11, మార్చి 2020, బుధవారం

అతిగా పిల్లలు సెల్ ఫోన్ వాడుక వల్ల పిల్లలు కు వచ్చే సమస్య పరిష్కారం మార్గం


చిన్న పిల్లలు ఫోన్లు టచ్ చేయకుండా ఉండాలంటే ఇలా చేయండి అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు ll

5 Ways To Quell Your Kid’s Obsession With Their Smartphone

నలుగురితో ముచ్చటించినప్పుడే సామాజిక నైపుణ్యాలు వృద్ధి చెంది. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మెరుగుపడతాయి. భావోద్వేగాలను పంచుకున్నప్పుడే అనుభూతుల రుచి తెలుస్తుంది. ఇతరులు చెప్పేది ఓపిగ్గా విన్నప్పుడే చక్కటి భాష అలవడుతుంది. ఆరుబయట ఆడుకున్నప్పుడు ప్రకృతితో మమేకమయ్యే అవకాశం లభిస్తుంది. అయితే మితిమీరిన టెక్నాలజీ వాడకం వల్ల.. వీటన్నిటికీ దూరమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉంచడం చేయాల్సిందే. కొన్ని పద్దతులు అవలంభిస్తే వారు ఫోన్లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. అవేంటో ఓ సారి చూద్దాం.

ప్రత్యామ్నాయ మార్గాలను

టీవీ, ట్యాబ్లెట్‌, స్మార్ట్‌ఫోన్లను పిల్లలు చూసేందుకు నిర్ణీతవేళల్ని నిర్దేశించాలి. ఆ ప్రణాళికను పెద్దలు కూడా విధిగా పాటించాలి. అప్పుడే పిల్లల్లో ఆశించినంత మార్పు వస్తుంది. గాడ్జెట్స్‌ అలవాటును మాన్పించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. 'చూడొద్దు.. చూడొద్దు..' అంటూ ఎంత గట్టిగా అరిచి గీపెట్టినా పిల్లలు మానరు. పాత బొమ్మలతో ఆడుకోమన్నా బోర్‌గా ఫీలవుతారు. అందుకని చౌకధరల్లో దొరికే సరికొత్త బొమ్మల్ని వారానికి ఒకసారి కొనివ్వాలి. అప్పుడే పిల్లల్లో టాయ్స్‌తో ఆడుకోవాలన్న ఆసక్తి కలుగుతుంది..

ఇంటి పనుల్లో భాగస్వామ్యం

పిల్లలను ఇంటి పనుల్లో భాగస్వాములను చేయాలి. వంటింట్లో అమ్మ చపాతీ చేస్తుందనుకోండి. పిల్లలను కూడా సరదాగా చపాతీ ఒత్తమని కాస్త పిండి ముద్దను చేతికి అందివ్వాలి. అది పాడవుతుందని పిల్లల్ని దూరం పెట్టొద్దు. పిల్లల అల్లరి భరించలేక.. వాళ్ల చేతికి స్మార్ట్‌ఫోన్‌ ఇచ్చి ఆడుకోమనడం తప్పు. అదే అలవాటుగా మారుతుంది. మళ్లీ ఆ అలవాటును మాన్పించడం తల్లిదండ్రు లకీ పెద్ద ప్రయాస. పెద్దలు చేసే పనుల్లో పిల్లలు.. పిల్లలు చేసే పనుల్లో పెద్దలు కలిసిపోయే వాతావరణాన్ని కలిగించాలి. పిల్లలు చెప్పే మాటల్ని తల్లిదండ్రులు శ్రద్ధగా వినాలి. వెంటనే స్పందించాలి. అప్పుడే ఇద్దరి మధ్యా బంధం బలపడుతుంది. టెక్నాలజీ మరపు సాధ్యం అవుతుంది.

కుటుంబాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న టెక్నాలజీ ...


ఈ మధ్యన పిల్లలు అమ్మా, నాన్నల ప్రేమకి తపించిపోతున్నారని ఎందుకంటే ఎప్పుడు చూసినా వారు టెక్స్ టింగ్ లో, నెట్ లో ఎవరితోనో చాటింగ్ లోనో వుంటారు పిల్లలు అక్కడే వున్నారని కూడా మర్చిపోయి. ఈ మధ్యన ఈ విషయం పై రిసర్చ్ చేయగా దాదాపు 75% తల్లి తండ్రులు పిల్లలు కారులో వారితో పాటు ప్రయాణం చేస్తుండగానే టెక్స్ టింగ్ లు, సెల్ ఫోన్ లో మాట్లాడుకోవడం లాంటివి చేస్తూ పిల్లల్ని అంతగా పట్టించుకోవటం లేదని, వారితో సంభాషించటం బాగా తగ్గిపోతుందని తేలింది. 


పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి..

తల్లిదండ్రులు ఎలాంటి ఉద్యోగాల్లో ఉన్నా పిల్లల అభిరుచులను ఎప్పటికప్పుడు తెలుసుకుం టూ ఉండాలి. సెల్‌ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ల వల్ల కలిగే అనర్థాలను వారికి తెలిజెప్పడం ద్వారా వారిని వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు సెల్‌ఫోన్‌ వైపు దృష్టి మళ్లకుండా వివిధ రకాల పుస్తకాలను చదివేలా చేయాలి. సెల్‌ ఫోన్‌ ఆటలకు ఎంత దూరం ఉంచితే అంత మంచిదని అందరు గుర్తించాలి. కఠినంగా అనిపించినా సరే.. పిల్లలు టీవీ చూసే విషయంలో ఆంక్షలు విధించాలి. ఏ ఛానల్‌ చూస్తున్నారో ఓ కన్నేయాలి. శారీరక ఎదుగుదల కు తోడ్పడే క్రీడల వైపు వారి దృష్టిని మళ్లించాలి. పిల్లలకు దూరంగా సెల్‌ఫోన్‌, పిల్లలు నిద్రించే గదిలో టీవీ ఉంచకపోవడం మంచిది. పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు సెల్‌ఫోన్లు ఇవ్వకపోవడం మరీ మంచిదని గమనించాలి.

ఇష్టమైన కథలు, పద్యాలు

పిల్లలకు పెద్దవారితో సంబంధాలు క్రమేపీ తగ్గుతున్నాయని, గత ఐదేళ్ల కాలంతో పోల్చితే చిన్న పిల్లల్లో భాషా పరమైన సమస్యలు, ఇబ్బందులు, మాట్లాడడానికి సంబంధించిన సమస్యలు పెరిగాయని తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. దీనికి కారణం టీవీ, స్మార్ట్‌ ఫోన్లు వాడకం, సెల్‌ఫోన్‌ వాడకం పెరగడమేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టీవీలు, కంప్యూటర్‌ వంటి స్క్రీన్‌ బేస్డ్‌ టెక్నాలజీ పెరగడం వల్ల పిల్లలకు పెద్దలతో ఉండే సంబంధాలు తగ్గిపోతున్నాయని, సదరు పరికరాలు తల్లిదండ్రుల పాలిట బేబీ సిట్టర్లుగా మారుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. రోజంతా తల్లిదండ్రులు తమ తమ ఉద్యోగ విధుల్లో మునిగితేలడం వల్ల పిల్లలకు చేరువగా కూర్చుని వారికి ఇష్టమైన కథలు, పద్యాలు చెప్పేవారు కరువయ్యారు. దీంతో పిల్లల్లో భాషా పరమైన సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటిలోని సభ్యులంతా కలిసి భోజనం చేసేలా సమయాన్ని కేటాయించుకున్నాకూడా పిల్లల్లో ఇలాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈవిషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.


రాత్రి పూట ఫోన్ల‌ను ఇవ్వ‌కండి

పిల్ల‌ల‌కు రోజులో ఎప్పుడైనా ఫోన్ల‌ను ఇవ్వండి కానీ రాత్రి పూట ఫోన్ల‌ను ఇవ్వ‌కండి. అది వారి నిద్ర‌పైనే కాదు, ఆరోగ్యంపై కూడా ప్ర‌భావం చూపుతుంది. దీనికి తోడు ఆన్‌లైన్ పోర్నోగ్ర‌ఫీ ఎక్కువైనందున రాత్రి పూట పిల్ల‌ల‌కు ఫోన్ల‌ను ఇవ్వ‌డం అంత మంచిది కాదు. ఆ స‌మ‌యంలో త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌పై నిఘా పెట్ట‌లేరు. క‌నుక పేరెంట్స్ ఎవ‌రైనా రాత్రి పూట త‌మ పిల్ల‌ల‌కు ఫోన్ల‌ను ఇవ్వ‌క‌పోవ‌డ‌మే మంచిది. క‌చ్చితంగా ఈ రూల్‌ను పెట్టి మీ పిల్ల‌ల‌కు చెప్పండి.

పార్టీలు, భోజ‌నాల‌ప్పుడు

పేరెంట్స్ తో క‌లిసి పిల్ల‌లు పార్టీల‌కు వెళ్లిన‌ప్పుడు లేదంటే ఇంట్లోనే ఫంక్ష‌న్లు చేసుకున్నా, భోజ‌నాలు చేసే స‌మ‌యంలో అయినా పిల్ల‌ల‌కు ఫోన్ల‌ను ఇవ్వ‌కండి. ఎందుకంటే ఆ స‌మ‌యాల్లో కూడా త‌ల్లిదండ్రులు పిల్ల‌లు ఏం చేస్తున్నారో స‌రిగ్గా గ‌మ‌నించ‌లేరు. దీంతో వారు ఫోన్ల వ‌ల్ల చెడు ప్ర‌భావానికి లోన‌య్యే అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఆ స‌మ‌యాల్లో ఫోన్ల‌ను పిల్ల‌ల‌కు ఇవ్వ‌కుండా రూల్ పెట్టండి.

యాప్‌లు

ఫోన్లు ఇచ్చేట‌ప్పుడు పిల్ల‌ల‌కు అవ‌స‌రం ఉండే యాప్స్‌ను మాత్ర‌మే వాటిల్లో అందుబాటులో ఉంచండి. కేవ‌లం వారికి అవ‌స‌రం అయ్యే గేమ్స్ లేదా ఇతర ఎడ్యుకేష‌న్ యాప్స్‌, పిల్ల‌ల క‌థ‌లు, పాటలు వంటి యాప్స్‌ను మాత్ర‌మే వారు చూసేట్టుగా ఫోన్ల‌లో సెట్ చేసి ఇవ్వండి. మిగిలిన యాప్‌ల‌కు లాక్‌లు పెట్టి ఆ త‌రువాత ఫోన్ల‌ను పిల్ల‌ల‌కు ఇవ్వండి. దీంతో వారు ఇత‌ర ఏ వివ‌రాల‌ను ఫోన్‌లో చూసేందుకు వీలు కాదు. అలా సేఫ్‌గా ఉండ‌వ‌చ్చు.

కాంటాక్ట్‌లు

త‌ల్లిదండ్రులు త‌మ‌కు తెలిసిన వ్య‌క్తుల‌కు చెందిన కాంటాక్ట్‌ల‌ను మాత్ర‌మే పిల్ల‌ల‌ను వాడుకునేలా చూడాలి. ఎందుకంటే అప‌రిచిత వ్యక్తులు అయితే వారు మీ పిల్ల‌ల‌ను వేధింపుల‌కు గురి చేయ‌వ‌చ్చు. వారిని హింసించ‌వ‌చ్చు. క‌నుక వారు ఫోన్ల‌లో ఎవ‌రెవ‌రికి కాల్స్ చేస్తున్నారు అనే విష‌యంపై ఓ క‌న్నేయాలి.ఇంట‌ర్నెట్‌లో కొన్ని యాప్‌లు లేదా సైట్ల‌లో మ‌న‌కు ఏవైనా సేవ‌లు కావాలంటే అవి మ‌న వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని అడుగుతుంటాయి. అలాంటి సంద‌ర్భాల్లో పిల్ల‌ల‌పై నిఘా ఉంచాలి. వారిని ఇంట‌ర్నెట్ వాడుకోకుండా నిషేధించాలి. ఇంట‌ర్నెట్ అవ‌స‌రం అయితే మీరు ద‌గ్గ‌రుండి వారికి కావ‌ల్సిన గేమ్స్ ఇన్‌స్టాల్ చేసివ్వాలి. స‌మాచారం వెదికి ఇవ్వాలి. అంతేకానీ వారి చేతికి ఫోన్ ఇచ్చి వారినే స‌మాచారం వెదుక్కోమ‌ని అవ‌కాశం ఇవ్వ‌కూడదు.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 


2 కామెంట్‌లు:

luckys చెప్పారు...

We are therefore entering the market with a new strategy and will be targeting senior executives, medical practitioners, professionals and students.”
vumoo

Rangextd చెప్పారు...

Nice Information rangextd reviews