26, మార్చి 2020, గురువారం

యూరిన్ ఇన్ఫెక్షన్ నవీన్ రోయ్ సలహాలు

యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

      మూత్రనాళంలో ఇన్ఫెక్షన్లు రావడం సాధారణమే. ఏ కారణమూ లేకుండా వచ్చిన ఇన్ఫెక్షన్ సులభంగానే తగ్గిపోతుంది. కానీ ఇతర కారణాల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే, దాన్ని నిర్లక్ష్యం చేస్తే మరిన్ని సమస్యలకు దారితీయవచ్చు. అందుకే మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే కారణం తెలుసుకుని అందుకు వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు పైబడిన వారి వరకు ఎవరికైనా మూత్రంలో ఇన్ఫెక్షన్లు రావచ్చు. కొందరిలో ఈ ఇన్ఫెక్షన్లు రావడానికి కారణం ఉండదు. కానీ ఇన్ఫెక్షన్లు రావడానికి కిడ్నీలో రాళ్లు కారణం కావచ్చు. ప్రొస్టేట్ గ్రంథిలో సమస్య కావచ్చు. మూత్రనాళంలో అడ్డంకులు కావచ్చు. కారణం ఏదైనా మూత్రంలో ఇన్ఫెక్షన్ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
చిన్న పిల్లల్లో, యుక్తవయస్సు వారిలో, ఎక్కువ శాతం స్త్రీలలో, వయసు పైబడిన వారిలో రావచ్చు. చిన్న పిల్లల్లో జ్వరం, దగ్గు, ఆయాసం, తీవ్రమైన జ్వరం, పక్క తడపడం వంటివి నులి పురుగుల వల్ల రావచ్చు.
యుక్తవయస్సు వారిలో గనేరియా, సిఫిలిస్, క్యాండిడియాసిస్, ఈకొలై, ఎయిడ్స్, హనీమూన్ సిస్టైటిస్, ఫైమోసిస్ స్ట్రిక్చర్స్, పారా ఫైమోసిస్ వల్ల, సెక్స్ ద్వారా వ్యాపించే ఇతర జబ్బుల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలలో పురుషుల కంటే మూత్రనాళం సైజు తక్కువగా ఉండటం వల్ల, మల ద్వారానికి దగ్గరగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్కు త్వరగా గురవుతారు. గర్భిణి స్త్రీలలో గర్భాశయ పెరుగుదల (పిండం ఒత్తిడి వల్ల) బ్లాడర్పై ఒత్తిడి పెరుగుతుంది. ఇక వయసు పైబడిన వారిలో ప్రొస్టేట్ గ్రంధి వాపు, గనేరియా, లైంగిక వ్యాధులు, ఎయిడ్స్, డయాబెటిస్, కేన్సర్, కాలేయ వాపు, కిడ్నీ ఇన్ఫెక్షన్లు, అధిక రక్తపోటు వంటి వ్యాధుల వల్ల, కిడ్నీ స్టోన్స్, నీళ్లు తక్కువ తాగడం, గుండె సంబంధ వ్యాధులు, పక్షవాతం, ఎముకలు విరగడం, ఎక్కువ రోజులు మంచానికి పరిమితం కావడం, మానసిక క్షోభ, నిద్రలేమి, రోగనిరోధక శక్తి సన్నగిలడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల కలిగే మానసిక ఒత్తిడి, ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్లు, నియంత్రణ లేని డయాబెటిస్ వ్యాధి, హెర్నియా, ఎలిఫెంటాయిసిస్, కణుతులు, గడ్డలు, రేడియేషన్ ట్రీట్మెంట్స్, వెన్నెముక గాయాలు, తలకు గాయం, ఎక్కువ రోజులు క్యాథెటర్ శరీరంలో ఉండటం వల్ల కూడా ఇన్ఫెక్షన్లు రావచ్చు.
ప్రధాన లక్షణాలు # మూత్రంలో మంట, మూత్రవిసర్జన తరువాత మంట, మూత్రవిసర్జన సరిగ్గా రాకపోవడం, ఆగి, ఆగి రావడం, అర్జంటుగా వెళ్లాల్సి రావడం, మూత్రం వచ్చినట్టు అనిపిస్తుండటం, రాకపోవడం, మూత్రం పచ్చగా, చిక్కగా, పసుపు రంగులో, వాసన కూడా ఉండటం, పొత్తి కడుపులో నొప్పి, వికారం, వాంతులు, కొద్దిపాటి జ్వరం, నీరసం, నొప్పులు, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి. గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది.
కారణాలు : యురినరి ఇన్ఫెక్షన్ కలగడానికి వివిధ కారణాలున్నాయి. మూత్రవిసర్జనలో అడ్డు ఉండడం. అంటే మూత్రపిండంలో రాళ్లు. మూత్రంలో ఇన్ఫెక్షన్కు ప్రధాన కారణం నీళ్లు తక్కువగా తీసుకోవడం. నీళ్లు ఎక్కువ తాగినప్పుడు మూత్రం నిల్వఉండదు. దీంతో ఇన్ఫెక్షన్వచ్చే అవకాశముండదు. తక్కువ నీళ్లు తీసుకున్నప్పుడు మూత్రాశయంలో మూత్రం నిల్వ ఉండి ఇన్ఫెక్షకు దారితీస్తుంది. క్రిములు పెరిగే అవకాశముంటుంది. కొత్తగా పెళ్లయిన వారిలో హనిమూన్సిస్టిటిస్అనే సమస్య కనిపిస్తుంది. ఇది కూడా ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. మగవారి కంటే ఆడవాళ్లలో మూత్రంలో ఇన్ఫెక్షన్ఎక్కువ. ఎందుకంటే పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రనాళం సైజు చిన్నగా ఉంటుంది. లోపల ఉండడం వల్ల క్రిములు చేరుతాయి. ఇవేకాక మూత్రనాళంలో అడ్డు ఉండడం, రాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువసార్లు వస్తుంది. చిన్న చిన్న రాళ్లు మూత్ర విసర్జనలో వెళ్లిపోతుంటాయి. మూత్ర వ్యవస్థలో అసాధారణ సమస్యలు ఇన్ఫెక్షన్కు కారణమవుతాయి. పిల్లల్లో పుట్టుకతోనే మూత్రనాళంలో అసాధారణ మార్పులు ఏర్పడుతుంటాయి. మెడుల్యరి స్పాంజ్కిడ్నీ సమస్య కొంత మందిలో ఉంటుంది. ఇందులో రెండు కిడ్నీలు కింది భాగంలో అతుక్కుని ఉంటాయి. దీని వల్ల ఎక్కువ మూత్రం నిల్వ ఉండే అవకాశముంది. చిన్న పిల్లల్లో రిఫ్లక్స్నెఫ్రోపతి సమస్య ఉంటుంది. మూత్రనాళం ద్వారా బయటికి వెళ్లే మూత్రం వెనక్కి వెళ్తుంది. మూత్రం నిల్వ ఉండి కిడ్నీ ఇన్ఫెక్షన్వచ్చే అవకాశముంది. ఏడాదిలోపు వయసు ఉన్నప్పుడు చలితో జ్వరం వచ్చినప్పుడు మూత్రంలో ఇన్ఫెక్షన్, రిఫ్లక్స్సమస్యను నిర్ధారించుకోవాలి. సమస్యను తొలిదశలోనే గుర్తించి చికిత్స చేస్తే కిడ్నీలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. వృద్ధుల్లో మూత్రం ఇన్ఫెక్షన్కు కారణం పురుషుల్లోని పౌరుష గ్రంథి (ప్రొస్టేట్గ్రంథి). ఇది మూత్రాశయం చుట్టూ ఉంటుంది. వయసుపెరిగే కొద్ది ఇది పెద్దగా మారుతుంది. దీన్ని బినైన్ప్రొస్టేటిక్హైపర్ప్లాసియా అంటారు. 60 ఏళ్ల తర్వాత ఇది పెరగడం వల్ల మూత్రనాళం ఒత్తిడికి గురై సన్న బడుతుంది. సాధారణంగా మూత్రం ధారగా రావాలి. కానీ ఈ సమస్య వల్ల వృద్ధుల్లో మూత్రం చుక్కలు చుక్కలుగా వస్తుంది. మూత్రం పోసిన పదినిమిషాల తర్వాత మళ్లీ పోయాల నుకుంటారు. తరచూ మూత్ర విసర్జనకు వెళ్తుంటారు. ఇక మహిళల్లో... అనారోగ్యానికి గురైనప్పుడు ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళ్లరు. ఇలాంటప్పుడు మూత్రం నిల్వ ఉండి ఇన్ఫెక్షన్వచ్చే అవకాశముంది. ఇక వీరిలో మూత్రనాళం సన్నగా, లోపలికి ఉండడం వల్ల సులభంగా క్రిములు వెళ్లి ఇన్ఫెక్షన్వస్
తుంది. మధుమేహం నియంత్రణ లేని వారి మూత్రంలో క్రిములు పెరుగుతాయి. వీరిలో ఇన్ఫెక్షన్తీవ్రంగా ఉంటుంది. కుటుంబ నియంత్రణ కోసం వాడే కండోమ్స్, స్పెర్మ్డల్ఫో
మ్వల్ల కూడా ఇన్ఫెక్షన్వస్తుంది.
నిర్ధారణ పరీక్షలు : పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు కంప్లీట్యూరిన్పరీక్ష చేయించాలి. దీని వల్ల మూత్రంలో చీము కణాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. చీము కణాలు ఉంటే యూరిన్కల్చర్పరీక్ష చేయించాలి. ఈ పరీక్ష వల్ల ఇన్ఫెక్షన్ఎందుకొచ్చిందో తెలుస్తుంది. సీరం క్రియాటినిన్తో కిడ్నీ పనితీరును తెలుసుకోవచ్చు. తర్వాత మూత్రనాళంలో అడ్డు, రాళ్లు ఉన్నాయో, లేవో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్పరీక్ష చేస్తారు. తర్వాత మూత్రం సాధారణంగా కిందికి వస్తుందా? లేదా పైకి వెళ్తుందా అనేది ఎంసియుజి పరీక్ష వల్ల తెలుసుకోవచ్చు. యురినరి ఇన్ఫెక్షన్కిడ్నీకి పాకిందా లేదా అని తెలుసుకోవడానికి సిటి స్కాన్చేస్తారు.
చికిత్స : 80 శాతం కేసుల్లో యురినరి ఇన్ఫెక్షన్ఇ-కొలై అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్కు మొదట యాంటి బయాటిక్తో చికిత్స చేస్తారు. మూత్రంలోని ఇన్ఫెక్షన్కిడ్నీలకు చేరుకుని దాని పనితీరును ప్రభావితం చేస్తుంది. పనిచేయడం ఆగిపోతుంది. విసర్జక వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో ఆకలి లేకపోవడం, నిద్రపట్టకపోవడం, వాంతులు, మూత్రం రావడం కూడా ఆగిపోవచ్చు. వీరికి డయాలసిస్కూడా అవసరం ఉండొచ్చు.
నివారణ : మధుమేహాన్ని నియంత్రించుకోవాలి. మూత్రం ఎక్కువ నిల్వ ఉండకూడదు. ప్రతి రెండు గంటలకు విసర్జించాలి. రోజూ సుమారుగా 1.5 నుండి రెండు లీటర్ల మూత్రం విసర్జించాలి. అందుకని మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. ఎక్కువగా మూత్రం ఆపుకోకూడదు. మూత్రం పసుపచ్చగా వస్తుంటే కామెర్లు అని అనకుంటాం. కానీ నీళ్లుతాగడం వల్ల తక్కువ తీసుకునే వారిలో ఇది కనిపిస్తుంది. నీళ్లు బాగాతీసుకుంటే ఈ రంగు రాదు. గర్భధారణ సమయంలో కూడా ఇన్ఫెక్షన్వచ్చే అవకాశముంది. గర్భంలో బిడ్డ పెరుగుతున్నప్పుడు మూత్రనాళాలపై ఒత్తిడి వల్ల మూత్రం నిల్వ ఉండి ఇన్ఫెక్షన్వస్తుంది. ఒక్కోసారి ఇన్ఫెక్షన్ అబర్షాన్కు దారితీసే అవకాశముంది. అందుకని ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. 
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి 
 *సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: