2, మార్చి 2020, సోమవారం

హై బీపీ నివారణ పరిష్కారం మార్గం

హై బీపీ భయం -High BP Fear-Health Counseling-హై బీపి గురించి అందరూ తెలుసుకోవలసిన విషయాలు-Everybody must Know about High BP-Contact for 

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

*రక్తపోటు ( Blood Pressure )*. 

      భారత దేశంలో హై బీ.పి, హార్ట్ ఎటాక్ , చక్కెర వ్యాధి , కొలెస్ట్రాల్ , బ్రెయిన్ హెమరేజ్ , కిడ్ని వ్యాధులు , కళ్ళ సమస్యలు మొదలగు వ్యాధులు రసాయనాలతో కూడిన సముద్రపు ఉప్పు వాడినప్పటి నుండే వస్తున్నాయి . 1930 కి ముందు భారతీయులందరూ సైంధవ లవణాన్నే వాడేవారు . 
*వాతము యొక్క లక్షణాలు* ---
1. గతి అంటే గమనం . 2 శోషింప చేయడం. ( ఆరబెట్టి , పొడి బారేలాగ చెయ్యటం ). 3 చల్లదనం . 4 వాయువు తనంతట తానుగా జొరబడటం . 5 పరివర్తన ( మార్పు ) .
# ఎసిడిటి , మలబద్ధకం , రక్తపోటు ( Blood Pressure ) వాతానికి చెందిన రోగాలు . 
# రక్తపోటు వాతానికి చెందిన 2వ లక్షణానికి చెందినది . 
# రక్తంలో ఆమ్లాలు పెరిగిపోతే అధిక రక్తపోటు వస్తుంది . 
# వాతము శరీరం అంతటా పెరిగినపుడు , చర్మం పొడి బారి పోతుంది . పెదవులు , మడమలూ పగులుతూ ఉంటాయి . తలలో చుండ్రు వస్తుంది . 
# శరీరంలో వాతం పెరిగిన యెడల మలబద్ధకం వస్తుంది . దాని వల్ల ప్రేగులలో పోడిబారిన తనం క్రమక్రమంగా పెరిగి రక్తనాళాలలోకి చేరుతుంది . శరీరంలో ధమనులు గట్టి పడుతూ ఉంటాయి . *గుండె రక్తాన్ని పంపించటానికి గాను ఎక్కువ వొత్తిడిని ( ప్రెషర్ ) చెయ్యవలసి వుంటుంది . ఇలా ప్రెషర్ పెరగటానికి మనం హై బ్లడ్ ప్రెషర్ ( అధిక రక్తపోటు ) అంటాము* 
అధిక రక్తపోటుకు చికిత్స చేయాలంటే *వాతాని కి చికిత్స* చెయ్యాలి . 

*అధిక రక్త పోటు ( High Blood Pressure ) కు చికిత్స* :---
 *ఉదయం పరగడపున తీసుకొనవలెను* 

1. దాల్చిన చెక్క పోడి. + వేడినీళ్ళలో 
( 1/2 Spoon + 1 గ్లాసు ) కలిపి త్రాగ వలెను .
2 . 1/2 spoon దాల్చిన చెక్క పొడి + 1/2 spoon తేనె + 1 గ్లాసు వేడి నీళ్ళ లో కలిపి త్రాగవలెను . 
3 . 1 / 2 spoon మొంతులు + 1 గ్లాస్ వేడి నీళ్ళలో వేసి రాత్రంత వుంచ వలెను . ఉదయం పరగడపున నీళ్ళు త్రాగవలెను , మొంతులను నమిలి , నమిలి తినవలెను . 
*పై 3 పద్దతులలో ఒక పద్దతినే ఆచరించండి . 
*1 1/2 లేక 2 నెలల్లో మీ High B. P. తగ్గిపోవును* ..

# *High B. P. + కొలెస్ట్రాల్ + అధిక బరువు + Heart Blockage + గుండె Weak గా వున్న వారికి ఈ చికిత్స* :---
 
1/2 spoon అర్జున చెట్టు బెరడు పొడి +  1/2 గ్లాస్ నీళ్ళలో బాగా ఉడికించి , చల్లారిన తర్వాత త్రాగ వలెను. *ఉదయం పరగడపున త్రాగవలెను* ..

*#సొరకాయ చికిత్స* ----
1 గ్లాసు సొరకాయ రసం + 5 పుదీన ఆకులు , కొద్దిగ కోతిమీర ఆకులు , 5 తులసి ఆకులీ , 4 - 5 నల్ల మిరియాలను మెత్థగా పేస్టు లాగా చేసి, సొరకాయ రసంలో కలిపి త్రాగవలెను . 
*గమనిక : --* 
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు 1 గంట ముందర ఈ సొరకాయ రసం త్రాగవలెను . 
*High Blood Pressure , Diabetes, Heart Blockage Bad Cholesterol వున్న వారికి ఈ రసం సరైన మంచి మందు* . 

*# High B. P., + Sugar వున్న వాళ్ళకి ఈ క్రింది చికిత్స పద్దతి* ----
*బిల్వ పత్రాల చికిత్స* --
5 బిల్వ పత్రాలను చట్నీ ( Paste ) లాగ తయారు చేసుకొని +  1 గ్లాసు నీళ్ళలో కలిపి 1/2 గ్లాసు నీళ్ళు అయ్యేవరకు మరిగించ వలెను చల్లార్చి త్రాగవలెను .
ఈ కషాయంని తీసుకోవడము వలన High B. P. + Sugar Normal ఆవుతుంది . 
*గమనిః* :-- ఈ బిల్వ పత్రాలను దేవాలయములో శివుడికి అర్పించి , తీసుకొని వచ్చి తయారు చేసుకొండి . 

  *పై వాటిలో *ఏదో ఒక పద్ధతి* నే ఆచరించండి .
*ప్రాణాయము* కూడా చేయవలెను . మీకు త్వరగా High  B.P. తగ్గిపోవును . 

👉రక్తపోటు మరికొన్ని తగ్గించే నవీన్ సలహాలు

• ఉల్లిపాయ, తేనె అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఒక టేబుల్‌ స్పూన్‌ ఉల్లిపాయ రసంలో, రెండు టేబుల్‌ స్పూన్ల తేనెను కలిపి రోజూ తాగాలి. ఖచ్చితంగా హైపర్‌టెన్షన్‌ తగ్గి బీపీ కంట్రోల్‌ అవుతుంది.
కరివేపాకు ఆరోగ్య ఉపకారి. ముఖ్యంగా గుండెకు చాలా మంచిది. ఒక గ్లాసు నీళ్లలో నాలుగైదు కరివేపాకుల్ని వేసి కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత తాగాలి. ఇలా రోజూ చేయటం వల్ల బ్లడ్‌ప్రెషర్‌ తగ్గుతుంది.
వెల్లుల్లి ప్రతీ రోజూ తినమని ఇంట్లో పెద్దలు చెబుతుంటారు. అంటే దీని ప్రాధాన్యతని అర్థం చేసుకోవచ్చు. రోజూ ఒక వెల్లుల్లి పీస్‌ తింటే నాచురల్‌ మెడిసిన్‌లా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. వెల్లుల్లి ఒంట్లోని కొలెసా్ట్రల్‌ని తగ్గించటంతో పాటు రక్తప్రవాహాన్ని క్రమబద్ధీకరిస్తుంది.
క్యారెట్స్‌తో కలిపి పాలకూరని మిక్స్‌ చేసి ఆ జ్యూస్‌ చేసుకొని తాగాలి. ఇలా రోజుకి రెండు సార్లు ఈ జ్యూస్‌ తాగితే హైబీపీ తగ్గుతుంది.
• ప్రతీరోజూ రెండుసార్లు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే ఖచ్చితంగా అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.
• చేపకూర తినటం వల్ల కూడా హై బీపీ తగ్గుతుంది.

*Low B. P.* 

Low B. P. కి Allopathic లో మందు లేదు . 

*చికిత్స* : ---

1. ఒక గ్లాసు నీళ్ళు + 15 లేక 20 గ్రాముల బెల్లం + కొద్దిగ ఉప్పు + కొద్దిగ నిమ్మ రసం కలిపి త్రాగ వలెను. 
*ప్రతి రోజు 2 లేక 3 సార్లు త్రాగవలెను . త్వరగా Low B. P. తగ్గి పోవును . 

2 . దానిమ్మ పండ్ల రసం + ఉప్పు
3. చెరుకు రసం  + ఉప్పు. 
4 . కమలా పండ్ల రసం + ఉప్పు.

ఏదో ఒక పండ్ల రసంలో *ఉప్పు ( నల్ల ఉప్పు )* *నే వాడవలెను* .
 
5.( ఆవు పాల ) వెన్న + పటిక బెల్లం లేక బెల్లం ని కలిపి తినవలెను .  

6. ఒక గ్లాసు పాలు + 1 spoon ఆవు నెయ్యి ని బాగా కలిపి రాత్రి భోజనం తర్వాత త్రాగవలెను . 
*గమనిక* :---
 ఆవు పాలు లేక గేద పాలు . వేడి పాలలో నెయ్యిని కలుపవలెను . 

7 . 1 గ్లాసు నీళ్ళలో కొద్దిగ ఉప్పుని కలిపి త్రాగవలెను . 

*పై వాటిలో ఏదో ఒక పద్ధతిని ఆచరించి Low B. P. ని తగ్గించుకోండి . 

*పాటించ వలసిన నియమాలు*:----

1. ఖచ్చితంగా సైంధవలవణం ( Rock Salt ) ని వాడండి . సైంధవ లవణం అధిక రక్త పోటుని నివారిస్తుంది . 
2 . ఖచ్చితంగా శుద్ధమైన ( Non Refined Oil ) ని వాడండి . ఈ నూనెను వాడిన వాత రోగమైన *రక్తపోటు* తగ్గిపోవును . వాతరోగాలు రావు . 
3 . నీటిని గుటక గుటకగా త్రాగండి . 
*( మలబద్ధకం)* నివారించ బడును . 
4 . స్వచ్చమైన దేశీయ ఆవు నెయ్యి వాడవలెను . 
*( నెయ్యి వాడడం వలన ప్రేగలలో వున్న పొడిబారిన తనం తొలగి పోయి మృదుత్వం వస్తుంది )* .

*గమనిక :- ఉప్పు = నల్ల ఉప్పు* 
ధన్యవాదములు 🙏
 *మి నవీన్ నడిమింటి 
  *సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: