*మధుమేహం అవగాహనే కోసం నవీన్ నడిమింటి సలహా*
ఇదీ ఆపద!
ఒకప్పుడు మధుమేహం మన దేశంలో చాప కింద నీరులా విస్తరించిపోతోందని చెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడు దాని విస్తరణా, విస్తృతీ ఏ తీరులో ఉందో అధ్యయనాల మీద అధ్యయనాలు బయటపెడుతున్న కొద్దీ.. మనం ఎంతటి ఆందోళనకర స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది.
మధుమేహం (షుగర్) తో బాధపడేవారు ఉదయం పరగడుపున గుప్పెడు లేత వేపాకులను నీటిలో మరిగించి కషాయంలా తీసుకొంటే షుగర్ నియంత్రణలో ఉంటుంది. చర్మం పై పుండ్లు , ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది.ఇంకా వివరాలు కు లింక్స్ లో చదవండి 👇
మధుమేహం (షుగర్)qrr1 రోగులు కనీసం 20 నుండి 30 నిముషాలు ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చేసుకోవాలి
1) ఆహారాన్ని సమయానికి తీసుకొంటూ , ఆహారంలో పచ్చని కూరగాయలు , ఆకుకూరలు , నిమ్మజాతి పండ్లు ఉండేలా చూసుకోవాలి.
2) రైస్ తగ్గించి , గోధుమ లేదా జొన్న రొట్టెలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
3) ముఖ్యంగా ఆపిల్స్ , నారింజ , బెర్రీస్ , బత్తాయి , కమలా పండ్లు , నేరేడు పండ్లు , ఉసిరి కాయలు , తరచుగా తీసుకొంటూ ఉండాలి.
4) మనసు ప్రశాంతంగా ఉండడానికి యోగా చేసుకోవాలి.
5).నేరేడు గింజల పొడి , పొడపత్రి ఆకు పొడి, కాకరాకు పొడి సమంగా కలిపి నీటితో నూరి శనగ గింజలంత మాత్రలు చేసి నీడలో గాలికి ఆరబెట్టి పూటకు రెండు మాత్రలు మంచినీటితో ఆహారానికి పావుగంట ముందు వేసుకుంటూ ఉంటే క్రమంగా మదుమేహం హరించి పొతుంది .
6).గంటలకొద్దీ కూర్చుంటే మధుమేహం
మీకు వ్యాయామం చేసే అలవాటు ఉన్నా సరే.. గంటలకొద్దీ కూర్చుని ఉండిపోతే టైప్-2 మధుమేహం ముప్పు పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కంప్యూటర్‌పై పనిచేయడం, కుర్చీలో విశ్రాంతి తీసుకోవడం వంటి.. కదలికల్లేకుండా కూర్చునే ప్రతి అదనపు గంటతో మధుమేహం ముప్పు 22 శాతం దాకా పెరుగుతుందని చెబుతున్నారు. మధుమేహం లేనివారితో పోలిస్తే.. మధుమేహం బాధితులు రోజుకు 26 నిమిషాలు అధికంగా కూర్చుని ఉంటున్నట్లు తమ అధ్యయనంలో గుర్తించామని నెదర్లాండ్స్ పరిశోధకులు జులియానే వాండర్‌బెర్గ్ పేర్కొన్నారు. అయితే.. కూర్చోవడం వల్లే మధుమేహం వస్తుందనేది రుజువు కాలేదనీ, రెండింటి మధ్య సంబంధం ఉందని వివరించారు. శారీరక శ్రమలేని అలవాటుతో టైప్-2 మధుమేహం పెరుగుతుందనే అంశం ఇంకా తేలలేదన్నారు.
7).నిత్యం ఫైబర్ తీసుకోవండ వలన మధుమేహం, క్యాన్సర్, గుండెకు సంబంధించిన జబ్బులు దరిచేరవు. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో ఉన్న షుగర్ లెవల్స్ కంట్రోచేయడానికి, చెక్కర స్థాయిని నియంత్రించడానికి చాలా సహాయపడుతుంది. ఫైబర్ ఆహారం తసుకోవడం వల్ల రక్తంలో ఉన్న షుగర్ ను గ్రహించి క్లోమ గ్రంథి ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధమై మధుమేహం నియంత్రణ అవుతుంది. మొలకెత్తిన గింజలు, ఓట్స్, పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, వేరుశనగ పప్పులు, రాగి, బాదం వంటి వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని రోజూ పరిమితంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. మధుమేహం, ఊబకాయం దరిచేరవు.
8).మధుమేహ బాధితులు..
మధుమేహం తెచ్చే తిప్పలేమిటి?
ఎప్పుడెప్పుడు ఏయే పరీక్షలు?
1)ప్రతినెలా
i]బరువు: బరువు, ఎత్తుల నిష్పత్తి (బీఎంఐ) 22లోపు ఉండాలి. దీన్ని తెలుసుకునేందుకు ఎత్తును (మీటర్లలో) ఎత్తుతో హెచ్చించి, బరువును ఆ వచ్చిన దానితో భాగహారించాలి.
ii]రక్తపోటు: 120/80 ఉండాలి.
iii]రక్తంలో గ్లూకోజు:
a]పరగడుపున 125 మిల్లీగ్రాముల లోపు ఉండాలి. (110-125 మధ్య ఉంటే మధుమేహం వచ్చే అవకాశం ఉందని గుర్తించాలి. ఈ స్థితిని 'ఐఎఫ్‌జీ'అంటారు.)
b]ఆహారం తీసుకున్న తర్వాత 2 గంటలకు: 200 మిల్లీగ్రాముల లోపు ఉండాలి.
(140-200 మధ్యఉంటే మధుమేహం వచ్చే అవకాశం ఉందని గుర్తించాలి. ఈ స్థితిని 'ఐజీటీ' అంటారు.)
2)మూడునెలలకోసారి
రక్తంలో గ్లయికాసిలేటెడ్ హీమోగ్లోబిన్ (ఎ1సి) పరీక్ష: ఫలితం 7 శాతం లోపు ఉండాలి.
3)ఆరునెలలకోసారి
రక్తంలో కొలెస్ట్రాల్: 250 మిల్లీగ్రాములు దాటకూడదు. 200 ఉంటే ఇంకా మంచిది.
ట్రైగ్లిజరైడ్స్: 150 మిల్లీగ్రాములు దాటకూడదు. 100 ఉంటే ఇంకా మంచిది.
హెచ్‌డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్: 35 మిల్లీగ్రాములకంటే ఎక్కువగా ఉండాలి. 45కు దగ్గరగా ఉంటే మంచిది.
మూత్రంలో మైక్రోఆల్బుమిన్: 20 మైక్రోగ్రాములకంటే తక్కువ ఉండాలి.
4)సంవత్సరానికోసారి
i]గుండె పనితీరును తెలుసుకోవటానికి ఈసీజీ
ii]వూపిరితిత్తుల పరిస్థితిని తెలుసుకోవటానికి ఛాతీ ఎక్స్‌రే
iii]కంటిలో ఫండస్ పరీక్ష.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి