1, మార్చి 2020, ఆదివారం

లో బీపీ నివారణ పరిష్కారం మార్గం


అల్ప రక్త పోటు యొక్క రకాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు  - Types of Low Blood pressure 

అల్ప రక్తపోటు లేదా హైపోటెన్షన్ లో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఇక్కడ వివరిస్తున్నాం.  

  • అంగస్థితికి సంబంధించిన లో బీపీ (Postural or Orthostatic Hypotension)
    తక్కువ రక్తపోటు రకాల్లో అంగస్థితికి సంబంధించిన లో బీపీ (లేదా ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్) ఒకటి.  ఒక వ్యక్తి తన శరీర భంగిమను ఆకస్మికంగా మార్చినప్పుడు అంటే ఉదాహరణకు పడుకున్న వ్యక్తి సడన్ గా అతి వేగంగా పైకి లేచినపుడు రక్తపోటు గణనీయంగా పడిపోతుంది. ఇది ఒక సాధారణ దృగ్విషయం. నిలబడినపుడు కొలిస్తే వచ్చే రక్తపోటు ప్రమాణం, పడుకున్నప్పుడు కొలిచినపుడు నమోదయ్యే రక్తపోటు కంటే కాస్త తక్కువగా ఉంటుంది. దీన్నే ‘అంగస్థితికి సంబంధించిన లో బీపీ’, ‘భంగిమ లో బీపీ’  లేదా ‘ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్’ అని పిలుస్తారు. ఇది మైకము కమ్మడానికి కారణమవుతుంది. ఇది సాధారణ వ్యత్యాసం, మరి దీనికి సాధారణంగా ఏ చికిత్స అవసరం లేదు.
     
  • భోజనానంతర దశలో బీపీ (Post-prandial Hypotension)
    పోస్ట్-ప్రాండియల్ హైపోటెన్షన్ అనేది భోజనం చేసిన తర్వాత వెంటనే రక్తపోటు (బ్లడ్ ప్రెషర్)  గణనీయంగా పడిపోతుంది. ఇలాంటి స్థితి సాధారణంగా వయసు పైబడ్డ వారిలో, అందులోను హైపర్ టెన్షన్, డయాబెటిస్పార్కిన్సన్, క్షయరోగం వంటి జబ్బులున్న వారికి సంభవిస్తుంది. భోజనం తర్వాత, కడుపులోని ప్రేగులలో జరిగే ఉత్తమ జీర్ణక్రియకు  మరియు తీసుకున్న ఆహారంలోని పోషకాల శోషణకు మరింత రక్త ప్రవాహం అవసరం. రక్త ఒత్తిడిని తగ్గించదానికి దోహదపడే డిమాండ్ మరియు యంత్రాంగాన్ని  మన శరీరం ఒక్కోసారి సమర్థంగా నిర్వహించలేకపోవటం వలన రక్తపోటు తగ్గుతుంది. దీన్ని ఒక సమస్యాత్మక పరిస్థితిగానే చెప్పవచ్చు మరియు దీన్ని అశ్రద్ధ చేయకుండా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది తేలికపాటి మైకం కమ్మడానికి  కారణమవుతుంది, అటుపై కింద పడటం జరిగి కొన్నిసార్లు తీవ్రమైన గాయాలు ఏర్పడతాయి. తక్కువ రక్తపోటు యొక్క చికిత్స సాపేక్షకంగా సులభం మరియు అందుగ్గాను రోగి భోజనంలో మరియు అతని/ఆమె భోజనానంతర కార్యకలాపాలలో మార్పు అవసరం.
     
  • నాడీసంబంధమైన అల్ప రక్తపోటు (Neurally Mediated Hypotension)
    నాడీ మధ్యవర్తిత్వ అల్పరక్తపోటును (హైపోటెన్షన్) నాడీ వ్యవస్థాపక సమన్వయము లేదా ‘వాసోవాగల్ మూర్ఛ’ అని కూడా అంటారు. ఇది భౌతిక (వేడి వాతావరణం, తీవ్రమైన వ్యాయామాలు) లేదా మానసిక ఒత్తిడి (ఆత్రుతగా ఉండటం, అరుదైన రక్తస్రావం వంటి భీకరమైన లేదా భయంకర  సన్నివేశాన్ని చూసినా) తో కూడిన పరిస్థితిలో దాపురిస్తుంది. గుండె మరియు మెదడు మధ్య జరిగే ప్రతిచర్యల అసమతుల్యత కారణంగా మరియు రక్తపోటు ఆకస్మికంగా తగ్గిపోతుంది. ఇది మళ్ళీ తీవ్రమైనదిగా పరిగణించాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఇలాంటప్పుడు, వికారం, వాంతి వచ్చేటట్టు వుండడము, మైకం కమ్మడం వంటివి వచ్చి  మనిషి మెలికలు తిరిగి కూలిపోవటం తద్వారా తీవ్ర గాయాలు ఏర్పడడం జరుగుతుంది. దీనికి చికిత్స చాలా సులభం, మరియు జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో  సరిపోతుంది.
     
  • తీవ్రమైన అల్ప రక్తపోటు (Severe Hypotension)
    తీవ్రమైన లో బీపీ ఎపుడొస్తుందంటే 90/60 mm ప్రమాణం కంటే తక్కువకు రక్త పీడనం పడిపోయినపుడు. ఇలాంటప్పుడు మెదడుకు జరిగే రక్త ప్రసరణ తక్కువైపోతుంది మరియు ఇది ప్రాణాంతకమవుతుంది. తీవ్రమైన అల్ప రక్తపోటు సాధారణంగా మనిషి షాక్ తిన్నపుడు జరుగుతుంది, అధిక రక్తనష్టం (గాయం తర్వాత), కాలిన గాయాలు లేదా తీవ్రమైన నిర్జలీకరణం కారణంగా ఇది ఏర్పడుతుంది. ఇది మరింత అధ్వాన్నంగా మారి ప్రాణానికే అపాయం కలిగే ప్రమాదం ఉన్నందున దీనికి తక్షణ చికిత్స అవసరం.(మరింత సమాచారం: అనఫీలాక్టిక్ షాక్)

అల్ప రక్త పోటు యొక్క లక్షణాలు 

సాధారణంగా చాలామందిలో రక్తపోటు ఒకింత తగ్గినా అది తాత్కాలికమే, మహా అయితే కొంచం మైకము కమ్ముతుంది అంతే, మరెలాంటి లక్షణాలు పొడజూపవు. అయినప్పటికీ, తరచుగా రక్తపోటు పడిపోవడం లేదా ఇందుకు సంబంధించి తీవ్రమైన సంకేతాలు మరియు లక్షణాలు కనబడినపుడు తీవ్ర ఆందోళన చెందాల్సిన పరిస్థితి. తక్కువ రక్తపోటు లక్షణాలు మరియు సంకేతాలు:

  • మైకము కమ్మడం (తలతిప్పడము-కండ్లు తిరగడము).
  • దృష్టిలో అస్పష్టత.
  • అలసట.
  • అస్థిరత (Unsteadiness).
  • బలహీనత.
  • చల్లని మరియు బంకగా ఉండే చర్మం.
  • మూర్ఛ వంటివి ఉంటాయి.

మనిషిలో రక్తపోటు విపరీతంగా తగ్గిపోతున్నట్లయితే, అది ఒక ప్రాణాంతక పరిస్థితికి కారణమవుతుంది, ఇది షాక్ లాంటి పరిస్థితిని సూచిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో, సంకేతాలు మరియు లక్షణాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి మరియు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాంటి తీవ్ర లో బీపీ  లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • గందరగోళం (పెద్దవారిలో ఈ గందరగోళ పరిస్థితి మరింత తీవ్రంగా ఉండొచ్చు.)
  • శ్వాస వేగంగా మరియు నిస్సారంగా మారుతుంది. (మరింత సమాచారం: శ్వాస ఆడకపోవడం)
  • నాడి (పల్స్) బలహీనంగా, వేగంగా కొట్టుకోవడం జరగొచ్చు.
  • చర్మం పాలిపోవడం, చల్లబడిపోవడం, చర్మంపై బంక లేదా జిగట బట్టినట్లు తయారవడం జరుగుతుంది.

షాక్ అనేది అత్యవసర చికిత్స అవసరమయ్యే ప్రమాదకర పరిస్థితి.

అల్ప రక్త పోటు యొక్క కారణాలు 

కారణాలు

దాదాపుగా మనలో అందరికీ జీవితంలో ఏదో ఒక సమయంలో రక్తపోటు పడిపోవడం అనేది జరుగుతుంటుంది, అయితే ఇది సాధారణంగా గుర్తించబడదు. అయితే, ఇలాంటి లక్షణాలు సుదీర్ఘమైనప్పుడు లేదా మళ్లీ మళ్ళీ కనిపించేటప్పుడు, దానికి గల కారణాన్ని గుర్తించడం అత్యవసరం. కొన్ని పరిస్థితులు సుదీర్ఘమైన అల్పరక్తపోటుకు (హైపోటెన్షన్కు) కారణం కావచ్చు మరియు చికిత్స చేయకపోతే ఇది ప్రమాదకరమైనదిగా మారుతుంది.  

తక్కువ రక్తపోటుకు కారణాలు:

వైద్య పరిస్థితులు (Medical Conditions)

అల్ప రక్తపోటుకు కారణమయ్యే అనేక వైద్యపరమైన పరిస్థితులు ఉన్నాయి. అవి ఏవంటే:

  • గర్భధారణ (Pregnancy)
    గర్భధారణ సమయంలో, రక్త ప్రసరణ వ్యవస్థ విస్తరిస్తుంది (పెరుగుతున్న బిడ్డకు కూడా రక్తం సరఫరా చేయబడుతుంది), తద్వారా ఇది రక్త పోటు పడిపోవడానికి దారి తీస్తుంది. దాదాపు అందరు తల్లులకు ఇది సాధారణమైనది, మరియు రక్తపోటు స్థాయిలు డెలివరీ తర్వాత మళ్ళీ సాధారణ (ప్రీ-గర్భధారణ స్థాయిలు) స్థితికి చేరుకుంటాయి.
  • నిర్జలీకరణము (Dehydration)
    శరీరం అధికంగా నీటిని కోల్పోయినప్పుడు, మొత్తం రక్త ప్రసరణలో రక్తం తగ్గిపోతుంది, ఈ పరిస్థితి రక్తపోటు తగ్గిపోవడానికి దారి తీస్తుంది. శరీరం అధికంగా నీటిని కోల్పోయినప్పుడు ఏర్పడే లో బీపీ, మైకము, అధిక దాహం, మరియు బలహీనతను కలిగిస్తుంది. వాంతి, భేదులుజ్వరం మరియు కఠినమైన వ్యాయామాలు చేసినపుడు శరీరంలో నిర్జలీకరణాన్ని (శరీరం అధికంగా నీటిని కోల్పోవడం)  కలిగిస్తాయి.
  • రక్త నష్టం (Blood loss) 
    పెద్దగా గాయం అయినపుడు కలిగే రక్తస్రావం కారణంగా రక్త ప్రసారంలో రక్త ప్రమాణం తగ్గిపోతుంది మరియు ఇది అల్ప రక్తపోటుకు దారి తీస్తుంది.
  • రక్త సంక్రమణం​ (Sepsis)
    రక్తంలోకి ప్రవేశించే తీవ్ర అంటువ్యాధి ఉన్నప్పుడు, శరీరంలో రక్తపోటు పడిపోతుంది, ఇది ప్రాణాంతకమవుతుంది. ఇలాంటి స్థితిని ‘సెప్టిక్ షాక్’ గా పిలువబడుతుంది.
  • గుండె సమస్యలు (Heart problems)
    గుండెపోటుగుండె వైఫల్యంబ్రాడీకార్డియా (తక్కువ హృదయ స్పందన రేటు) లేదా గుండె కవాట సమస్యలు వంటి కొన్ని గుండె వ్యాధులు తక్కువ రక్తపోటుకు కారణమవుతాయి. (మరింత సమాచారం: వాల్వులర్ గుండె జబ్బు)
  • అంతస్స్రావి సమస్యలు (Endocrine problems)
    థైరాయిడ్, పారాథైరాయిడ్ లేదా అడ్రినల్ (యాడిసన్ వ్యాధి) వంటి గ్రంధులకు సంబంధించిన సమస్యలు రక్తపోటును తగ్గిస్తాయి. అదనంగా, మధుమేహం లేదా హైపోగ్లైసిమియా (రక్తంలో చక్కెర స్థాయి తక్కువవడం), అల్ప రక్తపోటుకు కారణమవుతాయి. (మరింత సమాచారం: థైరాయిడ్ క్యాన్సర్హైపర్ థైరాయిడ్)
  • అనాఫిలాక్సిస్ (తీవ్ర అలెర్జీ ప్రతిచర్య,Severe Allergic Reaction)
    కొన్ని ఆహారాలు, మందులు లేదా పురుగుల కాటుకు అతిశయించిన తీవ్ర అలెర్జీ ప్రతిచర్య రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడానికి కారణమవుతుంది. ఇది ప్రాణాంతక పరిస్థితిని కలిగిస్తుంది. మరియు చర్మం దద్దుర్లు , దురద, మరియు గొంతు వాపు వంటి ఇతర లక్షణాలతో సంబంధం కలిగి ఉంటుంది.(మరింత సమాచారం: ఎలర్జీ
  • పోషక లోపాలు (Nutritional deficiencies)
    విటమిన్ బి 12 (మెథిల్కోబామాలిన్), ఫోలిక్ యాసిడ్ వంటి కొన్ని పోషకాలు, రక్తహీనత (మెగాలోబ్లాస్టిక్ అనీమియా)ను కల్గిస్తాయి. ఇది కూడా రక్తపోటును తగ్గిస్తుంది.

శస్త్రచికిత్స దశ పరిస్థితులు (Surgical Conditions)  

ఏదైనా శస్త్రచికిత్స తరువాత, ఇది ఒక చిన్న సాధారణ ప్రక్రియ అయినా, రక్తపోటు తగ్గిపొయ్యే ప్రమాదం ఉంది.

  • మత్తుమందు లేదా అనస్థీషియా (Anaesthesia) 
    శస్త్రచికిత్స సమయంలో రోగిని నిద్రపుచ్చేటందుకు మత్తు ఔషధాలను వాడతారు, ఇలాంటి మత్తు మందులు రక్తపోటును తగ్గించేవిగా ప్రతీతి పొందాయి. కొందరు రోగులలో, అనస్థీషియా/మత్తుమందు రక్తపోటును  తీవ్రంగా తగ్గించడానికి కారణమవుతాయి.
  • పూతిక లేదా రక్తగతవిష దోషము (Sepsis)
    వైద్య అనారోగ్యం మాదిరిగానే, రక్తంలో విషదోషం (సెప్సిస్) శస్త్రచికిత్స తర్వాత కనిపిస్తుంది. ఈ సందర్భంలో, రక్తగతవిషదోషం (సెప్టిక్ షాక్) కారణంగా అల్ప రక్తపోటు ప్రాణాంతకమవుతుంది.
  • శరీరంలో రక్తం లేదా ద్రవ నష్టం (Hypovolemic Shock)
    భారీ శస్త్రచికిత్సల సమయంలో శరీరంలో ‘హైపోవోలమిక్ షాక్’ సాధారణంగా సంభవిస్తుంది. ఇక్కడ భారీ రక్త నష్టం లేదా ద్రవం నష్టం కలుగుతుంది. ఈ రక్త-ద్రవ నష్టం 20 శాతం ఉంటుంది. ఇలా 20 శాతం ద్రవ/రక్త నష్టం రక్త ప్రసరణలో కలిగినపుడు రక్తపోటు స్థాయిలు తగ్గిపోతాయి. ఇది ప్రాణాంతక పరిస్థితి.

మందులు (Medications)

కొన్ని మందులసేవనం  రక్తపోటు పడిపోవడానికి కారణమవుతాయని తెలియవచ్చింది.  

  • మూత్రవిసర్జనప్రేరేపక మందులు (furosemide, hydrochlorothiazide) 
    మూత్రవిసర్జనను పెంచే మందులు తేలికపాటి నిర్జలీకరణాన్ని కలిగిస్తాయి మరియు రక్తపోటును కూడా పడగొట్టి ‘లో బీపీ’ కి కారణమవుతాయి. ఈ మందులు అధిక రక్తపోటుకు చికిత్సనందించేందుకు ఉపయోగిస్తారు; కాబట్టి, ఈ మందుల్ని అధిక మోతాదులో (సిఫారసు చేసిందానికంటే) లేదా అధికంగా తీసుకున్నట్లయితే, రక్తపోటు పడిపోవడం జరుగుతుంది.
  • ఆల్ఫా-బ్లాకర్స్ (prazosin)
    ఆల్ఫా-బ్లాకర్ మందులు కూడా రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగించేవే. సాధారణంగా, ఈ ఔషధాలు గుండె కొట్టుకొనే (హృదయ స్పందన) వేగాన్ని తగ్గిస్తాయి, తద్వారా రక్తపోటులో  పీడనం తగ్గిపోయి, లో బీపీని కల్గిస్తాయి.
  • బీటా-బ్లాకర్స్ (atenolol, propranolol)
    ఇవి కూడా ‘యాంటీ-హైపర్ టెన్సివ్ మందులే,  మరి వీటిని అధికంగా గాని లేక అధిక మోతాదులో తీసుకున్నప్పుడు, రక్తపోటు పడిపోవడం జరుగుతుంది.
  • యాంటీ-పార్కిన్సన్ మందులు (pramipexole)
    లెవోడోపా పదార్ధం కలిగిన మందులు  గుండె యొక్క పనితీరును తగ్గించటానికి మరియు హృదయమందత (బ్రాడీకార్డియా) అంటే గుండె నెమ్మదిగా పని చేసేందుకు కారణమవుతున్నాయి, తద్వారా ఈ మందులు రక్తపోటు  పడిపోవటానికి కారణం అవుతాయి.
  • యాంటీ డిప్రెసెంట్స్ (doxepin, imipramine)
    ఈ మందులు మెదడు చర్యలను మందగింపజేస్తాయి మరియు పల్స్ రేటుతో అనుబంధమున్న శరీరభాగం యొక్క పనితీరును కూడా తగ్గిస్తాయి. అంటే  ఈ మందులు పల్స్ రేటును మందగింపజేసి రక్తపోటును తగ్గిస్తాయి.
  • అంగస్తంభన మందులు
    సిల్డానాఫిల్ లేదా తడలఫిల్ వంటి మందులు నైట్రోగ్లిజరిన్తో పాటు తీసుకున్నప్పుడు రక్తపోటు అకస్మాత్తుగా పడిపోతుంది.

ప్రమాద కారకాలు (Risk factors)

అల్పరక్తపోటు లేదా తక్కువ రక్తపోటు ఏ వయస్సువారినైనా ప్రభావితం చేయగలవు, కానీ కొన్ని రకాలైన అల్ప రక్తపోట్లు కొన్ని వయస్సులవారిలోనే  లేదా కొన్ని పరిస్థితులలోనే సాధారణంగా వస్తాయి.

  • వయసు (Age)
    అల్పరక్తపోటు ఓ నిర్దిష్ట వయస్సు గలవారి మీదనే దాడి చేస్తుంది, ఉదాహరణకు, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ లేదా పోస్ట్-ప్రాండ్యుయల్ హైపోటెన్షన్ అనేది వయసు పైబడ్డ వ్యక్తులలో (సాధారణంగా 65 ఏళ్ల కన్నా ఎక్కువ) సాధారణం, అయితే నాడీసంబంధమైన అల్ప రక్తపోటు (న్యూరలీ మీడియేటెడ్  హైపోటెన్షన్) పిల్లలు, శిశువులు, మరియు యువకులకు కూడా సోకడం సాధారణం.
  • వ్యాధులు (Diseases)
    డయాబెటీస్, గుండె-సంబంధ సమస్యలు (మిట్రాల్ స్టెనోసిస్ లేదా వాహక లోపము), పార్కిన్సన్ వ్యాధిని కలిగినవారు అల్పరక్తపోటుకు (హైపోటెన్షన్) గురయ్యే ప్రమాదముంది.
  • మందులు (Medications)
    అధిక రక్తపోటును (ఆల్ఫా-బ్లాకర్స్, డయ్యూరిటిక్స్, లేదా బీటా-బ్లాకర్స్) నియంత్రించడానికి తీసుకునే కొన్ని మందులు లో బీపీ లేదా అల్పరక్తపోటు (హైపోటెన్షన్ ) కు గురయ్యే ప్రమాదాన్ని పెంచుతాయి.

అల్ప రక్త పోటు యొక్క నివారణ 

అల్ప రక్తపోటు దీర్ఘకాలికంగా కొనసాగుతూ బాధిస్తున్నట్లైతే, జీవనశైలిలోను  మరియు ఆహారసేవనంలో స్వల్ప మార్పులు చేయడం ద్వారా ఈ లో బీపీ సమస్యను అధిగమించవచ్చు. అల్ప రక్తపోటు లేదా లో బీపీ సమస్య నుండి బయట పడేందుకు సహాయపడే జీవనశైలి మార్పులు గురించి ఇక్కడ వివరిస్తున్నాము.

  • రోజంతా తగినంతగా ద్రవపదార్థాలు తీసుకోండి. వేసవి కాలం సందర్భంగా, మూత్రం కట్టినందుకు మీరు మూత్రవర్ధక మందుల (డ్యూయరిటిక్స్) ను సేవిస్తుఉన్నా, తగినంతగా ద్రవాహారాల్ని తీసుకోవడం మూలంగా లో బీపీ లేదా హైపోటెన్షన్ను నివారించగలము.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. మీరు ఆరోగ్యంగా ఉండటాన్ని ఓ అలవాటుగా చేసుకుని నిత్యం వ్యాయామం చేస్తున్నట్లైతే అది  మీ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు అల్ప రక్తపోటును (హైపోటెన్షను) నిరోధిస్తుంది.
  • మద్య పానీయాల సేవనం మానేయండి. మద్య పానీయాల సేవనంవల్ల మీ రక్తపోటు స్థాయిలు మరింత పడిపోవచ్చు.
  • ఓ భంగిమలో పడుకున్నప్పుడు లేదా కూర్చుని ఉన్నపుడు, ప్రత్యేకించి నిద్ర నుండి లేచేటపుడు, ఆకస్మికంగా (సడెన్ గా)  పైకి లేవకండి. నెమ్మదిగా లేవండి. ఇలా సడెన్ గా శరీర భంగిమను మార్చడాన్ని నివారించండి.
  • ఆహారంలో ఉప్పును కొద్దిగా అదనంగా తీసుకోండి.
  • భోజనానంతరం వచ్చే అల్ప రక్తపోటు (లో బీపీ) నివారణకు భోజనం తర్వాత వెంటనే కనీసం 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా విశ్రాంతి తీసుకోవడం వల్ల మూర్ఛ రాకుండా నివారించుకోవచ్చు. తక్కువ పరిమాణపు బోజనాలను ఎక్కువసార్లు భోంచేయడం అలవాటు  చేసుకోండి. ఇలా చేయడం వల్ల భోజనానంతరం వచ్చే అల్ప రక్తపోటు (పోస్ట్-ప్రాండ్యుయల్ హైపోటెన్షన్)ను నివారించవచ్చు.
  • భారీ మరియు కఠినమైన వ్యాయామం మానుకోండి.
  • మీరు నిద్ర నుండి మేల్కొనే ముందు, మీరు కాలును (ముందు చీలమండలాన్ని) బాగా కదిలించండి, ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

అల్ప రక్త పోటు యొక్క వ్యాధినిర్ధారణ అవగాహనా కోసం నవీన్ సలహాలు  -

రక్తపోటును కొలిచే పరికరం ‘స్పిగ్మోమానోమీటర్’ ను ఉపయోగించి అల్ప రక్తపోటును నిర్ధారణ చేస్టారు. అయినప్పటికీ, సమస్యను పరిష్కరించడంలో ఇది సహాయపడదు. రక్తపోటులో తగ్గుదల కారణాన్ని తెలుసుకోవడమే పరిశోధనా లక్ష్యము. రక్తపోటులో తగ్గుదలను తెలుసుకోవడానికి ఇలా చెయ్యవచ్చు:

  • రక్త పరీక్షలు/Blood tests
    హెమోగ్లోబిన్ స్థాయిలు, ఎర్ర రక్త కణాల గణనలు, రక్తంలో చక్కెర స్థాయిలను మరియు విటమిన్ B12 లేదా ఫోలిక్ యాసిడ్ స్థాయిల మూల్యాంకనం చేయడం వలన అల్ప రక్తపోటు (హైపోటెన్షన్) కు గల కారణాలను   నిర్ణయించవచ్చు.
  • ECG మరియు ఎఖోకార్డియోగ్రామ్/ECG and echocardiogram
    ECG పరీక్షను, నిరంతరంగా (24 గంటలు), చేసినపుడు , హృదయ స్పందనను సూచించే గుండె యొక్క లయ అసాధారణతలను గుర్తించడానికి సహాయపడుతుంది. ఈసీజీ పరీక్షనే ‘హోల్టర్ పరీక్ష’ గా కూడా పిలుస్టారు. ప్రత్యామ్నాయంగా, ఎఖోకార్డియోగ్రఫీ పరీక్ష హృదయ కవాట లోపం లేదా హృదయ ఆకృతిలో లోపాలను కనుక్కోవటానికి సహాయపడుతుంది. పేర్కొన్న ఈ గుండె లోపాలు అల్ప రక్తపోటుకు దారితీస్తాయి. (మరింత సమాచారం: అరిధ్మియా)
  • ఒత్తిడి పరీక్ష /Stress test
    ఒత్తిడి పరీక్ష అనేది ఒక ట్రెడ్మిల్ పై మీరు నడుస్తున్నప్పుడు నమోదు చేసే ఒక ECG రకం పరీక్ష. ఈ పరీక్ష మీ గుండె ఒత్తిడికి గురైనపుడు లేదా కష్టపడి పనిచేసేటప్పుడు రక్తపోటులో తగ్గుదలను ను గుర్తించటానికి సహాయపడుతుంది.
  • టిల్ట్ టేబుల్ పరీక్ష /Tilt table test
    టిల్ట్ టేబుల్ పరీక్ష అనేది అంగస్థితికి సంబంధించిన లో బీపీ(ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ను)ని గుర్తించడంలో సహాయపడే ఓ శాస్త్రీయ పరీక్ష. ఈ పరీక్షలో నిలబడినపుడు మరియు కింద పడుకున్నప్పుడు రక్తం ఒత్తిడిని రికార్డు చేస్తుంది.
  • వల్సల్వా యుక్తి/Valsalva manoeuvre
    ఇది స్వతంత్ర నాడీ వ్యవస్థ యొక్క పనితీరును నిర్ణయించే ఒక పరీక్ష. ఇది అనేకమైన లోతైన శ్వాసల సమయంలో ఉండే రక్తపోటు మరియు హృదయ స్పందనను రికార్డింగ్ చేసే పద్ధతి. ఇది నాడీ మధ్యంతర హైపోటెన్షన్ ను అంచనా వేయడానికి సహాయపడుతుంది.

అల్ప రక్త పోటు యొక్క చికిత్స -

సాధారణంగా, అల్ప రక్తపోటు (లో బీపీ)కు చాలా అరుదుగా చికిత్స అవసరమవుతుంది. ఎందుకంటే మనిషిలో లో బీపీ గుర్తించబడదు మరియు దీనికి సంబంధించిన ఏ ప్రధాన లక్షణాలను ఇది ఉత్పత్తి చేయదు, కేవలం తేలికపాటి లక్షణాలను మాత్రం ఇది ఉత్పత్తి చేయవచ్చు. కాటట్టే లో బీపీ కి చాలా అరుదుగా చికిత్స అవసరమవుతుంది. ఏదేమైనా, లక్షణాలు నిరంతరాయంగా మరియు దానికి అంతర్లీన కారణం ఉంటే, కారణం తెలుసుకోవడం మూలాన ఈ లో బీపీ సమస్యను పరిష్కరించవచ్చు. ఏవైనా మందులసేవనం వల్ల అల్ప రక్తపోటు సంభవించినట్లయితే, అప్పుడు ఔషధాలను మార్చడం లేదా మోతాదుని మార్చడంతో ఈ లో బీపీ సమస్య నుండి బయటపడొచ్చు.  

అల్ప రక్తపోటు/హైపోటెన్షన్ కు కారణం స్పష్టంగా తెలియనపుడు తీసుకునే  చికిత్స యొక్క ఉద్దేశ్యం ఏమంటే రక్తపోటును పెంచడం మరియు దానిని నిర్వహించడం-తద్వారా, ఖచ్చితంగా లో బీపీ సంకేతాలు మరియు లక్షణాలను తగ్గించడమే. ఇక దీనికి సాధారణ మార్గదర్శకాలు ఏవంటే:

  • ఉప్పును ఎక్కువగా  తీసుకోవడం (Increase your salt intake)
    ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల  రక్తంలోని ద్రవం పరిమాణం పెరుగుతుంది మరియు తద్వారా ఒత్తిడి పెరుగుతుంది.
  • ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోండి (Have more fluids)
    నీటిని ఎక్కువగా త్రాగడంవల్ల-ఉప్పును ఎక్కువగా  తీసుకోవడంవల్ల కలిగే ఫలితాలనే ఇస్తుంది. అధిక నీటిని తీసుకోవడం మూలాన శరీరంలో ద్రవం పరిమాణాన్ని పెంచుతుంది మరియు, అల్ప రక్తపోటు క్రమంగా పెరుగుతుంది.
  • మీ డాక్టర్ సూచించిన మందులను తీసుకోండి (Take medications prescribed by your doctor)
    మీ డాక్టర్ ఫ్లడ్ర్రోకోర్టిసోనే లేదా మిడ్డోడ్రైన్ వంటి కొన్ని మందులను ఇవ్వవచ్చు, ఇవి రక్తపోటును పెంచడంలో సహాయపడవచ్చు. వీటిని సాధారణంగా అంగస్థితికి సంబంధించిన లో బీపీ (ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్) చికిత్సలో ఉపయోగిస్తారు.
  • కంప్రెషన్స్ లేదా మేజోళ్ళు ధరించాలి (Wear compressions or stockings)
    సంపీడనాలు లేదా మేజోళ్ళు వాడడం వల్ల మీ పిక్కల్ని సంకోచ స్థితిలో ఉంచవచ్చు. ఇలా సంపీడన మేజోళ్ళు వాడటం వల్ల రక్తాన్ని సంకోచ స్థితిలో గుదిగూర్చడం సాధ్యమవుతుంది. అంతే కాక ఈ కంప్రెషన్స్ (మేజోళ్ళు) రక్తం ఒకే చోట నిలిచి ఉండటాన్ని నివారిస్తుంది, తద్వారా రక్తం ఎప్పుడూ ప్రసరణలో ఉండి ఒత్తిడిని పెంచడం మరియు రక్త ప్రసరణలో పీడన స్థాయిలను పెంచడానికి తోడ్పడుతుంది.

అల్ప రక్త పోటు యొక్క చిక్కులు అవగాహనా కోసం నవీన్ సలహాలు  - Complications of Low Blood pressure 


సాధారణంగా, అల్ప రక్తపోటు (హైపోటెన్షన్) కు బాగా చికిత్స చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఉత్తమ చికిత్సకు విజయం రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. లో బీపీకి చికిత్స సులభం మరియు దీన్ని ఇంట్లో కూడా నిర్వహించు కోవచ్చు. రోగులు ఈ చికిత్స గురించి బాగా అవగాహన చేసుకుంటే అది వారి చికిత్స విజయంలో అతిపెద్ద పాత్ర పోషిస్తుంది. ఈ లో బీపీకి గురైన  చాలామంది రోగులు తమ పరిస్థితి గురించి బాగా అవగాహన చేసుకుంటారు, ఇలా రోగులు తమ పరిస్థితిని బాగా అర్థం చేసుకోవడం చికిత్సకు చాలా సహాయపడటమే కాకుండా అల్ప రక్తపోటును నిరోధించేందుకు కూడా సహాయపడుతుంది.

ఉపద్రవాలు/Complicatons

  • రక్తపోటు తేలికపాటిస్థాయి నుండి ఓ మోస్తరు స్థాయికి పడిపోయినట్లయితే, అది తల తిప్పడం లేదా కళ్ళు తిరగడం, మూర్ఛ, బలహీనత ఏర్పడ్డప్పుడు, వీటి కారణంగా రోగి కిందికి పడిపోయి గాయాలయ్యే ప్రమాదముంది. ఇలా పడిపోయినపుడు తల, మొండెం లేదా ఇతర అవయవాలైన కాళ్ళు, చేతుల అంత్య భాగాలకు దెబ్బలు తగిలి, గాయాలై  ఎముకలు విరిగే ప్రమాదముంది.
  • అల్ప రక్తపోటు చాలా తీవ్రమైనదిగా ఉన్నట్లయితే అది రోగి అతి ముఖ్యమైన అవయవాలైన మెదడు లేదా గుండెకు తగిన పీడనంతో రక్తాన్ని ప్రసరింపజేయ లేకపోవడంతో గుండెకు, మెదడుకు శాశ్వత నష్టం కలిగిస్తుంది. ఇలా జరిగినపుడు రోగికి కింది సమస్యలు సంభవిస్తాయి. అవేమంటే:
    • స్ట్రోక్ / పక్షవాతం
    • కోమా
    • పునరావృతమయ్యే మూర్ఛ/శోషలు
    • గుండె వ్యాధులు

అల్ప రక్త పోటు అంటే ఏమిటి? -

రక్తపోటు అనేది రక్త నాళాల (ధమనుల) యొక్క గోడలపై రక్తప్రసరణ   కలిగించే పీడనం. గుండె కొట్టుకునే సమయంలో ప్రసరించే రక్తం యొక్క శక్తి కారణంగా రక్త నాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. గుండె పని తీరులో రక్తాన్ని తోడేటపుడు కలిగే రక్తపీడనం  (సిస్టోలిక్ పీడనం) లేదా ఒత్తిడి ఎక్కువవుతుంది. అలాగే, గుండె రక్తం తోడడం అయ్యాక జరిగే హృదయ సడలింపు (స్వల్ప విరామం), దశలో రక్తం ఒత్తిడి (డయాస్టొలిక్ ఒత్తిడి) చాలా తక్కువగా ఉంటుంది. ‘స్పిగ్మోమానోమీటర్’ ను ఉపయోగించి రక్తపోటును  కొలుస్తారు. వయోజనుల్లో సాధారణ రక్తపోటు 120 (సిస్టోలిక్) / 80 (డయాస్టొలిక్) mm Hg గా ఉంటుంది.

అల్ప రక్తపోటును ‘హైపోటెన్షన్’ (హైపో-తక్కువ, టెన్షన్-పీడనం) అని కూడా అంటారు. రక్త పీడనం 90/60 mm కు పడిపోయినపుడు కలిగే స్థితినే “లో బీపీ” అంటారు. ఈ లో బీపీ ఎక్కువ మంది వ్యక్తులలో సర్వ సాధారణం మరియు ప్రమాదకరం కూడా కాదు. కొంత మందిలో అయితే లో బీపీ ఉన్న సంగతి అసలు గుర్తించబడదు కూడా. లో బీపీ ఉన్న కొంతమందిలో కొంచెం మైకము కమ్మడం  లేదా మూర్ఛ రావడం సంభవించవచ్చు, కానీ తీవ్రంగా ఉంటే, అది ప్రాణాంతక పరిస్థితిని సృష్టించవచ్చు.

నిర్జలీకరణం (డీ-హైడ్రేషన్), తీవ్రమైన శస్త్రచికిత్స తరువాత తలెత్తే వైద్య పరిస్థితుల కారణంగా కూడా తక్కువ రక్తపోటు దాపురించవచ్చు. లో బీపీ కి గల మూల కారణాన్ని పరీక్షల ద్వారా తెల్సుకుని దానికి చికిత్స చేయడంపై వైద్యుడు దృష్ఠి  కేంద్రీకరిస్తాడు. అందువల్ల, అల్పరక్తపోటు/హైపోటెన్షన్ లేదా లో బీపీ యొక్క కారణాన్ని కనుగొనడం అనేది విజయవంతమైన చికిత్స చేయడంలో తొలి అడుగు. కాబట్టి, తక్కువ రక్తపోటుకు కారణమయ్యేదేమిటి? లో బీపీ ని మనం ఎలా అధిగమించగలము? అనే విషయాలను తెలుసుకునేందుకు ముందుకు చదవండి.


అల్ప రక్త పోటు కొరకు మందులు

1.-హై బి.పి. ని కంట్రోల్ లో ఉంచడంలో వెల్లుల్లి ఔషధంలా పని చేస్తుంది. అది బి.పి. ని తగ్గించి శరీరంలోని జీవక్రియలను సమతుల్యం చేస్తుంది . పల్స్ రేట్ , గుండె వేగాన్ని అదుపులో ఉంచుతుంది . అంతేకాదు రోజు ఉదయాన్నే పరగడుపున మూడు వెల్లుల్లి రేకులను మింగితే రోజంతా చలాకీగా ఉంచి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా దరి చేరకుండా చూస్తుంది.

2.-నేల‌ వ౦కాయి,లేద‌ అడ‌వి వ౦కాయ‌ అని పిలిచె ఈ వ౦గ‌మొక్క‌లు దాదాపు భార‌త‌ దేశ౦ అ౦త‌ట ఉన్నాయి.కాని  దీనిని చాల‌మ౦ది గుర్తి౦చ‌రు. ఒక‌వేళ‌ గుర్తి౦చిన‌ అవి ఎల వ0డుకోవ‌లో తెలియ‌దు.రోడ్దు ప‌క్క‌న‌ పిచ్చిమొక్క‌ల‌ ల‌ పెరిగే ఈ మొక్క‌లు ఎన్నో ఔష‌ధ‌ గుణాలు క‌లిగిన‌వి గా శాస్త్ర‌జ్జులు గుర్తి౦చారు.షుగ‌ర్, బి.పి త‌గ్గి౦చ‌డ‌మే కాకు౦డ‌ క‌డుపు లో నులి పురుగులు నివారిస్తు౦ద‌ని దీనికి ప్రతీతి,దినిని ఉర‌గాయిగా పెట్టుకోవ‌చ్చు ,పులుపు వేసి ఆవ‌పెట్ఱి వ౦డ‌వ‌చ్చు. మా౦సాహరులైతే చెన‌గ‌ప‌ప్పు,వెట‌మా౦శ౦,ట‌మ‌టా క‌లిపి వ౦డితే రుచి అదిరిపోద్ది......!


Medicine NamePack Size
KolqKolq Capsule
WikorylWIKORYL 325 TABLET DT 10S
AlexALEX + SYRUP 100ML
Solvin ColdSOLVIN COLD AF DROP
Tusq DXTUSQ DX COUGH SYRUP
Febrex PlusFebrex Plus AF Oral Drops
Ascoril DASCORIL D 12 SUSPENSION 60ML
Sinarest LevoSinarest Levo Tablet
Alcof DALCOF D SYRUP 100ML
CosomeCOSOME 100ML SYRUP
GutronGUTRON 2.5MG TABLET
DrilergDRILERG SYRUP 100ML
Low DexLow Dex Eye/Ear Drops
LpcLpc Syrup
Cosome EXPCOSOME EXP SYRUP
Ebast DcEbast Dc 10 Mg/10 Mg Tablet
Vilcold ZVilcold Z Syrup
Sunephrine HSunephrine H Eye Drop
Kufma SyrupKUFMA SYRUP 100ML
Trigenic PlusTRIGENIC PLUS SYRUP 60ML
Allercet ColdALLERCET COLD SYRUP 60M
Kufma Junior Cough SyrupKUFMA JUNIOR COUGH SYRUP 60ML
RinoseRINOSE TABLET 10S

కామెంట్‌లు లేవు: