BP, షుగర్ లను మీ కంట్రోల్ లో ఉంచుకోవాలంటే…ఇలా చేయండి అవగాహన కోసం నవీన్ నడిమింటి సలహాలు .
ఆహార అలవాట్లు, వంశపారంపర్యాల కారణంగా BP, షుగర్ లు ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరిని అంటుకున్నాయి.40 దాటిందంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫాం అని చెప్పకతప్పదు. ఇలాంటి స్థితిలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా….మన ప్రాణాలకే ప్రమాదం. BP, షుగర్లు వాటి చేతుల్లోకి మనల్ని తీసుకొకముందే…మనమే వాటిని మన కంట్రోల్ లో పెట్టుకోవాలి లేదంటే చాలా డేంజర్.
BP కి చెక్ పెట్టడం ఎలా?:
ఓ పిడికెడు మెంతుల్ని..రాత్రి నీటిలో నానబెట్టి, పరగడుపునే వాటిని నమిలి తినాలి. దీని వల్ల BP పూర్తి స్థాయిలో కంట్రోల్ లో ఉంటుంది.
షుగర్ ఔట్:
రోజూ రెండు చెంచాల మెంతి పొడిని నీటితో గానీ, పాలతో గానీ తీసుకోవడంవల్ల చక్కెరవ్యాధి, కొలెస్టరాల్ తగ్గుతాయి.
లివర్ వ్యాధులకు
రెండు చెంచాల మెంతి గింజలను సుమారు 4 గంటలు నీటిలో నానబెట్టి వాటిని ఈ నీటితో సహా ఉడకబెట్టి వడగట్టి తేనెతో తీసుకుంటే ఉబ్బస రోగం, క్షయ రోగులు, అధిక మద్యపానం వల్ల కాలేయం చెడిపోయిన వారు, కీళ్ల నెప్పులు, రక్తహీనతతో బాధపడేవారు త్వరగా కోలుకుంటారు. (మందులు వాడడం మానరాదు)
పైల్స్:
నీళ్ల విరేచనాలక, రక్త విరేచనాలు అవుతున్నవారు, మూలశంక (పైల్స్) ,వాంతులు ఉన్నవారు ….వేయించిన మెంతిపొడిని 1-2 చెంచాలు మజ్జిగతో తీసుకోవాలి.
చుండ్రు+వెంట్రుకలు రాలడం:
మెంతి పొడి పట్టించి స్నానం చేస్తే చుండ్రు, వెండ్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతి పిండి మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది.
ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టే…మెంతులకు ఆయుర్వేదంలో మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా BP, షుగర్ విషయంలో మాత్రం….ఈ నియమాలను పాటిస్తూనే…వాకింగ్ చేయడం తప్పని సరి..డాక్టర్లు సూచించిన మందులను కూడా క్రమం తప్పకుండా వేసుకుంటూ ఉండాలి
షుగర్ పేషంట్స్ తప్పక తీసుకునే కూరగాయ ఇది..
షుగర్ వచ్చిందంటే చాలు... డైట్ విషయంలో తెగ జాగ్రత్తలు పడుతుంటారు. ఇది తినకూడదు.. అది తినకూడదు.. ఇది తింటే షుగర్ కంట్రోల్ లో ఉండదు అంటూ ఆహారంలో లిమిటేషన్స్ పెట్టేస్తుంటారు.. చాలా వరకు కొన్ని కొన్ని ఆహార పదార్ధాలకు అపోహల కారణంగా తినకుండా దూరంగా ఉంటూ... ఎన్నో పోషకాలను కోల్పోతుంటారు.. అలాంటి వాటిల్లో ఓక్రా ఒకటి...అ దే లేడీ ఫింగర్‌గా పిలవబడే బెండకాయలు..
బెండకాయలు చెక్కర పేషంట్లకు దివ్యౌషధమనే చెప్పాలి.. ఇవి రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహంతో బాధపడే వారు నిస్సందేహంగా బెండకాయలను తమ డైట్‌లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎన్నో వెరైటీల రుచుకరమైన వంటకాలను బెండకాయలతో తయారుచేసుకోవచ్చు.. ఈ కూరగాయను సాంబారులోనూ వేసుకోవచ్చు. ఫ్రైగాను తినవచ్చు.. అలాగే మసాలా కూరల్లో, పచ్చడిలో ఇలా అన్ని రకాల వంటకాల్లో బెండకాయలను వానియోగించుకోవచ్చు. చిన్నప్పుడు అందరికీ గుర్తుండే ఉంటుంది..బెండకాయలు తింటే తెలివితేటలు , ముఖ్యంగా లెక్కలు బాగా వస్తాయని పెద్దవారు చెప్పేవారు...బెండలో ఉండే పోషకాల ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆ మాట వెనక ఉన్న అసలు వాస్తవం.
షుగర్ తో బాధపడేవారు...అనేక సమస్యలతో యుద్ధం చేస్తుంటారు..ముఖ్యంగా రక్తంలోని చక్కెర స్థాయిని కంట్రోల్ చేసేందుకు ఇష్టమైన ఆహారానికి దూరంగా ఉంటూ నోటిని కట్టేసుకుంటారు. బెండకాయలతో ఈ బెంగ తీరుతుందంటున్నారు డైటీషియన్‌లు.. బెండను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడం సులువవుతుందంటున్నారు.
బెండలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఎ, బి1 , బి2 , బి3 , బి9 , సి, ఈ, కె విటమిన్లు ఉంటాయి. అలాగే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి మినరల్స్ లభిస్తాయి. వీటితోపాటే ఫైబర్ కూడా అదనంగా ఉంటుంది.అందుకే ఇది ది బెస్ట్ వెజిటేబుల్‌గా పిలవబడుతోంది. అందుకే దీనిని రోజూ తీసుకున్నా... ఆరోగ్యానికి వచ్చే చింత ఏదీ లేదంటున్నారు వైద్యులు.
తక్కువ క్యాలరీలు గల బెండకాయలు షుగర్ పేషంట్స్ కే కాదు..అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే కూరగాయ. ఇది శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మలబద్దకం వంటి సమస్యలతో పోరాడుతుంది. ఆజీర్ణం వంటి కడుపు సమస్యలు రాకుండా జాగ్రత్తపరుస్తుంది.అన్‌హెల్దీ ఫ్యాట్‌ను కంట్రోల్ చేయడానికి బెండకాయలు ఉపయోగపడతాయి. దీని వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి, బీపీ,గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందంటున్నారు నిపుణులు. శాస్త్రవేత్తలు నిర్వహించిన కొన్ని పరిశోధనల ప్రకారం ప్రెగ్నెన్సీ సమయంలో రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నిర్వహించడానికి బెండకాయలు ఎంతగానో సహాయం చేస్తాయని తేలింది. అందుకే షుగర్ పేషంట్స్ మాత్రమే కాకుండా గర్భిణీలు కూడా బెండకాయలను ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకుంటే న్యూట్రిషనిస్టులు సిఫారసు చేస్తున్నారు.
షుగర్, బీపీ పేషెంట్లకు అనువైన ఆహారం
మధుమేహాం, బీపీ పేషెంట్లు ఆహార పానియాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. షుగర్ లెవల్స్ పెరగకుండా మంచి ఆహారం తీసుకోవటం ఎంతో అవసరం. వారికి కావల్సిన పౌష్టికాహారాన్ని ఇంట్లో ఇలా తయారుచేసుకోవచ్చు. రాగులు, గోధుమలు-1/2 కేజీ, కొమ్ము శనగలు, సోయాగింజలు, వేరుశనగ గుళ్లు, నూలుపప్పు, పావుకిలో చొప్పున, బార్లీ వంద గ్రాములు చొప్పున తీసుకోవాలి. వీటన్నింటిని సన్నటి సెగ మీద వేయించుకోవాలి. వేగిన వాటిని మెత్తగా మిల్లు పట్టించాలి. ఆ పిండిని అంబలిలాగ చేసుకోవచ్చు. పాలు వేసి బోర్న్‌విటాలాగా తాగవచ్చు. లేదా ఆ పిండిలో బెల్లం కలుపుకొని ఉండలుగా చేసుకుని అప్పుడప్పుడు తినవచ్చు. దీనివల్ల షుగర్, బీపీ పేషెంట్లకు ఉండే నీరసం తగ్గుతుంది. వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి