30 రోజులు మద్యం మానేస్తే... మీ బాడీలో వచ్చే మార్పులు ఇవీ...అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
ఎవరెస్ట్ శిఖరమైనా ఎక్కుతారు గానీ... మద్యం మానేయమంటే మానలేరు చాలా మంది.అందుకే కరోనా సెలవులు వల్ల మద్యం షాప్ మూతబడ్డాయి మద్యం తాగితే అన్నీ నష్టాలే. దాన్ని మానేస్తే ఎన్నో లాభాలు కూడా. అవేంటో తెలుసుకుందాం.
మన తెలుగు రాష్ట్రము లో కష్టానికీ, మద్యానికీ విడదీయరాని బంధం ఉంది. రోజంతా కష్టపడే చాలా మంది... సాయంత్రం కాగానే... మద్యం బాటిల్ ఎత్తేస్తారు. సంపాదించిన కాస్త సొమ్మునూ మద్యానికి వాడేస్తారు. ఫలితంగా తాత్కాలిక కిక్కు... దీర్ఘకాలిక సమస్యల్ని తెచ్చుకుంటారు. ఐతే... మద్యం తాగడం మానేస్తే కలిగే ప్రయోజనాలు, మద్యం మానేస్తే ఎంత మేలో తెలియకపోవడం వల్లే చాలా మంది మద్యం తాగుతూ ఉంటారు. దీనిపై జరిపిన పరిశోధనల్లో అద్భుత ఫలితాలొచ్చాయి. ఒక్క నెల పాటూ మద్యం మానేసినా చాలు... గుండె, లివర్, బాడీ అన్నీ ఆరోగ్యవంతంగా మారతాయి. నెల తర్వాత మళ్లీ మద్యం తాగడం మొదలుపెడితే... మళ్లీ అన్నీ పాడైపోతూ ఉంటాయి. అమెరికాలో చలి వల్ల అక్కడి ప్రజలు మద్యం తాగకుండా ఉండలేరు. అందువల్ల అక్కడి డాక్టర్లు మహిళలైతే రోజుకు ఒక డ్రింక్, మగాళ్లైతే రోజుకు రెండు డ్రింక్స్ మాత్రమే మద్యం తాగాలని సూచించారు. మద్యం తాగితే రకరకాల కాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చాలా మంది జనవరి రాగానే మద్యం మానేయాలని ఫిక్స్ అవుతారు. ఓ వారం తిరగ్గానే మళ్లీ పెగ్గు దిగిపోతుంది. కానీ... ఓ నెల మద్యం మానేస్తే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
1. లివర్ మెరుగవుతుంది : మనం మద్యం తాగితే... లివర్ పాడైపోవడం గ్యారెంటీ. కానీ మన బాడీలో లివర్ అత్యంత ముఖ్యమైన అవయవం. అది పాడైతే... దాదాపు 700 రకాల అవయవాలు సరిగా పనిచేయవు. అదే మద్యం తాగడం కనీసం నెలపాటూ మానేస్తే... లివర్ తిరిగి మెరుగవుతుంది. దానిలో లోపాల్ని అదే సరిచేసుకుంటుంది. అలాగే బాడీలో విష వ్యర్థాల్ని లివర్ బయటకు పంపుతుంది. చెడు కొవ్వుల్ని కరిగించేస్తుంది. అధికంగా ఉండే హార్మోనులను తగ్గిస్తుంది. ఇలా ఎన్నో మంచి పనులు చేసే లివర్ బాగుండాలంటే... మద్యం తాగడం మానేయాలి.
2. గుండెకు రక్షణ : మద్యం తాగడం వల్ల మన శరీరంలో.... ఫ్రీ రాడికల్స్ ఎక్కువవుతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇవి ఎక్కువయ్యే కొద్దీ గుండెకు ప్రమాదమే. ఇవి ధమనుల్లో గూడుకట్టుకొని... రక్త సరఫరాను అడ్డుకుంటాయి. ఫలితంగా గుండెకు ఏదో ఒక రోజు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి... గుండె పోటు వస్తుంది. ప్రాణం పోయే ప్రమాదం తలెత్తుతుంది. అదే మద్యం మానేస్తే... ఈ కొవ్వులన్నీ క్రమంగా కరిగిపోతాయి. అలా కరిగేలా లివర్ చేస్తుంది. ఫలితంగా గుండెకు రక్త సరఫరా చక్కగా అవుతుంది. గుండె హాయిగా ఉంటుంది. 40 ఏళ్లు దాటిన వాళ్లు గుండెను కాపాడుకునేందుకు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అమెరికన్లలా భారతీయులు, చైనీయులు మద్యం తాగితే... అడ్డమైన రోగాలూ రావడం ఖాయమని... పరిశోధనల్లో తేలింది.
3. కాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ : మద్యం తాగితే... తల, మెడకు సంబంధించిన కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే... ఎసోఫాజియల్, లివర్, బ్రెస్ట్ (రొమ్ము కాన్సర్), కొలొరెక్టల్ కాన్సర్లు కూడా సోకే ప్రమాదం ఉందని పరిశోధనలు తేల్చాయి. ఇన్ని రకాల కాన్సర్లలో ఏ ఒక్కటి సోకినా... ప్రాణాలకే ప్రమాదం. ట్రీట్‌మెంట్‌కే లక్షలు వదిలిపోతాయి. అందువల్ల మద్యం తాగడం మానేస్తే... కాన్సర్లు వ్యాపించే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది.
4. బరువు తగ్గుతారు : మద్యం తాగేవారు కంట్రోల్ లేకుండా తాగుతారు. పైగా మంచింగ్ పేరుతో... కొవ్వు ఉండే స్నాక్స్ తింటారు. ఇవన్నీ బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, పొట్ట ఇతరత్రా శరీర భాగాల్లో కొవ్వును కూడబెడతాయి. ఇక బరువు పెరగకుండా ఎలా ఉంటారు. మద్యాన్ని ఓ నెల మానేసి చూసుకుంటే కచ్చితంగా బరువు తగ్గినట్లు రుజువవుతుంది.
5. బ్రెయిన్ బాగా పనిచేస్తుంది : మద్యం తాగితే ఆ ప్రభావం మెదడుపై బాగా పడుతుంది. మెమరీ లాస్ ఏర్పడుతుంది. అదే మద్యానికి దూరంగా ఉంటే... బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. కొత్త కణాలు పుట్టుకొస్తాయి. అన్నీ లాభాలే. నెలే కాదు... 3 నెలలపాటూ మద్యాన్ని తాగడం మానేస్తే... అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయంటున్నారు డాక్టర్లు.సూచించారు ఇంకా వివరాలు లింక్స్ చుడండి
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
*మద్యపానం అలవాటు నుండి బయటపడేందుకు అద్భుతమైన నవీన్ సలహాలు*
మద్యం యొక్క ప్రభావం మొట్టమొదటగా ఆరోగ్యం మీదే పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యవంతుడిని కూడా భయంకరమైన రోగాల బారిన పడేస్తుంది. మద్యం సేవించటం అనేది ఒక దీర్ఘకాలిక రోగం వంటిది. సాదారణంగా అది పెరుగుతూనే ఉంటుంది కాని తగ్గటం అంటూ జరగదు. తప్ప తాగి ప్రతిరోజు ఇంట్లో వారితో మరియు ఇరుగు పొరుగు వారితో గొడవ పడేవారిని మనం గమనిస్తూనే ఉంటాం.మద్యం తాగి వాహనం నడపడం వల్ల ప్రాణాలు కోల్పోయే వారి గురించి తరచూ వార్తల్లో చూస్తూ ఉంటాం. కానీ, తాగుడుకు బానిస అయిన వారిని ఇంట్లో మనం నిత్యం ఉపయోగించే మెంతులతో మద్యపాన అలవాటును మాన్పించేలా చేయొచ్చు. శరీరంలోపలి విషాలను (టాక్సిన్లు) బయటకు పంపించి, శరీరం నిత్యం ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు చాలా బాగా సహాయపడతాయి. బీపీ, షుగర్, స్థూలకాయం లాంటి అనారోగ్య సమస్యలకే కాక…మద్యపానానికి భానిసైన వారి ఆరోగ్యాన్ని కాపాడి, వారిని తాగుడు అలవాటు నుండి దూరం చేయడంలోనూ… మెంతులు శక్తివంతంగా ఉపయోగపడతాయి.
మద్యపానం అలవాటు ఉన్న వారికి, రెండు చెంచాల మెంతి గింజలను తీసుకొని, సుమారు 4 గంటల పాటు వాటిని నీటిలో నానబెట్టి వాటిని అదే నీటితో ఉడకబెట్టి, వడగట్టి తేనెతో కలిపి తినేలా చేయాలి. దీని కారణంగా దెబ్బతిన్న కాలేయాన్ని కాపాడుకోవొచ్చు. అంతే కాక, ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల, మెంతుల్లో ఉంటే చేదు, జిగురు తత్త్వాలు మద్యం అంటేనే ఓ రకమైన అసహ్యభావం కలిగించేలా చేస్తాయి. ఫలితంగా ఎంత మద్యపాన ప్రియులైన ఈ మిశ్రమం తిన్నాక మద్యం జోలికి వెళ్లరు. ఈ మిశ్రమాన్ని అందిస్తూనే… ఆ వ్యక్తి యొక్క అవసరం కుటుంబానికి ఏ మేరకు ఉందో అతనికి వివరించాలి. ఆ మిశ్రమ ప్రభావానికి తోడు, మాటలు అతడిని మానసికంగా కూడా మద్యం జోలికి పోకుండా చేస్తాయి.
తాగుడుకు బానిస అయినా వారికి, మెంతు ఆకులతో తయారు చేసిన డికాషన్ పట్టించాలి. ఇలా మెంతులు, మెంతు ఆకులు కలిసి, తాగుడికి అలవాటైన వ్యక్తి ఆరోగ్యాన్ని మెరుగుపరిచడమే కాకుండా, వారిని తాగుడు అలవాటు నుండి బయట పడేలా చెత్తాయ్
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి