10, మార్చి 2020, మంగళవారం

వావిలాకు రసం తో నొప్పులు నివారణ పరిష్కారం మార్గం

వావ్.. వావిలాకు - నొప్పుల నివారణకు | నవీన్ నడిమింటి సలహాలు 

- ఎలాంటి నొప్పులకైనా తక్షణ ఉపశమనం కోసం నీటిలో వావిలాకు వేసి ఉడికించి ఆ నీటిని బాధ కలిగించే శరీర భాగం మీద ధారగా పోస్తే ఎంతో ఫలితం ఉంటుంది.
- వావిలాకు వేసి వేడినీళ్లు కాచి బాలింతలకు స్నానం చేయిస్తే వారి ఒంట్లో వుండే వాతం, నొప్పులు ఇట్టే తగ్గుతాయి.
- తలనొప్పిగా ఉంటే దీని ఆకులను నూరి తలకు పట్టిస్తే సరి. పంటి నొప్పిని కూడా నివారిస్తుంది.
- సింధువార పత్రం ఆకులు, బెరడు కషాయం జ్వరాలకు, జ్వర దోషాలకు చక్కటి విరుగుడు.
- మూర్ఛవ్యాధి ఉన్న వ్యక్తికి వావిలాకు రసం ముక్కులో వేస్తే చక్కని ఫలితముంటుందంటారు.
- చలిజ్వరం నివారణకు అరకప్పు వావిలాకు రసానికి రెండు చెంచాల తేనె కలిపి నిపుణుల సలహామేరకు తీసుకోవాలి.
- వావిలాకు కషాయాన్ని అన్ని రకాల పంటల్లో వచ్చే పురుగును నియంత్రించేందుకు విరివిగవాడు తారు 

ఇప్పుడు చాలా మంది అప్పటి విధానాలకు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా వివిధ రకాలు రోగాలు వస్తున్నాయి. పొలం గట్ల వెంట, చెరువు కట్టల వెంట పెరిగే వావిలాకు చెట్లు ఆయుర్వేద సంబంధమైనవి. చాలా మందికి ఇందులో ఉన్న గుణాలు తెలియదు.
...
వావిలాకులు వాత సంబంధమైన నొప్పులకు, శరీరంపై ఉన్న వాపులను తగ్గిస్తుంది.
దీని పువ్వులను కలరావ్యాధి, జ్వరం, కాలేయం, గుండె జబ్బులను నివారిస్తుంది.
ఆయుర్వేద, సిద్ధ వైద్యంలో మొక్కలోని అన్ని భాగాలకు తిక్తకషాయ, కటురసం, కటువిపాకం, ఉష్ణవీర్య, కఫహర, లఘు గుణాలు ఉంటాయి.  వెంట్రుకలకు, కంటికి, వాపులకు, నొప్పులకు, అమవాతానికి, కడుపులో పురుగులకు, పుండ్లకు, చెవి వ్యాధులు, మలేరియా, కఫాన్ని తగ్గిస్తుంది.
వావిలాకు రసంలో నువ్వుల నూనె కలిపి కాచి, వాతపు నొప్పులకు, వాపులకు, పై పూతగా పూస్తే తగ్గుతాయి.
వావిలి ఆకులు వేసి, కాచిన నీటిలో స్నానం చేస్తే, వాతపు నొప్పులకు బాలింత నొప్పులకు బాగా ఉపశమనం కలుగుతుంది.
పత్రాలు కషాయం కాచి, మిరియాలు పొడి కలిపి ఇస్తే జలుబు, తల భారంతో వచ్చే జ్వరం త్వరగా తగ్గుతుంది. పత్రాలతో గుంటగరగడాకు, తులసి, వాము, కలిపి దంచి రసం తీసి ఇస్తే కీళ్ల నొప్పులు, రుమటాయిడ్, ఆర్ధ్రయిటిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. పత్రాలను దిండులాగా తయారు చేసి, తల కింద పెట్టుకొని పడుకుంటే, తరచుగా వచ్చే తలనొప్పి, జలుబు మటుమాయం అవుతుంది. పత్రాల రసం, పిల్లలకు వచ్చే మూర్ఛ వ్యాధులకు ముక్కులో వేస్తే, ప్రథమ చికిత్సగా పనిచేస్తుంది. వావిలి పత్రాలలో గాడిదగడపాకు, జిల్లేడాకులు, ఆముదం ఆకులు, గుంటగరగడ, కుప్పింటి కలిపి రసం తీసి, నువ్వులనూనెలో వేసి కాచి, కీళ్ల వాపులకు పై పూతగా పూస్తారు. పత్రాల రసంలో అల్లంరసం కలిపి ముక్కులో వేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది.
వావిలి చెట్టు కొమ్మలను కొడవలి పిడులకు విశేషంగా ఉపయోగిస్తారు.
.
వావ్.. వావిలాకు - నొప్పుల 

- ఎలాంటి నొప్పులకైనా తక్షణ ఉపశమనం కోసం నీటిలో వావిలాకు వేసి ఉడికించి ఆ నీటిని బాధ కలిగించే శరీర భాగం మీద ధారగా పోస్తే ఎంతో ఫలితం ఉంటుంది.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి 
మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

కామెంట్‌లు లేవు: