మధుమేహం యొక్క లైంగిక మరియు యూరోలాజిక్ సమస్యలు అవగాహన కోసం నవీన్ నడిమింటి సలహాలు 

సమస్యాత్మకమైన మూత్రాశయ లక్షణాలు మరియు లైంగిక చర్యలో మార్పులు వ్యక్తులకు వయసు పెరిగే కొద్దీ వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యలు. మధుమేహం కలిగి ఉండడం అంటే ఈ సమస్యల యొక్క త్వరిత ప్రారంభం మరియు పెరిగిన తీవ్రత అని అర్థం కావచ్చు.  మధుమేహం రక్త నాళాలు మరియు నరములకు చేసే నష్టం కారణంగా మధుమేహం యొక్క లైంగిక మరియు యూరోలాజిక్ సమస్యలు ఏర్పడవచ్చు.    పురుషులకు అంగస్తంభనలు లేదా స్ఖలనంతో  ఇబ్బంది ఉండవచ్చు. మహిళలకు లైంగిక స్పందన మరియు యోని ద్రవాలు వూరడంతో సమస్యలు ఉండవచ్చు. మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు మరియు మూత్రాశయ సమస్యలు మధుమేహం ఉన్న వారిలో చాలా తరచుగా ఏర్పడతాయి. వారి మధుమేహంను నియంత్రణలో ఉంచుకున్న వ్యక్తులు ఈ లైంగిక మరియు యూరోలాజిక్ సమస్యలు త్వరితంగా ప్రారంభం అయ్యే వారి ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

మధుమేహం మరియు లైంగిక సమస్యలు

నరములు మరియు చిన్న రక్తనాళాలకు ఏర్పడే నష్టం కారణంగా మధుమేహం గల పురుషులు మరియు స్త్రీలు ఇద్దరిలో లైంగిక సమస్యలు అభివృద్ధి చెందవచ్చు. ఒక వ్యక్తి ఒక చేయి ఎత్తాలనుకుంటే  లేదా ఒక అడుగు వేయాలనుకుంటే మెదడు నాడీ సంకేతాలను అనుచిత కండరాలకు పంపుతుంది. నాడీ సంకేతాలు గుండె మరియు మూత్రాశయం వంటి అంతర్గత అవయవాలను కూడా నియంత్రిస్తాయి, అయితే వ్యక్తులు తమ చేతులు మరియు కాళ్ళ పై ఉండే అదే రకమైన స్పృహ నియంత్రణ వీటిపై వుండదు. అంతర్గత అవయవాలను నియంత్రించే నరాలను అటానమిక్ నర్వ్స్ అని పిలుస్తారు, అవి ఒక వ్యక్తి  దాని గురించి ఆలోచించకుండానే ఆహారాన్ని జీర్ణం చేయమని మరియు రక్తాన్ని ప్రసరించమని శరీరానికి సంకేతమిస్తాయి. జననాంగాలకు రక్త ప్రవాహంను పెంచే మరియు మృదువైన కండర కణజాలం రిలాక్స్ అవ్వడానికి కారణమయ్యే అటానమిక్ నర్వ్ సిగ్నల్స్ ద్వారా నిర్వహించబడే లైంగిక ప్రకంపనలకు శరీరం యొక్క ప్రతిస్పందన కూడా అసంకల్పితం.  ఈ అటానమిక్ నర్వ్స్ కు జరిగే నష్టం అనేది సాధారణ పనితీరును ఆటంకపర్చవచ్చు. రక్తనాళాలకు కలిగిన నష్టం ఫలితంగా  తగ్గిన రక్త ప్రవాహం కూడా లైంగిక అసమర్థతకు దోహదం చేయవచ్చు.

మధుమేహం ఉన్న పురుషులలో  లైంగిక సమస్యలు సంభవించవచ్చు?

అంగస్తంభన లోపం

అంగస్తంభన లోపం అనేది లైంగిక సంభోగం కొరకు కావలసినంత దృఢమైన ఒక అంగస్తంభన కలిగి ఉండేందుకు ఒక స్థిరమైన అసమర్థత. ఈ పరిస్థితిలో ఒక అంగస్తంభన కలిగి ఉండేందుకు మొత్తం అసమర్థత మరియు ఒక అంగస్తంభనను కొనసాగించేందుకు అసమర్థత వుంటాయి.

మధుమేహం ఉన్న పురుషుల్లో అంగస్తంభన లోపం యొక్క ప్రాబల్య అంచనాలు విస్తృతంగా 20 నుండి 75 శాతం వరకు గల పరిధిలో మారుతూ ఉంటాయి. మధుమేహం కలిగిన పురుషులు మధుమేహం లేని పురుషుల కంటే అంగస్తంభన లోపం కలిగి ఉండే అవకాశం రెండు నుండి మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది. అంగస్తంభన సమస్య ఉన్న పురుషులలో మధుమేహం ఉన్నవారు మధుమేహం లేని పురుషులలో కంటే 10 నుండి 15 సంవత్సరాల అంత ముందే సమస్యను ఎదుర్కోవచ్చు. అంగస్తంభన లోపం అనేది, ప్రత్యేకంగా 45 సంవత్సరాలు పురుషులల్లో  మరియు  చిన్నవారిలో, మధుమేహం యొక్క ప్రారంభ సూచిక కావచ్చు అని పరిశోధన సూచిస్తుంది.

మధుమేహంతో పాటు, అంగస్తంభన లోపం యొక్క ఇతర ప్రధాన కారణాలలో అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి, మద్య దుర్వినియోగం, మరియు రక్త నాళ వ్యాధి ఉంటాయి. అంగస్తంభన లోపం మందుల దుష్ప్రభావాలు, మానసిక కారణాలు, ధూమపానం, మరియు హార్మోన్ల లోపాలు వలన కూడా సంభవించవచ్చు.

అంగస్తంభన లోపంను ఎదుర్కునే వ్యక్తులు ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో మాట్లాడుటను పరిశీలించాలి. ఆరోగ్య సంరక్షణ ప్రదాత రోగి యొక్క వైద్య చరిత్ర, లైంగిక సమస్యల యొక్క రకం మరియు ఫ్రీక్వెన్సీ, మందులు, ధూమపానం మరియు మధ్యపానం అలవాట్లు, మరియు ఇతర ఆరోగ్య పరిస్థితులు గురించి అడగవచ్చు. ఒక శారీరక పరీక్ష మరియు ప్రయోగశాల పరీక్షలు లైంగిక సమస్యల యొక్క సరైన కారణాలను ఖచ్చితంగా గుర్తించడంలో సహాయపడవచ్చు. ఆరోగ్య సంరక్షణ ప్రదాత రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ మరియు హార్మోన్ స్థాయిలు తనిఖీ చేస్తాడు మరియు నిద్ర సమయంలో సంభవించే అంగస్తంభనల కొరకు తనిఖీ చేసే ఒక పరీక్షను ఇంటి దగ్గర చేసుకోమని రోగిని అడగవచ్చు. రోగి నిరాశగా ఉన్నాడా లేదా ఇటీవల అతని జీవితంలో కలత చెందే మార్పులను ఎదుర్కున్నాడా  అని కూడా ఆరోగ్య సంరక్షణ ప్రదాత అడగవచ్చు.

న్యూరోపతి అని కూడా పిలువబడే నరాలు దెబ్బతినడం ద్వారా సంభవించే అంగ స్ధంభన సమస్యలకు చికిత్సలు విస్తృతంగా మారుతూ ఉంటాయి మరియు మౌఖిక మాత్రలు మొదలుకుని , వాక్యూమ్ పంపు, యురేత్రాలో ఉంచబడిన పెల్లెట్స్ మరియు పురుషాంగంలోకి నేరుగా షాట్లు ఇవ్వడం నుండి శస్త్రచికిత్స వరకు ఉంటాయి. ఈ అన్నీ పద్ధతులకు లాభాలు మరియు నష్టాలు ఉన్నాయి. ఆందోళన తగ్గించడానికి లేదా ఇతర సమస్యలను  పరిష్కరించడానికి మానసిక కౌన్సిలింగ్ అవసరం కావచ్చు. సాధారణంగా ఇతర  అన్ని పద్దతులు విఫలం అయ్యాక అంగస్తంభనకు సహాయం చేయడం కోసం  లేక ధమనులను రిపేరు చేయడం కోసం ఒక పరికరాన్ని ఇంప్లాంట్ చేయడానికి శస్త్రచికిత్సను ఒక చికిత్స లాగా వాడతారు.

తిరోగమన  స్ఖలనం

తిరోగమన స్ఖలనం అనేది ఒక వ్యక్తి యొక్క వీర్యంలో ఒక భాగం లేదా మొత్తం స్ఖలన సమయంలో పురుషాంగం యొక్క కొన లోంచి బయటకు వెళ్ళే బదులుగా మూత్రాశయంలోకి వెళ్ళే ఒక స్థితి. స్ఫింక్టర్స్  అని పిలువబడే అంతర్గత కండరాలు సాధారణంగా పనిచేయలేనప్పుడు తిరోగమన స్ఖలనం ఏర్పడుతుంది. ఒక స్పింక్టర్ స్వయంచాలకంగా శరీరంలో ఒక మార్గాన్ని తెరుస్తుంది లేదా మూసివేస్తుంది. తిరోగమన స్ఖలనంతో వీర్యం మూత్రాశయంలోకి ప్రవేశించి మూత్రంతో కలిసి మూత్ర విసర్జన సమయంలో మూత్రాశయానికి నష్టం కలిగించకుండా బయటికి వస్తుంది. తిరోగమన స్ఖలనం ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి స్ఖలనం సమయంలో కొద్దిగా వీర్యం డిశ్చార్జ్ అవుతుంది అని గమనించవచ్చు లేదా ప్రజనన సమస్యలు తలెత్తితే, పరిస్థితి గురించి తెలుసుకోవచ్చు. స్ఖలనం తర్వాత ఒక మూత్ర నమూనా యొక్క విశ్లేషణ వీర్యం యొక్క ఉనికిని బహిర్గతం చేస్తుంది.

పేలవమైన రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ మరియు దానివల్ల కలిగే నరాల నష్టం తిరోగమన స్ఖలనం ను కలిగించవచ్చు. ఇతర కారణాలలో ప్రోస్టేట్ శస్త్రచికిత్స మరియు కొన్ని మందులు ఉంటాయి.

బ్లాడర్ లోని స్పింక్టర్ కండరాలను బలంగా చేసే మందులు, మధుమేహం లేదా శస్త్రచికిత్స వల్ల కలిగే తిరోగమన స్ఖలనం విషయంలో సహాయపడవచ్చు. వంధ్యత్వ చికిత్సలో అనుభవం ఉన్నయురాలజిస్ట్ వీర్యాన్ని మూత్రం నుండి సేకరించి, ఆపై సంతానోత్పత్తి కొరకు ఆ వీర్యాన్ని కృత్తిమ ఫలదీకరణ కొరకు వాడడం వంటి సంతానోత్పత్తిని ప్రోత్సహించే పద్ధతులతో తోడ్పడగలడు.

మధుమేహం ఉన్న స్త్రీలకు  లైంగిక సమస్యలు సంభవించవచ్చు?

మధుమేహం ఉన్న చాలా మంది మహిళలు లైంగిక సమస్యలు ఎదుర్కొంటారు. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న మహిళల్లో లైంగిక సమస్యల గురించిన పరిశోధన పరిమితమైనప్పటికీ, ఒక అధ్యయనం టైప్ 1 మధుమేహ వ్యాధితో బాధపడుతున్న మహిళల్లో 27 శాతం మంది లైంగిక అసమర్థతను ఎదుర్కొన్నారు అని కనుగొంది. మరొక అధ్యయనం మహిళలు టైప్ 1 మధుమేహ వ్యాధితో బాధపడుతున్న మహిళల్లో 18 శాతం మంది మరియు టైప్ 2 మధుమేహ వ్యాధితో బాధపడుతున్న మహిళల్లో 42 శాతం మంది లైంగిక అసమర్థతను ఎదుర్కొన్నారు అని కనుగొనింది.

లైంగిక సమస్యలలో ఇవి ఉండవచ్చు

  • యోనిలో పొడితనంను కలిగించే, తగ్గిన యోని లూబ్రికేషన్
  • అసౌకర్యవంతమైన లేదా బాధాకరమైన లైంగిక సంభోగం
  • లైంగిక కార్యకలాపం కోసం తగ్గిన కోరిక లేదా కోరిక లేకపోవడం
  • తగ్గిన లైంగిక స్పందన లేదా లైంగిక స్పందన లేకపోవడం

తగ్గిన లైంగిక స్పందన లేదా లైంగిక స్పందన లేకపోవడం అనే దానిలో ప్రేరేపించబడడానికి లేదా ప్రేరేపించబడి ఉండడానికి అసమర్థత, జననేంద్రియ ప్రాంతంలో తగ్గిన ఇంద్రియ స్పర్శ లేదా ఇంద్రియ స్పర్శ లోకపోవడం మరియు ఉద్వేగ స్థితికి చేరుకోవడానికి స్థిరమైన లేదా అరుదైన అసమర్థత అనేవి ఉండవచ్చు.

మధుమేహ వ్యాధితో బాధపడుతున్న మహిళల్లో లైంగిక సమస్యల యొక్క కారణాలలో నరాలు దెబ్బతినడం, స్త్రీ జననేంద్రియానికి మరియు యోని కణజాలానికి తగ్గిన రక్త ప్రసరణ మరియు హార్మోన్ల మార్పులు ఉంటాయి. ఇతర సంభావ్య కారణాలలో కొన్ని మందులు, మద్యం దుర్వినియోగం, ధూమపానం, ఆతృత, లేదా నిస్పృహ వంటి మానసిక ఆందోళనలు, గైనకాలజిక్ ఇన్ఫెక్షన్స్, గర్భధారణ లేదా రుతువిరతికి సంబంధించిన ఇతర వ్యాధులు మరియు పరిస్థితులు ఉంటాయి.

లైంగిక సమస్యలు ఎదుర్కొనే  లేదా లైంగిక స్పందనలో ఒక మార్పును గమనించిన మహిళలు ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో మాట్లాడడాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆరోగ్య సంరక్షణ ప్రదాత రోగి యొక్క వైద్య చరిత్ర, ఏవైనా గైనకాలజిక్ పరిస్థితులు లేదా ఇన్ఫెక్షన్స్, లైంగిక సమస్యల యొక్క రకం మరియు తరచుదనం (ఫ్రీక్వెన్సీ), మందులు, ధూమపాన మరియు మద్యపాన అలవాట్లు, మరియు ఇతర ఆరోగ్య పరిస్థితులు గురించి అడుగుతాడు. ఆరోగ్య సంరక్షణ ప్రదాత రోగి గర్భవతినా లేదా మెనోపాజ్ దశకు చేరుకున్నారా అని మరియు ఆమె నిస్పృహతో ఉందా లేక ఇటీవల ఆమె జీవితంలో కలత చెందే  మార్పులను ఎదుర్కొన్నదా అని అడగవచ్చు. శారీరక పరీక్ష మరియు ప్రయోగశాల పరీక్షలు కూడా లైంగిక సమస్యల కారణాలను ఖచ్చితంగా గుర్తించడానికి సహాయపడవచ్చు. ఆరోగ్య సంరక్షణ ప్రదాత రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ గురించి కూడా రోగితో మాట్లాడతాడు.

ప్రిస్క్రిప్షన్ లేదా ఓవర్-ది-కౌంటర్ వజినల్ లుబ్రికాంట్లు యోని పొడి బారడాన్ని ఎదుర్కొంటున్న మహిళలకు ఉపయోగపడవచ్చు. తగ్గిన లైంగిక స్పందనకు చికిత్స పద్ధతులలో లైంగిక సంబంధాల సమయంలో   భంగిమలో మరియు ప్రేరణ కలిగించటంలో మార్పులు ఉంటాయి. మానసిక కౌన్సిలింగ్ సహాయకారిగా ఉండవచ్చు. కటి కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడే కేగెల్  వ్యాయామాలు లైంగిక స్పందనను మెరుగుపరచవచ్చు. ఔషధ చికిత్సల అధ్యయనాలు కొనసాగుతున్నాయి.

మధుమేహం మరియు యూరోలాజిక్ సమస్యలు

మధుమేహం వున్న పురుషులు మరియు స్త్రీలను  ప్రభావితం చేసే యూరోలాజిక్ సమస్యలలో మూత్రాశయ సమస్యలు మరియు మూత్ర నాళ  ఇన్ఫెక్షన్స్ ఉంటాయి.

మూత్రాశయ సమస్యలు

మధుమేహం మరియు ఇతర వ్యాధులు, గాయాలు మరియు ఇన్ఫెక్షన్స్ తో సహా అనేక సంఘటనలు లేదా పరిస్థితులు మూత్రాశయ పనితీరును నియంత్రించే నరాలను దెబ్బతీయవచ్చు. మూత్రాశయ పనితీరును నియంత్రించే నరాలు దెబ్బతినడం కారణంగా మధుమేహం ఉన్న పురుషులు మరియు స్త్రీలలో సగం కంటే ఎక్కువ మంది మూత్రాశయ అసమర్థతను కలిగి ఉంటారు. మూత్రాశయ అసమర్థత అనేది ఒక వ్యక్తి జీవితం యొక్క నాణ్యత మీద ఒక గాఢమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మధుమేహం ఉన్న పురుషులు మరియు స్త్రీలలో ఉండే సాధారణ మూత్రాశయ సమస్యలలో ఈ క్రిందివి ఉంటాయి:

  • ఓవరాక్టివ్ బ్లాడర్. పాడైపోయిన నరములు మూత్రాశయంనకు తప్పుడు సమయంలో సంకేతాలను పంపవచ్చు, దీనివల్ల హెచ్చరిక లేకుండా దాని కండరాలు నొక్కబడతాయి. ఓవరాక్టివ్ బ్లాడర్ యొక్క లక్షణాలలో ఇవి వుంటాయి
  • యూరినరి ఫ్రీక్వెన్సీ-ఒక రోజుకు ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ సార్లు లేక ఒక రాత్రికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మూత్రవిసర్జన
  • యూరినరి అర్జెన్సీ- వెంటనే మూత్రవిసర్జన చేయవలసిన ఆకస్మిక, బలమైన అవసరం.
  • అదుపు చేయలేని కోరిక-మూత్రవిసర్జన చేయవలననే బలమైన కోరిక తరువాత మూత్రం కారిపోవటం
  • స్పింక్టర్ కండరాల యొక్క పేలవమైన నియంత్రణ. స్పింక్టర్ కండరాలు యురెత్రా-మూత్రాన్ని మూత్రాశయం నుండి శరీరం బయటికి తీసుకువచ్చే ట్యూబ్- చుట్టూ వుంటాయి మరియు మూత్రాశయంలో మూత్రాన్ని నిల్వ ఉంచుటకు దానిని మూసి ఉంచుతాయి. స్పింక్టర్ కండరాలకు వుండే నరాలు దెబ్బతింటే, కండరాలు వదులు అయి కారిపోవడానికి వీలుకల్పిస్తాయి లేక ఒక వ్యక్తి మూత్రం పోయుటకు ప్రయత్నించేటప్పుడు గట్టిగా ఉంటాయి.
  • మూత్రం నిలుపుదల . కొందరు వ్యక్తులకు , నరాల నష్టం అనేది వారి మూత్రకోశ కండరాలు, ఇది మూత్రవిసర్జన చేయవలసిన సమయం అనే సందేశాన్ని పొందకుండా చేస్తుంది లేదా కండరాలను మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయలేనంత బలహీనంగా చేస్తుంది. ఒకవేళ మూత్రాశయం పూర్తి ఎక్కువగా నిండితే, మూత్రం పేరుకుపోవచ్చు మరియు పెరుగుతున్న ఒత్తిడి మూత్రపిండాలను దెబ్బతీయవచ్చు. ఒక వేళ మూత్రం చాలా సేపు శరీరంలో ఉండిపోతే మూత్రపిండాలలో లేక మూత్రాశయంలో ఒక ఇన్ఫెక్షన్ అభివృద్ధి కావచ్చు. మూత్రం నిలుపుదల అనేది ఆపుకొనలేని అధిక ప్రవాహంకు-మూత్రాశయం నిండినప్పుడు మరియు సరిగ్గా ఖాళీ కానప్పుడు మూత్రం కారడం-దారితీయవచ్చు.

 

మూత్రాశయం సమస్యల నిర్ధారణలో మూత్రాశయ పనితీరును మరియు మూత్రాశయ అంతర్భాగం యొక్క రూపాన్ని రెండింటినీ తనిఖీ చెయ్యడం ఉండవచ్చు. పరీక్షలలో, ఎక్స్-రేలు, మూత్రాశయం పనితీరును అంచనా వేయడానికి యూరోడైనమిక్ పరీక్ష, మరియు, మూత్రాశయం లోపల వీక్షించడానికి సిస్టోస్కోప్ అని పిలిచే ఒక పరికరంను ఉపయోగించే ఒక పరీక్ష అయిన సిస్టోస్కోపీ ఉండవచ్చు.

 

నరాలు దెబ్బతినడం కారణంగా ఏర్పడిన మూత్రాశయ సమస్యల యొక్క చికిత్స నిర్దిష్ట సమస్య మీద ఆధార పడివుంటుంది. ఒకవేళ మూత్రం నిలుపుదల ప్రధాన సమస్య అయితే, మూత్రాశయం బాగా ఖాళీ అవ్వడాన్ని ప్రోత్సహించడానికి ఔషధప్రయోగం మరియు మరింత సమర్థవంతమైన మూత్రవిసర్జనను ప్రోత్సహించడానికి టైమ్డ్ వాయిడింగ్ -ఒక షెడ్యూల్లో మూత్రవిసర్జన చేయడం- అని పిలవబడే ఒక అభ్యాసం చికిత్సలో భాగమై ఉండవచ్చు. కొన్నిసార్లు ప్రజలకు మూత్రాన్ని బయటికి పంపడానికి కాథెటర్ అని పిలిచే ఒక సన్నని గొట్టాన్ని క్రమానుగతంగా మూత్రమార్గం గుండా మూత్రాశయంలోకి పంపవలసిన అవసరం ఉండవచ్చు. మూత్రాశయం పూర్తిగా నిండినప్పుడు ఎలా చెప్పాలి మరియు మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయడానికి  పొత్తి కడుపును మర్దనా ఎలా చేయాలి అని తెలుసుకోవడం కూడా సహాయం చేయగలదు. ఒకవేళ మూత్రం కారుట ప్రధాన సమస్య అయితే, మందులు, కేగల్ వ్యాయామాలతో కండరాలను బలంగా చేయడం లేక శస్త్రచికిత్స సహాయపడగలదు. అత్యవసర మూత్ర విసర్జన మరియు అతి ఉత్తేజక మూత్రాశయం యొక్క తరచుదనం కొరకు చేసే చికిత్సలో మందులు, టైమ్డ్ వాయిడింగ్, కేగల్ వ్యాయామాలు,మరియు కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్స అనేవి భాగమై ఉండవచ్చు.

మూత్ర నాళ ఇన్ఫెక్షన్స్

బాక్టీరియా, సాధారణంగా జీర్ణ వ్యవస్థ నుండి, మూత్రనాళమును చేరినప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మూత్ర మార్గమున బాక్టీరియా అభివృద్ధి చెందితే, ఆ ఇన్ఫెక్షన్ ను యురేత్రిటిస్ అని పిలుస్తారు. ఆ బాక్టీరియా మూత్ర నాళము వరకు ప్రయాణించి సిస్టిటిస్ అని పిలువబడే మూత్రాశయం ఇన్ఫెక్షన్ ను కలిగించవచ్చు. చికిత్స చేయబడని ఇన్ఫెక్షన్ శరీరంలో ఇంకా లోపలికి పోయి పైలోనేఫ్రీటిస్ అనే మూత్రపిండాల ఇన్ఫెక్షన్  ను కలిగించవచ్చు. కొంతమంది దీర్ఘకాలిక లేదా పునరావృతమయ్యే మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ ను కలిగి ఉంటారు. మూత్ర నాళ ఇన్ఫెక్షన్స్ యొక్క లక్షణాలలో ఇవి ఉండవచ్చు

  • మూత్రవిసర్జన చేయాలనే తరచుగా ఏర్పడే తపన
  • మూత్రవిసర్జన సమయంలో మూత్రాశయంలో నొప్పి లేదా మంట
  • చిక్క టి లేదా ఎరుపు మూత్రం
  • స్త్రీలలో యోనిఎముక పై భాగంలో ఒత్తిడి
  • పురుషులల్లో, పురీష నాళము నిండింది అనే భావన

మూత్రపిండాలలో ఇన్ఫెక్షన్ ఉంటే, ఒక వ్యక్తికి వికారం ఉండవచ్చు, వీపులో లేక పక్కన నొప్పి అనిపించవచ్చు మరియు జ్వరము ఉండవచ్చు. తరచూ మూత్ర విసర్జన అధిక రక్తంలో గ్లూకోజ్ యొక్క  లక్షణం కావచ్చు, కనుక ఇటీవలి రక్తంలో గ్లూకోజ్ పర్యవేక్షణ యొక్క ఫలితాలను విశ్లేషించాలి.

ఆరోగ్య సంరక్షణ ప్రదాత బాక్టీరియా మరియు పస్ కొరకు విశ్లేషించబడే ఒక మూత్ర నమూనా కోసం అడుగుతాడు. రోగికి తరచుగా వచ్చే మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ వుంటే అదనపు పరీక్షలు చేయబడవచ్చు. ఒక అల్ట్రాసౌండ్ పరీక్ష  అంతర్గత అవయవాల నుండి వెనకకు తిరిగి వచ్చిన ధ్వని తరంగాల యొక్క ప్రతిధ్వని నమూనాల నుండి చిత్రాలను అందిస్తుంది. ఒక ఇంట్రావీనస్ పయేలోగ్రామ్ మూత్ర నాళము యొక్క ఎక్స్-కిరణాల చిత్రాలను మెరుగుపర్చడానికి ఒక ప్రత్యేక డైను ఉపయోగిస్తుంది. సిస్టోస్కోపీ నిర్వహించబడవచ్చు.

మరింత తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ ను నివారించడానికి త్వరిత రోగనిర్ధారణ మరియు చికిత్స ముఖ్యమైనవి.    ఒక మూత్ర నాళ ఇన్ఫెక్షన్ ను క్లియర్ చేయడానికి ఆరోగ్య సంరక్షణ ప్రదాత మూత్రంలోని బ్యాక్టీరియా రకాన్ని బట్టి బహుశా యాంటీబయాటిక్ చికిత్సను సూచించవచ్చు. మూత్రపిండ ఇన్ఫెక్షన్లు చాలా తీవ్రమైనవి మరియు అనేక వారాల యాంటీబయాటిక్ చికిత్స అవసరం కావచ్చు. పుష్కలంగా ద్రవాలను త్రాగటం అనేది మరో ఇన్ఫెక్షన్ ను నిరోధించడంలో సహాయపడుతుంది.

మధుమేహం యొక్క లైంగిక మరియు యూరోలాజిక్ సమస్యలు అభివృద్ధి అయ్యే ప్రమాదం ఎవరికి ఉంది?

ప్రమాద కారకాలు అనేవి ఒక వ్యాధి పొందే అవకాశాలను పెంచే పరిస్థితులు. ప్రజలు ఎంత ఎక్కువ ప్రమాద కారకాలు కలిగి ఉంటే, ఆ వ్యాధి లేక పరిస్థితి అభివృద్ధి అయ్యే అవకాశాలను అంత ఎక్కువ కలిగి ఉంటారు. డయాబెటిక్ న్యూరోపతి మరియు సంబంధిత లైంగిక మరియు యూరోలాజిక్ సమస్యలు వీరిలో సర్వసాధారణంగా కనిపిస్తాయి

  • పేవలమైన రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ కలిగిన వారు
  • రక్తంలో కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో కలిగిన వారు
  • అధిక రక్తపోటు కలిగిన వారు
  • అధిక బరువు
  • 40 కంటే పైబడినవారు
  • పొగ త్రాగే వారు
  • శారీరకంగా చురుకుగా లేనివారు

మధుమేహ– సంబంధిత లైంగిక మరియు యూరోలాజిక్ సమస్యలను నివారించవచ్చా?

మధుమేహం ఉన్న వారు, వారి రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు, మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను వారి ఆరోగ్య సంరక్షణ ప్రదాత సిఫార్సు చేసిన లక్ష్య సంఖ్యలకు దగ్గరగా ఉంచడం ద్వారా లైంగిక మరియు యూరోలాజిక్ సమస్యల యొక్క వారి ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. శారీరకంగా చురుకుగా ఉండటం మరియు ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడం కూడా మధుమేహం యొక్క దీర్ఘ కాల సమస్యలను నిరోధించడానికి సహాయపడవచ్చు. పొగత్రాగే వారి కొరకు, వదిలిపెట్టడం అనేది నరాలు దెబ్బతినడం కారణంగా ఏర్పడిన లైంగిక మరియు యూరోలాజిక్ సమస్యలు అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధితో సహా మధుమేహంనకు సంబంధించిన ఇతర ఆరోగ్య సమస్యల యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గుర్తుంచుకోవలసిన విషయాలు

మధుమేహం వలన నరాలు దెబ్బతినడం అనేది లైంగిక మరియు యూరోలాజిక్ సమస్యలకు కారణం కావచ్చు.

  • మధుమేహం ఉన్న పురుషుల్లో వచ్చే లైంగిక సమస్యలలో ఇవి వుంటాయి
  • అంగస్తంభన లోపం
  • తిరోగమన స్ఖలనం
  • మధుమేహం ఉన్న స్త్రీలలో వచ్చే లైంగిక సమస్యలలో ఇవి వుంటాయి
  • తగ్గిన యోని ద్రవాలు మరియు అసౌకర్య లేదా బాధాకరమైన సంభోగం
  • తగ్గిన లైంగిక కోరిక లేదా లైంగిక కోరిక లేకపోవడం
  • తగ్గిన లైంగిక స్పందనలు లేదా లైంగిక స్పందనలు లేకపోవడం
  • మధుమేహం ఉన్న పురుషుల్లో మరియు మహిళలల్లో యూరోలాజిక్ సమస్యలలో ఇవి వుంటాయి
  • నరాలు దెబ్బ తినడానికి సంబంధించిన ముత్రాశయం సమస్యలు, ఓవర్ యాక్టివ్ బ్లాడర్, స్పింక్టర్ కండరాల కండరాల పేలవమైన నియంత్రణ, మరియు మూత్రం నిలుపుదల
  • మూత్రనాళం ఇన్ఫెక్షన్స్
  • ఆహారం, శారీరక శ్రమ, మరియు అవసరమైన విధంగా మందులు ద్వారా మధుమేహాన్ని నియంత్రించడం అనేది లైంగిక,మరియు యూరోలాజిక్ సమస్యలు నిరోధించడానికి సహాయపడవచ్చు.
  • లైంగిక మరియు యూరోలాజిక్ సమస్యల కొరకు చికిత్స అందుబాటులో ఉంది

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660