మోకాళ్ళ నొప్పులను నివారించే 19 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
మనం ఏ పని చేసినా మన మోకాలిపై భారం పడుతూనే ఉంటుంది. మన శరీరంలోనే ఇది ఒక అద్భుతమైన అవయం. శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడటానికి అవసరమైన అవయవం. రోజువారీ కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణ రహితంగా దాన్ని ఉపయోగించడం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులలో నివాసం, ఎగుడుదిగుడు ప్రాంతాల్లో నడక వంటి కారణాలతో మోకాలిలో నొప్పి సమస్య పెరుగుతోంది. అయితే కొందరిలో మోకాలినొప్పి వయసును బట్టి కూడా వస్తూ ఉంటుంది. సాధారణంగా 45 సంవత్సరాలు పై బడిన వారిలో మోకాళ్ల నొప్పులు రావటం సాధారణం.
మొదట జాయింట్స్ దగ్గర నొప్పి చిన్నగా మొదలై క్రమంగా నొప్పి తీవ్రత అధికం అవుతుంది. . దీంతో వారు నడవటానికి, మెట్లు ఎక్కటానికి, పరిగెత్తటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నొప్పుల్ని తగ్గించుకోవటానికి చాలా రకాల మెడిసిన్స్ ఉపయోగిస్తారు. ఇలా ఉపయోగించటం వల్ల తాత్కాలిక ఉపశమనం పొందుతారు. కానీ ఆ మెడిసిన్ ప్రభావం మాత్రం దీర్ఘకాలిక సమస్యలకు దారి తీస్తుంది. అందుకే వీలైనంత వరకు సహజ సిద్ధంగా తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తే మంచిది. ఏదైనా గాయం అవటం లేదా ఆర్థ్రైటీస్ సమస్యల వలన కూడా ఈ నొప్పులు కలగవచ్చు. ఈ నొప్పుల బారిన పడిన వారు ప్రశాంతంగా ఉండలేరు.
ఏ పని సక్రమంగా నిర్వహించలేని స్థితికి చేరుకుంటారు. రోజు వ్యాయమం చేయడం వల్ల కొంతమేరకు నొప్పిని తగ్గించవచ్చు. అలాగే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. కొన్ని చిట్కాలు పాటించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఆ మోకాళ్ల నొప్పుల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇక అవి ఏమిటో ఒకసారి చూద్దామా.
అల్లంలో అనాల్జెసి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇది మోకాళ్ల నొప్పులను నివారిస్తుంది. కాబట్టి, కొద్దిగా అల్లం నూనెను మోకాళ్లపై అప్లై చేసి స్మూత్ గా మసాజ్ చేయాలి. అలాగే మీరు కొద్దిగా అల్లం పేస్ట్ ను కూడా అప్లై చేసి తక్షణ ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా మోకాళ్ల నొప్పుల వారు నొప్పి అధికంగా ఉన్నప్పుడు అల్లం టీలో పసుపు కలిపి తాగితే సరిపోతుంది. అలాగే ఒక గ్లాసు నీటిలో చిన్న అల్లం ముక్కను, సగం చెంచా పసుపును వేసి 10-15 నిమిషాలు మరిగించి తేనె కలుపుకుని తాగితే మంచిది. ఇలా వారానికి రెండు సార్లు చేసినా మోకాళ్ల నొప్పులు తగ్గు ముఖం పడతాయి.
నిమ్మ సిట్రస్ యాంటీ-ఇన్ప్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఇది మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది. మోకాళ్లొ నొప్పలతో బాధపడేవారు ఎక్కువగా దీన్ని ఉపయోగించడం మంచిది. తినే ఆహారంలో లేదా అప్పుడప్పుడు నిమ్మతో తయారుచేసిన పానీయాలు తాగడం మంచిది. అలాగే నువ్వుల నూనె, నిమ్మ రసం సమభాగాలుగా తీసుకుని వాటిని బాగా కలిపి కీళ్లపై మర్దన చేస్తే మోకాళ్ల నొప్పలు క్రమంగా తగ్గుతాయి.
పసుపు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మోకాళ్ళ నొప్పులను,ఇన్ఫ్లమేషన్ ను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మోకాళ్ల నొప్పులకు ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ. పసుపు మిక్స్ చేసిన పాలు తాగడం వల్ల మోకాళ్ల నొప్పల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొంత పసుపును తీసుకుని నీటితో కలిపి పేస్ట్‌లా చేయాలి. అనంతరం దాన్ని మోకాళ్లపై మర్దనా చేసినట్టు రాయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే నొప్పులు తగ్గుతాయి. ఒక టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ చక్కెర పౌడర్, 1 టీస్పూన్ లైమ్ పౌడర్‌లను తీసుకుని వాటిని తగినంత నీటితో బాగా కలపాలి. దీంతో మెత్తని, చిక్కని పేస్ట్ తయారవుతుంది. ఈ పేస్ట్‌ను రాత్రి పూట సమస్య ఉన్న ప్రాంతంలో రాయాలి. రాత్రంతా దాన్ని అలాగే వదిలేయాలి. ఉదయాన్నే కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే నొప్పులు తగ్గిపోతాయి.
ఆవాల నూనెను ప్రతిరోజూ రెండుసార్లు మీ మోకాలు నొప్పి ఉన్న చోట పూస్తే ఉపశమనం పొందవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల ఆవాల నూనెలో వెల్లుల్లి , ఒక లవంగ వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరగించాలి. ఆ తర్వాత ఈ నూనెను నొప్పి ఉన్న చోటు పూయాలి. ఇలా తరచూ చేస్తే ఉంటే నొప్పి నుంచి ఉపశమన పొందవచ్చు. ఆ నూనెతో మోకళ్లపై మసాజ్ మాత్రం తరచుగా చేస్తూ ఉండాలి.
యాపిల్ పండుతో తయారయ్యే పదార్ధమే యాపిల్ సైడర్ వెనిగర్. రోజు మొత్తంలో ఏ భోజనానికి ముందైనా సరే ఒకటి లేదా రెండు స్పూన్ల యాపిల్ సైడర్ వినేగర్ తీసుకుంటే మంచిది. యాపిల్ సైడర్ వెనిగర్ లో అల్కలిన్ లక్షణాలుంటాయి. మోకాలి లోపల హానికరమైన వాటిని తొలగించడంలో ఇది సాయపడుతుంది. రెండు కప్పుల నీటిలో రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ తాగాలి. వేడి నీటి స్నానపు తొట్టెలో రెండు కప్పులు ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి కలపాలి. ఆ తొట్టెలో మోకాలును అరగంట సేపు ఉంచాలి. ఒక స్పూన్ ఆలివ్ నూనె, ఒక స్పూన్ యాపిల్ వెనిగర్ ను మిక్స్ చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో మాసాజ్ చేయాలి.
ఎప్సం సాల్ట్ లో మోకాలి నొప్పిని నయం చేసే గుణాలను ఎక్కువ మోతాదులో ఉన్నాయి. ఒక బకెట్ లో వేడి నీటిని తీసుకొని అందులో రెండు నుండి మూడు చెంచాల ఎప్సం సాల్ట్ ను కలపండి. తరువాత దీనిలో 10 నుండి 15 నిమిషాల పాటూ మీ కాళ్ళను అందులో ఉంచండి. కాళ్ళను బయటకి తీసిన తరువాత తేమను అందించే ఉత్పత్తులను పాదాలకు పూయండి. ఎందుకంటే ఎప్సం సాల్ట్ కాళ్లను పొడిగా మారుస్తుంది. ఇలా తరచుగా చేస్తూ ఉంటే మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు.
ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ మోకళ్ల నొప్పుల నివారణకు బాగా పని చేస్తాయి. వారానికి కనీసం రెండు సార్లైనా చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. చేపలు తిననివారు బదులుగా ఒమేగా -3 ఫాటీ యాసిడ్లు ఉండే అవిసెగింజలూ, బాదం, వాల్‌నట్లూ, పొద్దుతిరుగుడు పువ్వు గింజల్ని తీసుకోవాలి. చేప నూనెలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఎకోసపెంటెనోయిక్ ఆమ్లం (EPA) డొకోసాహెక్సానియోక్ ఆమ్లం (DHA) ఉంటాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు రరకాలు ఉన్నాయి. ఆహారంలో తరచూ సాల్మొన్ చేపలు తీసుకుంటూ ఉంటే దాదాపు మోకళ్ల నొప్పులు రావు. చేపలు లేదా ఫ్లాక్స్ సీడ్లలో ఈ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఒమేగా -3 ఎక్కువగా ఉండే సాల్మోన్, ట్యూనా, సార్డినెస్, హెర్రింగ్, కాడ్, మేకెరెల్ లాంటివి మోకాలి నొప్పి నివారణకు నివారణకు బాగా ఉపయోగపడతాయి. ప్రతిరోజూ తైల చేపలు (మాకేరెల్ లేదా సాల్మోన్ వంటి) లను రెండు సేమేట్లను తినండి. లేదా ప్రతి రోజూ కేప్సూల్ రూపంలో ఒమేగా -3 ని ఒక గ్రాము తీసుకోవాలి. దీంతో మీరు నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.
అత్యధికంగా కాల్షియం ఉన్న పదార్ధాలు తీసుకుంటే మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. ఒక రోజుకి కనీసం ఒక గ్లాసు పాలను ఏదైనా ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. పాలలో లాగే పెరుగు, మజ్జిగలో కూడా అంతే మోతాదులో కాల్షియం నిల్వలు ఉంటాయి. సీ ఫిష్ లో చాలా ప్రసిద్ది చెందినవి, సార్డిన్స్. ఒక రోజులో మీకు కావల్సిన 33% కాల్షియంను వీటిలో పుష్కలంగా లభిస్తుంది. ఎండిన అంజీర పండ్లును కూడా తినాలి. అరటి, బచ్చలికూర, బీన్స్, యాపిల్స్ వంటివి కూడా బాగా తినాలి. సోయాచిక్కుళ్ళు, కొత్తమీర, మెంతిఆకు, బెల్లం, నువ్వులు, పిస్తా, వాల్‌నట్, రాగులు, పొట్టుతో కల మినుములు,ఉలవలు, తోటకూర, తమలపాకులు, కారట్, కాలీఫ్లవర్, కరివేపాకు, పుదీనా, పసుపు, పొన్నగంటికూర, ధనియాలు, జీలకర్ర, చేపలు, జున్ను, గుడ్లు,
చిలకడదుంపలు, ఎండుకొబ్బరి, బాదంవంటి వాటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తినాలి.
మనకి మార్కెట్ లో విరవిగా దొరికే పండ్లలో ఫైనాపిల్ ఒకటి. తినాదినికి ఇది కొంచెం పుల్లగా ఉంటుందనే కారణం తో చాలా మంది వెనకాడతారు కాని దీని ద్వారా మోకాళ్ల నొప్పులు దూరం అవుతాయి. కాల్షియం, మాంగనీస్ అధికంగా ఉండే ఈ పండులో ఉంటాయి. ఎముకలకు బలం చేకూరుతుంది. కీళ్లనొప్పులు తగ్గిపోతాయి. రోజుకు వందగ్రాములు మాత్రమే పైనాపిల్ తింటే మంచిది.
బొప్పాయి విత్తనాల టీ అనేది మోకాళ్ల నొప్పుల నివారణకు అత్యుత్తమ సహజ మార్గం. బొప్పాయి విత్తనాలు జస్ట్ ఓ టీ స్పూన్ తీసుకుంటే ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. బొప్పాయి ఫలం కంటే వాటి విత్తనాలే మిక్కిలి ఔషధ విలువలు కలిగి ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. బొప్పాయి శరీరంలో రోగనిరోధక వ్యవస్థకు పెంపొందిస్తుంది. బొప్పాయి గింజల్ని మెత్తగా చేసి సలాడ్స్‌లో, పాలు, తేనె కలుపుకొని కూడా తినవచ్చు. కానీ రోజుకు ఒక టీ స్పూన్ మాత్రమే బొప్పాయి గింజల మొత్తాన్ని వాడాలి.
క్యారెట్ అద్భుతమైన స్వీట్ టేస్ట్ ను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. క్యారెట్ లో పవర్ ఫుల్ విటమిన్స్, న్యూట్రీషియన్స్, అనేకం ఉన్నాయి. అందువల్ల క్యారట్ జ్యూస్ తాగడం వల్ల మోకాలి నొప్పులు దాదాపుగా తగ్గిపోతాయి. ప్రతిరోజూ క్యారట్ రసం తాగడం లేదా క్యారట్లు తినేడం చేయాలి. క్యారట్ జ్యూస్ లో నిమ్మకాయరసం కలుపుకుని తాగితే మోకాలి నొప్పి తగ్గిపోతుంది. అలాగే కీళ్లు దృఢంగా మారుతాయి.
మెంతులు కాస్తంత చేదు కనిపిస్తాయి. అయితే వీటిలో చాలా ఔషధ గుణాలున్నాయి. ఇందులో ఉపయోగం ఉంటుంది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తప్రసారాన్ని పెంచుతాయి. మెంతులను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి, ఉదయం వాటిని నమిలి తినాలి. జాయింట్ పెయిన్ నుంచి ఉపశమనం పొందడానికి మెంతుల పేస్టును కూడా అప్లై చేసుకోవచ్చు.
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయల్లో సల్ఫర్, ఆంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంది. ఉల్లిపాయ, ఆవాలు సమ భాగాలుగా తీసుకుని బాగా నూరి కీళ్ల మీద మర్దన చేసుకుంటే వెంటనే నొప్పులు తగ్గుతాయి. ఉల్లిపాయల్లో బయోఫ్లోవానోయిడ్స్ క్వెర్సెటటిన్ ఎక్కువగా ఉంటాయి. క్వెర్సెటటిన్ హిస్టామైన్, ప్రోస్టాగ్లాండిన్స్, లుకోట్రియెన్లు వంటి తాపజనక కణాల ఉత్పత్తిని నిరోధిస్తుంది. అందువలన ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సలో ఇది బాగా ఉపయోగపడుతంది.
కొబ్బరి నూనెలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, మిరిస్టిక్, మేషిక్, వివిధ ఖనిజాలుంటాయి. కొబ్బరి నూనెను నొప్పి ఉన్న చోట స్మూత్ గా అప్లై చేయాలి. దీంతో మంచి ఉపశమనం లభిస్తుంది. కలబంద వేరా, కొబ్బరి నూనెతో కూడిన మిశ్రమాన్ని నొప్పి ఉన్న చోట మర్దన చెయ్యడం వల్ల కీళ్లలో సంభవించే వాపు తగ్గుతుంది. కొబ్బరి నూనె ఎముకలు, కీళ్ళలో ఉన్న నొప్పిని ఉపశమనానికి బాగా పని చేస్తుంది. కొబ్బరి నూనె కాస్త వేడిగా చేసి దానిని కొంచెం నొప్పి ఉన్న చోట పూస్తూ మసాజ్ చేయాలి.
కారంలో ఉండే క్రియాశీలక పదార్థాలు ఇంద్రియ నరాలను స్పర్శించడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే రక్త ప్రవాహం ఉత్తేజితం అవుతుంది. కీళ్ల కండరాలను నయం చేయడంలో సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. క్యేన్ పెప్పర్ మసాజ్ ఆయిల్ ఈ విధంగా తయారు చేసుకోవాలి. వెచ్చని ఆలివ్ నూనె లేదా బాదం నూనె కు 1/2 టీ స్పూన్ కారపు పొడిని కలపాలి. వీటిని బాగా కలపాలి. దీన్ని మోకాలిపై రాయాలి. దీంతో కాస్త బాధగా అనిపించినా కీళ్లు, కండరాలు బాగా పని చేస్తాయి.
ఈ చికిత్సల వలన కాళ్ళ లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గి, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. మంచుగడ్డ సంచిని ఒక పొడి గుడ్డలో చుట్టి 10-15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా రోజుకి రెండు నుంచి మూడు సార్లు చేయాలి. ఈ చికిత్స వలన మీరు ఏదైనా గాయం లేదా కాలి లోపల ద్రావణాలు గడ్డ కట్టిన నొప్పి నుండి కూడా విముక్తి పొందుతారు. అలాగే వేడి నీటి స్నానం చేయాలి. వేడి నీటి తొట్టిలో స్నానము చేయటం వలన అందులో ఉండే ఆవిరిలు కండరాలను సడలింప పరచి ఎముకల నొప్పిని కూడా తగ్గిస్తాయి. మోకాళ్ళ నొప్పులని తగ్గించటం అన్ని సమయాల్లో వీలు పడదు. కావున ఇందులో నైపుణ్యం పొందిన వారి సలహాలను తీసుకోవటం చాలా మంచిది.
మోకాళ్ల నొప్పి తలెత్తటానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఆ భాగానికి రక్తసరఫరా తగ్గటం. ఇలాంటి సమస్యలను తేలికైన వ్యాయామాలతో తగ్గించుకోవచ్చు.
ముందుగా కుర్చీలో కూచొని నెమ్మదిగా పైకి లేవాలి. 3-4 సెకన్ల సేపు అలాగే ఉండి తిరిగి నెమ్మదిగా కూచోవాలి. ఈ సమయంలో చేత్తో కుర్చీని పట్టుకోకూడదు. అలాగే మోకాళ్లు శరీరానికి మరీ పక్కలకు విస్తరించకుండా చూసుకోవాలి. అలాగే తేలికైన బస్కీలు తీయాలి. కుర్చీ వెనకాల నిలబడి, రెండు చేతులతో కుర్చీని పట్టుకోవాలి. నెమ్మదిగా కూచునే ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో కిందికి చూసినప్పుడు పాదాల వేళ్లు కనబడనంతవరకు మోకాళ్లు వంగాలి. తర్వాత నెమ్మదిగా పైకి లేవాలి. దీన్ని 8-10 సార్లు చేయాలి. మోకాళ్లు వంచటం వంటివి చేయాలి. ముందుగా చాప మీద వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్లను పైకి లేపుతూ పాదాలను పిరుదుల వద్దకు తెచ్చుకోవాలి. చేతులను రెండు పక్కలా చాపకు ఆనించాలి. తర్వాత కాళ్లను ఎడమపక్కకు వంచాలి. ఈ సమయంలో నడుం మెలి తిరిగినట్టు అవుతుంది. 4-5 సెకండ్ల పాటు అలాగే ఉండి, కాళ్లను మధ్యలోకి తేవాలి. అనంతరం కుడిపక్కకు కాళ్లను వంచాలి. ఇది మోకీళ్ల పక్క కండరాలు సాగటానికి, అవి బలోపేతం కావటానికి తోడ్పడతుంది. ఇలా పలు వ్యాయామాలు చేయడం ద్వారా మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
కొన్ని యోగాసానాల ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. ఉత్థాన పాదాసనం (గోడ దన్నుతో) గోడకు దగ్గరగా పడుకోవాలి. రెండు కాళ్లూ గోడకి ఆనించాలి. రెండు చేతులూ పక్కన ఉంచుకోవాలి. కళ్లు మూసుకుని శ్వాస మామూలుగా తీసుకుని వదులుతూ ఉండాలి. అలా పడుకున్న తర్వాత కాలిబొటనవేలి నుంచి మొదలుపెట్టి తలవరకూ ప్రాణశక్తి ప్రసరణ జరుగుతున్నట్టుగా వూహించుకోవాలి. నొప్పి ఉన్న ప్రాంతాల్లో ఉపశమనం అందుతున్నట్టుగా అనుకోవాలి.
అలాగే గరుడాసనం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఒక కుర్చీలో కూర్చుని.. ఒక కాలిమీద కాలు వేసుకుని ఒక మోకాలిమీద మరో మోకాలు వచ్చేట్టుగా కూర్చోవాలి. కుడికాలిని పైన ఉంచి ఎడమకాలి పిక్కల దగ్గరకు తీసుకువచ్చి తాకించాలి. కుడిచేతిమీద నుంచి ఎడమ చేతిని ఉంచి మెలితిప్పాలి. కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. పదిసెకన్ల నుంచి అరనిమషం వరకూ ఈ ఆసనంలో ఉండాలి. ఇదే విధంగా ఎడమకాలిని పైకి పెట్టి చేయాలి.
ఇలా మార్చి మార్చి మూడు సార్లు చేయాలి. అలాగే శవాసనం బాగా ఉపయోగపడుతుంది.
దాల్చిన చెక్క, ఫైనాపిల్, ఓట్స్ తదితర వాటితో తయారు చేసుకునే స్మూతీని తాగడం ద్వారా మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. మరి ఈ స్మూతీ తయారు చేసుకునే విధానం ఏమిటో చూద్దామా.
కావలసినవి:
1 కప్ (250 మి.లీ.ల )నీరు
దాల్చిన చెక్క (7గ్రా)
2 కప్స్ ముక్కలు పైనాపిల్స్
1 కప్ వోట్ మీల్
1 కప్ నారింజ రసం
2 ½ టేబుల్ స్పూన్లు బాదం, చూర్ణం
2 ½ టేబుల్ స్పూన్ల తేనె
తయారీ:
మొదటి వోట్ మీల్ సిద్ధం చేసుకోవాలి. పైనాపిల్ జ్యూస్ తీసుకోవాలి. నారింజ రసం, దాల్చినచెక్క, తేనె, వీలైతే బాదం పప్పులను కలిసి మిశ్రమంగా చేసుకోండి. వోట్ బీల్ పైనాపిల్ జ్యూస్ వేసి మళ్లీ మిశ్రమం చేయండి. తర్వాత అన్నీ కలిసి ఒక స్మూతీ తయారు చేసుకోండి.
1 కామెంట్:
డాక్టర్ గారూ,నా పేరు పద్మలత. నాకు histerectomy తర్వాత, మోకాళ్ళ నొప్పులు, పై పొట్ట (పొత్తి కడుపు కాదు) వచ్చింది.నొప్పుల వలన చాలా exercises చేయలేను. పొట్ట తగ్గేందుకు, ఏదయినా ఆహారం లో మార్పు చేయగలను.దయచేసి చెప్పగలరు. నాకు 55 years. బరువు 70kgs. Height 4.10.
కామెంట్‌ను పోస్ట్ చేయండి