23, మార్చి 2020, సోమవారం

కరోనా అదుపులో పెట్టె ఆహారం నియమాలు మరియు జాగ్రత్త లు

కరోనా వైరస్ కి దూరంగా ఉండాలంటే... ఈ ఆహారం &జాగ్రత్తలు తీసుకుంటే సరి!అవగాహన కోసం నవీన్ నడిమింటి సలహాలు 

మన శరీరంలో ఇమ్యునిటీ పవర్( రోగ నిరోధోక శక్తి) ఎక్కువగా ఉంటే.. ఎలాంటి వైరస్ లు దరిచేరవని చెబుతున్నారు. అంటే.. ముందుగా మనం రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

ప్రపంచ దేశాలను వణికిస్తోంది కరోనా వైరస్( కోవిడ్-19). చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు భారత్ కి కూడా పాకింది. తాజాగా భారత్ లో రెండు కేసులను గుర్తించారు. ఒకటి హైదరాబాద్ లో కాగా.. మరోటి దేశరాజధాని ఢిల్లీలో.

ఈ వైరస్ సోకిన వారు తుమ్మినా., దగ్గినా కూడా మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు దీనికి ప్రత్యేకంగా మందు అంటూ ఏదీ కనిపెట్టకపోయినా.. దానిని తగ్గించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వైరస్ సోకిన వారు తుమ్మినా., దగ్గినా కూడా మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు దీనికి ప్రత్యేకంగా మందు అంటూ ఏదీ కనిపెట్టకపోయినా.. దానిని తగ్గించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే.. ఈ వైరస్ సోకిన తర్వాత మందు లేకపోయినా.. ముందు జాగ్రత్తగా రాకుండ మాత్రం చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.  కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల ఈ వైరస్ రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..
అయితే.. ఈ వైరస్ సోకిన తర్వాత మందు లేకపోయినా.. ముందు జాగ్రత్తగా రాకుండ మాత్రం చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల ఈ వైరస్ రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..
మన శరీరంలో ఇమ్యునిటీ పవర్( రోగ నిరోధోక శక్తి) ఎక్కువగా ఉంటే.. ఎలాంటి వైరస్ లు దరిచేరవని చెబుతున్నారు. అంటే.. ముందుగా మనం రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
మన శరీరంలో ఇమ్యునిటీ పవర్( రోగ నిరోధోక శక్తి) ఎక్కువగా ఉంటే.. ఎలాంటి వైరస్ లు దరిచేరవని చెబుతున్నారు. అంటే.. ముందుగా మనం రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
వెల్లుల్లి... మనం సాధారణంగా వెల్లుల్లిని వంటల్లో వాడుతూ ఉంటాం. అయితే.. ప్రస్తుతం దీనిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనిని పచ్చిగా కానీ, మెత్తగా పేస్టులాగా చేసి గానీ, లేదా ఏదైనా సూప్ చేసుకోని గానీ తాగాలని చెబుతున్నారు. ఇలా వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల  ఈ కరోనా వైరస్ నుంచి దూరంగా ఉండవచ్చని సూచిస్తున్నారు.

స్టార్ సోంపు.. దీనిని ఎక్కువగా బిర్యానీలో వాడుతుంటారు. చూడటానికి నక్షత్రంలో ఉండే ఈ మసాలా దినుసు వాడకుండా మనం అసలు బిర్యానీనే చేయరు. అయితే.. దీనిని తీసుకోవడం వల్ల కూడా శరీరంలో ఇమ్యునిటీ పవర్ పెరుగుతుందని చెబుతున్నారు. గ్రీన్ టీలో కానీ, బ్లాక్ టీలో గానీ దీనిని మరిగించి తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

అల్లం.. అల్లం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలిసిందే. అయితే... ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కచ్చితంగా అల్లం తీసుకోవాలని చెబుతున్నారు. అల్లం రసం తాగడం కానీ.. టీలో అల్లం వేసుకోవడం కానీ చేసి కూడా దీనిని తీసుకోవచ్చు.

కొబ్బరినూనె.. కొబ్బరి నూనెతో వంటలు చేసుకొని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
కొబ్బరినూనె.. కొబ్బరి నూనెతో వంటలు చేసుకొని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాదు పీనట్స్, ద్రాక్ష, రెడ్ వైన్, వైట్ వైన్, బ్లూబెర్రీస్, క్యాన్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ లాంటివి తీసుకోవాలని చెబుతున్నారు. కోకోవా, డార్క్ చాక్లెట్ లాంటివి కూడా మంచివని సూచిస్తున్నారు. అంతేకాకుండా పెప్పర్ కూడా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. స్వీట్ పొటాటో తీసుకోవడం కూడా చాలా మంచిదని సూచిస్తున్నారు. ఈ ఆహారాలు తీసుకుంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరిగి.. కరోనా దరి చేరకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

కరోనా వైరస్.. అపోహలు-నవీన్ నడిమింటి సమాధానాలు 

       కరోనా మహమ్మారికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని వాస్తవాలు కనిపిస్తుంటే, ఎన్నో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వాటన్నింటికీ ప్రశ్నా-సమాధానం తరహాలో అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు డాక్టర్  చైతన్య. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సందేశాన్ని గ్రేట్ ఆంధ్ర పాఠకుల కోసం అందించే ప్రయత్నమిది.

1) ప్రశ్న: కరోనా వైరస్ వేడికి నశిస్తుందా? భారత దేశం వంటి వేడి ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందదని వింటున్నాం కదా.
జవాబు: Flu (influenza) cases ఎండాకాలంలో తగ్గిపోయినట్టే కరోనా వైరస్ తో వచ్చే COVID-19 కూడా ఎండాకాలంలో సమసిపోతుందని కొన్ని ఆశలు లేకపోలేదు. వేడి వల్ల వైరస్ వ్యాప్తి చెందదు అనే ఆశ ఉన్నా, ఇప్పుడు ఆస్ట్రేలియా, సింగపూర్ లో చూస్తే పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. వేడి ప్రదేశమైన ఫ్లోరిడాలో కరోనా వైరస్ విజృంభించి వ్యాపిస్తుంది. ఎండాకాలంలో ఇది influenza లా సమసిపోతుందా, లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇది కొత్త వైరస్ కావడంతో ఇది ఎట్లా ప్రవర్తిస్తుందో ఇప్పుడే చెప్పలేము.  ఆధారాలు లేని విషయాలను ఊహించి ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించకపోవడం మనకు నష్టం కలిగిస్తుంది.

2) ప్రశ్న: పారాసెటమాల్ (paracetamol) తో కరోనా వైరస్ నయమవుతుందా?
జవాబు: కరోనా వైరస్ వచ్చినవాళ్లు 80% మంది జ్వరం, దగ్గు వంటి వాటితో బాధపడి కోలుకుంటారు. వాళ్లకి ఎటువంటి మందులు ఇచ్చినా, ఇవ్వకపోయినా కోలుకుంటారు. Paracetamol జ్వరం తగ్గిస్తుంది, జ్వరం వచ్చే ఏ రోగానికైనా paracetamol జ్వరం నుండి ఉపశమనం ఇస్తుంది. అంతే కాని దానితో రోగం నయం కాదు. ఉదాహరణకు మలేరియా, T.B, flu వంటి రోగాల్లో కూడా జ్వరం నుండి ఉపశమనం కోసం paracetamol వాడుతారు. అట్లానే కరోనా వైరస్ తో వచ్చే జ్వరానికి కూడా paracetamol వేసుకోవచ్చు.

కరోనా వైరస్ తో తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ లో చేరేవాళ్లకు, pneumonia (ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్) తో, ఊపిరితిత్తుల్లో నీరు నిండడంతో, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. దానికి ఆక్సిజెన్ (oxygen) అవసరం పడుతుంది. తీవ్రమైన cases లో ventilator మీద ఉంచే అవసరం పడుతుంది. Acute respiratory distress syndrome (శ్వాస వ్యవస్థ పనిచేయకపోవడం), acute cardiac injury (గుండెకు హాని జరగడం), shock (కణాలకు ఆక్సిజెన్ అందకపోవడం) కరోనా వైరస్ తో చనిపోవడానికి ముఖ్యమైన కారణాలు. వాళ్లని paracetamol తో నయం చేయలేమనేది వేరే చెప్పనవసరం లేదు.

3) ప్రశ్న: పొడి దగ్గు, జ్వరం ఉంటేనే నాకు కరోనా వైరస్ సోకినట్టా? అవి లేకపోతే నేను సేఫ్ గా ఉన్నట్టేనా?
జవాబు: కరోనా వైరస్ వ్యాధిలో ఎక్కువగా కనిపించే లక్షణాలు జ్వరం, నీరసం, పొడి దగ్గు, ఆకలి లేకపోవడం, ఒళ్ళు నొప్పులు, కఫం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. కొంత మంది రోగుల్లో తల నొప్పి, గొంతు నొప్పి, ముక్కు కారడం, వికారం, నీళ్ళ విరేచనాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో కొంత మందికి ఒకటో, రెండో లక్షణాలే ఉండవచ్చు. కొంత మందిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవచ్చు. కొంతమందిలో ఎక్కువ లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాలు చాలా మటుకు జలుబు, ఫ్లూ వంటి ఇతర వైరల్ వ్యాధుల్లో కనిపించేవే. అందుకని వ్యాధి లక్షణాలను బట్టి మాత్రమే కరోనా వైరస్ ను గుర్తు పట్టలేము. టెస్టింగ్ తో మాత్రమే ఖచ్చితంగా గుర్తు పట్టే అవకాశం ఉంది.

4) కరోనా వైరస్ వస్తే చనిపోతామా?
జవాబు: కరోనా వైరస్ వచ్చిన వారిలో 1-2% మంది చనిపోతారు. అది చిన్న సంఖ్యలా కనిపించవచ్చు. కానీ వ్యాధిని అరికట్టకపోతే కొత్త వ్యాధి కావడం వల్ల, ఎవరికీ immunity లేనందువల్ల ప్రపంచంలో 50-65% ప్రజలు కరోనా బారిన పడే అవకాశం ఉంది. ఉదాహరణకు సుమారు నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న తెలంగాణాలో వ్యాధిని అరికట్టే చర్యలు తీసుకోకపోతే రెండు నుండి రెండున్నర కోట్ల మందికి కరోనా సోకే అవకాశం ఉంది. తక్కువలో తక్కువ 1% అనుకున్నా రెండు నుండి రెండున్నర లక్షల మంది చనిపోయే అవకాశం ఉంది. అందుకే అందరూ ఈ వ్యాధిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఇచ్చే సూచనలను పాటించి అత్యవసరమైతే తప్ప ఇంటి బయటకు వెళ్లకుండా, ఇతరులతో కలవకుండా ఉండాల్సిన అవసరం ఉంది. వైరస్ బారిన పడిన వాళ్ళు 14 రోజులు అందరినుండి దూరంగా ఉండి వ్యాధి ఇంకొకరికి సోకకుండా జాగ్రత్తపడాలి.

5) కరోనా వైరస్ సోకిన వాళ్ళు చాలా మంది కోలుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి కదా. ఎందుకు దీని గురించి ఇంత భయాందోళనలు?
జవాబు: అవును పైన చెప్పినట్టు కరోనా వైరస్ వచ్చిన వారిలో 1-2% మంది చనిపోతారు. అంటే వంద లో 98-99 మంది దీని నుండి కోలుకుంటారు. అయితే వందలో పది నుండి ఇరవై మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్ లో చేరవలసిన అవసరం పడుతుంది. 60 ఏళ్ళకు పైబడిన వృద్ధులు, గుండె జబ్బులు, diabetes (షుగర్ వ్యాధి) ఉన్నవాళ్ళకు కరోనా వైరస్ సోకితే తీవ్ర అస్వస్థతకు గురయ్యి చనిపోయే అవకాశాలు ఎక్కువ. 80 % మంది స్వల్ప అస్వస్థత మాత్రమే కలిగిన ప్రజలు మామూలుగా తిరుగుతూ వృద్ధులకు, ఇతర వ్యాధులున్న వారికి వ్యాప్తి చేసి వారి మరణాలకు కారణమవుతారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా చెప్పే జాగ్రత్తలు మన గురించే కాదు మన చుట్టూ ఉన్నవాళ్ళ కోసం పాటించాల్సిన అవసరం ఉంది. ఎంత ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందో పైన రాసిన దాంట్లో మళ్లీ ఒకసారి చదవండి.

6) కరోనా వైరస్ కి మందులు లేవా? WhatsApp లో ఎన్నో చిట్టి చిట్కాలు చూస్తున్నాం కదా. ఏవో మందులతో COVID-19 నయమయిపోతుంది అన్న వార్తలు వింటున్నాం కదా?
జవాబు: కరోనా వైరస్ కి ప్రస్తుతానికి ఏమీ మందులు లేవు. చాలా దేశాల్లో రకరకాల మందులతో trials చేస్తున్నారు. కొన్ని మందులు ఎంతో కొంత పని చేసినట్టు కనిపించినా ఇప్పటివరకూ ఖచ్చితంగా కరోనా వైరస్ కి పని చేసే మందులేమీ గుర్తించబడలేదు. WHO కూడా HIV కి వాడే antivirals, ఇతర antivirals, malaria కి వాడే chloroquine తో వివిధ దేశాల్లో ఒకే సారి clinical trial మొదలుపెడుతుంది.

COVID-19 కేసులు అత్యధికంగా ఉన్న దేశాల్లో కనుగొనలేని మందులు, ఉపశమనాలు, చిట్కాలు, ఆసక్తికరంగా కరోనా వైరస్ ఇంకా పెద్దగా వ్యాప్తి చెందని భారత దేశంలో కనుగొన్నట్టు చెబుతున్నారు. అసలు కేసులు లేకుండా ఎవరి మీద ప్రయోగాలు చేసినట్టు, మందులు, చిట్కాలు పని చేస్తాయని ఎట్లా నిర్ధారించినట్టు? కరోనా వైరస్ ని నయం చేస్తున్నట్టు వచ్చే ఫేక్ మందులను, ఫేక్ చిట్కాలను తిప్పి కొట్టండి. వాటిని forward చేయడం ఆపండి. తప్పుడు భరోసాలతో ఉంటే వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశాలు ఎక్కువ.  

7) 60 కన్నా ఎక్కువ వయసున్న వాళ్ళకే కరోనా వైరస్ తో తీవ్రమైన అస్వస్థత కలుగుతుందంట కదా. తక్కువ వయసున్న వాళ్లెందుకు  జాగ్రత్తలు పాటించాలి?
జవాబు: అమెరికాలో COVID-19 తో హాస్పిటల్ పాలయిన వాళ్ళలో 40% మంది 20-54 వయసులలో ఉన్నవాళ్లే. 60 ఏళ్లకు పైబడిన వాళ్లు తీవ్ర అస్వస్థత కలిగి, చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నా కరోనా వైరస్ అన్ని వయసుల వాళ్ళకు అస్వస్థతను కలిగిస్తుంది. తీవ్ర అస్వస్థత కలిగినవాళ్లు కోలుకోవడానికి మూడు నుండి ఆరు వారాల సమయం పట్టవచ్చు.

8 ) కరోనా వైరస్ లాంటి pandemic (మహమ్మారి) ఇంతకముందు ఎప్పుడయినా వచ్చిందా?
జవాబు: 1918 లో స్పానిష్ ఫ్లూ (spanish flu) అనబడే H1N1 వైరస్ ప్రపంచంలో అయిదు నుండి పది కోట్ల మంది మరణానికి కారణమయింది. అతి వేగంగా వ్యాప్తి చెందిన స్పానిష్ ఫ్లూ ప్రపంచంలో మూడో వంతు జనాభాకు సోకింది. పరిశోధనల్లో స్పానిష్ ఫ్లూ పక్షుల నుండి మనుషులకు పాకినట్టు తెలుస్తుంది. ఇప్పటి కరోనా వైరస్ చైనా లోనో, అమెరికాలోనో ల్యాబ్ లో తయారు చేసినట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ప్రపంచంలో ఆధిపత్యం కోసం ఆ దేశాలు చేసే కుట్రల నిజానిజాలు బయటపడే రోజు బయట పడతాయి కానీ ఇట్లాంటి మహమ్మారి వందేళ్ళ క్రితమే ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.

9) భారత దేశంలో కరోనా వైరస్ కేసులు 200 మాత్రమే ఉన్నాయి. దీనికే ఇంత ఆందోళన ఎందుకు?
జవాబు: ఒక దేశంలో 200 కేసులు, మరో దేశంలో 2000 కేసులు ఉంటే రెండో దేశంలో epidemic పదింతలు ఉన్నట్టు కాదు. కరోనా వైరస్ కేసులు ప్రతి ఆరు రోజులకు డబుల్ అవుతాయనేది ఇప్పటివరకూ ఉన్న డేటా ను బట్టి తెలుస్తుంది. అంటే మొదటి దేశం రెండు మూడు వారాల్లో రెండో దేశం ఉన్న దశకు చేరుకోనుందని అర్థం. ఫిబ్రవరి 27 న మొదటి community transmission కేసు (అంటే ఎవరి నుండి వైరస్ సోకిందో తెలియని కేసు) నమోదు చేసుకున్న అమెరికాలో ఈరోజు 18,000 కు పైగా కేసులు నమోదయినాయి. టెస్ట్ కిట్ల కొరతతో తీవ్రమైన పరిస్థితిలో ఉన్నవాళ్లనే ఎక్కువగా టెస్ట్లు చేస్తున్న సందర్భంలో నమోదయిన నంబర్లివి.

ఇదంతా చెప్పేది ఆందోళన పెంచడానికి కాదు. ఈ మహమ్మారిని సరిగా అర్థం చేసుకొని సరైన జాగ్రత్తలు తీసుకోవడానికి. అందరూ అప్రమత్తంగా ఉండి వైరస్ వ్యాప్తి చెందకుండా చేయగలిగితే అంతకన్నా కావలసింది ఏముంది? చైనా తీసుకున్న తీవ్రమైన, ఖచ్చితమైన చర్యల వల్ల, ప్రజలు అన్ని జాగ్రత్తలూ పాటించడం వల్ల అక్కడ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్ట గలిగారు.

ఇదంతా చైనా తప్పో, మన దేశం లోకి ఇంకో దేశం నుండి వచ్చిన వాళ్ళ తప్పో అని నిందించుకోవాల్సిన సమయం కాదిది. ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన కాలంలో మనం జీవిస్తున్నాం. ఎన్నో దేశాలు పర్యటించాలని ఆశపడుతూ, వీలయినన్ని దేశాలు తిరుగుతూ, అన్ని దేశాల్లో తయారవుతున్న టెక్నాలజీ, విలాస వస్తువులను అనుభవిస్తున్న ప్రజలు, రోగాలు వచ్చినప్పుడు మాత్రం ఎవరినో ఒకరిని నిందించడం సరైనది కాదు. COVID-19 ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 'చైనీస్ వైరస్' అని పిలవడం అతని జాత్యహంకారాన్ని, అసహన భావాన్ని తెలియజేస్తుంది. అట్లాంటి ద్వేషపూరిత ఆలోచనల నుండి మనం దూరంగా ఉందాం. ఆందోళన పెరిగినప్పుడు ఎదుటివాళ్లను నిందించడం చాలా సులువు. కానీ మనమందరం ఈ విపత్తులో కలిసి ఉన్నామనేది మనం మరువకూడని సమయమిది. Humans are more alike than different. ఎంత భయాందోళనలో అయినా మన మనిషితనాన్ని కోల్పోకుండా ఉండగలిగితే, ఇలాంటి సంక్షోభ సమయాలను కలిసికట్టుగా ఎదుర్కోగలుగుతాం.

కరోనా వైరస్  విషయమై కొన్ని అతి ముఖ్యమైన సూచనలు 
        **************************

*1). పాల ప్యాకెట్లను శుభ్రంగా కడిగి మాత్రమే తదుపరి ఉపయోగించండి*.

*2 ). సాధ్యమైనంతవరకు న్యూస్ పేపర్లను వచ్చేనెల అంతం వరకు ఉపయోగించకండి*
.
*3 ). ఒక నెల రోజుల పాటు జొమాటో స్విగ్గి లను సాధ్యమైనంత వరకూ ఊ వినియోగించ కండి*
.
*4 ). ఇంటికి తీసుకువచ్చిన కూరగాయలను పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఉపయోగించండి*
.
*5 ). ఎక్కువగా వ్యాధి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న సెల్ ఫోన్ మరియు రిమోట్ లను కనీసం రోజుకు ఒకసారి  క్లీనింగ్ ఫ్లూయిడ్ తో శుభ్రపరచాలి*
.
*6 ). ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు గానీ కనీసం గంటకు ఒకసారి సబ్బుతో గాని శానిటైజర్ తో గాని చేతులను శుభ్రపరుచుకోవాలి*
.
*7 ). పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం సాధ్యమైనంతవరకు అవాయిడ్ చేయండి*.

*8 ).జిమ్ములను స్విమ్మింగ్ పూల్ ను ఇతర ఎక్ససైజ్ ప్లేస్ ను ప్రైవేట్ లను డాన్స్ క్లాసులను సంగీత క్లాసులను అవాయిడ్ చేయండి*
.
*9 ). బయటకు వెళ్లి వచ్చిన వెంటనే మీ బట్టలను తొలగించి దూరంగా ఉంచి కాళ్ళను చేతులను అతి శుభ్రంగా కడుక్కోండి*

*10 ). అతి ముఖ్యమైన విషయం పూర్తిగా చేతులను శుభ్రపరచకుండా మీ ముఖమును అందలి భాగములను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దు*
.
*11 ).  పనిమనుషులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళను పూర్తిగా చేతులు కాళ్ళు కడుగుకొని తదుపరి పని చేయమని చెప్పండి వారిని మెయిన్ గుమ్మాలు కానీ గోడలు కానీ తాకకుండా ఉండేటట్లు చూడండి. వారికి కూడా శుభ్రత విషయంలో కౌన్సిలింగ్ ఇవ్వండి*

*12 ). అతి ముఖ్యమైన రెండో స్టేజ్ నుండి మూడో స్టేజ్ కి వెళ్లే  పరిస్థితుల్లో మన దేశం ఉంది ఇటలీ లాంటి అడ్వాన్స్డ్ కంట్రీ కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది అంటే మనదేశంలో ఆ పరిస్థితి వస్తే ఎంత  దయనీయంగా ఉంటుందో ఆలోచించండి దయచేసి తేలికగా తీసుకోకండి*
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: