9, మార్చి 2020, సోమవారం

గురక నివారణ ఆయుర్వేదం లో పరిష్కారం మార్గం


గురక నివారణలో ఆయుర్వేదం పరిష్కారం మార్గం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

గురక నివారణలో ఆయుర్వేదం
స్థూలకాయం గురకకు ఒక ప్రధాన కారణం. కొవ్వు వలన శ్వాస మార్గాలు ఇరుకుగా మారి సమస్య తలెత్తుతుంది. పైగా స్థూలకాయం గలవారిలో కఫము కూడా ఎక్కువగాతయారౌతుంది. కఫము వలన గురక ఉద్రత పెరుగుతుంది. చిన్నపిల్లల్లో ఒక వేళా సమస్య కనిపిస్తుంటే టాన్సిల్స్, ఎడినోయిడ్స్, పాలిప్స్ వంటివి పెరగటం వలన ఈ కారణం ఏర్పడవచ్చు.
మద్యపానం, ధూమపానం చేసే వారిలో గురక సమస్య తలెత్తుతుంది. పెరుగు, అరటిపండ్లు, స్వీట్లు వంటి కఫము పెంచే ఆహారాల వలన కూడా గురక వచ్చే అవకాశం ఉంటుంది.
జాగ్రత్తలు
1 .అధికంగా బరువు ఉండేవాళ్ళు, బరువు తగ్గటానికి ప్రయత్నించాలి.
2 .స్వీట్లు, నూనెలు, క్రొవ్వు పదార్థాలు తగ్గించాలి.
3 .ప్రతినిత్యం వ్యాయామం చేయాలి.
4 .ప్రాణాయామం గురకకు ఒక మంచి ఔషధం వంటిది.
5 .నిద్రపోయేటప్పుడు పక్కకు తిరిగి పడుకోవటం అలవాటు చేసుకోవాలి.
6 .ఎక్కువసేపు నిద్రపోవాలి.
7 .దిండు ఉపయోగించకుండా కానిలేక రెండు, మూడు దిండ్లు ఉపయోగించి కాని      పడుకుంటే ఈ సమస్య కొంతవరకు తీరవచ్చు.
చికిత్సలు

1 .నీటి ఆవిరితో యూకలిఫ్టస్ తైలాన్ని వేసి ఆవిరి పడితే శ్వాస మార్గాలు విచ్చుకుంటాయి.
2 . మిరియాలు, లవంగాలు, ఏలక్కాయలు, అల్లం ఇవన్నీ కఫాన్ని తద్వారా గురకను తగ్గిస్తాయి. కావున ఆహారంలో వీటిని అధికంగా ఉపయోగించాలి.
3 .కాఫేనర్తరీ రస మాత్రలు రెండు చప్పున ఉదయం-సాయంత్రం తీసుకోవడం.
4 .మరీచ్యాది వాటి, రెండు మాత్రలు రోజుకు రెండు సార్లు తీసుకోవచ్చును.
5 .లవంగాది వటిమాత్రలు, నవకగుగ్గులు, మేధోహర విదంగాదీ లోహం వంటి ఔషదాలు గురక సమస్యను తగ్గిస్తాయి. 

కామెంట్‌లు లేవు: