17, మార్చి 2020, మంగళవారం

ఫాస్ట్ గా పొట్ట తగ్గాలి అంటే ఆసనాలు


యోగ లో 28 రోజులు ఈ ఒక్క ఎక్స‌ర్‌సైజ్ చేస్తే.. పొట్ట త‌గ్గ‌డం ఖాయం..! అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 



ఉండాల్సిన దాని క‌న్నా మ‌న శ‌రీరం అధిక బ‌రువు ఉంటే అప్పుడు ఎన్ని ఇబ్బందులు మ‌న‌కు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దీనికి తోడుగా ఇక పొట్ట ఎక్కువ‌గా ఉంటే అప్పుడు ఇంకా స‌మ‌స్య ఎదుర‌వుతుంది. అయితే కింద సూచించిన విధంగా ఓ సింపుల్ ఎక్స‌ర్‌సైజ్‌ను రోజూ 4 నిమిషాల పాటు చేస్తే చాలు. 28 రోజుల్లోనే మీ శ‌రీరంలో అధికంగా ఉన్న‌ కొవ్వు క‌రిగిపోతుంది. అంతేకాదు పొట్ట కూడా త‌గ్గుతుంది.


ఎలా చేయాలంటే..?


చిత్రంలో చూపిన విధంగా నేల‌పై బోర్లా ప‌డుకుని మోచేతుల‌ను, కాలి వేళ్ల‌ను ఆధారంగా చేసుకుని శ‌రీరం మొత్తాన్ని పైకి లేపాలి. ఈ భంగిమ‌లో వీలైనంత సేపు ఉండాలి. దీంతో పొట్ట‌, ఛాతీ కండ‌రాలు, భుజాల‌పై అధికంగా ఒత్తిడి ప‌డుతుంది. ఇది ఆయా భాగాల్లో ఉండే కొవ్వును క‌రిగించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ వ్యాయామాన్ని 'ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ (Plank Exercise)' అంటారు. దీన్ని నిత్యం కింద సూచించిన విధంగా చేస్తే కేవ‌లం 28 రోజుల్లోనే పొట్ట త‌గ్గుతుంది.

కింద తెలిపిన‌ టైం ప్ర‌కారం పైన చెప్పిన వ్యాయామాన్ని రోజూ చేయాలి..!
1వ రోజు – 20 సెకండ్లు
2వ రోజు – 20 సెకండ్లు
3వ రోజు – 30 సెకండ్లు
4వ రోజు – 30 సెకండ్లు
5వ రోజు – 40 సెకండ్లు
6వ రోజు – రెస్ట్
7వ రోజు – 45 సెకండ్లు
8వ రోజు – 45 సెకండ్లు
9వ రోజు – 60 సెకండ్లు
10వ రోజు – 60 సెకండ్లు
11వ రోజు – సెకండ్లు
12వ రోజు – 90 సెకండ్లు
13వ రోజు – రెస్ట్
14వ రోజు – 90 సెకండ్లు
15వ రోజు – 90 సెకండ్లు
16వ రోజు – 120 సెకండ్లు
17వ రోజు – 120 సెకండ్లు
18వ రోజు – 150 సెకండ్లు
19వ రోజు – రెస్ట్
20వ రోజు – 150 సెకండ్లు
21వ రోజు – 150 సెకండ్లు
22వ రోజు – 180 సెకండ్లు
23వ రోజు – 180 సెకండ్లు
24వ రోజు – 210 సెకండ్లు
25వ రోజు – రెస్ట్
26వ రోజు – 210 సెకండ్లు
27వ రోజు – 240 సెకండ్లు
28వ రోజు – 240 సెకండ్లు ఆపైన మీ ఇష్టం


అలవాట్లు మార్చుకుంటే మీ ఆరోగ్యం బాగుంది .. 

        అదుపులేని ఆహారపు అలవాట్లు, వేళకు 
తినకపోవడం, కనీస వ్యాయామం లేకపోవడం.. నూటికి తొంభై శాతం జబ్బులకు ఇదే కారణం. వాటిలో మార్పు తేగలిగితే అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘవ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. తద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చని జాతీయ పోషకాహార సంస్థ (National Institute of Nutrition - NIN ) చెబుతోంది.

ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..
* ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాములు ఉప్పు మాత్రమే వాడాలి. 
* ఒక వ్యక్తి రోజుకు 20 గ్రాములకు మించి వంట నూనె వాడకూడదు. అదీ నెలంతా ఒకే రకం నూనెను వాడకుండా రెండు మూడు రకాల నూనెలను వాడాలి. 
* రోజుకు 400 గ్రాముల కూరగాయలు తీసుకోవాలి. అందులో 250 గ్రాముల కూరగాయలు, 150గ్రాముల పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. 
* రోజూ కనీసం అరగంట నుంచి గంటపాటు ఏదో ఒక వ్యాయామం చేయాలి. 
పైన సూచించిన విధంగా రోజూ ఆయా స‌మయాన్ని అనుస‌రించి ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ చేస్తే ఫ‌లితం ఉంటుంది. త్వ‌ర‌గా పొట్ట త‌గ్గుతుంది.

కామెంట్‌లు లేవు: