12, అక్టోబర్ 2020, సోమవారం

బొల్లి మచ్చలు తగ్గుతాయా??? అవగాహన కోసం నవీన్ సలహాలు ఈ లింక్స్ లో చూడాలి || Best solution for Leucoderma

బొల్లి మచ్చాలకు నివారణకు నవీన్ నడిమింటి సలహాలు - బలమైన యోగం




వుసిరికకాయల పొడి , చండ్రచెట్టు చేవపొడి  సమానంగా  కలిపి నిలువచేసుకోవాలి . అదేవిదంగా బావంచల గింజలను విడిగా దంచి జల్లించి వుంచుకోవాలి . ఒక గ్లాస్ మంచి నీటిలో ఒక చెంచ ఉసిరిక , చండ్ర కలిపినా పొడి వేసి ఒక కప్పు కషాయానికి మరిగించి వడపోసి అందులో పావు చెంచ బావంచల పొడి కలిపి తాగాలి . ఇలా రెండుపూటలా ఆహారానికి గంట ముందుగ క్రమం తప్పకుండ సేవిస్తుంటే బోల్లివల్ల ఏర్పడిన తెల్ల మచ్చలు క్రమంగా తగ్గుతాయి .


గత మూడు సంవత్సరాలుగా, కాళ్ళు, చేతులు మరియు ముఖం పై బొల్లి సమస్యతో బాధపడుతున్న ఒక 8 ఏళ్ల బాలుడను, 26 ఆగస్టు 2015 న ఒక వైబ్రో చికిత్సా నిపుణుల వద్దకు తీసుకు రావడం జరిగింది. గతంలో ఈ బాలుడకు చర్మ వైద్యుడుచే ఇవ్వబడిన వైటమిన్ బిళ్ళలు మరియు ఇతర మందుల ద్వారా ఉపశమనం కలగకపోవడమే కాకుండా, రోగికి వాంతులు, శరీర వాపు మరియు బొల్లి మచ్చలపై ఎర్ర విస్ఫోటకములు (బాయిల్స్) వంటి దుష్ప్రభావాలు కలగడంతో అల్లోపతి చికిత్సను నిలిపి వేయడం జరిగింది. ఆ తర్వాత, రోగి యొక్క తల్లి తండ్రులు అతనికి ఒకటిన్నర సంవత్సరాల పాటు ఆయుర్వేద చికిత్స చేయించారు. అయితే ఈ చికిత్స ద్వారా కేవలం కొంత మెరుగుదల మాత్రమే ఏర్పడడంతో తల్లి తండ్రులకు సంతృప్తి కలగలేదు. కొంత కాలం తర్వాత వీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు దీవించిన సాయి వైబ్రియానిక్స్ చికిత్స గురించి వినడం జరిగింది. సాయి భక్తులైన వీరు వెంటనే తమ బిడ్డకు ఈ చికిత్సను చేయించాలని నిర్ణయించుకుని, వైబ్రో చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. క్రింది మిశ్రమాలను ఈ రోగికి ఇవ్వడం జరిగింది:
CC15.1 Mental & Emotional tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies…6TD 

మందు యొక్క మోతాదు: మూడు వారాలకు 6TD (రోజుకి ఆరు సార్లు), ఆపై మూడు వారాలకు QDS (రోజుకి నాలుగు సార్లు), ఆ తర్వాత TDS మోతాదులో కొనసాగించబడింది. ఈ మిశ్రమమును బాధిత చర్మం పైపూతగా (BD) ఉపయోగించేందుకు విభూతిలో కూడా కలిపి ఇవ్వడం జరిగింది

ఈ చికిత్స ప్రారంభించిన ఎనిమిది వారాల తర్వాత, రోగి యొక్క ముఖం పై ఉన్న తెల్ల మచ్చలన్నీ పూర్తిగా తొలగి, అతని చర్మ వర్ణం సాధారణ స్థితికి తిరిగి మారింది. అతని కాళ్ళు మరియు చేతులపై ఏర్పడిన మచ్చలు 95% వరకు తొలగిపోయాయి. దీని కారణంగా మందు యొక్క మోతాదు ఆపై రెండు వారాలకు OD కి, ఆ తర్వాత OW కి తగ్గించడం జరిగింది. పదమూడు వారాల తర్వాత రోగి యొక్క కాళ్ళు మరియు చేతుల పై మచ్చలు పూర్తిగా తొలగిపోయాయి. మిశ్రమం కలపబడిన విభూతితో పాటు (పైపూతకు) ఈ మందును మరికొంత కాలం వరకు OD మోతాదులో తీసుకోవలసిందిగా చికిత్సా నిపుణుల చే అతనికి సలహా ఇవ్వబడింది. రోగికి బొల్లి సమస్య పూర్తిగా తొలగిన కారణంగా 2016 మే లో, పైపూత మందును పూర్తిగా నిలిపి, మౌఖికంగా తీసుకొనే మందు యొక్క మోతాదును మరింత తగ్గించి ఇవ్వడం జరిగింది (నెలకు ఒకసారి).

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

*సభ్యులకు సూచన*

*************

సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..


కామెంట్‌లు లేవు: