ఈ విధంగా వ్యాప్తి చెందే నొప్పిని ఫాఇన్ టు గ్రాఇన్ (FOIN To GROIN) నొప్పిగా పరిగణిస్తారు
  • వాంతి వచ్చినట్లుగా ఉండడం, వాంతులు కావడం
  • మూత్రపిండాలలో రాళ్ళు ఆయా భాగాలలో కదలకుండా ఉన్నంత కాలము - నొప్పికాని, బాధను కాని కలిగించవు
  • సైజులో ఎంత చిన్నరాయి అయినా మూత్రపిండము నుంచి మూత్రాశయము లోనికి జారుతున్నపుడు, సున్నితమైన పొర దెబ్బ తినడం, మొదలు పెట్టగానే భరించలేని నొప్పి, బాధ కలుగుతుంది
  • వణుకుతో కూడుకున్న జ్వరంతోపాటు వాంతులు
  • మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి, మంట ఉంటుంది.
  • మూత్రం రక్తంతో కలిసి వస్తుంది.
  • ఎక్కువ సార్లు మూత్రము పోవాలనిపిస్తుంది.
  • మూత్రం వెళ్ళాలి అంటే భరించరాని నొప్పి వస్తుందన్న భయం.
  • సాధారణ కడుపు నొప్పి నుండి- భరించరాని కండరాలు వద్ద పిండినట్లుగా నొప్పి వస్తుంది.

పరీక్షలు

  1. అల్ట్రాసౌండు - కడుపు పరీక్షలు
  2. ఐ.వి.పి. (ఇంటావీనస్ ఫైలోగ్రామ్)
  3. ‘ఎక్స్’ రే కడుపు మూత్రనాళము - మూత్రాశయ భాగాలు (కె.ము.బి)
  4. యమ్.ఆర్.ఐ (MRI) కడుపు/మూత్రపిండాలు
  5. మూత్ర పరీక్షలు

ఈ పరీక్షల వలన మూత్ర వ్యవస్ధ ఇన్ ఫెక్షను, మూత్రనాళాలు మూసుకుపోవడం, మూత్రపిండ కణాలు దెబ్బతినడం, మూత్ర వ్యవస్ధ పనిచేయుట వ్యత్యాసం కనుగొనవచ్చును.

చికిత్స

నిమ్మ రసం తో మూత్ర పిండాలలొ రాళ్ళు మాయం

* నిమ్మరసం లో సైన్డవ లవణం కలిపి తాగితే మూత్ర పిండాలలో రాళ్ళు కరిగిపోతాయే .

* ఉదయాన్నే పరిగాడుపున నిమ్మరసం తాగితే అజీర్తి సమస్య తగ్గిపోతుంది .

* నిమ్మ రసం లో త్యేనే కలిపితాగితే ఎక్కిళ్ళు పోతాయే .

  1. మూత్రపిండాలలో రాయి సైజు 5 mm లోపు వుందని నిర్దారించినపుడు, సాధారణంగా మూత్రం ద్వారా వెలుపలకు వస్తుంది
  2. ఐదు (5) mm కన్నా పెద్దగా వున్న రాళ్ళు తనంత తానుగా వెలుపలకు రావు కాబట్టి తప్పని సరిగా అతోట్రెప్సి ద్వారా కాని, ఆపరేషన్ ద్వారా కాని తీసివేయవలసిన అవసరం ఉంటుంది
  3. యారెటరోస్మోపి, పర్ క్యూటీనియస్ నెఫ్రోలితోటమీ, అతోక్లాస్ట్, లేజర్స్ అనే అధునాతన పద్దతుల ద్వారా మూత్రపిండాల రాళ్లను తీసివేయవచ్చును

మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు

మంచి నీళ్ళు అధికంగా తీసుకోవాలి. అలా ధారాళంగా నీరు త్రాగితే మూత్రము పలుచబడి, ఉప్పు, ఖనిజ లవణాలు కాన్ సెంట్రేట్ కాకుండా ఉండి మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి

  1. రోజుకు సుమారు 2-3 లీటర్ల నీరు త్రాగటం మంచిది. ఎండాకాలంలో ఇంకా ఎక్కువ త్రాగవలసిన అవసరం ఉంటుంది
  2. పాలు, వెన్న లాంటి డైరీ ఆహార పదార్ధాలలో కాల్షియం అధిక శాతం ఉంటుంది. కాబట్టి, వీలైనంత తక్కువ మోతాదులలో తీసుకోవాలి
  3. కాల్షియం తో కూడిన మందుల వాడకం తగ్గించాలి
  4. విటమిను A అధికంగా వున్న సహజమైన ఆహారాన్ని తీసుకోవాలి
  5. శారీరకంగా చురుకుగా వుండి, రోజు సుమారు ½ గంటలు వ్యాయామం లేదా నడక చేయాలి
  6. మాంసకృత్తులు అధికంగా వున్న మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవాలి. యూరిక్ ఆసిడ్, కాల్షియం, ఫాస్ఫరస్ పదార్ధాలు అధికంగా ప్రోటీన్ ఆహారం ద్వారా తయారవుతాయి
  7. విటమిన్ C విటమిన్ D మాత్రలు డాక్టరు సలహా ప్రకారమే వేసుకోవాలి. వీటిని అధికంగా
  8. తీసుకోవడం వలన కాల్షియం ఆక్జలేటు రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది
  9. మాంసంలోని లివరు, కిడ్నీ, మెదడులలో యూరిక్ ఆసిడ్ అధికంగా ఉంటుంది. కాబట్టి మూత్రపిండ వ్యాధుల వారు ఈ ఆహారం తీసుకోరాదు.

దీర్ఝకాలికంగా మూత్రపిండాలు పనిచేయకపోవడం

మూత్రపిండాలు నిర్వహించే విధులను క్రమేణా, దీర్ఝకాలికంగా నిర్వహించ లేక పోవడాన్ని దీర్ఝకాలికంగా మూత్రపిండాలు పనిచేయకపోవడం అంటారు. దీనినే కిడ్నీఫెల్యూర్ అని, సి.ఆర్.ఎఫ్ అని కూడా అంటారు.

రక్తములోని వ్యర్ధ పదార్ధాలను వడకట్టలేక పోయినపుడు, మూత్రం ద్వారా సరిగా విసర్జించ లేక పోయినపుడు, శరీరంలో ఉప్పును మరియు నీటిని తగు పాళ్ళలో సమం చేయలేకపోయినప్పుడు, శరీరంలో రక్త పోటును క్రమబద్దీకరించ లేకపోయినప్పుడు, మూత్రపిండాలు పనిచేయడం లేదని - దీనినే మూత్రపిండాలు పనిచేయకపోవడం - కిడ్నీఫెల్యూర్ అని అంటారు. కిడ్నీలు సాధారణ స్ధితికి రాలేనంతగా చెడిపోతాయి.

కారణాలు

  1. మూత్రపిండాలకు వచ్చే దీర్ఝకాలిక వ్యాధుల వలన క్రమేణా మూత్రపిండాలు పనిచేయకుంటే చెడిపోతాయి.
  2. దీర్ఝకాలిక అధిక రక్త పోటు
  3. మధుమేహ వ్యాధితో బాధపడుతున్నవారు
  4. మూత్రపిండాలలో రాళ్ళు, గడ్డలు, ప్రోస్టేట్ గ్రంధి పెద్దది కావడం వలన మూత్ర ప్రవాహానికి ఆటంకం కలిగించి దీర్ఝకాలిక వ్యాధులు కలుగుతాయి. వీటి వలన కూడా మూత్రపిండాలు పనిచేయ లేకపోతాయి.
  5. అనేక సంవత్సరాలుగా నొప్పి తగ్గించే మందులు వాడుతున్నా,ఆయుర్వేదం, యునానీ మందులలో ఉపయోగించే లోహ సంబంధ భస్మాలను ఎక్కువగా తీసుకొంటున్నా, డాక్టరు సలహా లేకుండా యాంటిబయాటిక్స్ ని వాడటం లాంటివి చేస్తున్నా కూడా కిడ్నీఫెల్యూర్ సంభవించడానికి అవకాశం ఉంది.

లక్షణాలు

  1. కారణము తెలియకుండా బరువు తగ్గడం, ఆకలి మందగించడం,
  2. వాంతులు వచ్చునట్లు అనుభూతి
  3. వాంతులు రావడం
  4. తలనొప్పి, నీరసం, మాటిమాటికి ఎక్కిళ్ళు రావడం,
  5. కాళ్ళు, ముఖం వాపు
  6. మూత్రం ద్వారా ఆల్బుమిన్ అనే ప్రోటీన్ విసర్జించబడి, రక్తంలో ప్రోటీన్ల శాతం తగ్గిపోతుంది.
  7. రక్త పోటు పెరుగుతుంది
  8. మాటిమాటికి మూత్ర సంబంధ ఇన్ ఫెక్షన్ కు గురికావడం
  9. నీళ్లు త్రాగినా మూత్రం రాకపోవడం
  10. శ్వాస చెడువాసన రావడం
  11. చర్మము విపరీతంగా దురద పుట్టడం. పై లక్షణాలు తొలిదశలో వున్నప్పుడే డాక్టరును సంప్రదించి వైద్యసలహా పొందాలి. అశ్రద్ద చేస్తే క్రమేణా కోమాలోకి వెళ్ళి మరణం సంభవించవచ్చును.

కిడ్నీఫెయిల్యూర్ మూలంగా వచ్చే అనర్ధాలు

  • తీవ్ర రక్తపోటు
  • రక్త హీనత
  • నరాల అస్వస్ధత
  • కండరాల అస్వస్ధత

వ్యాధి నిర్ధార పరీక్షలు

  1. మూత్రంలో అల్బుమిన్ శాతం అధికంగా వుండటం. ఈ సాధారణ విలువలు సుమారు 6 నెలలు నుండి 10 నెలలు ముందుగా డాక్టర్లు గుర్తించగలుగుతారు.
  2. రక్తంలో యూరియా, క్రియాటినిన్, పొటాషియం లాంటి మలిన పదార్ధాల శాతాన్ని తెలుసుకోవడానికి డాక్టరును సంప్రదించి సలహా తీసుకోవాలి.
  3. కడుపు ‘ఎక్స్’రే, CT స్కాన్

నివారణ

మూత్రపిండాలు పనిచేయలేక పోవడానికి ముందే మూలకారణాలు తెలుసుకొని వైద్యసలహా పొందితే కిడ్నీఫెయిల్యూర్ ను నివారించవచ్చు. మధుమేహ, రక్తపోటు వ్యాధులకు క్రమంతప్పక, సరియైన వైద్యం చేయించుకుంటూ ఉండాలి.


కిడ్నీ సంబంధ వ్యాధులు - చికిత్సలు

గర్భస్థ శిశువుల్లో, పిల్లల్లో కిడ్నీ సమస్యలు

చిన్న పిల్లల్లో మూత్రపిండాలకు వచ్చే సమస్యల్లో కిడ్నీ వాపు సాధారణంగా కనిపిస్తుంది. ఇలా కిడ్నీకి వాపు రావడాన్ని వైద్యపరిభాషలో ‘హైడ్రోనెఫ్రోసిస్’ అంటారు. నిజానికి ఈ కిడ్నీ వాపు లక్షణం ఎన్నో రకాల కారణాల వల్ల రావచ్చు. వాటిలో కొన్ని శస్త్రచికిత్స ద్వారా నయం చేయగలిగేవి, మరికొన్ని వైద్య చికిత్సతో సరిచేయగలిగేవి.

చాలా సందర్భాల్లో బిడ్డ ఇంకా పుట్టకముందే తల్లి కడుపులో ఉన్నప్పుడే ఈ సమస్యలు బయటపడతాయి. తల్లికి స్కానింగ్ చేస్తున్నప్పుడు ఇవి బయటపడతాయి. పిల్లల్లో ఈ కిడ్నీ సమస్యలు ఎంత విస్తృతం అంటే... పుట్టబోయే బిడ్డల్లో కనీసం ఒకటి నుంచి రెండు శాతం మంది వీటితో పుడతారంటే అది అవాస్తవం కాదు. పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో మూత్రంలో ఇన్ఫెక్షన్‌తో బాధపడే అవకాశం ఉంది. మార్చి 13న ప్రపంచ కిడ్నీ దినం సందర్భంగా గర్భస్థ శిశువుల్లో, పిల్లల్లో కిడ్నీ సమస్యలపై అవగాహన కోసం ఈ కథనం.

తల్లిదండ్రులూ... మీరివి చేయండి..

రెండేళ్ల లోపు పిల్లలకు మాటిమాటికీ జ్వరం వస్తుంటే వారికి మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు ఏవీ లేవని మొదట నిర్ధారణ చేసుకోండి.

మూడేళ్లు దాటిన పిల్లలు ప్రతి రెండు లేదా మూడు గంటలకొకసారీ సాఫీగా నింపాదిగా మూత్రవిసర్జన చేసేలా జాగ్రత్త తీసుకోండి.

పిల్లలు చాలాసేపు టీవీ చూస్తూనో లేదా కంప్యూటర్‌పై ఆడుతూనో ఉంటే వారిని బయటి ఆటలు ఆడేలా ప్రోత్సహించండి. పిల్లలు చాలాసేపు మూత్రం బిగబట్టి ఉంచడాన్ని ప్రోత్సహించకండి.

పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే ఆకుకూరల వంటి ఆహారాన్ని పిల్లలకు ఎక్కువగా ఇవ్వండి. కిడ్నీ సమస్యలను నివారించడానికి మలబద్దకం లేకుండా చూసుకోవడం కూడా చాలా ప్రధానం.పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా లేకపోయినా, రక్తహీనత ఉన్నా, బీపీ ఉన్నా, మూత్రంలో రక్తం పడినా, తరచూ ఇన్ఫెక్షన్లు వస్తున్నా ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించండి.

పీయూజే అబ్‌స్ట్రక్షన్ (పీయూజే బ్లాక్)

మన శరీరంలోని జీవక్రియల్లో విడుదలయ్యే మలినాలన్నింటినీ మూత్రపిండాలు వడపోస్తాయి. ఇలా వడపోశాక తయారయ్యే మూత్రం... మూత్రపిండాల నుంచి మూత్రాశయం వరకు రెండు నాళాల ద్వారా వెళుతుంది. వాటిని యురేటర్లు అంటారు. మూత్రపిండాల నుంచి మూత్రాశయానికి (బ్లాడర్‌కు) మూత్రం సరఫరా చేసే ఈ నాళాలలో అడ్డంకి రావడం మూత్రపిండాల వాపునకు దారితీస్తుంది. ఈ రకమైన అడ్డంకుల్లో చాలా సాధారణమైన అడ్డంకిని పీయూజే అబ్‌స్ట్రక్షన్ అంటారు.

ఈ రకమైన సమస్య ఉన్నట్లు తల్లిగర్భంలోనే స్కానింగ్ ద్వారా కనుక్కోవచ్చు. కానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బిడ్డ పుట్టిన తర్వాత పరీక్షల ద్వారా దీన్ని నిర్ధారణ చేసి వ్యాధి ముదరకముందే సరైన చికిత్స తీసుకుంటే దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు.

నిర్ధారణ: అల్ట్రా సౌండ్ స్కాన్ ద్వారా పీయూజే అబ్‌స్ట్రక్షన్ అనే ఈ కండిషన్ బయటపడుతుంది. దీన్ని నిర్ధారణ చేయడం కోసం ‘డీటీపీఏ/ఈసీ రీనోగ్రామ్’ అనే పరీక్ష చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఎంసీయూజీ అనే పరీక్ష అవసరం కావచ్చు.

చికిత్స :

పై పరీక్షల ద్వారా పీయూజే దగ్గర అడ్డంకి ఉండి, ఫలితంగా కిడ్నీ పనితీరు 40 శాతం కంటే తగ్గడం లేదా లక్షణాలు కనిపించడం జరిగితే... ఆ అడ్డంకిని శస్త్రచికిత్సతో చేస్తారు. దీన్ని చిన్నగాటు ద్వారా కీ-హోల్ (లాపరోస్కోపిక్) ప్రక్రియలోనూ చేయవచ్చు. ఈ ప్రక్రియలో చిన్నారి పొట్టభాగంపై ఎలాంటి కోత లేకుండా కేవలం 3 మి.మీ. సైజ్‌లో చిన్న గాట్లతోనే శస్త్రచికిత్స పూర్తి చేయవచ్చు. ఈ పద్ధతిలో నెలల పిల్లలకు కూడా సురక్షితంగా ఆపరేషన్ చేయవచ్చు.

వెసైకో యురెట్రిక్ రిఫ్లక్స్ (వీయూఆర్)

మూత్రపిండాల వాపుతో లేదా మూత్రంలో ఇన్ఫెక్షన్‌తో బయటపడే మరో ముఖ్యమైన సమస్య వెసైకో యురెట్రిక్ రిఫ్లక్. అయితే ఈ సమస్య ఒక్కోసారి ఎలాంటి వాపూ లేకుండా కూడా రావచ్చు. సాధారణంగా కిడ్నీలో వడపోత ప్రక్రియ పూర్తయ్యాక కిడ్నీల నుంచి మూత్రం యురేటర్ ద్వారా మూత్రాశయానికి రావాలి. అంతేగాని ఎలాంటి పరిస్థితుల్లోనూ అది వెనక్కు ప్రవహించకూడదు. అయితే విసైకో యురెట్రిక్ రిఫ్లక్స్ అనే స్థితిలో అది మూత్రాశయం నుంచి కిడ్నీలకు వెనక్కు ప్రవహిస్తుంది. దాంతో ప్రమాదకరమైన ‘పైలో నెఫ్రైటిస్’ అనే స్థితి వచ్చి అది కిడ్నీ దెబ్బతినడానికి దారితీయవచ్చు.

ఈ వీయూఆర్ అనే కండిషన్ సాధారణంగా పుట్టకముందే ఏర్పడుతుంది. అయితే దీని దుష్పరిణామాలు మాత్రం బిడ్డ పుట్టాక కిడ్నీకి ఇన్ఫెక్షన్ రూపంలో వ్యక్తమవుతాయి. సమస్య ఏమిటంటే పిల్లల్లో సాధారణంగా ఎలాంటి నొప్పిగాని, ఇబ్బందిగాని, మూత్రవిసర్జనకు అవరోధం గాని ఉండవు. కాబట్టి పిల్లలకు తరచూ జ్వరం గానీ, మూత్రంలో ఇన్ఫెక్షన్‌గాని వస్తే వీయూఆర్ నిర్ధారణ చేయడానికి కొన్ని పరీక్షలు చేయించాలి.

నిర్ధారణ పరీక్షలు:

ఎంసీయూజీ అనే ప్రత్యేకమైన ఎక్స్-రే చేయించాలి. వీయూఆర్ అనే కండిషన్‌లో ఐదు గ్రేడ్స్ ఉంటాయి. ఇందులో మొదటి రెండింటిని తక్కువ తీవ్రత దశగానూ, మూడో గ్రేడ్‌ను మధ్యదశగానూ, నాలుగు, ఐదు గ్రేడ్‌లను తీవ్రమైనవిగానూ చెబుతారు. వీయూఆర్ కండిషన్ ఉందని తెలిశాక మూత్రపిండాలు పాడయ్యాయా లేదా అని చూసేందుకు డీఎమ్‌ఎస్‌ఏ అనే స్కాన్ చేయాల్సి ఉంటుంది.

వీయూఆర్ వల్ల దుష్పరిణామాలు ఏమిటి? కొంతమంది పిల్లల్లో లో-గ్రేడ్ వీయూఆర్ ఉన్నా ఏ రకమైన సమస్యలూ రాకపోవచ్చు. కానీ ఇంటర్మీడియట్ గ్రేడ్ లేదా హైగ్రేడ్ వీయూఆర్ ఉన్న పిల్లల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. దీనివల్ల కిడ్నీలలో ‘స్కార్’ తయారై కిడ్నీ పనితీరును దెబ్బతీసి, కిడ్నీ ఫెయిల్యూర్‌కీ, చిన్న వయసులోనే హైబీపీకి దారితీసే ప్రమాదం ఉంది.

వీయూఆర్ వల్ల పుట్టకముందే జరిగే నష్టాన్ని నివారించలేం గానీ, పుట్టాక వీయూఆర్ వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల కలిగే డ్యామేజీని ఖచ్చితంగా నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఒకసారి కిడ్నీ స్కార్ తయారైతే ఆ నష్టం శాశ్వతం.

చికిత్స:

వీయూఆర్ నివారించడానికి రెండు రకాల చికిత్సలు చేయవచ్చు. అవే... సాధారణ వైద్యచికిత్స, శస్త్రచికిత్స. ఏ తరహా చికిత్స అవసరం అన్నది చిన్నారి వయసు, గ్రేడ్, ఆడపిల్లా, మగపిల్లవాడా, కిడ్నీలు ఏమేరకు దెబ్బతిన్నాయి... వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఏ పిల్లాడికి ఏది అవసరం అన్నది పూర్తిగా నిపుణులైన డాక్టర్‌లు నిర్ధారణ చేస్తారు.

వైద్య చికిత్స:

ఈ చికిత్స ఏడాది నుంచి ఏడాదిన్నర వయసు లోపల ఉన్న పిల్లలకు, లోగ్రేడ్ వీయూఆర్ పిల్లలకు ఉపయోగిస్తారు. సాధారణంగా వీయూఆర్‌కు వైద్య చికిత్సతో పెద్దగా ప్రయోజనం చేకూరదు. అయితే తీవ్రత తక్కువగా ఉండే ఒకటి రెండు దశల్లో వ్యాధి ఉన్నప్పుడు దాన్ని మరింత ముదరకుండా చేసేందుకు మాత్రమే వైద్యచికిత్స తోడ్పడతుంది.

శస్త్రచికిత్స:

ఈ ప్రక్రియ ద్వారా మూత్రం వ్యతిరేక మార్గంలో పయనించడాన్ని నివారిస్తారు. శస్త్రచికిత్స లక్ష్యం ఏమిటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ రాకుండా అరికట్టి తద్వారా కిడ్నీ దెబ్బతినకుండా రక్షించడం. శస్త్రచికిత్స అంటే భయపడాల్సిన పనిలేదు. ఇప్పుడు అత్యాధునికమైన, అత్యంత తక్కువ ఇబ్బంది కలిగించే ఎండోస్కోపిక్, లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఓపెన్ సర్జరీ కంటే ఈ ప్రక్రియలతో సౌకర్యం ఎక్కువ.

పోస్టీరియర్ యురెథ్రల్ వాల్వ్స్ (పీయూవీ)

ఈ కండిషన్ సాధారణంగా చిన్నారి పుట్టకమునుపే రెండు వైపులా మూత్రపిండాల వాపుతో కనిపిస్తుంది. పుట్టుకతో వచ్చే మూత్రపిండాల సమస్యలన్నింటిలోనూ ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఇది కేవలం మగపిల్లల్లో మాత్రమే వస్తుంది. సాధారణంగా మూత్రపిండాల నుంచి మూత్రాశయం వరకు రెండు నాళాలు ఉంటాయి. అయితే మూత్రాశయం నుంచి కిందికి మూత్రం ప్రవహించే మార్గం ఒకటే ఉంటుంది. పీయూవీలో అడ్డంకి మూత్రాశయం (బ్లాడర్) కిందన ఏర్పడుతుంది.

అంటే ఒకే నాళం ఉండే చోట అడ్డంకి ఏర్పడటం వల్ల మిగతా మూత్రపిండాల సమస్యలతో పోలిస్తే ఇది ఒక మూత్రపిండాలకి బదులుగా, రెండింటినీ దెబ్బతీస్తుంది కాబట్టి, ఇది అపాయకరంగా పరిణమించే అవకాశాలు ఎక్కువన్నమాట. అందుకే ఈ కండిషన్‌ను ఎమర్జెన్సీగా పరిగణించి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ కండిషన్‌ను ఇటీవల బిడ్డ పుట్టకముందే తెలుసుకుంటున్నారు. ఈ కండిషన్‌ను అనుమానించినప్పుడు బిడ్డ పుట్టగానే ఎంసీయూజీ అనే పరీక్షతో దీన్ని నిర్ధారణ చేస్తారు.

చికిత్స:

నిర్ధారణ పరీక్ష నిర్వహించిన తర్వాత బిడ్డ పుట్టీపుట్టగానే సిస్టోస్కోపీ అనే శస్త్రచికిత్స ద్వారా ఈ కండిషన్‌ను సరిదిద్దుతారు. అయితే ఇలాంటి శస్త్రచికిత్స నిర్వహించిన చిన్నారులను సుదీర్ఘకాలం పాటు (అంటే దాదాపు 15 నుంచి 20 ఏళ్లపాటు) డాక్టర్ల పర్యవేక్షణ (ఫాలో-అప్)లో ఉంచాలి. ఎందుకంటే చాలామందికి శస్త్రచికిత్స అనంతరం వైద్య చికిత్స అవసరం అవుతుంది. కొందరిలో మరోసారి శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితీ రావచ్చు. అయితే నిపుణులైన శస్త్రచికిత్సకులు నిర్వహించిన శస్త్రచికిత్స తర్వాత ఈ పిల్లలు మామూలుగానే జీవించే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

వెసైకో యూరెట్రిక్ జంక్షన్ (వీయూజే) అబ్‌స్ట్రక్షన్

ఈ కండిషన్‌లో మూత్రప్రవాహానికి యురేటర్‌కూ, యూరినరీ బ్లాడర్‌కూ మధ్య ఉండే జంక్షన్‌లో అడ్డంకి వస్తుంది. ఫలితంగా యూత్రం యురేటర్‌నుంచి కిందికిపోకుండా ఉండటంతో మూత్రపిండం వాపు (హైడ్రోనెఫ్రోసిస్) కనిపిస్తుంది. ఈ కండిషన్ కూడా బిడ్డ కడుపులో ఉండగానే వస్తుంది. దీనివల్ల చిన్నపిల్లల దశలోనే ఇన్ఫెక్షన్స్, కడుపునొప్పి రావచ్చు.

ఈ కండిషన్‌ను అల్ట్రాసౌండ్, ఎంసీయూజీ, డీటీపీఏ రీనోగ్రామ్, ఐవీపీ లేదా ఎమ్మార్ యూరోగ్రఫీ అనే పరీక్షలతో నిర్ధారణ చేస్తారు.

చికిత్స: ఒకసారి వీయూజే అబ్‌స్ట్రక్షన్ అని నిర్ధారణ జరిగాక, చికిత్స ఎలా అన్నది నిర్ణయించాల్సి ఉంటుంది. అంటే... ఎలాంటి లక్షణాలూ బయటకు కనిపించకుండా ఉండి, మూత్రపిండాలు దెబ్బతినకుండా ఉంటే... ఈ కండిషన్ ఉన్న పిల్లలను వైద్యులు తరచూ వైద్య పరీక్షలు చేయిస్తూ, నిరంతరం వారిని పర్యవేక్షిస్తూ, వేచిచూస్తూ ఉండాలి. ఒకవేళ పరిస్థితి ఏమాత్రం విషమిస్తున్నా శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఈ శస్త్రచికిత్సకూడా కిడ్నీ దెబ్బతినకుండా రక్షించడానికి చేస్తారు.

చాలా పిల్లల్లో దీన్ని ఒకే ఆపరేషన్‌తో సరిచేస్తారు. అయితే మరీ చంటిపిల్లలయితే రెండు ఆపరేషన్లు అవసరమవుతాయి. మొదటిది అడ్డంకిని బై-పాస్ చేసేందుకు నిర్వహిస్తారు. రెండో శస్త్రచికిత్సను మరో రెండు మూడేళ్ల తర్వాత చేసి, అప్పుడు యురేటర్‌ను, బ్లాడర్‌ను కలుపుతారు. దీన్ని కూడా ల్యాపరోస్కోపిక్ విధానంలో చేయవచ్చు. ఫలితంగా చిన్నారులకు ఇబ్బంది, సమస్యలు, నొప్పి కలిగే అవకాశాలు చాలా తక్కువ

నెఫ్రోటిక్ సిండ్రోమ్

సాధారణంగా మన శరీరంలో జరిగే జీవక్రియల్లో వెలువడే విషపదార్థాలు, వ్యర్థాలను మూత్రపిండాలు వడపోసి, వేరు చేసి వ్యర్థపదార్థాలను మాత్రమే మూత్రం ద్వారా బయటకు పంపేస్తాయి. అయితే నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్నప్పుడు శరీరానికి అవసరమైన ప్రోటీన్లు కూడా మూత్రంలో వెళ్తాయి.

గుర్తించేదెలా:

దీన్ని సాధారణంగా ఒంటి వాపు లక్షణంతో గుర్తించవచ్చు. పిల్లల్లో కంటి చుట్టూవాపు కనిపిస్తుంది. ముఖ్యంగా తెల్లవారుజామున ఈ వాపు ఎక్కువ. మూత్రం తక్కువగా, నురగతో వస్తుంది. ఒక్కోసారి వాంతులు అవుతాయి. ఆకలి కూడా మందగిస్తుంది.

ఎందుకు వస్తుంది: ఏవైనా ఇన్ఫెక్షను లేదా అలర్జీ కారణంగా సాధారణ రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం వల్ల ఇది రావచ్చు. చాలా సందర్భాల్లో ఇదమిత్థంగా కారణం తెలియదు. ఏడాది లోపు పిల్లల్లో జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇది రావచ్చు.

నిర్ధారణ: సాధారణ మూత్ర, రక్త పరీక్షలతో దీన్ని గుర్తించవచ్చు.

చికిత్స : దీనికి చేసే చికిత్స మూడు దశల్లో ఉంటుంది. మొదట ఒక నాలుగైదు నెలల పాటు రోగనిరోధక వ్యవస్థను చక్కదిద్దేలా స్టెరాయిడ్స్ ఇస్తారు. ఆ తర్వాత పిల్లల ఆహారంలో మార్పులు తెస్తారు. అంటే వారు రోజు తీసుకునే ఉప్పు, నూనెపదార్థాలు, మాంసాహారం వంటి వాటిని సగానికి సగం తగ్గిస్తారు. ఇలాంటి పిల్లల్లో రక్తం గడ్డకట్టడం అనేది మెడికల్ ఎమర్జెన్సీగా వచ్చి, అది అత్యవసరంగా చికిత్స చేయాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు.

పిల్లల మూత్రపిండాల్లో రాళ్లు...

సాధారణంగా మూత్రపిండాల్లో రాళ్లు చిన్నపిల్లలకు రావని అనుకుంటారు. కానీ కొంతమంది పిల్లల్లో ఇవి వస్తాయి.

కారణాలు: పిల్లల్లో మంచినీరు తాగే అలవాటు తగ్గడమే దీనికి కారణం. జన్యుపరమైన అంశాలు, కుటుంబ చరిత్రలో కిడ్నీల్లో రాళ్లు రావడం, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు (ప్యాకేజ్‌డ్ ఫుడ్స్, చిప్స్, పచ్చళ్లు, అప్పడాలు, భోజనంలో ఉప్పు ఎక్కువగా వేసుకోవడం) వంటివి దీనికి ప్రధాన కారణం. రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లోనైతే మూత్రపిండాల నిర్మాణంలో లోపాల వల్ల ఇవి వస్తాయి.

లక్షణాలు: మూత్రవిసర్జనలో తీవ్రమైన నొప్పి రావడం, భరించలేనంత కడుపునొప్పి, వికారం, వాంతులు, ఒక్కోసారి మూత్రవిసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ కడుపునొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నిర్ధారణ:

అల్ట్రా సౌండ్ స్కానింగ్ అనే అతి చవకైన పరీక్షతో వీటిని నిర్ధారణ చేయవచ్చు. ఇవి ఏర్పడటానికి కారణాలను తెలుసుకోడానికి రక్తపరీక్షలు చేస్తారు. చాలా అరుదుగా సీటీ స్కాన్, ఇతర పరీక్షలు అవసరం కావచ్చు.

చికిత్స: నోటి ద్వారా తీసుకునే కొన్ని మందులతో తొలుత 3-6 నెలల పాటు చికిత్స చేస్తారు. దీనివల్ల 8 మి.మీ. కంటే తక్కువ పరిమాణం ఉన్న రాళ్లు వాటంతట అవే పోతాయి. అయితే 12 మి.మీ. కంటే పెద్ద రాళ్లను తొలగించడానికి శస్త్రచికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. దీని తర్వాత ఈ రాళ్లు మళ్లీ పెరగకుండా నివారించేందుకు నీళ్లు ఎక్కువగా తాగడం, ఉప్పు, మాంసాహారం తగ్గించడంవంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (యూటీఐ)

పిల్లల్లో మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు.

కారణాలు: మూత్రపిండాలు, యురేటర్, మూత్రాశయం వంటి మూత్రవిసర్జక వ్యవస్థలోని వివిధ అవయవాల నిర్మాణంలో లోపాలు, మూత్రం వ్యతిరేక దిశలో పయనించడం, మూత్రనాళాల్లో అడ్డంకుల వంటివి రెండేళ్ల వయసులోపు ఉండే 60-70 శాతం మంది పిల్లల్లో యూటీఐకి కారణాలు. ఇక స్కూల్‌కు వెళ్లే వయసు పిల్లల్లో మూత్రవిసర్జన చేసినప్పుడు మూత్రాశయం పూర్తిగా ఖాళీకాకపోవడం ఒక కారణం. మూత్రం వస్తున్నా ఆటల్లో పడి లేదా టీవీ చూస్తుండటం వల్లనో, స్కూల్లో టాయిలెట్ శుభ్రంగా లేదనో లేదా మరేదైనా కారణం వల్లనో చాలాసేపు మూత్రవిసర్జన చేయకుండా బిగబట్టి ఉండటం కూడా దీనికి కారణం. దీనివల్ల మూత్రాశయంలోని బ్యాక్టీరియా వృద్ధి చెంది ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. ఇక పిల్లలు నీళ్లు తక్కువగా తాగడం వల్లనో లేదా మలబద్ధ్దకంతోనో బాధపడుతూ బ్లాడర్ పూర్తిగా ఖాళీ చేయకుండా ఉండటం వల్ల అక్కడ బ్యాక్టీరియా పెరిగి, మూత్రంలో ఇన్ఫెక్షన్లు రావచ్చు.

లక్షణాలు:

రెండేళ్ల కంటే తక్కువ వయసు పిల్లల్లో కారణం లేకుండా తరచూ జ్వరం, మూత్రంలో మంట, వాంతులు కావడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక పెద్ద పిల్లల్లో మూత్రవిసర్జనలో నొప్పి, దుస్తుల్లోనే మూత్రవిసర్జన కావడం వంటి లక్షణాలు ఉంటాయి.

నిర్ధారణ / చికిత్స: సాధారణ మూత్రపరీక్ష, మూత్రం కల్చర్ పరీక్ష వంటి వాటితో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. సాధారణ యాంటీబయాటిక్స్, జ్వరం మాత్రలతో చికిత్స జరుగుతుంది.

పిల్లల్లో కిడ్నీ ఫెయిల్యూర్

మూత్రపిండాలు మనలోని వృథా పదార్థాలను వడపోసి, ఆ వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. ఒకవేళ మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని పరిస్థితి వస్తే దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్‌గా పేర్కొంటారు. ఫలితంగా వ్యర్థాలు మన శరీరంలోనే ఉండిపోతాయి. దాంతో రక్తంలో క్రియాటినిన్, బ్లడ్ యూరియా వంటివి ఎక్కువవుతాయి. కిడ్నీ ఫెయిల్యూర్‌లో రెండు రకాలుంటాయి. మొదటిది తాత్కాలికం. అంటే కొద్దిరోజుల్లోనే మూత్రపిండం మళ్లీ తన వడపోత సామర్థ్యాన్ని తిరిగి పొందుతుంది. ఇక రెండో రకం కిడ్నీ ఫెయిల్యూర్‌ను క్రానిక్ లేదా శాశ్వత వైఫల్యంగా పేర్కొంటారు. ఇందులో కిడ్నీ తన పనితీరును మళ్లీ మెరుగుపరచుకోవడం ఉండదు. ఈ పరిస్థితి వస్తే కిడ్నీ మార్పిడి చికిత్సే దీనికి పరిష్కారం.

కారణాలు: తాత్కాలిక కిడ్నీ ఫెయిల్యూర్‌కు శరీరంలో రోగనిరోధకశక్తిలో మార్పులు, ఇన్ఫెక్షన్లు (బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్), కిడ్నీలో రాళ్లు, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, ఒక్కోసారి కొన్ని రకాల మందులు వాడటం కూడా దీనికి కారణం. ఇక క్రానిక్ లేదా శాశ్వత కిడ్నీ ఫెయిల్యూర్‌కు జన్యుపరమైన, నిర్మాణలోపాల వంటి అనేక అంశాలు కారణమవుతాయి.

లక్షణాలు: మూత్ర పరిమాణం తగ్గడం ఒంట్లో వాపు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు (ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల) వాంతులు తలనొప్పి ఫిట్స్ రావడం కొందరిలో దీర్ఘ నిద్ర. కొందరు పిల్లల్లో చర్మంపై ర్యాష్, కీళ్లనొప్పులు, జ్వరం, నీళ్ల విరేచనాలు కూడా ఉండవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన పిల్లల్లో ఎదుగుదల తక్కువగా ఉంటుంది. నీళ్లు కూడా తక్కువగా తాగుతారు.

నిర్ధారణ: సాధారణ రక్త, మూత్ర పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. రక్తం, మూత్ర పరీక్షల్లో క్రియాటినిన్, బ్లడ్ యూరియా ఎక్కువగా ఉంటాయి. దీనితో పాటు అల్ట్రా సౌండ్ స్కానింగ్, ఛాతీ ఎక్స్-రే వంటి మామూలు పరీక్షలతో పాటు కొన్ని ప్రత్యేక పరీక్షలూ అవసరమవుతాయి. కొందరికి కిడ్నీ బయాప్సీ పరీక్ష చేసి వారిలో వ్యాధి తీవ్రత, అనుసరించాల్సిన చికిత్సలను నిర్ణయిస్తారు.

చికిత్స: దీనికి రెండు రకాలుగా చికిత్స చేయాల్సి ఉంటుంది. అంటే రోగికి ఏ కారణంగా ఈ పరిస్థితి వచ్చిందో తెలుసుకుని దానికి అనుగుణంగా సపోర్టివ్ చికిత్స ఇవ్వాలి. ఉదాహరణకు అధిక రక్తపోటు వల్ల ఇలా జరిగితే ఆ పిల్లల్లో ఉప్పు పాళ్లు సరిచేసేలా ఆహారాన్ని నిర్ణయించడం, అవసరాన్ని బట్టి ఇమ్యూనోసప్రెసెంట్స్ వంటి మందులు వాడటం చేస్తారు. ఇక కొందరు పిల్లలకు రక్తంలో పేరుకున్న వ్యర్థాలను వడపోసే డయాలసిస్ చేయాల్సి రావచ్చు. దాంతోపాటు కడుపులో చేరిన నీళ్లను తొలగించే చికిత్స అవసరం కావచ్చు. చాలామంది పిల్లల్లో కొద్ది రోజుల నుంచి వారాల్లోనే మూత్రపిండాల పనితీరు మళ్లీ మామూలవుతుంది. అయితే దీర్ఘకాలం పాటు వాళ్లకు నిత్యం వారి ఎదుగుదలను పరిశీలిస్తూ ఉండటం, క్రియాటినిన్ పాళ్లను పరీక్షిస్తూ ఉండటం వంటి పరీక్షలు దాదాపు 20 ఏళ్ల పాటు చేయిస్తూ ఉండాలి.

ఇక మూత్రపిండాలు శాశ్వతంగా దెబ్బతిన్న పిల్లలకు నిత్యం డయాలసిస్ అవసరం లేదా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స శాశ్వత పరిష్కారమవుతుంది.

చాలా ప్రాథమిక స్థాయి పరీక్షలతో కిడ్నీ సమస్యను తెలుసుకోవచ్చు. తగిన చికిత్స తీసుకోవచ్చు. ఆ జాగ్రత్త పిల్లల విషయంలో మరింత ఎక్కువ అవసరం.

కిడ్నీలో రాళ్ల సమస్యకు హోమియో ఉత్తమం

కిడ్నీలో రాళ్ళు అనగానే ఆపరేషన్ ఒక్కటే మార్గం అని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి ఆపరేషన్ చేసి రాళ్ళు తీసివేసినా మళ్లీ తయారవుతూనే ఉంటాయి. అందుకే రాళ్ళు వాటంతట అవే పడిపోయేలా చేయడమే కాకుండా రాళ్ళు తయారయ్యే శరీరగుణాన్ని మార్చే హోమియో చికిత్సను ఎంచుకోవడం ఉత్తమం అంటున్నారు హోమియో వైద్యులు డాక్టర్ కవిత.

ఎక్కువ మందిలో కనిపించే సమస్య కిడ్నీలో స్టోన్స్. తీసుకునే ఆహారం, శరీరతత్వం వంటివి స్టోన్స్ ఏర్పడటానికి కారణమవుతున్నాయి. మూత్రపిండాల్లో రాళ్ళు గట్టిగా క్రిస్టల్ రూపంలోఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో గానీ, మూత్రనాళాల్లోగానీ ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడినట్లయితే నెఫ్రోలిథియాసిస్ అని, మూత్రనాళాల్లో ఉంటే యూరోలిథియాసిస్ అని అంటారు. కిడ్నీలో రాళ్ళు ఎవరిలోనైనా ఏర్పడవచ్చు.

అయితే స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా ఏర్పడతాయి. 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సున్నప్పుడు కిడ్నీ స్టోన్స్ ఏర్పడితే భవిష్యత్తులో మళ్లీ మళ్లీ రావడానికి అవకాశాలుంటాయి. ఒకటి కంటే ఎక్కువ స్టోన్స్ ఏర్పడినపుడు కూడా సమస్య పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది.

కారణాలు :

గౌట్ వ్యాధి ఉన్న వారిలోనూ, రక్తంలో యూరిక్ఆసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వారిలోనూ కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి. గర్భిణిగా ఉన్న సమయంలోనూ ఏర్పడే అవకాశం ఉంటుంది. మూత్రం సాంద్రత పెరిగినా, వాల్యూమ్ తగ్గినా స్టోన్స్ ఏర్పడతాయి. మంచినీరు తక్కువగా తాగే వారిలోనూ, కొన్నిరకాల యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌తో బాధపడుతున్న వారిలోనూ మూత్రపిండాల్లో రాళ్ళు తయారుకావడానికి ఆస్కారం ఉంది.

మెటబాలిక్ అబ్‌నార్మాలటిస్ ఉన్నా స్టోన్స్ ఏర్పడవచ్చు. హైపర్ థైరాయిడిజమ్, సిస్టిన్యూరియా, రీనల్ ట్యూబ్యులార్ అసిడోసిస్ ఉన్న వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. అధిక రక్తపోటు, డయాబెటిస్‌తో బాధపడుతున్నప్పుడు, జీర్ణవ్యవస్థకు ఆపరేషన్‌లు జరిగినపుడు, కొన్ని రకాల మందులు ముఖ్యంగా డైయురెటిక్స్, కాల్షియమ్ ఉన్న మందులు కిడ్నీ స్టోన్స్‌కు కారణమవుతాయి. వంశపారపర్యంగా ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి.

ఆహారమూ కారణమే

మాంసాహారం, చక్కెర , ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కిడ్నీ స్టోన్స్‌కు కారణమవుతాయి. విటమిన్ డి సప్లిమెంట్లు ఎక్కువగా తీసుకున్నా, పాలకూర ఎక్కువగా తిన్నా ఆక్సలేట్ స్టోన్స్ ఏర్పడటానికి అవకాశం ఉంటుంది.

లక్షణాలు :

కిడ్నీలో రాళ్ళు 4 మి.మీల సైజులో ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కొంచెం సైజు పెరిగినపుడు తీవ్రమైన నడుం నొప్పి, కడుపు నొప్పి, మూత్రంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో 4 మి.మీల సైజులో ఉన్నా నడుం భాగంలో నొప్పి ఉంటుంది. కిడ్నీ స్టోన్ సైజు పెరిగినపుడు వాంతులు, వికారం, కూర్చున్నా, పడుకున్నా నొప్పి తగ్గకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో మంట, చలి జ్వరం కూడా ఉంటుంది.

నిర్ధారణ :

పైన చెప్పిన లక్షణాలు ఉన్నప్పుడు కిడ్నీ స్టోన్స్‌ను నిర్ధారించుకోవడానికి స్కానింగ్ చేయించుకోవాలి. ఈ పరీక్ష ద్వారా స్టోన్స్ ఉన్న ప్రదేశం, సైజు తెలుసుకోవచ్చు. కొన్నిరకాల రక్తపరీక్షలు, యూరిక్ ఆసిడ్ లెవెల్స్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

ఆపరేషన్ ఒక్కటే మార్గమా?

మూత్రపిండాల్లో రాయి మూలంగా తీవ్రమైన నొప్పి ఉంటుంది. చాలామంది నొప్పిని భరించలేక ఆపరేషన్‌కు సిద్ధపడుతుంటారు. ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదని కూడా చాలా మంది భావిస్తుంటారు. కానీ ఆపరేషన్ చేసి రాళ్ళు తొలగించినా మళ్లీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలు పాటించని వారిలో సర్జరీ చేసి తీసివేసినా 6 నుంచి 8నెలల్లో తిరిగి ఏర్పడటానికి ఆస్కారం ఉంది. కాబట్టి సర్జరీకి వెళ్లేముందు అన్ని విషయాలు ఆలోచించుకోవాలి.

హోమియో చికిత్స

ఆపరేషన్ అవసరం లేకుండా మందులతో రాళ్ళు పడిపోయేలా చేయడం హోమియో వైద్య విధానం ప్రత్యేకత. హోమియో చికిత్స వల్ల మూత్ర నాళ మార్గం వెడల్పు పెరిగి రాయి సులువుగా బయటకు వచ్చేస్తుంది. హోమియో వైద్య విధానంలో శరీరంలో రాళ్ళు తయారయ్యే గుణాన్ని మార్చేలా చికిత్స అందించడం జరుగుతుంది. దీనివల్ల రాళ్ళు మళ్లీ మళ్లీ ఏర్పడటం జరగదు. శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హోమియో మందులు వాడుకుంటూ ఆహార నియమాలు పాటిస్తే కిడ్నీ స్టోన్స్ సమస్యను సులువుగా అధిగమించ వచ్చనడంలో సందేహం లేదు. కిడ్నీలోస్టోన్స్ ఉన్నాయని తెలిసిన వెంటనే అనుభవజ్ఞులైన వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే సరిపోతుంది

కిడ్నీలో రాళ్లు మందులతో మాయం

కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు తేలగానే బెంబేలెత్తిపోతారు. ఎక్కడ శస్త్ర చికిత్స అంటారోనన్న భయం మనసును కుదిపేస్తుంది. నిజానికి ఆహారపానీయాల విషయాల్లో జాగ్రత్త పడితే అసలీ సమస్యే ఉండదు. ఎప్పుడైనా సమస్య మొదలైతే తొలి రోజుల్లోనే హోమియో వైద్యుణ్ని సంప్రదిస్తే కేవలం మందులతోనే రాళ్లు తొలగిపోతాయంటున్నారు ప్రముఖ హోమియో వైద్యులు ప్రొఫెసర్ బి. సోహన్ సింగ్. మూత్ర పిండాలు చేసే ప్రక్రియలో సమతుల్యత లోపించినప్పుడు వ్యర్థపదార్థాలు సూక్ష్మమైన స్ఫటికాలుగా మారతాయి.

ఇవి ఒకదానికొకటి అంటుకుని చివరికి రాళ్ళుగా తయారవుతాయి. ఈ రాళ్లు వెంటనే నష్టం కలిగించవు. ముందుగా అతి సూక్ష్మమైన స్పటికాలు తయారై కొన్నేళ్లు గడిచిన తరువాత ఒక రాయిగా మారతాయి. వాస్తవానికి 70 శాతం వరకు రాళ్లు మూత్రంతో పాటే బయటకు పోతాయి. మిగతా 30 శాతం మాత్రం మూత్ర పిండాలు, మూత్ర నాళాలు, పిత్తాశయం (బ్లాడర్) వీటిల్లో ఎక్కడో ఒక చోట ఉండిపోతాయి.

ఏమిటా కారణాలు?

వంశానుగ తంగా వచ్చే జన్యుపరమైన కారణాలు కొన్ని అయితే, ఉష్ణ ప్రదేశాల్లో నివాసం, ఉదర సంబంధ సమస్యలకు తరుచూ మందులు వాడటం, అలాగే అతిగా స్టెరాయిడ్స్ తీసుకోవడం. క్యాల్షియం, ఫాస్ఫేట్స్, ఆక్సలేట్స్ రక్తంలో అధికంగాఉండడం వంటివి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి.అలాగే, అతిగా మాంసాహారం తీసుకోవడం. విటమిన్-సి, డి, బి-6 లోపించడం, శరీరంలో విటమిన్-డి ఎక్కువగా ఉండడం,మూత్ర పిండాల్లో ఇన్‌ఫెక్షన్లు, కంతులు ఉండడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం. అలాగే అతిగా మద్యం సేవించడం వల్ల కూడా రాళ్లు ఏర్పడతాయి.

జాగ్రత్తలేమిటి?

  • ఈ రాళ్లు ఏర్పడ డానికి మన ఆహారపు అలవాట్లే ముఖ్య కారణం. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే ముఖ్యంగా చేయవలసిన పని.
  • ఈ ఆహారంలో క్యాల్షియం మోతాదు తగ్గించడం, ఆక్సలేట్లు అధికంగా ఉండే చాక్లెట్లు, పాలకూర, టమాట, బీట్‌రూట్, స్ట్రాబెర్రీ ఉన్న పదార్థాలు తగ్గించాలి.
  • ఈ ఆరోగ్యవంతులు రోజుకు మూడు లీటర్ల నీళ్ళు తాగితే సరిపోతుంది. కానీ, కిడ్నీలో రాళ్ళు ఏర్పడిన వారు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగవలసి ఉంటుంది. అయితే, చల్లని నీరు గానీ, ఇతర చల్లని పానీయాలు గానీ తీసుకోకూడదు. ఈ క్యాల్షియం రాళ్ళు ఉన్న వారు ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి.
  • ఈ ప్రొటీన్లు తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడకుండా నియంత్రించవచ్చు. రాళ్లను నిర్లక్ష్యం చేస్తే, వాటి పరిమాణం పెద్దదై మూత్ర విసర్జన పెద్ద సమస్యగా మారుతుంది. మూత్ర నాళం సన్నగా మారడం, ఇన్‌ఫెక్షన్లు రావడం, ఒక్కోసారి క్యాన్సర్ వ్యాధికి కూడా ఇది దారితీయవచ్చు.

నిర్ధారణ పరీక్షలు :

యూరిన్ అనాలసిస్, యూరిన్ కల్చర్, ఎక్స్‌రే-కె.వి.9, అల్ట్రా సౌండ్ వంటి పరీక్ష'ల ద్వారా మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నాయో లేదో స్పష్టంగా తెలిసిపోతుంది. నీళ్లు ఎక్కువగా తాగితే చాలా మందిలో రాళ్లు వాటంతట అవే మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు ఆ రాళ్లను సేకరించి పరీక్షలకోసం ఒక బట్టలో పట్టి ఉంచాలి. అవి ఏ రకం రాళ్లో పరిశీలించి ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదో డాక్టర్లు సూచిస్తారు. హోమియో వైద్యవిధానం ద్వారా శస్త్రచికిత్స అవసరం లేకుండా కేవలం మందులతోనే రాళ్లను తొలగించవచ్చు. ఇకపై మళ్ళీ రాకుండా కూడా నియంత్రించవచ్చు.

చికిత్స...

హోమియో మందులతో రాళ్లు కరిగిపోవు. కానీ మూత్ర నాళాన్ని మందులు విశాలం చేస్తాయి. దీని వల్ల ఒకటి రెండు సెంటీ మీటర్ల పరిమాణం గల రాళ్లు మూత్ర నాళంలోంచి బయటికి వెళ్ళిపోతుంటాయి.

బర్బారిస్ వల్గారిస్: నొప్పి నడుములో మొదలై, గజ్జల వరకూ రావడం. నొప్పి మరీ అధికమై లేస్తూ, కూర్చుంటూ నానా అవస్థలూ పడుతున్నప్పుడు ఈ మందు బాగా పని చేస్తుంది.

లైకోపోడియమ్: మూత్రంలో మంట, మూత్ర నాళంలో ఇసుక పోసినట్లు ఉండడం, మూత్రం చేయగానే నొప్పి తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

టెరిబింత్: మూత్రపిండ ంలో నొప్పితో పాటు మూత్రం తెల్లగానూ, రక్తపు చారలతోనూ ఉంటే ఈ మందు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మ్యాగ్ ఫాస్: కడుపులో నొప్పి అధికంగా ఉన్నప్పుడు ఈ మందు చాలా త్వరితంగా ప్రభావాన్ని చూపిస్తుంది.

కోలోసింథ్: పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా ఉండడం వల్ల ఎప్పుడూ వంగిపోతుంటారు. అలాంటి వారికి ఇది చాలా ఉపయుక్తమైన మందు. నిజానికి చాలా మందికి మూత్రాశయంలో రాళ్ళు ఉంటాయి. అక్కడ అవి ఉండడం వల్ల ప్రమాదం కూడా ఏమీ ఉండదు. రాయి మరీ పెద్దదై నప్పుడు అది మూత్రనాళంలో ఆటంకాలను తెస్తే తప్ప రాళ్లు మూత్రాశయంలో ఉండిపోతే వచ్చే నష్టమేమీ లేదు. మూత్ర నాళంలో రాయి అడ్డుపడి భరించ లేని నొప్పి వస్తే తప్ప శస్త్రచికిత్సకు వెళ్లకపోవడమే మంచిది.

- డాక్టర్ బి. సోహన్ సింగ్

రిటైర్డ్ సూపరింటెండెంట్

ప్రభుత్వ హోమియోపతి హాస్పిటల్,హైదరాబాద్

మార్చి 10న వరల్డ్‌ కిడ్నీ డే

మన దేశంలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారు 20లక్షల మంది వరకు ఉన్నారని ఒక అంచనా. ఏటా అదనంగా రెండు లక్షల మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని, మన రాష్ట్రం విషయానికి వస్తే రాజధాని నగరంలో 30వేల మంది నుంచి 40 వేల మంది కిడ్నీ వ్యాధిగ్రస్థుకు డయాలసిస్‌ అవసరం అవుతున్నది. ఈ కిడ్నీ సమస్యలకు ప్రధానంగా మధుమేహం (40శాతం), హైబిపి (30శాతం) కారణమవుతున్నాయి. వీటిని అదుపులో ఉంచజీుకుంటే మూత్రపిండాలు చాలా వరకు కాపాడుకోవచ్చు.

నిరంతరం రక్తంలోని వ్యర్ధాలను వడకడుతూ.. మూత్ర పిండాలు మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. పైగా చికిత్సకు ఎంతో ఖర్చు అవుతుంది. మూత్రపిండం పూర్తిగా విఫలమైతే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండక తప్పదు. ఈ ‘డయాలసిస్‌’ కోసం నెలకు సుమారు రూ.4-5వేలు ఖర్చు అవుతాయి. అంతేకాకుండా ఇతరత్రా సమస్యలు ఏర్పడతాయి. చికిత్స తీసుకున్నా కిడ్నీ తిరిగి సమర్ధంగా మారదు.

గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినటం వంటివీ మొదలవుతాయి. పోనీ దెబ్బతిన్న మూత్రపిండాన్ని మార్పిడి చేయించుకోవాలంటే కిడ్నీ దాతలు దొరకటం కష్టం. ఆపరేషన్‌ పెద్ద ప్రయత్నమనుకుంటే ఇక ఆ రత్వాత జీవితాంతం వేసుకోవాల్సిన మందులకూ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఎన్నో ఇబ్బందులు, దుష్ర్పభావాలు. ఇంత ఖర్చు చేసి చికిత్స తీసుకున్నా జీవనకాలమూ తగ్గవచ్చు. ఇలాంటి ప్రమాదాలన్నీ దరిచేరకుండా ఉండాలంటే ముందే మేల్కొని, అసలు కిడ్నీలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

మన జీవనశైలి మార్పులే కిడ్నీలకు సెగ:

మన దేశంలో మధుమేహం ఎంత విపరీతంగా విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2015 నాటికి వీరి సంఖ్య రెట్టింపు కావచ్చని అంచనాలు చెబుతున్నాయి. ఈ మధుమేహంతో పాటే మూత్రపిండాల వైఫల్యం కేసులు పెరుగుతున్నాయి. టైప్‌-1 మధుమేహ బాధితుల్లో 10-30శాతం, టైప్‌-2 మధుమేహుల్లో 40శాతం మంది కిడ్నీ సమస్యల బారినపడే అవకాశం ఉంది. ఒకసారి ఈ మూత్రపిండాల సమస్య మొదలైందంటే.. దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. అందుకే సమస్యను తొలిదశలో గుర్తిస్తే దాన్ని ముదరకుండా నిలువరించే అవకాశం ఉంది. అందుకే మధుమేహులంతా కిడ్నీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ ఆరోగ్యవంతులు అసలు మధుమేహం బారినపడకుండా చూసుకోవాలి.

కిడ్నీల పరిరక్షణకు తేలికైన పరీక్షలు

టైప్‌-1 రకం బాధితులు మధుమేహం బారినపడిన ఐదేళ్ళ నుంచి ప్రతి ఏటా కిడ్నీ సమస్యలు వస్తున్నాయేమో పరీక్షించుకోవటం మంచిది. టైప్‌- 3 మధుమేహులైతే దాన్ని గుర్తించిన తక్షణమే కిడ్నీ పనితీరు తెలుసుకునే పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాత కనీసం ఏడాదికి ఒకసారైనా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీ సమస్యలేమైనా తల ఎత్తుతున్నాయా? అన్నది తేలికైన పరీక్షల ద్వారా చాలా ముందుగానే గుర్తించవచ్చు.

మూత్రంలో అల్బుమిన్‌:అల్బుమిన్‌ అనేది ఒక రకం ప్రోటీను. మూత్రంలో ఈ సుద్ద ఎక్కువగా పోతోందంటే కిడ్నీల వడపోత సామర్ధ్యం తగ్గిపోతున్నట్టే. అందుకే ప్రతి ఏటా తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకోవాల్సిందే. దీని ద్వారా కిడ్నీ సమస్యను గుర్తించవచ్చు.

రక్తంలో సిరమ్‌ క్రియాటిన్‌:మన కిడ్నీల వడపోత సామర్ధ్యం ఎలా ఉందో చెప్పేందుకు ఈ పరీక్ష కీలకం. దీని ఆధారంగా వడపోత సామర్ధ్యాన్ని ( ఎస్టిమేటెడ్‌ గ్లోమెరూలార్‌ ఫిల్టరేషన్‌ రేట్‌-ఈజీఎఫ్‌ఆర్‌(ను లెక్కించి... కిడ్నీల సమస్య తలెత్తే అవకాశం ఎంతవరకూ ఉందన్నదనే అంచనా వేస్తారు. సాధారణంగా ఇది 110 మి.లీ. వరకూ ఉంటుంది. ఇది 60 మి.లీ.కన్నా తక్కువుంటే మూత్రపిండాల సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. కేవలం క్రియాటినైన్‌ పరీక్ష చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50శాతం దెబ్బతినే వరకూ కూడా సిరమ్‌ క్రియాటినైన్‌ పెరగకపోవచ్చు. కాబట్టి ‘ఈజీఎఫ్‌ఆర్‌’ను చూసుకోవటం ముఖ్యం. సీరమ్‌ క్రియాటినైన్‌ పరీక్షించి దానితో పాటు వయసు, బరువు, ఎత్తు వంటి ప్రమాణాల ఆధారంగా ‘ఈజీఎఫ్‌ఆర్‌’ లెక్కిస్తారు.

కిడ్నీలను కాపాడుకోవాలంటే?

మధుమేహం, అధిక రక్తపోటు కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహులు- హెచ్‌బిఎ 1సి (గ్లైకాసిలేటెడ్‌ హిమోగ్లోబిన్‌) పరీక్ష ఫలితం 7కన్నా తక్కువ ఉండేలా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది గత మూడు నెలల సమయంలో మధుమేహం కచ్చితంగా అదుపులో ఉందా లేదా? అని చెప్పే పరీక్ష. మధుమేహం, హైబీపీ రెండూ ఒకదానికి ఒకటి తోడై.. చివరికి కిడ్నీలను దెబ్బతీసే స్థాయికి చేరకుంటాయి. అందుకే రక్తపోటును 130/80 కంటే తక్కువే ఉండేలా చూసుకోవాలి.రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవాలి. అలాగే రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి.మూత్రంలో సుద్ద పోతుంటే వెంటనే గుర్తించి తక్షణం చికిత్స తీసుకోవాలి. అందుకే తరచూ పరీక్షలు చేయించుకోవటం ముఖ్యం.

ఆధారము: హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్

మూత్రాశయ సంబంధ వ్యాధులు - చికిత్సలు

మూత్రంలో అల్బుమిన్‌ అనే ప్రోటీన్‌- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

మూత్రంలో అల్బుమిన్‌ :

అల్బుమిన్‌ అనేది ఒక రకం ప్రోటీను. మూత్రంలో ఈ సుద్ద ఎక్కువగా పోతోందంటే కిడ్నీల వడపోత సామర్ధ్యం తగ్గిపోతున్నట్టే. అందుకే ప్రతి ఏటా తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకోవాల్సిందే. దీని ద్వారా కిడ్నీ సమస్యను గుర్తించవచ్చు. శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసే శుద్ధి యంtraaలు కిడ్నీలు. అలాంటి కిడ్నీలు పనిచేయడం మానేస్తే.. మన శరీరమే విషతుల్యం అయిపోతుంది.

మన దేశంలో ప్రతి పది మందిలో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. వీళ్లలో చాలామందికి తమ కిడ్నీలో సమస్య ఉందన్న విషయమే తెలియదు. కిడ్నీ జబ్బులకి సవాలక్ష కారణాలు. కారణం తెలిస్తే కిడ్నీజబ్బులను ఎదుర్కోవడం కూడా పెద్ద కష్టం ఏమీ కాదు.

మూత్రంలో ఏమాత్రం ప్రోటీన్‌ పోతున్నా మధుమేహులు జాగ్రత్త పడటం మంచిది. ఎందుకంటే మధుమేహుల్లో కిడ్నీ సమస్యలూ తలెత్తే అవకాశముంది. దీంతో మూత్రంలో అల్బుమిన్‌ అనే ప్రోటీన్‌ పోవటం కనిపిస్తుంది. ఇలాంటివారికి గుండెపోటు, పక్షవాతం, గుండెవైఫల్యం ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. సాధారణంగా 90% మంది మధుమేహుల్లో మూత్రంలో అల్బుమిన్‌ స్థాయులు మామూలు మోతాదులోనే ఉంటాయి. అయినప్పటికీ వీరికి కూడా గుండెజబ్బుల ముప్పు పెరుగుతోందా? అనేదానిపై ఇటలీ పరిశోధకులు తొమ్మిదేళ్ల పాటు అధ్యయనం చేశారు. ఈ ప్రోటీన్‌ మోతాదు కొద్దిగా పెరిగినా గుండె సమస్యల ముప్పు పొంచి ఉంటున్నట్టు గుర్తించారు. ఇక దీని మోతాదు పెరుగుతున్నకొద్దీ ముప్పూ ఎక్కువవుతూ వస్తోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల మధుమేహులు మూత్రంలో అల్బుమిన్‌ పోతుంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించటం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

మూత్రము లో ప్రోటీన్‌ పోవడాన్ని ఈ క్రింది రకాలుగా చెప్పవచ్చు :

  • మైక్రోఆల్బుమినూరియా,
  • మాక్రో ఆల్బుమినూరియా,
  • ప్రొటినూరియా లేదా ఆల్బుమినూరియా
  • యూరిన్‌ - క్రియాటినిన్‌ రేషియో,

మూత్రములో ప్రోటీన్‌ పరీక్ష . . సుమారు 5-10 మి.లీ. మూత్రము ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని పై భాగము వేడిచేయగా ప్రోటీన్‌ కాగులేట్ అయి తెల్లని పొర(టర్బిడ్) గా యేర్పడును. ఇది మనకు ప్రోటీన్‌ ఉన్నదీ .. లేనిదీ తెలుసందే తప్ప ఖచ్చితముగా ఎంత మోతాదులో పోతుందో తెలియదు. 1+, 2+, 3+,4+ అని అంచనా పై రిపోర్ట్ చేయుదురు. నార్మల్ గా 0-8/100 మి.లీ. ఉంటుంది .

మూత్రము లో ప్రోటీన్‌ కనిపించే కొన్ని ముఖ్యమైన వ్యాధులు :

  • మధుమేహము --diabetes
  • రక్తపోటు --hypertension,
  • కాలేయ వ్యాధులు --liver cirrhosis,
  • గుండె జబ్బులు --heart failure ,
  • ఒకరకమైన చర్మ వ్యాది --systemic lupus erythematosus.
  • మూత్రపిండాల వ్యాధులు ..Glomerulo nephritis , nephrotic syndrome,
  • గర్భిణీ లలో మూత్రము లో ప్రోటీన్‌ ఉంటే గుర్రపు వాతవ (eclampsia) అనే సీరియస్ వ్యాధికి దారితీయును,

Albumin in Urine-మూత్రంలో అల్బుమిన్‌ - Ayurvedhic Treatment / Mr Naveen Nadiminti 

మన రక్తంలో ఆల్బుమిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. రక్తం తాలూకు ద్రవాభిసరపీడనం (ఆస్మాటిక్ ప్రెషర్)ని నిర్దేశిత స్థితిలో ఉంచటం దీని ప్రధాన విధి. దీనికోసం శరీరంలో రక్తంతోపాటు ప్రొటీన్ కూడా సంచరిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ప్రొటీన్‌తోకూడిన రక్తం మూత్ర పిండాలను చేరుకుంటుంది. కిడ్నీలు రక్తంలో అదనంగా ఉండే ప్రొటీన్‌ని వడపోత ద్వారా వేరుపరిచి వెలుపలకి విసర్జిస్తాయి. ఇది శారీరక క్రియలో భాగంగా కనిపించే సహజ ప్రక్రియ. అయితే ఏదైనా కారణం చేత మూత్రపిండాలు విసర్జించాల్సిన స్థాయి కంటే ఎక్కువ ప్రొటీన్‌ని లేదా ఆల్బుమిన్‌ని మూత్రం ద్వారా వెలువరిస్తే దానిని ఆల్బుమినూరియా అంటారు. దీనినే మైక్రోఆల్బిమునూరియా అని కూడా పిలుస్తారు. మామూలు డిప్‌స్టిక్ పద్ధతుల ద్వారా మూత్రంలో ఉండే ప్రొటీన్‌ని కొలవటం సాధ్యం కానప్పుడు మైక్రో ఆల్బిమునూరియా అంటారు. గ్లోమరూలర్ ప్రొటినూరియా, నెఫ్రోటిక్ సిండ్రోమ్ వంటి పేర్లతో కూడా ఈ వ్యాధి స్థితిని వ్యవహరిస్తారు.

ఆల్బుమినూరియాను పోలిన వ్యాధి స్థితిని ఆయుర్వేదం ''లాలామేహం'' అనే పేరుతో వివరించింది. ఇది 10 రకాలైన కఫజ ప్రమేహాల్లో ఒక భేదం. జొల్లులాగా తీగలుగా, జిగటగా వెలువడే మూత్రాన్ని లాలామేహం అంటారు. ఈ వ్యాధికి ఆయుర్వేదంలో ప్రభావవంతమైన చికిత్స ఉంది. మన శరీరాల్లో ప్లాస్మా ప్రొటీన్లనేవి ఉండటం అవసరం. ఈ ప్రొటీన్లు వెలుపలకు వెళ్లిపోకుండా చేయడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. గ్లోమరూలర్ ఫిల్టరేషన్ బ్యారియర్ ద్వారా ప్రొటీన్లు వెళుతున్నప్పుడు కిడ్నీలలోని రీనల్ ట్యూబ్యూల్స్ అనే నిర్మాణాలు ఈ ప్రొటీన్లను తిరిగి శరీరంలోకి గ్రహిస్తాయి. ఆరోగ్యవంతుల్లో రోజు మొత్తం విసర్జించిన మూత్రంలో 150 మిల్లీ గ్రాముల వరకూ (లేదా 100 మిల్లీలీటర్ల మూత్రంలో 10 మిల్లీ గ్రాముల వరకూ) ప్రొటీన్ కనిపించడం సహజం. ఇంతకంటే ఎక్కువ మొత్తాల్లో ప్రొటీన్ మూత్రంతోపాటు వెళుతుంటే దానిని అసాధారణంగా భావించాలి. కిడ్నీ వ్యాధులుగాని లేదా ఇతర సాధారణ సంస్థాగత (సిస్టమిక్) వ్యాధులు గాని దీనికి కారణమయ్యే అవకాశం ఉంది.

శారీరక శ్రమ, తీవ్రావస్థలో కనిపించే వ్యాధులు, హెచ్చు స్థాయి జ్వరాలు, నెలసరిలో అపక్రమం, గర్భధారణ, అసాధారణమైన యోనిస్రావాలు, ఆహారంలో తేడాలు, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర నిల్వలు పెరగటం వంటి అనేక అంశాలు మైక్రో ఆల్బునూరియాకి కారణమవుతాయి రాత్రి మొత్తం కాలం పగటి మొత్తం కాలం రెంటినీ పోల్చి చూస్తే రాత్రి కంటే పగటిపూట ఆల్బుమిన్ విసర్జన 25 శాతం అధికంగా ఉంటుంది. టైప్ 1 మధుమేహం (ఇన్సులిన్ మీద ఆధారపడే మధుమేహం)లో ఆల్బుమినూరియా కనిపిస్తే మూత్ర పిండాల వైఫల్యాన్ని పరిగణించాలి.

కాగా టైప్ 2 మధుమేహంలో ఆల్బుమినూరియా కనిపిస్తే గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గటంవల్ల ఉత్పన్నమయ్యే ఇస్కీమిక్ గుండె జబ్బులను దృష్టిలో ఉంచుకోవాలి. రోగ వికృతి విధి విధానం త్రివిధమైన కారణాలవల్ల మూత్రంలో అసాధారణ స్థాయిలో ఆల్బుమిన్ కనిపించే అవకాశం ఉంది. మూత్రపిండాల్లోని రీనల్ ట్యూబ్యూల్స్ ప్రొటీన్లను తిరిగి గ్రహించనివ్వకుండా చేసే వివిధ సంస్థాగత వ్యాధులవల్ల ఈ స్థితి రావచ్చు. ఇది మొదటి కారణం. రక్తంలోని ప్లాస్మా ప్రొటీన్లు అధికంగా ఉత్పత్తి కావటమే కాకుండా మూత్రపిండాలు వడపోయగలిగే స్థాయిని మించిపోయి ప్రొటీన్లు మూత్రపిండాలను చేరుకోవటం రెండవ కారణం. మూత్ర పిండాల్లోని గ్లొమరులర్ బ్యారియర్స్ అనే నిర్మాణాలు తమ పరిమితులను కోల్పోయి అసాధారణ స్థాయిలో మధ్యమ స్థాయి అణుభారం కలిగిన ప్రొటీన్లను అనుమతించటం అనేది ఆల్బూమినూరియాకు మూడవ కారణం.

స్ర్తి పురుష భేదాన్ని పరిగణిస్తే ఈ వ్యాధి పురుషుల్లో రెండు రెట్లు ఎక్కువ. అలాగే వయసుతోపాటు ఈ సమస్య కూడా పెరుగుతుంది. వ్యాధి ఇతివృత్తం ఈ సమస్య ఎక్కువమందిలో యాదృచ్ఛికంగా బయటపడుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటివి ఉన్నాయని తెలిసినప్పుడు చేయించే రొటీన్ పరీక్షల్లో ఆల్బూమినూరియా ఉన్నట్లు బయటపడుతుంది. ఆల్బూమినూరియా ఉన్నంత మాత్రాన దానిని ప్రమాదభరితమైన మూత్రపిండాల వ్యాధులకు ముడిపెట్టాల్సిన పనిలేదు. మామూలు వ్యాధుల్లో సైతం ఈ లక్షణం కనిపించే అవకాశం ఉంది కనుక ముందుగా ఈ కోణంలో దర్యాప్తు చేయటం అవసరం. ఆల్బూమినూరియా ఉన్నదని తేలినప్పుడు మూత్రంలో ఎరుపుదనం, నురగ వంటి లక్షణాలతోపాటు సకోశవ్యవస్థకు చెందిన సమస్యలు అనుబంధంగా కనిపిస్తున్నాయేమో తెలుసుకోవాలి. అలాగే మడమల్లోను వాపు, కంటిచుట్టూ వాపు, వృషణాలూ, యోని పెదవుల్లో వాపు వంటివి అనుబంధంగా ఉన్నాయేమో చూడాలి. గతంలో అధిక రక్తపోటు కనిపించిన ఇతివృత్తం ఉండటం, రక్తంలో కొలెస్టరాల్ అధికంగా ఉండటం, గర్భధారణలో కిడ్నీలు వ్యాధిగ్రస్తమైన సందర్భాలు ఉండటం, మధుమేహం ఉండటం, కుటుంబంలో ఇతరులకు మధుమేహం ఉండటం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ ల్యూపస్ వంటి ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులుండటం, రేనాడ్స్‌వ్యాధి (చర్మంపైన దద్దురు, కళ్ళుఎర్రబారటం, కీళ్లు పట్టేయడం) వంటి వ్యాధుల ఇతివృత్తం గురించి తెలుసుకోవాలి. అలాగే మం దుల వాడకం గురించి తెలుసుకోవడం కూడా ముఖ్యం.

కార్లు, క్షయ, మలేరియా, సిఫిలిస్, ఎండోకార్డైటిస్ వంటి వ్యా ధుల బారిన పడిన సందర్భాలున్నాయేమో తెలుసుకోవాలి. హెచ్‌ఐవి, హెపటైటిస్-బి వంటి వైరల్ వ్యాధులబారిన పడే అవకాశం (రిస్కు) ఉన్నదేమో తెలుసుకోవాలి. జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టటం, బరువు తగ్గటం, ఎముకలనొప్పి వంటి లక్షణాలను అడిగి తెలుసుకోవాలి. అలాగే నెఫ్రోటిక్ సిండ్రోమ్‌ని సూచించే ఉపద్రవాలున్నాయేమో గమనించాలి. గజ్జల్లో నొప్పి, కడుపునొప్పి, ఆయాసం, ఊపిరితో ఛాతినొప్పి రావటం, వణుకు వంటి లక్షణాలకు ప్రాముఖ్యతనివ్వాలి. వ్యాధి నిర్థారణ, విశే్లషణ తాత్కాలికంగా కనిపించే ప్రొటినూరియా వ్యాధిలో రీనల్ ఫంక్షన్ పరీక్షలో తేడా ఉండదు. పొడుగ్గా సన్నగా ఉండే వ్యక్తుల్లో, అందునా 30 ఏళ్ళలోపు వ్యక్తుల్లో కనిపించవచ్చు. ఈ స్థితితోపాటు సాధారణంగా వెన్ను వంపు కనిపిస్తుంది. శాశ్వతంగా మూత్రంలో ప్రొటీన్ పోతుండటం, మూత్రంతోపాటు విసర్జితమయ్యే ప్రొటీన్ మొత్తాలు 500 మిల్లీ గ్రాముల ఉండటం అనేది అంతర్గత కిడ్నీ వ్యాధిని సూచిస్తుంది. మూత్రంలో రక్తకణాల మేట కనిపించటం, రక్తంలో ఆల్బుమిన్ తగ్గటం (హైపోఆల్బిమునీమియా), మూత్రంలో కొవ్వు కనిపించటం (లిపిడూరియా), వాపు, కిడ్నీల పనితీరుని చెప్పే రీనల్ ఫంక్షన్ టెస్టు అసాధారణమైన ఫలితాలను ప్రదర్శించటం, రక్తంలో కొవ్వు ఎక్కువ మొత్తాల్లో ఉండటం (హైపర్ లిపిడిమియా), రక్తపోటు అధికంగా ఉండటం వంటివి అన్నీ కిడ్నీలు వ్యాధిగ్రస్తం కావడం మూలాన ప్రాప్తించే ఆల్బిమినూరియాలో కనిపిస్తాయి.

సూచనలు, ఆయుర్వేద చికిత్స

  • చంద్రప్రభావటి, శిలాజిత్తు, యశదభస్మం, చంద్రకళారసం, స్వర్ణమాక్షీక భస్మం, త్రివంగ భస్మం, యోగేంద్ర రసం, గుడూచిసత్వం, నాగభస్మం వంటివి ఈ వ్యాధిలో ప్రయోగించదగిన ఆయుర్వేద ఔషధాలు.
  • ఆల్బుమినూరియా (లాలమేహం) వ్యాధి స్థితిలో ప్రత్యేకంగా వాస (అడ్డసరం ఆకులు), హరీతకి (కరక్కాయ పెచ్చులు), చిత్రక (చిత్రమూలం వేర్లు), సప్తపర్ణి (ఏడాకులపొన్న) వీటితో కషాయం తయారుచేసుకొని తాగితే హితకరంగా ఉంటుంది.
  • ఉసిరికాయల రసం (20 మిల్లీలీటర్లు), పసుపు (5 గ్రా.) లను రోజుకు రెండుసార్లు ఉదయం, రాత్రి పుచ్చుకోవాలి.
  • త్రిఫలాలు, పెద్దపాపర (విశాల), దేవదారు, తుంగముస్తలు వీటిని సమాన భాగాలు తీసుకొని కషాయ రూపంలో 30 మిల్లీ లీటర్ల మోతాదుగా రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
  • అడవి మల్లె పుష్పాలు (కుటజ), కపిత్థ పుష్పాలు (కపిత్థ), రోహితక పుష్పాలు, విభీతకి పుష్పాలు, సప్తపర్ణ పుష్పాలు (ఏడాకులపొన్న)వీటిని ముద్దగా నూరి ఉసిరిపండ్ల రసానికి కలిపి తీసుకోవాలి.
  • వేప, రేప, ఏడాకుల పొన్న, మూర్వ, పాలకొడిశ, మదుగ వీటి పంచాంగాలను కషాయం రూపంలో అవసరమైతే తేనె చేర్చి తీసుకోవాలి.
  • చంద్రప్రభావటి అనే మందు జాంబవాసవం అనుపానంగా వాడాలి.
  • శిలాజిత్తు (500 మి.గ్రా.), వసంత కుసుమాకరరసం (100 మి.గ్రా) మోదుగపువ్వుల కషాయంతో పుచ్చుకోవాలి.
  • చిల్లగింజలను మజ్జిగతో గంధం తీసి మూత్రవిరేచన క్వాథంతో 20మిల్లీ లీటర్ల మోతాదులో రోజుకు రెండుసార్లు పుచ్చుకోవాలి. ఆహారం ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. ఆహార పదార్థాలకు అదనంగా ఉప్పు చేర్చకూడదు. ముఖ్యంగా వాపు కనిపిస్తున్న సందర్భాల్లో ఈ సూచన బాగా గుర్తుంచుకోవాలి.
  • ఈ వ్యాధి స్థితిలో ప్రొటీన్ (మాంసకృతులు) పదార్థాల వాడకం గురించి కొంత సందిగ్ధత నెలకొని ఉంది. మధుమేహంతో కూడిన కిడ్నీ వ్యాధుల్లోనూ, గ్లొమరూలర్ వ్యాధుల్లోనూ కనిపించే ఆల్బూమినూరియాలో ప్రొటీన్‌ని తగ్గించటం ద్వారా వ్యాధి కొనసాగే వేగాన్ని తగ్గించవచ్చునని తేలింది. అయితే ప్రొటీన్‌ని తగ్గిస్తే పోషకాహార లోపం (మాల్‌న్యూట్రిషన్)వల్ల ఇక్కట్లు వచ్చే చిక్కు ఉంది కాబట్టి రోజుకు ఒక కిలో శారీరక బరువుకు ఒక గ్రాము చొప్పున లెక్కకట్టి ప్రొటీన్ వాడకుంటే మంచిది. అంటే, 70 కిలోల బరువుండే వ్యక్తులు రోజుకు 70గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలన్నమాట.

మూత్ర నాళ ఇన్‌ఫెక్షన్లకు మెరగైన వైద్యం

మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్లు రావడం సాధారణమే. ఏ కారణమూ లేకుండా వచ్చిన ఇన్‌ఫెక్షన్ సులభంగానే తగ్గిపోతుంది. కానీ ఇతర కారణాల వల్ల ఇన్‌ఫెక్షన్ వచ్చినట్లయితే, దాన్ని నిర్లక్ష్యం చేస్తే మరిన్ని సమస్యలకు దారితీయవచ్చు. అందుకే మూత్రంలో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లయితే కారణం తెలుసుకుని అందుకు వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి.

చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు పైబడిన వారి వరకు ఎవరికైనా మూత్రంలో ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. కొందరిలో ఈ ఇన్‌ఫెక్షన్లు రావడానికి కారణం ఉండదు. కానీ ఇన్‌ఫెక్షన్లు రావడానికి కిడ్నీలో రాళ్లు కారణం కావచ్చు. ప్రొస్టేట్ గ్రంథిలో సమస్య కావచ్చు. మూత్రనాళంలో అడ్డంకులు కావచ్చు. కారణం ఏదైనా మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

కిడ్నీ, యూరేటర్స్, బ్లాడర్, మూత్రనాళానికి సంబంధించిన ఇన్‌ఫెక్షను మూత్రాశయ ఇన్ ఫెక్షన్లుగా పరిగణించవచ్చు. అయితే కొన్ని రకాల ఇన్ ఫెక్షన్లు తొందరగా తగ్గిపోతే, మరికొన్ని ఇన్‌ఫెక్షన్లు తీవ్రమవుతాయి. చలిజ్వరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఎవరిలో రావచ్చు?

చిన్న పిల్లల్లో, యుక్తవయస్సు వారిలో, ఎక్కువ శాతం స్త్రీలలో, వయసు పైబడిన వారిలో రావచ్చు. చిన్న పిల్లల్లో జ్వరం, దగ్గు, ఆయాసం, తీవ్రమైన జ్వరం, పక్క తడపడం వంటివి నులి పురుగుల వల్ల రావచ్చు.

యుక్తవయస్సు వారిలో గనేరియా, సిఫిలిస్, క్యాండిడియాసిస్, ఈకొలై, ఎయిడ్స్, హనీమూన్ సిస్టైటిస్, ఫైమోసిస్ స్ట్రిక్చర్స్, పారా ఫైమోసిస్ వల్ల, సెక్స్ ద్వారా వ్యాపించే ఇతర జబ్బుల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలలో పురుషుల కంటే మూత్రనాళం సైజు తక్కువగా ఉండటం వల్ల, మల ద్వారానికి దగ్గరగా ఉండటం వల్ల ఇన్‌ఫెక్షన్స్‌కు త్వరగా గురవుతారు. గర్భిణి స్త్రీలలో గర్భాశయ పెరుగుదల (పిండం ఒత్తిడి వల్ల) బ్లాడర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇక వయసు పైబడిన వారిలో ప్రొస్టేట్ గ్రంధి వాపు, గనేరియా, లైంగిక వ్యాధులు, ఎయిడ్స్, డయాబెటిస్, కేన్సర్, కాలేయ వాపు, కిడ్నీ ఇన్‌ఫెక్షన్లు, అధిక రక్తపోటు వంటి వ్యాధుల వల్ల, కిడ్నీ స్టోన్స్, నీళ్లు తక్కువ తాగడం, గుండె సంబంధ వ్యాధులు, పక్షవాతం, ఎముకలు విరగడం, ఎక్కువ రోజులు మంచానికి పరిమితం కావడం, మానసిక క్షోభ, నిద్రలేమి, రోగనిరోధక శక్తి సన్నగిలడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల కలిగే మానసిక ఒత్తిడి, ఇతర ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, నియంత్రణ లేని డయాబెటిస్ వ్యాధి, హెర్నియా, ఎలిఫెంటాయిసిస్, కణుతులు, గడ్డలు, రేడియేషన్ ట్రీట్‌మెంట్స్, వెన్నెముక గాయాలు, తలకు గాయం, ఎక్కువ రోజులు క్యాథెటర్ శరీరంలో ఉండటం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్లు రావచ్చు.

ప్రధాన లక్షణాలు

మూత్రంలో మంట, మూత్రవిసర్జన తరువాత మంట, మూత్రవిసర్జన సరిగ్గా రాకపోవడం, ఆగి, ఆగి రావడం, అర్జంటుగా వెళ్లాల్సి రావడం, మూత్రం వచ్చినట్టు అనిపిస్తుండటం, రాకపోవడం, మూత్రం పచ్చగా, చిక్కగా, పసుపు రంగులో, వాసన కూడా ఉండటం, పొత్తి కడుపులో నొప్పి, వికారం, వాంతులు, కొద్దిపాటి జ్వరం, నీరసం, నొప్పులు, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి. గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది.

నిర్ధారణ పరీక్షలు

  • మూత్రపరీక్ష
  • కల్చర్
  • అల్ట్రాసౌండ్ కెయుబి
  • ఐవీపీ
  • సీటీస్కాన్

చికిత్స

వ్యాధి మూలం తొలగిపోయేలా చికిత్స అందించడం ద్వారా మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లను సమూలంగా తరిమేసే అవకాశం ఉంది. హోమియో చికిత్స ఇదే విధానంలో ఉంటుంది. రోగలక్షణాలు, మానసిక స్థితి, శారీరక లక్షణాలు, వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స అందించడం జరుగుతుంది. హోమియో చికిత్సలో ఎలాంటి దుష్ఫలితాలూ ఉండవు. చికిత్సలో ముందుగా ఏ కారణం వల్ల ఇన్‌ఫెక్షన్ వచ్చిందీ కనుక్కోవాలి. ఆ తరువాత దానికి తగిన చికిత్స ఇవ్వాలి.

నివారణ పద్ధతి

ప్రతిరోజు నీళ్లు ఎక్కువగా తాగాలి. జననాంగాల ప్రాంతంలో శుభ్రత పాటించాలి. మూత్రం నిలువ ఉంచుకోకుండా తరచుగా విసర్జన చేస్తుండాలి. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం తగినంత నీరు తాగకపోవడమేనని గుర్తుపెట్టుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మూత్ర సంబంధ ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

మూత్రనాళంలో అవరోధం (స్ట్రిక్చర్ యురెత్రా)

మూత్రనాళం ఇరుకైపోవడం వల్ల మూత్ర విసర్జనలో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమస్య కొందరికి పుట్టుకతోనే రావచ్చు. మరికొందరికి ఇతర కారణాల వల్ల ఆ తరువాత కాలంలో కూడా రావచ్చు. అంటువ్యాధుల కారణంగా గానీ, రసాయనిక కారణాలతో గానీ, పీచులాంటి పదార్థం అడ్డుపడటం వల్లగానీ, ఈ సమస్య రావచ్చు. మూత్ర నాళం ఇరుకైపోవడం వల్ల మూత్రం చాలా నెమ్మదిగా వెళుతుంది. ఒక్కోసారి మూత్ర విసర్జన ఆగిపోవచ్చు కూడా. సమస్య మూలాలు, దాని తీవ్రతను బట్టి ఈ వ్యాధికి చికిత్స ఉంటుంది.

ఈ కొందరికి మూత్ర విసర్జన చేయాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ, ప్రతి సారీ కొన్ని చుక్కలు మాత్రమే వస్తాయి. చాలా మందిలో మూత్రం రక్తంతో కలిసి ఉంటుంది. విసర్జనకు ముందు, తరువాత మంటగా ఉంటుంది. వీరు కేంతారిస్-200 మందును ప్రతి నాలుగు గంటలకు ఒకడోసు చొప్పున 7 సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఈ గతంలో గనేరియా వ్యాధికి లోనైన వారిలో ఈ తరహా సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయి. అరుదుగా కొందరిలో సిఫిలిస్ మూలాలు కూడా కనిపిస్తాయి. మూత్ర విసర్జన కోసం వెళ్లిన చాలా సార్లు అసలు రానే రాదు. రాత్రివేళ నొప్పి ఎక్కువవుతుంది. వీరికి మెర్క్‌సాల్-200 మందును ప్రతి 6 గంటలకు ఒక డోసు చొప్పున 7 సార్లు వేస్తే ఉపశమనం లభిస్తుంది.

ఈ మూత్రనాళ ద్వారం మీద, జననాంగం చివర చర్మం లోపల చిన్నటి బొబ్బలు ఏర్పడతాయి. మూత్ర విసర్జన సమయంలో మూత్రనాళంలో విపరీతమైన మంట ఉంటుంది. మూత్రం అమ్మోనియా లాంటి వాసన వేస్తుంది. మూత్రం కొన్ని చుక్కలు రావాలన్నా ఎంతో అవస్థ పడతారు. వీరు నైట్రిక్ యాసిడ్-200 మందును రోజూ ఉదయం ఒక డోసు చొప్పున వారం రోజులు వేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఈ మూత్ర విసర్జన సమయంలో నొప్పి మంట ఉంటాయి. చాలాసేపటి వరకు ఒక చుక్క కూడా మూత్రం రాదు. ఆ తరువాత అతి కష్టంగా కొన్ని చుక్కలు పడతాయి. ఆ తరువాత నొప్పి లేకుండా మూత్రం ఏకధారంగా వస్తుంది. ఈ స్థితిలో క్లెమాటిస్-200 మందును రోజూ ఒక డోసు చొప్పున వారం రోజులు వేసుకుంటే సమస్య తొలగిపోతుంది.

గమనిక : సూచించిన ఈ మందులు ప్రథమ చికిత్సకు ఉద్దేశించినవి. ఒక వేళ ఈ మందులతో సమస్య తగ్గకపోతే దగ్గరలో ఉన్న హోమియో వైద్యుణ్ని సంప్రదించండి.

ఈ సమస్య షుగర్‌తోనేనా?

నా వయసు 56 సంవత్సరాలు. నాకు 12 ఏళ్లుగాషుగర్ ఉంది. ఈ మధ్యలో ఎక్కువగా ప్రయాణం చేసినప్పుడు కాళ్లకు వాపులువస్తున్నాయి. నా బ్లడ్‌టెస్ట్‌లో క్రియాటినిన్ 10మియగా/డెసీలీటర్, యూరియా 28 మియగా./డెసీలీటర్ ఉంది. యూరిన్ టెస్ట్‌లో ప్రొటీన్ 3 ప్లస్ అనిచెప్పారు. నాకు షుగర్ వల్ల కిడ్నీ సమస్య ఉందా? ఇప్పుడు ఎలా జాగ్రత్తపడాలి?

మీరు పంపిన రిపోర్టుల ప్రకారం మీకు యూరిన్‌లో ప్రొటీన్ ఎక్కువగా పోతోంది (డైయూరెటిక్ నెఫ్రోపతి). మొదటిది షుగర్ వల్లో లేదా కిడ్నీ లేదా ఇతర కారణాల వల్లో తెలుసుకోవాలి. మీరు ఒకసారి కంటి డాక్టర్ దగ్గర రెటీనా పరీక్ష చేయించుకోవాలి. షుగర్ వల్ల రెటీనా దెబ్బతిన్నట్లయితే నెఫ్రోపతికి కారణం కూడా మధుమేహమే అయివుండే అవకాశం ఉంది. ఈ సమస్య ఉన్నవాళ్లు భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహం అదుపులో ఉంచుకోవడం అన్నింటి కన్నా ముఖ్యం. ఖాళీకడుపుతో ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ 14 మియగా./డెసీలీటర్ లోపు, తిన్న తర్వాత 160 మియగా./డెసీలీటర్ ఉండేటట్లు చూసుకోవాలి. యూరిన్‌లో వెళ్లిపోయే ప్రొటీన్‌ని తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. రక్తంలో కొలెస్ట్రాల్ 150 మియగా./డెసీలీటర్ లోపల ఉండేటట్లు మందులు వాడాలి. ఇవి కాకుండా ఉప్పును తగ్గించాలి. రోజుకి 2 గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం అలవాట్లకు దూరంగా ఉండాలి. పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వాడకూడదు.

మాఅబ్బాయి వయసు 5 సంవత్సరాలు. ఈ మధ్య పొద్దున లేచినప్పుడు కళ్లు, కాళ్లుఉబ్బి ఉంటున్నాయి. యూరిన్ టెస్ట్‌లో ప్రొటీన్ 3 ప్లస్ అని చెప్పారు. ఇదికిడ్నీ జబ్బేనా? పరిష్కారం ఏమిటి?

మీరు చెప్పినదాన్ని బట్టి మీ బాబుకు నెఫ్రోటిక సిండ్రోమ్ అనే జబ్బు ఉంది. మూత్రంలో ప్రొటీన్ ఎక్కువగా పోవడానికి కారణం కూడా ఇదే. ముందు ఈ వ్యాధి నిర్ధారణ అవసరం. ఒకసారి 24 గంటల యూరిన్ ప్రొటీన్ పరీక్ష చేయించండి. సీరమ్ అల్బుమిన్ కొలెస్ట్రాల్ పరీక్ష కూడా అవసరం. నెఫ్రోటిక్ సిండ్రోమ్‌లో అల్బుమిన్ తక్కువగా ఉండి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది చిన్న పిల్లల్లో సాధారణంగా వచ్చే సమస్య. మొదటిసారి వచ్చినప్పుడు మొత్తం మూడు నెలలు స్టెరాయిడ్స్ వాడాలి. ఇవి వాడేముందు పేషెంట్‌కి ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు ఉండకూడదు. ఈ వ్యాధి 15 ఏళ్ల వరకు మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. మొదటిసారి ట్రీట్‌మెంట్ పూర్తికాలం వాడినవాళ్లకు మళ్లీ వచ్చే అవకాశం తక్కువ. ఆహారంలో ఉప్పు, కొవ్వు పదార్థాలు తగ్గించాలి. ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ వ్యాధి మళ్లీ రావచ్చు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

నాకు 32 ఏళ్లు. మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉంటోంది. తరచుగా జ్వరం వస్తోంది. మందులువాడినప్పుడు తగ్గిపోతుంది. నెలలోపు మళ్లీ వస్తోంది. ఎందుకిలా జరుగుతోంది.దీనికి పరిష్కారం ఉందా?

మీరు రికరెంట్ యూరిన్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడు తున్నారు. ఇలా మళ్లీ మళ్లీ రావడానికి గల కారణాలను ముందు విశ్లేషించాలి. షుగర్ ఉంటే కూడా ఇలా పదే పదే ఇన్‌ఫెక్షన్ వస్తుంది. కాబట్టి ఒకసారి డయాబెటిస్ పరీక్ష చేయించండి. అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే రాళ్లు ఉన్నా మూత్రనాళాల వాపు ఉన్నా తెలుస్తుంది. యాంటి బయాటిక్స్ పూర్తి కాలం వాడకపోతే ఇలా ఇన్‌ఫెక్షన్ మళ్లీ మళ్లీ తిరగబెడుతుంది. నీళ్లు ఎక్కువగా అంటే రోజుకి రెండు, మూడు లీటర్ల వరకు తాగాలి. మూత్రం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆగకుండా వెంటనే వెళ్లాలి. ఇలా జాగ్రత్త పడితే ఇన్‌ఫెక్షన్లను కొంతవరకు నివారించవచ్చు. ఏ కారణం లేకుండా ఇన్‌ఫెక్షన్ మళ్లీ వస్తోందంటే మూడు నెలల వరకు యాంటి బయాటిక్స్ డోస్ వాడాలి.

నావయసు 50 సంవత్సరాలు. నేను క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతూవారానికి మూడుసార్లు డయాలిసిస్ చేయించుకుంటున్నాను. నేను ఉండే ఊళ్లోడయాలిసిస్ కేంద్రం లేదు. కాబట్టి ఇది కాకుండా నాకు వేరే పరిష్కారాలు ఏమన్నాఉన్నాయా?

ఈ సమస్య ఉన్నవాళ్లకు ఇతర చికిత్స అంటే కిడ్నీ మార్పిడి ఒకటే. కాని ఇది అందరికీ సాధ్యపడదు. కిడ్నీ మార్పిడి సాధ్యపడనప్పుడు హాస్పిటల్‌లో చేసే డయాలిసిస్ కంటే ఇంటో చేసుకునే డయాలిసిస్ మంచిది. ఇది చాలా సులువైన పద్ధతి కూడా. హాస్పిటల్‌కి వెళ్లే అవసరం కూడా ఉండదు. పేషెంటు తన సొంతంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. రోజువారీ పనుల్లో కూడా ఇది ఆటంకం కాదు. డయాలిసిస్ నడుస్తుండగా ఇతర పనులు కూడా చేసుకోవచ్చు. ఆఫీస్‌లో కూర్చుని కూడా ఇది అమర్చుకోవచ్చు. ఖర్చు కూడా హాస్పిటల్ డయాలిసిస్ కంటే తక్కువ. ముఖ్యంగా సరైన సదుపాయాలు లేని ఊళ్లలో ఈ డయాలిసిస్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. దీనివల్ల బీపీ, ఇతర మందుల అవసరం కూడా తగ్గుతుంది. మీరు ఒకసారి మీ డాక్టర్‌ని సంప్రదించి ఇంట్లో చేసుకునే డయాలిసిస్‌ను వాడడం మంచిది.

మూత్రాశయ క్యాన్సర్‌కు ఆధునిక చికిత్స

ధూమపానం, అద్దకం తదితర పరిశ్రమల్లోని రసాయనాల ప్రభావం, మూత్రసంచిలో ఉండే రాళ్ల వల్ల మూత్రాశయ క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ కారణంగా మూత్రంలో రక్తం పడుతుంది. మూత్రాశయంలో వచ్చే క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించకుండా సత్వర నివారణకు మెరుగైన చికిత్స చేయించుకోవాలంటున్నారు

ఇటీవల బ్లాడర్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. డైయింగ్, కెమికల్ పరిశ్రమల్లో పనిచేసే వారితోపాటు పొగతాగటం, బిల్‌హార్జియాసిస్ అనే రోగ పీడితులు ఎక్కువగా బ్లాడర్ క్యాన్సర్ (మూత్రాశయ క్యాన్సర్)ల బారిన పడుతున్నారు. మూత్రసంచిలో ఎక్కువ కాలంపాటు రాయి ఉన్నా, చికిత్స చేయించుకోని వారికి కూడా క్యాన్సర్ వస్తుంది.

లక్షణాలు :

మూత్రంలో రక్తం పడటం, కడుపులో ఎలాంటి నొప్పిి లేకుండా మూత్రంతో రక్తం కలిసి వచ్చినా, రక్తం గడ్డలుగా తయారై మూత్రంతోపాటు చిన్న రక్తగడ్డలు పడినా, మూత్రం పోసేటపుడు మంట అనిపించినా, పొత్తికడుపులో నొప్పి అనిపించినా మూత్రాశయంలో క్యాన్సర్ ఉందని అనుమానించాలి. ఒక్కో సారి బ్లాడర్‌లో రక్తం గడ్డ కట్టి మూత్రం రాకుండా అట్టుకుంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నపుడు వివిధ రకాల పరీక్షల ద్వారా క్యాన్సర్ ట్యూమర్ సైజు ఎంత ఉంది? బ్లాడర్‌లో ఎక్కడ ఉంది? ఎన్ని ట్యూమర్లు ఉన్నాయి? శరీరంలో ఈ క్యాన్సర్ ఎంతవరకు పాకిందనే అంశాలపై వివిధ పరీక్షల ద్వారా రోగ నిర్ధారణ చేసుకోవాలి.

వ్యాధి నిర్ధారణ పరీక్షలు :

మూత్రంలో రక్తం వచ్చినపుడు ముందుగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలి. స్కానింగ్‌లో క్యాన్సర్ ట్యూమర్లు బ్లాడర్‌లో ఉన్నాయని తేలితే మూత్రనాళం ద్వారా మూత్రసంచిలోకి ఓ సన్నని ట్యూబ్ పంపించి లైట్ వేసి పరీక్షిస్తారు. దీన్ని సిస్టోస్కోపి అంటారు. క్యాన్సర్ ట్యూమర్ చిన్న ముక్క తీసుకొని దాన్ని బయాప్సీకి పంపించటం ద్వారా క్యాన్సర్ ఏ దశలో ఉందో గుర్తిస్తారు. దీనిలో భాగంగా బ్లాడర్‌లో ఆరంభమైన క్యాన్సర్ శరీరంలో ఏ ఏ భాగాలకు పాకిందనే అంశంపై లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్ఎఫ్‌టీ), ఛాతీ ఎక్స్‌రే, ఐసోటోప్ బోన్ స్కానింగ్ పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షల వల్ల క్యాన్సర్ మూత్రాశయం నుంచి బయటకు విస్తరించిందా? లింఫ్‌నోడ్, లివర్, ఊపిరితిత్తులు, ఎముకలకు పాకిందా అనే అంశాలు తెలుస్తాయి.

క్యాన్సర్‌లో నాలుగు దశలు

మూత్రాశయ క్యాన్సర్‌లో నాలుగు దశలున్నాయి. క్యాన్సర్ మూత్రసంచిలోపల వరకే పరిమితమైతే దాన్ని మొదటి దశ అంటారు. మూత్రసంచి కండరాల్లోకి పాకితే రెండోదశ అని, బ్లాడర్ పరిసర శరీర భాగాలు, లింఫ్‌నోడ్స్‌కు వ్యాపిస్తే మూడవదశగా గుర్తిస్తారు. కాలేయం, ఊపిరితిత్తులు, ఎముకలకు పాకితే నాలుగో దశగా గుర్తించి చికిత్స చేస్తారు. ట్యూమర్ నోడ్ మెటాస్టెసిస్ (టీఎన్ఎం) పరీక్ష ద్వారా క్యాన్సర్ దశను కచ్చితంగా నిర్ధారించవచ్చు.

ట్యూమర్ యూరెత్రల్ రీసెక్షన్ చికిత్స :మూత్రద్వారం నుంచి నాళం ద్వారా ఎండోస్కోపిక్ పద్ధతిలో ఓ చిన్న స్టీలు ట్యూబ్‌ను మూత్రసంచిలోకి పంపించి దాన్ని హై ఫ్రీక్వెన్సీ కరెంటు సాయంతో క్యాన్సర్ ట్యూమర్‌ను ముక్కలుగా చేసి మూత్రనాళం ద్వారా బయటకు తెస్తారు. ఇందులో ఇటీవల లేజర్ కిరణాల సాయంతోనూ క్యాన్సర్ ట్యూమర్‌లను తొలగించే విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ శస్త్రచికిత్స వల్ల రక్తస్రావం తక్కువగా కావటంతో పాటు రోగి త్వరగా కోలుకుంటాడు. బ్లాడర్‌లో సూపర్ ఫిషియల్ ట్యూమర్ మూడు, నాలుగు చోట్ల వచ్చినా, తొలగించాక మళ్లీ వచ్చినా బీసీజీ అనే మందును మూత్రసంచిలో వేసి, మళ్లీ ట్యూమర్‌లు ఏర్పడకుండా చికిత్స చేస్తారు.

మజిల్ ఇన్‌వెజూ ట్యూమర్ :మూత్రసంచిలో ఏర్పడిన క్యాన్సర్ ట్యూమర్ మూత్రాశయ కండరాల్లోకి వెళితే మజిల్ డీపర్ బయాప్సీ చేస్తారు. అలాంటపుడు ఆపరేషన్ చేసి, క్యాన్సర్ సోకిన మూత్రసంచిని పూర్తిగా తొలగిస్తారు. దీన్ని టోటల్ సిస్టెక్టమీ ఆపరేషన్ అంటారు. మూత్రం రావటానికి వీలుగా పొత్తికడుపులో కుడివైపు ఓ కృత్రిమ సంచిని బయట అమరుస్తారు. మూత్రసంచిని తొలగించేందుకు అంగీకరించని రోగులకు రేడియో థెరపీ, కీమోథెరపీల ద్వారా క్యాన్సర్ ట్యూమర్ల నివారణకు చికిత్స చేస్తారు. ఓ సారి మూత్రాశయంలో క్యాన్సర్ వచ్చాక, ఆపరేషన్ చేసి ట్యూమర్లను తొలగించిన తర్వాత కూడా ప్రతి మూడు నెలలకు ఓసారి అల్ట్రాసౌండ్, సిస్టోస్కోపి పరీక్షలు చేయించుకోవటం అవసరం. క్యాన్సర్ ట్యూమర్లను తొలగించేందుకు శస్త్రచికిత్స చేయించుకోవటంలో జాప్యం చేస్తే ఈ క్యాన్సర్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదముంది.

యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌

మహిళలలో వచ్చే ఆరోగ్య సమస్యల్లో యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ ఒకటి. యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ కలిగినప్పుడు అశ్రద్ధ, నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించి అవసరమయిన మందులు తీసుకోవాలి. యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ను అశ్రద్ధచేస్తే ఇది తీవ్రంగామారి మూత్ర పిండాల ఆరోగ్యానికి అవరోధం కలిగిస్తుంది. మనిషి దేహంలోని మలిన పదార్థాలను మూత్రపిండాలు, మూత్రనాళాలద్వారా బయటకు పంపుతాయి. అవి శరీరంలోంచి బయటకు వెళ్ళకపోతే శరీరానికి హానికలుగుతుంది. యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ రావడానికి ఎన్నోకారణాలున్నాయి. మూత్రా శయంలోకి బాక్టీరియా ప్రవేశించడంవల్ల, మల మూత్రవిసర్జనానంతరం నీటితో సరిగ్గా శుభ్రపరచకపోవడంవల్ల, ఆ బాక్టీరియా యురెత్రా నుండి మూత్రాశయం వరకూ వ్యాపించి ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. గర్భవతులలో కూడా ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఎక్కువగా వుంటుంది. మూత్రానికి వెళ్ళవలసివచ్చినప్పుడు, మూత్ర విసర్జన చేయకుండా ఎక్కువ సమయం ఆపుకోవడం కూడా యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ను కలుగచేస్తుంది. డయాబెటీస్‌ వ్యాధితో బాధపడే స్త్రీలలో యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ కలిగే అవకాశం వుంటుంది. దాంపత్యంలో పాల్గొన్న తర్వాత జననాంగాన్ని శుభ్రపరచకపోయినా యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ఆస్కారముంటుంది.

యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని కొన్ని లక్షణాలను బట్టి గుర్తించవచ్చు. మూత్ర విసర్జనా సమయంలో మంటగా అనిపిస్తుంది. మాటిమాటికీ మూత్రానికి వెళ్ళాలన్న ఫీలింగ్‌ కలుగు తుంది. యూరిన్‌ కొంచెంగానే వస్తుంది. మూత్రానికి వెళ్ళాలనిపించిన వెంటనే మూత్ర విసర్జన చెయ్యకపోతే మూత్రాన్ని ఆపటం కష్టమవు తుంది. మూత్ర విసర్జనా సమయంలో కడుపుక్రింది భాగంలో సన్నని నొప్పి వస్తుంది. మూత్రవిసర్జన తర్వాత యురేత్రా వద్ద సూదులతో గుచ్చుతున్నట్లుగా నొప్పి, బాధ, మంట ఏర్పడతాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టరును సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి. లేకపోతే యురేత్రానుండి మూత్రాశయం వరకూ బాక్టీరియా వ్యాపిస్తుంది.

డాక్టర్‌కు చూపించడంలో ఆలస్యం చేస్తే యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ మూత్రపిండాల వరకూ వ్యాపించి కిడ్నీల మీద ఆ ప్రభావం పడే ప్రమాదముంది. యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడే స్త్రీలు ఆ సమస్య వ్యాధిగా మారకముందే తగిన చికిత్స చేయించుకోవాలి. యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ సాధారణ సమస్యే అయినప్పటికీ నిర్లక్ష్యంచేస్తే దాని ప్రభావం, పర్యవసానం మాత్రం తీవ్రంగా వుంటుంది.

గాల్‌బ్లాడర్‌ స్టోన్స్‌

బైల్‌ ఏర్పడే పదార్ధాలలో అబ్నర్మాలిటీ వల్ల గాల్‌బ్లాడర్‌ స్టోన్స్‌ ఏర్పడతాయి. వీటిని ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. 80% కొలెస్ట్రాల్‌ స్టోన్స్‌, 20% స్టోన్స్‌ 50% కొలెస్ట్రాల్‌ మోనో హైడ్రేట్స్‌తో బాటు కాల్సియమ్‌ బైల్‌ పిగె్మైంట్స్‌, ప్రొటీన్స్‌, ఫ్రాటి యాసిడ్స్‌తో కలిసి ముదురు ఎరుపు రంగు స్టోన్స్‌ ఏర్పడతాయి. కొలెస్ట్రాల్‌ స్టోన్స్‌ నల్లగా ఉంటాయి. బిలియరీ ఇన్‌ఫెక్షన్‌తో రెండోరకం రాళ్ళు ఏర్పడతాయి. ఆడవాళ్ల లో కూడా ఈ రాళ్ళు సాధారణం.

కొలెస్ట్రాల్‌ గాల్‌బ్లాడర్‌ స్టోన్స్‌ ప్రధానంగా మూడు కారణాల వల్ల ఏర్పడవచ్చు. కొలెస్ట్రాల్‌తో బైల్‌ శాచురేషన్‌తో ఏర్పడవచ్చు. కొలెస్ట్రాల్‌ మోనోహైడ్రేట్‌ న్యూక్లియేషన్‌తో క్రిస్టల్‌ మిగిలిపోయి స్టోన్స్‌ ఏర్పడవచ్చు. గాల్‌బ్లాడర్‌ మోటోఫంక్షన్‌ వల్ల కూడా ఆలస్యం కావచ్చు. నల్లరాళ్లు స్వచ్ఛమైన కాల్షియమ్‌ బిలిరుబినేట్‌తో గాని కాల్షియమ్స్‌, మ్యూసిన్‌ గ్లైకోప్రొటీన్స్‌ మిశ్రమంలోగాని ఏర్పడతాయి. క్రానిక్‌ హీమోలైటిక్‌ స్టేట్‌... బైల్‌లో కాంజుగ్రేటెడ్‌ బిలిరుబిన్‌ ఎక్కువ కావడం సెర్రోసిస్‌ వున్నవాళ్ళలో ఈ బిలిరుబిన్‌ రాళ్లు ఏర్పడతాయి.

పరీక్ష...

గాల్‌బ్లాడర్‌లో స్టోన్స్‌వున్న సంగతి అల్ట్రాసోనోగ్రఫీ పరీక్షలో తెలుస్తుంది.

లక్షణాలు...

బిలియరి కొలిక్‌ కడుపులో తీవ్రమైన నొప్పి ఉంటుంది. కడుపు కుడిపై భాగంలో నిండినట్లు నొప్పి ఉంటుంది. ఈ ఆగని నొప్పితో ‘కొలిసిస్టయిటిస్‌’ అనే అనుమానం రావాలి. ఈ నొప్పితోబాటు తలతిరగడం, వాంతులు కలగవచ్చు. రక్తంలో బలిరుబున్‌ పెరగడం ఆల్కలేస్‌ ఫాస్పేట్‌తో కామన్‌ డక్ట్‌లో రాయి ఉన్నట్లు అనుమానం రావాలి. చలి, జ్వరంతో బిలియర్‌ పెయిన్‌ వస్తే కొలిసైటెటెస్‌, పాంక్రియాటెటెస్‌ లేక కొలంజెటిస్‌ కావచ్చు. బిలియరి కొలిక్‌ క్రొవ్వు ఆహారం బాగా తింటే ఎక్కువవుతుంది.

చికిత్స...

గాల్‌బ్లాడర్‌ స్టోన్స్‌ని అలా వదిలేస్తే ప్రాణాపాయం కలగవచ్చు. డయాబెటిస్‌ వున్నవాళ్లకి గాల్‌బ్లాడర్‌ స్టోన్స్‌ వస్తే సెప్టిక్‌ కావచ్చు. అప్పుడు కొలిసిస్టెక్టమి అనే శస్తచ్రికిత్స చేస్తారు. ఈ శస్తచ్రికిత్సలో గాల్‌బ్లాడర్‌ తొలగిస్తారు. దీని వల్ల నష్టం లేదు.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

Great information.i salute to you.we need more information on persons health recovery after following it


9703706660 నెంబర్ కు మీ సమస్య మరియు మీ మొబైల్ నెంబర్ తో మెసేజ్ చేయగలరు

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)


కామెంట్‌లు లేవు: