20, అక్టోబర్ 2020, మంగళవారం

నరాల బలహీనత సమస్య పరిష్కారం ఈ లింక్స్ లో చూడాలి


(weak nerves)నరాల బలహీనత తో బాధపడుతున్నారు..... నవీన్ నడిమింటి  మీ సమస్యను పరిష్కరించుకోండి.

ప్రస్తుత సమాజం లో అనేక మంది నరాల బలహీనత తో బాధపడుతున్నారు. కాళ్ళు, చేతులు వణకడం, మాట్లాడు క్రమంలో కళ్లలోనుంచి నీరు కారడం. అనుకోని సంఘటనలు చూసిన  , విన్న గుండె దడదడ లాడటం, బరువు లేని వస్తువులు కూడా మోయటానికి శక్తీ లేకపోవటం , రాయాలంటే చేతులు వణకడం ......... ఇలా అనేక సమస్యలు కొందరిలో చూస్తూ ఉంటాం , మనము అనుభవిస్తూ ఉంటాం.
నవీన్ నడిమింటి  ఈ సమస్యలని పరిష్కరించుకోగలరు.
1. దీర్ఘ శ్వాస ప్రక్రియ ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవొచ్చు.--ప్రశాంతమైన చోట కూర్చొని.ఊపిరితితుల నిండా గాలి తీసుకొని, గాలిని బయటకు వదలకుండా రెండు నుంచి మూడు నిముషాలపాటు ఉంచిన తరవాత నిదానముగా గాలిని వదలాలి.ఇలా రోజుకి పది నుంచి పదిహేను నిముషాలు ఈ ప్రక్రియ చేయుట ద్వారా మన నరాల బలహీనతను నివారించుకోవొచ్చు.
2. ఒక చెంచాడు బాల దుంప వేర్లు పొడి  , అశ్వ గ్రంధి దుంప వేర్లు పొడి (ఆయుర్వేద దుకాణాలలో దొరుకును ) తీసుకొని రెండిటిని కలిపి తీసుకొనుట మంచిది.
3.ప్రతిరోజు పాదరక్షలు (చెప్పుల) లేకుండా ముపై (30)నిముషాలు గడ్డిలో కాని , ఇసుకలో కాని నడువుట మంచిది. 
4. ప్రతిరోజు తెల్లవారుజామున సూర్యకాంతి మీ శరీరం మీద పడేటటు కూర్చొనుట వలన మీ నరములు శక్తివంతమగును. 
5. మెగ్నీషియం లోపం వలన నరములు బలహీనపడును. మెగ్నీషియం మీ నరములకు మేలు చేయును. కనుక మెగ్నీషియం కలిగిన పదార్దాలు తినుట మంచిది . పదార్దాలు: డార్క్ చాక్లెట్ , వాల్ నట్స్, బాదాం,బచ్చలి కూర, పుచ్చకాయ, అరటిపండు. 
6.యోగ మరియు ధ్యానం ద్వారా మీ నరాల బలహీనత సమస్యను అధిగమించొచ్చు. 
7. ప్రతి రోజు ఒక గ్లాస్ పాలు తప్పకుండ తాగటం మంచిది. 
8. ప్రతి రోజు ఉదయం గోరువెచ్చటి నీటిలో లో కొద్దిగా నిమ్మరసం, తెనే కలిపి తీసుకోవటం మంచిది. 
9. వారానికి ఒకసారి శరీర మర్దన (మసాజ్) చేయుట ద్వారా నరములు శక్తివంతంగా   మారతాయి.

కామెంట్‌లు లేవు: