బహిష్టు సమస్యలు
1 . సోంపు గింజలు              ------- 40 gr
     రాళ్ళ ఉప్పు               -------- 20 gr
     కలకండ                       ------- 20 gr
        సొంపును దోరగా వేయించి పొడి చేసుకోవాలి .ఉప్పుకలకండ లను కూడా మెత్తగా పొడి చేసుకొని ,అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
       ఉదయం,సాయంత్రం ఒక్కొక్క అర టీ స్పూను చొప్పున నీటితో తీసుకోవాలిఒక గంట వరకు
 ఏమి తీసుకో కూడదు. విధంగా కొద్ది రోజులు చేస్తే రుతు క్రమమం సక్రమముగా జరుగుతుంది
 
2.    సక్రమమైన రుతు క్రమము కొరకు
ఎండు ద్రాక్ష          ------250 gr
అతిమధురం         ----- 250 gr
     అతిమధురం దంచిజల్లించిపొడి చేసుకోవాలి,దానికి ఎండు ద్రాక్ష ను కలిపి కల్వంలో నూరి ముద్దగా చెయ్యాలి.ప్రతి రోజు ఉదయం పరగడుపున,సాయంత్రం భోజనానికి ఒక గంట ముందు 15 గ్రాముల ఉండ తిని నీళ్ళు తాగాలి.దీనితో రుతు క్రమమం క్రమబద్ధ మవుతుంది.
 
3.        Irregular Periods
నువ్వులు                                  -------50 gr
పాత బెల్లం                              ------- 100 gr
రెక్క దాసాని (మందారపూలు    ------- 200 gr

        దాసాని పూలను నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి.నువ్వులు దోరగా వేయింఛి పొడిచేసుకోవాలి.నువ్వులపొడి,దాసాని పూల పొడి,బెల్లం కలిపి ఉండలుగా చేసి తడి లేకుండా ఆరబెట్టాలిపీరియడ్స్ వచ్చిన నెల తరువాత అదే తేదికి పీరియడ్ రాకుంటే  రోజు పరగడుపున  ఉండ ఒకటి తిని గంట వరకు ఏమి తినకూడదు.

ఇవి తినడం ప్రారంభించిన ఎన్ని రోజులకైతే మరలా పీరియడ్స్ మొదలవుతాయో తరువాత నెలలో అన్ని రోజులు ముందుగా తినడం ప్రారంభించాలి విధంగా మూడు నెలలు చేస్తే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి.
4.                        పీరియడ్స్ టైం లో స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు
              బహిష్టు సమయం లో స్త్రీలు పగటినిద్రరాత్రి మేల్కోవడం,అతిగా పరిగెత్తడంపెద్దగా నవ్వడం,ఏడవడంమాట్లాడడం,దూర ప్రయాణము వంటివి చెయ్య కూడదు.దీనివలన శరీరంలో అతిగా ఉష్ణం పుడుతుంది.
శీత్కారి ప్రాణాయామం :--నాలుకను మడచి,పళ్ళు బిగబట్టి,నోరుమూసుకొని,ముక్కుతో గాలి పీల్చాలి.
శాంతి శయనాసనం:--బహిష్టు సమయంలో చేతులు కింద ఆనేట్లుగా కాళ్ళు చాపి చాప మీద పడుకోవాలి.
ఎండు ద్రాక్ష            ------పావు కిలో
అతిమధురం పొడి  -------పావు కిలో
      రెండు కలిపి మెత్తగా నూరాలి.,భోజనానికి ముందు 10 గ్రాముల ముద్ద తినాలివీలైతే పాలు తాగాలి విధంగా చేస్తే స్త్రీలకు నెలకు ఒకసారి మాత్రమే బహిస్టు వస్తుంది
చేయకూడని పనులు :-- బహిష్టు సమయంలో నిద్రపోరాదు సమయంలో గర్భం వస్తే పుట్టే బిడ్డలు ఎల్లప్పుడూ నిద్ర ముఖం తో వుంటారుఎక్కువసేపు మేలుకో కూడదు. సమయం లో గర్భం వస్తే పిల్లలు ఎక్కువసేపు మేలుకొంటారు.అతిగా తిరిగితే,అతిగా వాగితే అవే ఫలితాలు వస్తాయి.
బహిష్టు సమయంలో హాయిగా కూర్చోవాలి,విశ్రాంతి తీసుకోవాలి,ప్రశాంతంగా ఉండాలి
  
5.    బహిష్టు సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు
   భార్య బహిష్టు లో ఉండగా భర్తతో కలవడం నిషిద్ధం.బహిష్టు స్త్రీలు పూల ,ఏమొక్కలను తాకరాదు.
మూడు రోజులు భార్యా భార్తలిరువురు నమస్కారాసనం చేయాలి,ఏకాగ్రత కలుగుతుంది
వేడి పదార్ధాలు తినరాదు.సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.పచ్చపెసలుపాత బియ్యం వాడాలి.
నాటు ఆవు లేదా గేదె పాలు ,నెయ్యి వాడాలి.  జెర్సీ పాలు తాగరాదు.
తీపి దానిమ్మ పండ్లు,కిస్మిస్ పండ్లు ఇంకా ఏవైనా తీపి పండ్లు తినవలెను.
6.      కావలసిన సమయంలో రజస్వల కాకపోతే
           రెండు స్పూన్ల మెంతులు నానబెట్టిమెత్తగా రుబ్బి కొంచం దోసె పిండిలో కలిపి దానిలో
కొద్దిగా కారం,కొద్దిగా ఉప్పు కలిపి చిన్న దోసెలు ఒకటిగానిరెండు గాని తినిపించాలి.ప్రతి రోజు ఇవ్వాలి.

రోజులలోపల తప్పక రజస్వలఅవుతారు.అయినతరువాదోసెలుఇవ్వడంమానెయ్యాలి.ఒకటి,రెండు రోజులలో అయినా కావచ్చుఇది పక్కింటివాళ్ళ అనుభవం.
 
          బట్టంటు రోగాల సమస్యలు - నివారణ
      ఉసిరి కాయలు కార్తీక మాసంలో శ్రేష్టత కలిగి వుంటాయి. మాసంలో 50 నుండి 100 కిలోల కాయలు తెచ్చి ఎండ బెట్టి ,పెచ్చులను వేరుగాగింజలను వేరుగా తీసి ఎండ బెట్టుకోవాలి.గింజల లోని పప్పును తీసి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి.వస్త్రకాయం పట్టాలి.
    ఆహారానికి ముందు ఒక గంట వరకు ఏమి తినకుండా ఉదయం , సాయంత్రం అరస్పూను పొడి,
అర స్పూను తేనెఅర స్పూను కలకండ కలిపి తినాలిచప్పిడి ఆహారం తినాలి.
 
2.         తెల్ల బట్ట వ్యాధి
         పండిన వేపాకులను ఎండబెట్టి ,నలిపి ,స్టవ్ మీద పెట్టి ,బాణలిలో వేసి మాడ్చాలిచల్లారిన తరువాత సీసాలో భద్రపరచుకోవాలి.
అర టీ స్పూను పొడిలో వెన్న కలిపి తీసుకుంటూ వుంటే సమస్య నివారింప బడుతుంది.
 పొడిలో పటిక పొడి కూడా కలిపి పెట్టుకోవచ్చు.
దీనిని వాడితే పడిశముదగ్గు కూడా నివారింప బడతాయి.
 
బహిష్టు సమయంలో కడుపు నొప్పినడుము నొప్పి నివారణకు గుళికలు                  
         చలువ చేసే పదార్ధాలను మాత్రమే తినాలివేడి చేసే పదార్ధాలను తినకూడదువిశ్రాంతి తీసుకోవాలి.సాధ్యమైనంత వరకు ప్రయాణం చేయరాదు.మాంసాహారం భుజించ రాదుబహిష్టు సమయం లో భర్తను దగ్గరకు రానివ్వకూడదు .దాని ప్రభావం పురుషుడి మీద వుంటుంది.
దోరగా వేయించి దంచిన మిరియాల పొడి ----3/4 T.S (ముప్పావు టీ స్పూను)
నెయ్యి         ---- 3 టీ స్పూన్లు
బెల్లం         ---- 30 gr
           అన్నింటిని కలిపి మూడు ముద్దలు తయారు చెయ్యాలి.
మొదటి రోజు ఎప్పుడు బహిష్టు వస్తే అప్పుడు ఒక ముద్దను బుగ్గలో పెట్టుకొని చప్పరించాలి.ఇది చప్పరించడం పూర్తయ్యేలోపల నొప్పి తగ్గిపోతుందిరెండవ రోజుమూడవ రోజు ఉదయాన్నే పరగడుపున ఇదే విధంగా చెయ్యాలిఇదే విధంగా రెండవమూడవ బహిష్టు సమయం లో కూడా చేస్తే ఇక ఎప్పటికి నొప్పి రాదు.
 
                  తెల్లబట్ట -- కుసుమ వ్యాధి                                    
ఉసిరిక పొడి   ----- 100 gr
కలకండ పొడి  ----- 100 gr
రెండింటిని కలిపి సీసాలో భద్రపరచాలి.
   ప్రతి రోజు ఉదయంసాయంత్రం ఒక్కొక్క టీ స్పూను పొడిని చేతిలో వేసుకొని చప్పరించి తింటూ వుంటే ఎంతో కాలం గా వున్న తెల్లబట్ట వ్య్హాది నివారింప బడుతుందిఉదయం పూట  మందును వాడి సాయంత్రం వేళ 4,5 గంటల సమయం లో పొట్ట ఖాళి గా వున్నప్పుడు పలుచని వేడి గంజి ఒక గ్లాసు తాగాలిఆహారం లో కారంఉప్పు తగ్గించి తినాలిమాంసంమసాలాలు తగ్గించి వాడుకోవాలి.

                        ఋతు చక్రం సక్రమంగా రావడానికి -- ద్రాక్ష రసాయనం      

 ఎండు ద్రాక్ష           ----- 250 gr
 అతిమధురం పొడి   ----- 250 gr

              రెండింటిని కలిపి కల్వం లోవేసి బాగా ముద్దగా నూరాలిదీనిని ప్రతి రోజు ఉదయంరాత్రి
 ఆహారానికి గంట ముందు 15 గ్రాముల చొప్పున తిని పాలు తాగాలి.

దీనిని వాడడం వలన నెలకు రెండు సార్లు బహిష్టు అయ్యే వాళ్లకు నెలకు ఒక సారి మాత్రమే వచ్చి క్రమ బద్ధీకరించ బడుతుంది.

దీనిని 40 రోజులు వాడాలిమరీ బలహీనంగా వున్న వాళ్ళు 100 రోజులు వాడాలి. "దీనిని సాధారణ బలహీనతలకు కూడా వాడ వచ్చుఇది చాలా బలవర్ధక మైనది.
 
                              బట్టంటు రోగాల సమస్య --- నివారణ             
శరీరంలో వాతం పెరగడం వలన తెల్లబట్ట ( white discharge ) అవుతుంది.
పెరుగు                         --- ఒక కప్పు
నువ్వుల నూనె              --- ఒక టీ స్పూను
చక్కెర్ర                         --- ఒక టీ స్పూను
అతి మధురం పొడి         --- ఒక టీ స్పూను
వేయించిన శోటి పొడి      --- అర టీ స్పూను
   అన్ని పదార్ధాలను పెరుగులో కలిపి ఉదయంసాయంత్రం తీసుకోవాలిఆహారానికి గంట ముందు తీసుకోవాలి  విధంగా 20 నుండి 40 రోజులు వాడడం వలన బట్టంటు వ్యాధి పూర్తిగా నివారింప బడుతుంది.
                                  ప్రతినెలా ఋతుక్రమం సరిగా రావడానికి                        
1. శొంటి పొడి               ----- 100 gr
    ఎండు ఖర్జూరం పొడి  ----- 100 gr

     రెండింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలిబహిష్టు రావడానికి పది రోజులు ముందు నుండి వాడడం ప్రారంభించాలిబహిష్టు వచ్చిన తరువాత ఆపెయ్యాలి విధంగా మూడు నెలలు చెయ్యాలి.

2. తిప్ప తీగ పొడి ----- 100 gr
 ఎండు ద్రాక్ష        ----- 100 gr

     రెండింటిని కలిపి ముద్దగా దంచి పెట్టుకోవాలిదీనిని బహిష్టుకు పది రోజుల ముందు నుండి ప్రారంభించి వాడాలిబహిష్టు వచ్చిన తరువాత ఆపెయ్యాలి విధంగా మూడు నెలలు వాడాలి.

                     దీర్ఘకాలంగా బహిష్టు రాకుండా వుంటే --నివారణ          

     ఆరు నెలలుఒక సంవత్సరం వరకు బహిష్టు రాక పోవడానికి కారణం మానసిక సమస్యలు,
అధిక శారీరక శ్రమ . ఒక్కొక్కసారి బహిష్టు ఆగి పోవడందీర్ఘ కాల విరామం ఏర్పడడం జరుగుతుంది.

       20 గ్రాముల వేప చెట్టు బెరడును తెచ్చి కడిగి చితగ్గొట్టి అర లీటరు నీటిలో వేయాలిదానిలో
 మూడు గ్రాముల శొంటి పొడి ,

పాత బెల్లం               --- 20 gr 
వేప చెట్టు బెరడు      --- 20 gr
శొంటి పొడి                 --- 3 gr
పాత బెల్లం               --- 20 gr
నీళ్ళు                     --- అర లీటరు

      ఒక గిన్నెలో అన్నింటిని వేసి పావు లీటరు కషాయం మిగిలే వరకు కాచాలివడపోసుకొని రోజుకొకసారి తాగాలిఒక గంట వరకు ఏమి తినకూడదు విధంగా బహిష్టు వచ్చే వరకు తాగాలిబహిష్టు వచ్చిన తరువాత అన్ని మలినాలు బహిష్కరింప బడతాయి వేప చెక్కకు బదులుగా మామిడి చెట్టు బెరడును కూడా ఉపయోగించవచ్చు.

                              ప్రతి నెలా బహిష్టు సక్రమంగా రావడానికి                

1. నువ్వులుబెల్లంఎండుకొబ్బెర కలిసిన పదార్ధాలను ప్రతి రోజు ఏదో ఒక రూపంలో ఆహారంలో వాడాలి.

 2. ప్రతి రోజు ఒక గ్లాసు అన్నం వార్చిన గంజి తాగుతూ వుంటే నెలసరి సక్రమంగా వస్తుందికాని నెలరోజులు తప్పనిసరిగా ప్రతి రోజు వాడాలిమధ్యలో మానకూడదు.

3. 50 గ్రాముల నువ్వులను పావు లీటరు నీటిలో వేసి ఉడకబెట్టి ముప్పావు వంతు వరకు మిగిలేట్లు మరిగించాలి. 30 గ్రాముల పాత బెల్లాన్ని కలపాలిదీనిని ఉదయం పరగడుపున తినాలి.

 ఇది తినిన తరువాత ఒక గంట వరకు ఏమి తినకూడదు.
ఇలా చేస్తే ఒకటి రెండు వారాల్లో బహిస్టు వస్తుంది.
తరువాత  తేదికి ముందు ప్రారంభించి చెయ్యాలి విధంగా మూడు నెలలు వాడితే నాలుగవ నేలనుండి దానంతట అదే వస్తుంది
నెల వచ్చిన తరువాత బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే మెత్తటి అరటిపండు లో 50 గ్రాముల నెయ్యి కలిపి పిసికి మూడు పూటలా తినాలి.
నెలసరి సమయం లో కారంపులుపు ఎక్కువగా వాడకూడదుపెసర పప్పునెయ్యి ఎక్కువగా వాడుకోవాలి.

               తెల్లబట్ట వ్యాధి -- నివారణ                   

 వ్యాధి ఎక్కువైతే అవయవం దగ్గర పుండ్లు ఏర్పడతాయినీళ్ళలో వేపాకులుపసుపు వేసి ఉడికించి  నీటితో రెండు పూటలా కడుక్కోవాలి.

మూలబంధనం;-- పద్మాసనం వేసుకొని శరీరాన్ని బంధించినట్లు పైకి లేపినట్లు మోకాళ్ళ మీద చేతులు పెట్టుకోవాలి.

తడి మొల కట్టు :-- తొడలనుండి నాభి వరకు తడి గుడ్డను చుట్టుకోవాలిదానిపై పొడి బట్టను చుట్టుకోవాలి.(టవలు చుట్టుకున్నట్లుఅరగంట ఉంచి తీసేయ్యాలి.

 ఉడ్యానబంధము:--  ఆసనాన్ని వేయడం వలన వ్యాధిని  పెరగకుండా నిరోధించవచ్చు.

ఉత్తరేణి వేర్ల పొడి                        ---- 50 gr
 దాల్చిన చెక్క పొడి                    ---- 50 gr
దోవేపిప్పళ్ళ పొడి                   ---- 50 gr
నాగకేసరాల పొడి                       ---- 50 gr
పాత బెల్లం                             ---- 200 gr 

  అన్ని పొడులను,బెల్లాన్ని కలిపి ముద్దగా దంచి నిల్వ చేసుకోవాలిఉదయంసాయంత్రం పది గ్రాముల ముద్ద చొప్పున తినాలిలేదా బియ్యం కడిగిన నీళ్ళలో కలకండ కలిపి తాగితే వెంటనే తగ్గుతుంది.

లేత బెండకాయలు ఒకటిరెండు తింటూ వుంటే ఆగి పోతుంది.

అన్నం వార్చిన గంజి తాగాలి
.
కొద్దిగా జిలకర నోట్లో వేసుకొని నమిలి రసం మింగాలి.

తెల్ల బట్ట అయ్యేటపుడు పిక్కలుతొడలు ఎక్కువ నొప్పిగా వుంటాయికొబ్బరి నూనెతో పోత్తిపోట్టతొడలుపిక్కలుపాదాల మీద రుద్దితే వెంటనే నొప్పులు తగ్గుతాయి.

పోత్తిపోట్ట మీద ఒత్తిడి కలిగించాలి.

పద్మాసనం వేసుకొని చేతిని మొకాలుపై పెట్టుకొని మణికట్టు కిందినుండి సగం చేతి వరకు నొక్కాలిమణికట్టుకు రెండు అంచులలో (మధ్యలో కాకుండాఒక బొటన వేలితో నొక్కాలిఅదే విధంగా రెండవ వైపు చెయ్యాలి.

ఆహారంలో ఉప్పుకారంపులుపు ఎక్కువగా వాడకూడదు.

అన్నంలో పాలుపెసరపప్పుపెసరకట్టు వేసుకొని తినాలి.

                      బహిష్టు సమయంలో కడుపులో నొప్పి --- నివారణ             

  నొప్పిగా వున్నపుడు నూలు గుడ్డను వేడి నీటిలో ముంచి భరించ గలిగినంత వేడిగా పొట్ట మీద వేసుకోవాలివెంటనే చల్లటి నీటిలో ముంచిన గుడ్డను దానిపై కప్పాలి విధానాన్ని ఋతుస్రావం కొద్ది కొద్దిగా వున్నపుడు మాత్రమే చేయాలిఎక్కువగా వున్నపుడు చెయ్యకూడదు.

ఉదరచాలనం:-- పొట్టను ముందుకువెనుకకు కదిలించాలిసీతాకోక చిలుక వ్యాయామం లాగా కాళ్ళను ఆడించాలి.

 1. బటాణి గింజంత నీరుసున్నం తీసుకొని 50 గ్రాముల వెన్నపూస మధ్యలో పెట్టి మింగాలివిపరీతంగా వున్న కడుపు నొప్పి 10,15 నిమిషాలలో తగ్గి పోతుంది.

ఎండిన తుమ్మి పూల పొడి  --- మూడు వేళ్ళంత  
మిరియాల పొడి                --- రెండు చిటికెలు

 రెండు కలిపి నోట్లో వేసుకొని నీళ్ళు తాగితే వెంటనే నొప్పి తగ్గుతుంది.

                              బహిష్టు సమయంలో నడుము నొప్పి--నివారణ  

నలగగొట్టిన శొంటి                ---5 gr
  " వాయువిడంగాలు            ---5 gr

  రెండింటిని కలిపి ఒక గ్లాసు నీళ్ళలో వేసి కాచి ఒక కప్పుకు రానివ్వాలివడకట్టి బెల్లం కలుపుకొని తాగాలిదీనిని బహిష్టు వచ్చిన రోజు నుండి మూడు రోజులు ఉదయం పరగడుపున వాడాలి. (1,2,3 రోజులు విధంగా మూడు నెలలు వాడితే ఇక ఎప్పటికి నొప్పి రాదు.

యోగాసనం:-- వెల్లకిలా పడుకొని కాళ్ళను పైకి మడిచి నడుమును కొంచం పైకేత్తాలినిటారుగా నిలబడి రెండు చేతులను నడుము మీద పెట్టుకొని వెనక్కి వంగాలినడుము మీద రెండు చేతులు వుంచుకొని నడుమును గుండ్రంగా తిప్పాలిమణి కట్టు మీద నొక్కాలి.
  
                        బహిష్టు నొప్పి,---నివారణ ---అండాశయ వృద్ధి  
కలబంద గుజ్జు             ---20 gr
మంచి నెయ్యి             --- ఒక టీ స్పూను
 కరక్కాయ పొడి        ---- పావు లేక అర టీ స్పూను
 మంచి పసుపు           --- 2, 3 చిటికెలు
 సైంధవ లవణం         ---- పావు టీ స్పూను

    అన్నింటిని గ్లాసులో పోసుకొని అవసరమైతే నీటిని కలుపుకొని మూడు రోజులు తీసుకోవాలిబహిష్టు సమయంలో కాని బహిష్టుకు ముందు గాని తీసుకోవాలి.

బహిష్టు సక్రమంగా రాకపోవడంఅప్పుడప్పుడు బ్లీడింగ్ కనిపించడం నివారణ    

ఆముదపు ఆకులకు నూనె పూసి వేడి చేసి పొత్తి కడుపు మీద పరచాలి.

                                దీర్ఘ కాలంగా బహిష్టు రాక పోవడం --- నివారణ

 ఆముదపు ఆకులు వేపాకులు పసుపు అన్నింటిని కలిపి నూరి పొత్తి కడుపు మీద పరచి గుడ్డ కప్పాలి విధంగా చేస్తూ వుంటే ఋతుక్రమం సక్రమంగా వస్తుంది.
 
                              IRREGULAR PERIODS                   

   హార్మోనలలో తేడాలవలన  విధంగా అవుతుందిజీవిత సమస్యలు పనులు , ఒత్తిడి వలన హార్మోన్ల లో తేడాలు వస్తాయి.
నల్ల నువ్వుల పొడి              ---- ఒక టీ స్పూను
శొంటి పొడి                         ---- ఒక టీ స్పూను
పిప్పళ్ల పొడి                       ---- ఒక టీ స్పూను
మిరియాల పొడి                 ---- ఒక టీ స్పూను
గంటు బారంగి పొడి              ----ఒక టీ స్పూను
బెల్లం పొడి                         ---- ఒక టీ స్పూను
           అన్నింటిని ఒక కప్పు నీటిలో వేసి పావు కప్పు మిగిలే వరకు కాచి ఉదయం పరగడుపున,
రాత్రి భోజనానికి ముందు ఒక నెల రోజులు తాగుతూ వుంటే ఖచ్చితంగా 28 రోజుల కొకసారి మాత్రమే పీరియడ్స్ వస్తాయి.
 
                          బహిష్టు సమయంలో వచ్చే పార్శ్వపు తలనొప్పి         
                                          (Menstruval Migrane)

మానసిక ఒత్తిడి వలనహార్మోన్లలో తేడాల వలన వస్తుంది.
ఇది రెండు రకాలు.:--
1. సాధారణంగా వచ్చే పార్శ్వపు తలనొప్పి
2. బహిస్టు సమయంలో వచ్చే మైగ్రేన్ నొప్పి.
లక్షణాలు;-- బహిష్టు వచ్చే ముందు విసుగుతలనొప్పిఒత్తిడివికారం, uneasiness.మొదలైనవి.
శొంటి             ---- 100 gr
వస                  --- 50 gr
రెండింటిని విడివిడిగా పొడి చేసి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
తల నొప్పి చాలా తీవ్రంగా వున్నపుడు   పొడికి నీటిని కలిపి పేస్ట్ లాగా చేసి నొప్పి వున్నచోట పట్టు వెయ్యాలిఅది ఆరే లోపల నొప్పి చాలా ఆశ్చర్య కరంగా తగ్గి రిలాక్స్ అవుతారు.
పీరియడ్స్ మొదలయ్యే మూడురోజుల ముందు నుండి ఉదయంమధ్యాహ్నంరాత్రి కొంచం పొడిని తేనెతోకలిపి రంగరించి నాకాలి విధంగా 5, 6 నెలలు వాడితే తగ్గుతుంది.

                                      IRREGULAR PERIODS                               
సన్న జాజి పూలుమొగ్గలుఆకులు ---- 20 gr
                                         నీళ్ళు ---- అర లీటరు
అన్నింటిని కలిపి గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలితరువాత వడకట్టి  నీళ్ళను రెండు భాగాలుగా చేసి తాగుతూ వుంటే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి.
  
                             తెల్ల బట్ట వ్యాధి-- (White Discharge )                
      గర్భ సంచి పక్కనున్న ఫెలోపియన్ ట్యూబులో ఇన్ఫెక్షన్ చేరడం వలనయోని గోడల మీద ఇన్ఫెక్షన్చేరడం వలన స్రవిస్తుందినీటి లాగతెల్ల సోన లాగా స్రవిస్తుది.
పరిష్కారాలు:-- పై పూతగా యోనిలోపాలి భాగాలను త్రిఫల కషాయం తో కడగడం వలన మార్పు వుంటుంది.
యోనిలో గర్భాశయపు ద్వారం వద్ద కడగాలి.
అశోక చెట్టు యొక్క బెరడు చూర్ణము
లొద్దుగ చెట్టు బెరడు చూర్ణము
రెండింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.
 పొడిని రెండు పూటలా నీటిలో కలుపుకొని తాగాలి.
    చింత గింజలను కాల్చి లోపలి తెల్లని పప్పును పొడి చేసి దానిలో కొద్దిగా చక్కర కలిపి ఉదయంసాయంత్రంతీసుకోవాలి
.
తుమ్మ బంక నీటిలో కలుపుకొని తాగితే చాలా బాగా పని చేస్తుంది.
ఆహార నియమాలు:-- కారంపులుపుపచ్చి మిర్చి వేసిన పదార్ధాలు మానెయ్యాలి.
మేనోపాస్ తరువాత గాని తెల్ల బట్ట అవుతుంటే తప్పని సరిగా వైద్యుని సంప్రదించాలి.
  
                                    సక్రమ మైన ఋతుక్రమానికి                      
ఉల్లి పాయలు                  ---- 50 gr
నీళ్ళు                            ---- ఒక లీటరు
పాత బెల్లం                    ----- 30 gr
  ఒక గిన్నెలో నీళ్ళు పోసి ఉల్లి ముక్కలను వేసి మరిగించి అర లీటరు కు రానివ్వాలిదీనిలో బెల్లం వెయ్యాలి.బెల్లంలో మలినాలు వుంటే వడకట్టాలిఇది గోరువెచ్చగా ఉండగానే వడపోసి ఉదయం పరగడుపున కొద్ది కొద్దిగా తాగాలి.
        ఇది తాగిన తరువాత గంట వరకు ఏమి తినకూడదుబహిష్టు ఆగిపోయినపుడు ఇది వాడితే మరలా బహిష్టు వస్తుందిబహిష్టు వచ్చినపుడు దీనిని వాడడం మానెయ్యాలిమరలా బహిష్టు తేదికి పది రోజులు ముందు మరలా ప్రారంభించాలి విధంగా మూడు బహిష్టుల వరకు వాడాలి.
 
                     సక్రమమైన ఋతుక్రమమునకు ---కుమారీ గుటికలు           
కుమారి = కలబంద
  కలబంద మట్టను చీల్చి వేలాడ  గడితే రసం కారుతుందిదీనిని ఒక పింగాణి పాత్రలోకి పడితే అది క్రమేపి గడ్డ కడుతుందిదీనినే ముసాంబరం అంటారు.
ముసాంబరం                ---- 20 gr
పొంగించిన ఇంగువ పొడి   --- 20 gr
 రెండింటిని కల్వంలో వేసి చాలా కొద్దిగా తేనె కలిపి నూరాలిఇది ముద్దగా అయిన తరువాత శనగ
గింజలంత మాత్రలు కట్టాలిసంవత్సరం వరకు నిల్వ వుంటాయి.
ఉపయోగాలు:-- వీటిని బహిష్టు సమయం లో వాడకూడదుసమయానికి బహిష్టుచాలా కాలంగా రాని వాళ్ళు వారం ముందు నుండి  వాడాలిబహిష్టు వచ్చిన వెంటనే ఆపెయ్యాలిఉదయం,సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున వాడాలిఆగిన బహిష్టువస్తుందిగర్భాశయ సమస్యలు నివారింప బడతాయి.
 
                                       తెల్లబట్ట సమస్య --- నివారణ                              
 వ్యాధిని తెల్ల కుసుమలేదా బట్టంటు వ్యాధి అని కూడా అంటారు.
లొద్దుగ చెక్క ( బెరడు ) పొడి --- మూడు వేళ్ళకు  వచ్చినంత
     ఉదయంమధ్యాహ్నంరాత్రి మూడు వేళ్ళకు వచ్చినంత చొప్పున ఆహారానికి గంట ముందు
పది రోజులు ఒక కప్పు మంచి నీటిలో కలుపుకొని తాగాలివెంటనే ఒక అరటి పండు తినాలి విధంగా మూడు పూటలా మూడు అరటి పళ్ళు తినాలి.

వేడి చేసే పదార్ధాలను తినకూడదు.

పెరుగు అసలు వాడకూడదు.

పులుపుకారం తగ్గించి చప్పిడి పద్యం వుండాలి.

 పెసరపప్పుఅన్నంపాయసం తినాలి
 
                       స్త్రీలలో ఎర్రబట్ట సమస్య --- నివారణ                                    
 
మర్రిరావిజువ్విమేడి --- వీనిలో ఏదో ఒకదాని పండ్లు తెచ్చి ముక్కలుగా చేసి ఎండబెట్టాలిదంచి
పొడి చేసి నిల్వ చేసుకోవాలిదానికి సమానంగా కలకండ పొడి కలపాలి.
ఇది శరీరంలోని అత్యుష్ణాన్ని పూర్తిగా నివారిస్తుంది.
 
                       తెల్లబట్ట వలన వచ్చే నడుము నొప్పి నివారణకు                  
   స్త్రీలలో తెల్లబట్ట సమస్య వలన నడుము నొప్పి వంటివి వున్నపుడు మిగల పండిన అరటి పండు గుజ్జుకు ఒక టీ స్పూను ఉసిరి పొడి కలపాలి ముద్దను 40 రోజులు వాడాలి.
        నెలసరి ముందు వచ్చే ఆందోళన ( PMS Pre Menstruval Syndrome)      
మానసికశారీరక సమస్యలునిద్ర లేకపోవడంవిపరీతమైన ఆకలికీళ్ళు--కండరాల నొప్పులుబరువుపెరగడంశరీరంలో నీరు చేరడంస్థనాలు బరువుగా వుండడంమొటిమలు పెద్దవి కావడంవిరేచనాలు కావడంకుంగుబాటుఒత్తిడి మొదలైన సమస్యలుంటాయి.
పై సమస్యలు మెదడులో కొన్ని రసాయన మార్పుల వలన వస్తాయిఆల్కహాల్కెఫీన్ ఎక్కువగా వాడడం
ఊరగాయలుపచ్చళ్ళు ఎక్కువగా తినడం , పిత్తోద్యోగం మొదలైన కారణాల వలన వస్తాయి.
1. కలబంద గుజ్జు   ----ఒక టీ స్పూను
                  తేనె ---- రెండు టీ స్పూన్లు
రెండింటిని కలిపి 40 రోజులు వాడాలి.
కలబంద ముదురుగా వున్న మట్టను తీసుకొని పై చెక్కును తీసి గుజ్జును మాత్రం సేకరించుకోవాలి.
2. వాము --- ఒక టీ స్పూను
      బెల్లం --- తగినంత
కలిపి రోజుకు రెండు సార్లు గోరువెచ్చని నీటితో తీసుకోవాలి.
  
                             ఆడ పిల్ల సకాలంలో రజస్వల కాక పోతే                           
హార్మోన్లను ఉపయోగించకుండా ఆహార ఔషధాల ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
బాదం పప్పులు
కోడి గుడ్డు తెల్ల సొన
నువ్వుల పొడి
తేనె
    అన్నింటిని కలిపి ముద్దగా నూరి పాలతో కలిపి ఆడ పిల్లలు సేవిస్తే హార్మోన్లు తీసుకునే అవసరం లేకుండానే సకాలంలో రజస్వల కావడం జరుగుతుంది.
 
                               ఆగిపోయిన బహిష్టు తిరిగి రావడానికి                       
        కాకర చెట్టు వేళ్ళు దంచి అర కప్పు నీళ్ళలో వేసి మరిగించి కషాయం చేసి తాగితే ఆగిపోయిన బహిష్టు తిరిగి వస్తుంది.
                                          బహిష్టునొప్పి --నివారణ                                 

    ఒక గ్రాము ఇంగువను నేతిలో వేయించి పొడి  హేసి అన్నం యొక్క మొదటి ముద్దలో తింటే తగ్గుతుంది.

                    ఋతు చక్రం -- క్రమబద్ధీకరణ                               

 కన్య స్త్రీగా మారడం = మెచ్యూరిటీ

సన్న జాజి చెట్టు యొక్క పూలుమొగ్గలుఆకులు   ---- 100 gr
                                                            నీళ్ళు    ---- అర లీటరు

రెండింటిని కలిపి ఒక పాత్రలో వేసి మరిగించి పావు లీటరు కషాయానికి రానివ్వాలిదీనిని ప్రతి రోజు తాగుతూ వుంటే గర్భాశయ సమస్యలుఅండాశయంలో బుడగలుపిట్యుటరి గ్రంధి సరిగా పనిచేయక పోవడం వంటి సమస్యలు నివారించ బడతాయిమరియు ఋతు సమస్య క్రమబద్ధీక రించబడుతుంది.

                 బహిష్టు సమస్యలు--- నివారణ                                    

 బహిష్టు సక్రమంగా రాకపోవడాని నష్టార్తవము అంటారు

థైరాయిడ్ సమస్యలు వున్నపుడు బహిష్టు సమస్యలు ఏర్పడతాయి.

 గంటు బారంగి పొడి                 ---- ఒక టీ స్పూను
 నల్ల నువ్వుల పొడి                 ----   "   "     "
మిరియాల పొడి                      ----   "   "     "
పిప్పళ్ళ పొడి                         -----   "   "     "
శొంటి పొడి                             -----   "   "    "

      రెండు గ్లాసుల నీటిలో ఐదు టీ స్పూన్ల పొడినిబెల్లాన్ని వేసి కాచాలిఒక గ్లాసుకు రానివ్వాలి.
దీనిని రోజుకు ఒక సారి తాగితే బహిష్టు సమస్యలు నివారింప బడతాయిఇంతకంటే వేరే మందులు అవసరం లేదు.

                    తెల్లబట్ట సమస్య -- నివారణ                             

   దీనిని నిర్లక్ష్యం చేయకూడదుచాల కాలం కొనసాగితే ఇన్ఫెక్షన్ వస్తుందినడుము నొప్పి వస్తుందికాల్షియం శాతం తగ్గడం వలన వస్తుందిపీరియడ్స్ వచ్చే ముందు ఒకటిరెండు రోజులు ఉండడం సర్వ సాధారణంఇది సమస్య కాదు.

      ఈ వ్యాధి వలన రోగులు పాలి పోయినట్లు వుంటారు ఇతర వ్యాధులు ఏమైనా వుంటే అవి నివారించుకొని  వ్యాధికి మందులు వాడుకోవాలి.

నేల ఉసిరిక ఆకులను పచ్చివి  తీసుకుని నూరి పిల్లలు ఆడుకునే గోలీలంత మాత్రను మజ్జిగతో తీసుకుంటే వెంటనే తగ్గుతుంది.

నేల ఉసిరిక ఆకు పొడి                   --- 10 gr
ముసాంబరం                               --- 10 gr
ఇంగువ                                      ---10 gr
జిలకర                                      --- 10 gr
 శొంటి                                        ---10 gr

అన్నింటిని కల్వంలో వేసి నూరి కండి గింజ కంటే కొంచం పెద్ద సైజులో మాత్రలు చేసి ఆరబెట్టుకోవాలి.
ఆహారానికి ముందు పూటకు ఒక మాత్ర చొప్పున మూడు పూటలా వాడాలి
                                        బహిష్టు నొప్పి-- నివారణ            
 
      బహిష్టు సమయంలో పొత్తి కడుపులో నొప్పి వస్తుందికటి ప్రాంతంలో వాతం చేరడం వలన  సమస్య ఏర్పడుతుంది.
Ebdometrosis :-- గర్భాశయం లోపల పెరగాల్సిన పోర బయట పెరగడం వలన వస్తుంది.
Pelvic Inflamatory Desease :-- పొత్తి కడుపుకు పై భాగంలోబొడ్డుకు కింది భాగంలో నొప్పి వుంది తొడల వరకుపాకుతుందివాంతులువికారంనిస్త్రాణవిరేచనాలుకళ్ళు తిరగడం వంటి అనుబంధ లక్షణాలు వుంటాయి.
గరికవేర్ల ను ముద్దగా నూరి రెండు టీ స్పూన్ల ముద్దను తీసుకుని పులియబెట్టిన గంజిలో కలుపుకుని తాగాలి
2. మందార పూలను ముద్దగా నూరి బియ్యపు గంజిలో కలుపుకుని తాగాలి.
3. నారికేళ లవణం ---ఒక టీ స్పూను
       శంఖ భస్మం ----అర గ్రాము
రెండు కలిపి తీసుకోవాలి.
4. నల్ల నువ్వులు ----ఒక టీ స్పూను
             జిలకర ---- అర టీ స్పూను
                బెల్లం ---- ఒక టీ స్పూను
కలిపి ఉదయంసాయంత్రం తీసుకోవాలి.
                బహిష్టు సమయం లో తాత్కాలికంగా వచ్చే కడుపునొప్పి         
నువ్వుల నూనెను ఒక గ్లాసు పాలలో కలుపుకుని తాగితే వెంటనే నొప్పి తగ్గుతుంది.

                                 బహిష్టుకు ముందు వచ్చే అసహనం చిరాకు                        
                                     PREMENTRUAL  SYNDROME

    1.  ముసాంబరం పొడి         ----- ఒక గ్రాము
         అతిమధురం పొడి         ----- ఒక గ్రాము
         జటామాంసి  పొడి          -----  "    "
                 పసుపుపొడి         -----   "    "
                      తేనె                ----- తగినంత

         అన్ని పొడులను తేనెతో బాగా కలిపి సేవించాలి.  ఈ విధంగా బహిష్టు కు నాలుగు రోజుల
    ముందు నుండి వాడాలి.

     2.  జటామాంసి  చూర్ణం      ---- పది గ్రాములు      
                    వస   చూర్ణం      ---- పది గ్రాములు
                        నీళ్ళు           ---- ఒక కప్పు 

         రాత్రి పూట చూర్ణాలను  నీళ్ళలో నానబెట్టి ఉదయం దానిని రెండు భాగాలుగా చేసి ఉదయం
     అరకప్పు,  సాయంత్రం అర కప్పు  చొప్పున తాగితే తగ్గుతుంది.
 
     3.    దాల్చిన చెక్క పొడి       --- ఒక గ్రాము
               మిరియాల పొడి       ---   :     "
                   పిప్పళ్ళ పొడి       ---   "     "
                       శొంటి పొడి      ---    "     "

           అన్నింటిని కలిపి తీసుకోవాలి. 

                              స్త్రీలలో నెలసరి సక్రమంగా రావడానికి                                

          కలబంద గుజ్జు     --- 5 gr
                 బెల్లం         --- 5 gr

          ఈ మిశ్రమం లో బెల్లం మాత్రమే వాడాలి .
          రెండింటిని కలిపి మిన్గావచ్చు  లేదా నీటిలో కలుపుకొని తాగాలి.

                                                ఋతుక్రమం  సరిగా రావడానికి                      

       ప్రతి రోజు ఉదయం పరగడుపున రెండు కొబ్బరి బొండాం లను తాగుతూ వుంటే ఋతుక్రమం  సరిగా వస్తుంది

                                               బహిష్టు సక్రమంగా రావడానికి                           24-6-11 .

బెల్లం                                --- 10 gr
నువ్వుల పొడి                     --- 10 gr
పొంగించిన ఇంగువ పొడి       ---- చిటికెడు

      అన్నింటిని కలిపి మెత్తగా నూరి గోలీ చేసుకోవాలి . దీనిని చప్పరిస్తూ వుండాలి . ఈ విధంగా ఒకటి,  రెండు వారాలు
వాడితే  ఋతుస్రావం ఎక్కువగా వున్నా,  తక్కువగా వున్నా  లేక బహిస్టు నొప్పి వంటి సమస్యలు నివారింపబడతాయి  .

సూచనలు :--
      ఆహారంలో ఉప్పు,  కారం,  పులుపు వంటి ఘాటైన వేడి చేసే పదార్ధాలను  వాడకూడదు .
      అన్నం లో పెసరపప్పు,  నెయ్యి,  అన్నంలో పాలు వంటి పదార్ధాలను వాడాలి .   .

            శొమ రోగం ( తెల్లటి నీరు ) , తెల్లబట్ట  రోగం , వీర్యం పోవడం ,  మూత్రం పోవడం వంటి సమస్య నివారణ
                                                                  25-6-11.

 తిప్ప తీగ పొడి                       --- 25 gr
 జిలకర పొడి                           --- 25 gr
 పల్లేరు కాయల పొడి                --- 25 gr
 ధనియాల పొడి                      --- 25 gr
 పటికబెల్లం పొడి                   --- 100 gr
  
        అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి .

        ఒక టీ స్పూను పొడిని మజ్జిగతో గాని ,  నేతితో గాని సేవించాలి .

                                                 బహిష్టు నొప్పి      ---   నివారణ                       

    చిన్తాకును రేకు మీద పోసి ఎండబెట్టి  మూకుడులో వేసి నల్లగా మాడ్చి మిక్సీ లో వేసి జల్లించాలి .
    పావు టీ స్పూను  పొడిని  పావు కప్పు నీటిలో కలుపుకొని తాగాలి .
    బహిష్టు కు ముందు వారం రోజుల ముందు నుండి దీనిని  వాడాలి . ఈ విధంగా రెండు , మూడు నెలలు చెయ్యాలి .
    B-Vitamin  ఎక్కువగా వున్న ఆహారాన్ని తరచుగా తీసుకోవాలి

                                          ఆడపిల్ల సకాలంలో రజస్వల కాకపోతే                           

             ఆడపిల్ల  10 --- 15 సంవత్సరాల మధ్య రజస్వల కావడం ఆరోగ్యకరం
 కారణాలు :--- మానసిక సమస్యలు , హార్మోన్లలో తేడాలు , పోషకాహార లోపం మొదలైనవి .

1. పల్లేరు కాయల చూర్ణం             ---- అర టీ స్పూను
    నల్ల నువ్వుల చూర్ణం               ----   "    "     "
             బెల్లం                           ----   "    "     "
    ఎండు  కొబ్బరి తురుము          ----   "    "     "

              అన్ని పదార్ధాలను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి . నిమ్మకాయంత సైజు ఉండను తినిపించాలి

2.  మందార పూల  చూర్ణం            ---- ఒక టీ స్పూను
     బెల్లం తరుము                       ----  "    "    "
     నల్ల నువ్వుల చూర్ణం              ----   "    "    "

           అన్నింటిని కలిపి నిమ్మకాయంత ఉండను తినిపించాలి

3.  ఇంగువ                                ---- శనగ గింజంత
     బెల్లం                                   ---- ఒక టీ  స్పూను
            రెండింటిని  వేడి నీటితో కలిపి తినాలి .

4.  నువ్వులను ఎక్కువగా తినిపిస్తూ వుండాలి

                                     బహిష్టు నొప్పి  లేదా ఋతు శూల  --- నివారణ                        

 కారణాలు :--- గర్భాశయం లో ఫైబ్రాయిడ్స్ పెరగడం ,  సర్విక్స్ లో ఇరుకుగా వుండడం , 11 సంవత్సరాల లోపు రజస్వల కావడం, బహిష్టు సక్రమముగా రాకపోవడం , చాలా కాలం పాటు గర్భం రాకపోవడం, అధిక రక్తస్రావం , వంశపారంపర్యం  మొదలైనవి .

1. వావిలాకు చూర్ణం                    --- 20 gr
    మిరియాల చూర్ణం                   --- 20 gr
    వెల్లుల్లి                                  --- 20 gr
    ఇంగువ                                 ---   5 gr

     అన్నింటిని కల్వంలో వేసి బాగా మెత్తగా నూరి కుంకుడు గింజలంత మాత్రలు కట్టాలి .
     ప్రతి రోజు ఉదయం బహిష్టు సమయం లో ఒక మాత్రను మంచి నీటితో సేవించాలి .

2.  కలబంద రసం                       --- ఒక టేబుల్ స్పూను
            తేనె                             ---   "      "        "

      దీనిని ఏరోజుకారోజు తయారు చేసుకొన్ తాగేయ్యాలి ఈ విధంగా రోజుకు  2 , 3 సార్లు వాడాలి .

3.   బొప్పాయి పండు రసం            ---- ఒక గ్లాసు
                     నిమ్మ రసం           ---- ఒక టేబుల్ స్పూను

      రెండింటిని కలిపి బహిష్టు సమయం లో ప్రతి రోజు తాగించాలి .

సూచన :--- వేడినీటితో పొత్తి కడుపు మీద కాపడం పెట్టాలి . సీసాలో వేడి నీటిని పోసి పొట్ట మీద దొర్లించాలి

                                                  అధిక ఋతు రక్తస్రావం --- నివారణ                         

1 అత్తపత్తి ఆకుల రసం                 ---- రెండు టేబుల్ స్పూన్లు
            తేనె                            ---- 1, 2      "         "

       రోజుకు మూడు సార్లు చొప్పున  3, 4 రోజులు వాడాలి .

2. బాదం గింజల పేస్ట్                ---- ఒక టీ స్పూను
    మారేడు ఆకుల ముద్ద            ----  "    "     "
            తేనె                            ----  "    "     "

       అన్నింటిని బాగా కలిపి తిని ఒక కప్పు వేడి నీటిని తాగాలి  ( ప్రతిరోజు ఉదయం )

తీసుకోవలసిన జాగ్రత్తలు :-- Rest is the Best Treatment .  Asprin  వున్న  మాత్రలను ఎక్కువగా వాడకూడదు .
పడుకున్నపుడు తలకింద ఎత్తుగా పెట్టుకోవాలి .  అరటి పువ్వు ను కూర వండుకొని తినాలి . ధనియాల కషాయం తాగితే
తగ్గుతుంది .

                                      బహిష్టు నొప్పి నివారణకు --- కర్పూరవటి                               
కుంకుమ పువ్వు             --- 5 gr
పచ్చకర్పూరం                --- అర టీ స్పూను
      తేనె                        --- తగినంత

      ఒక చిన్న కల్వంలో కుంకుమ పువ్వు వేసి బాగా మెత్తగా పొడి లాగా చెయ్యాలి . తరువాత పచ్చకర్పూరం వేసి బాగా
కలిసేట్లు నూరాలి  తరువాత  5 , 6  చుక్కల తేనె కలిపి బాగా నూరి  శనగ గింజలంత  మాత్రలు తయారు చేసుకోవాలి .

      ప్రతి రోజు ఒక మాత్ర చొప్పున బహిస్టు కు మూడు ముందు రోజులనుండి బహిష్టు ఆగేవరకు వాడాలి .  ఈ విధంగా
6 నెలలు వాడాలి . ఈ విధంగా వాడడం వలన  ఇక ఎప్పటికి నొప్పి రాదు

తీసుకోవలసిన జాగ్రత్తలు ;---  వేడి నీళ్ళ సీసాతో పొత్తి కడుపు మీద దొర్లిస్తూ కాపడం పెట్టాలి . టబ్ లో అంచువరకు
నీళ్ళు పోసి నడుము  మునిగేటట్లు కూర్చోవాలి .  సాత్వికాహారం భుజించాలి

                IRREGULAR  PERIODS                       

కారణాలు :--- హార్మోన్ల ఆధిక్యం , థైరాయిడ్ గ్రంధులలో తేడాలు  ఎక్కువగా వుండడం , ఎక్కువగా  ఎక్కువగా చేయడం ,  గర్భాశయంలో నిర్మాణ పరమైన సమస్యలు వుండడం ,  కుటుంబ ఇతివృత్తము  మొదలైనవి .

1. మందార పూల ముద్ద                ---- ఒక టేబుల్ స్పూను
                నీళ్ళు                        ----  అర గ్లాసు

         ప్రతి రోజు పరగడుపున పూల ముద్దను నీళ్ళలో కలుపుకొని తాగాలి .

2.  ఉడికించిన కలబంద గుజ్జు         ---- ఒక టీ స్పూను
     ఆపిల్ జ్యూస్  లేదా నీళ్ళు        ---- ఒక గ్లాసు

        ప్రతి రోజు పరగడుపున  గుజ్జును ఆపిల్ జ్యూస్ లో గాని లేదా నీళ్ళలో గాని కలుపుకొని తాగాలి  బహిష్టు కంటే  5, 6
రోజులు ముందు నుండి తీసుకోవాలి .

3.  తులసి ఆకుల రసం                ---- ఒక టీ స్పూను
                తేనె                          ---- ఒక టీ స్పూను
        మిరియాల పొడి                  ---- చిటికెడు

       అన్నింటిని బాగా రంగరించి నాలుకతో నాకేయ్యాలి .ఉదయమ్ , సాయంత్రం ఏ పూటకు ఆ పూట తయారు చేసుకొని
సేవించాలి . ఒకటి , రెండు నెలలు వాడాలి .  దీంతో బహిష్టు క్రమబద్ధమవుతుంది .

సూచనలు :--- ఒత్తిడిని తగ్గించుకోవాలి . విశ్రాంతి తీసుకోవాలి . అర్ధ శక్తిగా వ్యాయామం చేయడానికి  ప్రాధాన్యత ఇవ్వాలి .
మలబద్ధకం లేకుండా చూసుకోవాలి  సులభంగా జీర్ణమయ్యే పదార్ధాలను వాడాలి .

                                                 తెల్లబట్ట వ్యాధి --- నివారణ                                  26-8-11.

నెల ఉసిరిక ఆకుల ముద్ద                ---- 30
బియ్యపు కడుపు                           ---- ఒక కప్పు
కలకండ                                       ---- తగినంత

       అన్నింటిని కలిపి పరగడుపున తాగాలి .
       చప్పిడి పద్యం వుండాలి . 3 రోజులలో తగ్గుతుంది .కాలెయాన్ని కాపాడుతుంది . భర్తకు దూరంగా వుండాలి
       దానిమ్మ రసం , ఎండుద్రాక్ష వంటివి మంచిది . పాలన్నం , మజ్జిగన్నం ఎక్కువగా తినాలి .

                                               ఎర్రబట్ట నివారణకు  --- స్త్రీ జన కల్పకము               

శనగ పిండి                      --- 30 gr
జిలకర పొడి                     ---   5 gr
చక్కర                            --- 30 gr

      శనగ పిండిని కొద్దిగా మాత్రమె వేయించాలి .
      అన్ని పదార్ధాలను బాగా కలపాలి .

      ఉదయం , సాయంత్రం ఒక్కొక్క స్పూను చొప్పున సేవించాలి . ఇది తిని మజ్జిగ తాగాలి .  లేదా
      బార్లీ నీళ్ళు గాని, ధనియాల కషాయాన్ని గాని , ద్రాక్ష రసం గాని , మజ్జిగ గాని తాగవచ్చును 
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660

నెలసరి నొప్పులకు మందులు 

మహిళల్లో నెలసరి వచ్చిందంటే చాలు నడుము నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, తలనొప్పి వంటి రకరకాల శారీరక సమస్యలతోపాటు అలసట, చిరాకు లాంటి మానసిక సమస్యలు వేధిస్తాయి. అయితే నెలసరి సమయంలో వేదించే నొప్పుల్ని తాము రూపొందించిన న్యాచురల్ రోల్ఆన్ తో తగ్గించుకోవచ్చని చెబుతున్నారు ఢిల్లీకి చెందిన ఇద్దరు ఐఐటి విద్యార్థులు. అర్చిత్ అగర్వాల్, హ్యరి నెహ్రవత్ అనే ఇద్దరు ఢిల్లీ – ఐఐటీ విద్యార్థులు దాదాపు ఏడు నెలల పాటు కష్టపడి ఈ నొప్పి నివారిణి తయారు చేశారు. దీన్ని యూకలిప్టస్, మెంథాల్, వింటల్ గ్రీన్ వంటి నూనెల్ని ఉపయోగించి తయారుచేస్తారు. దీని ధర 169 రూపాయలు. ఇది వందశాతం సహజసిద్ధమైనది. 10 ఎం.ఎల్ Sanfe రోల్ఆన్ ను దాదాపు మూడు పర్యాయాలు ఉపయోగించుకోవచ్చు. నొప్పి ఉన్న చోట ఈ నూనె రాసుకోవడం వలన సత్వరమే నొప్పి మాయమవుతుంది. దాదాపు ఎనిమిది గంటల పాటు నొప్పి పై దీని ప్రభావం పనిచేస్తుంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్‌)లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఈ మందును 14 నుంచి 38 మధ్య వయసున్న మహిళలపై ప్రయోగించి చూడగా అది విజయవంతం కావడంతో ఇటీవలే దీన్ని ఐఐటీ – ఢిల్లీలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ రోల్ఆన్ బయట మందుల షాపులోనే కాకుండా అమెజాన్ వంటి ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ లోనూ అందుబాటులో ఉంది.

కొన్ని నవీన్ సలహాలు చికిత్సలు

  • అల్లం తురుమును కప్పు నీటిలో కలిపి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత దాన్ని వడకట్టి తగినంత నిమ్మరసం, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పిరియడ్స్ లో రోజుకు రెండు మూడు సార్లు త్రాగటం వలన నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • హాట్ బ్యాగ్ తో ఉపశమనాన్ని పొందవచ్చు దీన్ని పొత్తికడుపు, నడుము దగ్గర కాపడం పెట్టుకుంటే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • నెలసరి సమయంలో శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది అందుకే నడుము, కడుపు భాగంలో 15 నిమిషాల పాటు సువాసనగల నూనెలతో మర్దన చేస్తే ఫలితం బాగుంటుంది.
  • ఈ సమయంలో జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలు, అధిక ఉప్పు ఉన్న ఆహారం తినకపోవడమే మంచిది.
  • పీచు పదార్ధాలు, విటమిన్లు, ఐరన్, ఒమెగా కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
  • క్యాల్షియం లోపం వలన కూడా నెలసరి నొప్పులు రావచ్చు. అందుకని క్యాల్షియం పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలు తీసుకోవటం మంచిది. బాదంపప్పు, పెరుగు, సాల్మన్ చేప లాంటి ఆహార పదార్థాలతో పాటు సూర్యరశ్మి శరీరంపై పడేలా చేసుకోవడం వలన నెలసరి నొప్పులు దూరం చేసుకోవచ్చు.