లివర్ సిరోసిస్ నివారణ కు -ఆయుర్వేదం మందులు అవగాహనా కోశం నవీన్ నడిమింటి సలహాలు
లివర్ సిరోసిస్ -ఆయుర్వేదం
మనిషిలోని శక్తికి మూలాధారం కొవ్వు అయితే శరీరంలో కొవ్వు శాతం ఎక్కువైనా ,తక్కువైనా ఏ రెండు స్థితులు అనారోగ్యదాయకమై అనేక రుగ్మతలకు దారి తీస్తుంది. శరీరంలో కొవ్వు ఎక్కువైతే ,బరువు పెరిగి, గుండె సబంధిత వ్యాధులు గురవుతారు. అదే కొవ్వు కాలేయంలో పేరుకుపతే,దానిని ఫ్యాట్ లివర్ అని అంటారు. లివర్లో కొవ్వు పేరుకుపోవడం వలన దాని పనితనంతో ,లోపం ఏర్పడి గట్టిపడి వాపు చెంది పెద్దదవుతుంది. ఇలా గట్టి పడడంఎక్కువైతే ,చివరకు లివర్ సిరోసిస్ కి దారి తీస్తుంది. అప్పుడే అది ప్రాణాపాయ స్థితి అవుతుంది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించటమే దీని ఉదేశ్యం .
లివర్ విధులుమన శరీరంలో ఉన్న అవయవాలన్నింటిలో కెల్లా కాలేయం చాల పెద్దది .దీనిని లివర్ అంటారు. శరీరంలో జరిగే అనేక రకాల జీవ రసాయనిక క్రియలకు పనికి వచ్చే దాదాపు వెయ్యి ఎంజమ్స్ ని ఈ లివర్ ఉత్పత్తి చేస్తుంది.
రోగనిరోధక శక్తీ నిచ్చే యాంటీ బాడీస్ ని లివర్ ఉట్పతి చేస్తుంది. మనం నిత్యం తీసుకొనే అనేకరకాలైన
ఆహార పదార్ధాలను జీర్ణం చేయడంలోను, శరీరంలో ఉన్న కొవ్వును కరిగించటానికి ,శరీరానికి హాని క్రిములను నాశనం చేయడంలోనూ ,రక్తాన్ని అవసరమైన సమయంలో గడ్డ కట్టకుండా చేయడంలోనూ ,మనం నిత్యం ఆడుకొనే మందులలో విషతుల్యమైన ,రసాయనాలను ఫిల్టర్ చేయడంలోనూ ,ఆటల సమయంలోకండరాలకు అవసరమైన శక్తినందిచటంలోనూ ,కంటి చూపు బాగా ఉండడానికి ,శరీరంలో ని వ్యర్ధ పదార్ధాలను ,యూరియా రూపంలో ,మూత్రం ద్వారా బయటకు పంపించటంలోనూ ,ఇంకా శరీరంలో జరిగే అనేక రకాలైన కార్యక్రమంలో లివర్ ప్రముకమైన పాత్ర పోషిస్తే మరియు గుండెకు సంరక్షణ కావటం లాగ పని చేస్తుంది.
ఫ్యాట్ లివర్
శారీరక శ్రమ లేని కారణంగా ,అత్యధికంగా కొవ్వు పదార్ధాలను ఎక్కువ తీసుకోవడం వలన ,శరీరంలో కొవ్వు ఎక్కువుగా పేరుకుపోయి ఉంటుంది. అదే లివర్లో కూడా ఎక్కువైతే ఫ్యాటీ లివర్ ఏర్పడుతుంది. కొవ్వును కరిగించటంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ఫ్యాటీ లివర్ వలన ఈ ప్రక్రియలో లోపం ఏర్పడి ,తద్వారా లివర్ వ్యాధి గ్రస్తంగా మారుతుంది. చివరికి లివర్ సిరోసిస్ గా మారుతుంది. ఈ ఫ్యాటీ లివర్ ఏర్పడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రధానంగా శరీరం బరువు ఎక్కువుగా ఉండడం ,అతిగా మద్యం సేవించటం ,మధుమేయం నియంత్రణలో లేకపోవడం ,ట్రిగ్లిజరైడ్స్ లాంటి,హైపర్ కొలస్ట్రేమియా ఎక్కువుగా ఉన్నవారిలో ,పోష్టకాహారలోపంలోపం ఉన్న వారిలో ,శరీరంలో విటమిన్లు ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువుగా ఉన్నవారిలో ,వాల్ప్రాయిల్ యాసిడ్ మందులు ఎక్కువువగా వాడే వారిలో మరియు ఆడవాళ్లు కొన్ని సందర్భంలో గర్భం దాల్చినప్పుడు ,ఈ ఫ్యాటీ లివర్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఏ కారణంగా ఫ్యాటీ లివర్ వచ్చిందో సరైన సమయంలో గుర్తించి ,చికిత్స చేయించుకున్నట్లు అయితే ,లివర్ సిరిసిస్ బారాన పడకుండా జాగ్రత్త పడవచ్చు.
లివర్ సిరోసిస్ అంటే ?
మనం నిత్యం తీసుకొనే అనేక రకాలైన ఆహారపదార్ధాలలోని ,విషపూరిత వ్యర్ధ మలిన పదార్ధాలను బయటకు పంపించి ,సహజ విసర్జక వ్యవస్థ మన శరీరంలోనే ఉంది. విషపదార్ధాలు శరీరం నుండి విసర్జించే పదహతి ని డ్-టాక్సిఫికేషన్ అని అంటారు. రసాయనిక పదార్ధాలు ,పాస్టుఫుడ్స్, ఆల్కహాల్ ,స్ట్రాస్ తో కూడిన తిళ్ళు, ఆహరం ద్వారా ఏర్పడే విషపూరిత వాయువులు ,పదార్ధాలు ఎక్కువై పేరుకుపోతున్నప్పుడు ,సహజ విసర్జక వ్యవస్థ పనిచేయడం ద్వారా చాల కష్టంగా మారుతుంది. దీని వల్ల జీవన చర్యలు మందగించి ,జీర్ణవ్యవస్థ లో హార్మోన్స్ వ్యవస్థ లో మరియు విసర్జక అవయవాల పనితీరు అస్తవ్యస్తంగా మారి శరీరం అనేక రుగ్మతలకు దారి తీస్తుంది. విసర్జక వ్యవస్థలో అతి ముఖ్యమైనది కాలేయం. కాలేయంలో ని కణజాలం దెబ్బత్తింటే ,రక్తం ద్వారా తనలో ప్రవేశించే విష పదార్ధాలను ,తొలగించుకోలేని స్థితి ఏర్పడుతుంది. లివర్కు ఏర్పడే ఈ స్థితినే లివర్ సిరోసిస్ అని అంటారు.లివర్ క్రమంగా వ్యాధి గ్రస్తం అవుతూ ,తను నిర్వహించవలసిన అతి ముఖ్యమైన పనులను
సమర్ధవంతంగా చేయలేకపోవడం జరుగుతుంది. శరీరంలో ప్రతి క్షణం జరిగే అనేక రసాయనిక ప్రక్రియ
లలో అంతరాయం ఏర్పడి ,క్రమంగా లివర్ పెద్దది డియోడినంపై ఒత్తిడి పెరిగి ఆ పైన పేయిబ్రోస్గా మారుతుంది. తద్వారా కాలేయం పరిమాణం చిన్నదెయి ,వీనస్ సర్క్యులేషన్కు ఆటంకం ఏర్పడి ,కడుపులో నీరు చేరి ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది.
కారణాలు ;-
లివర్ సిరోసిస్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యముగా కనిపించేవి ఇవి. కొవ్వు అధికంగా ఉండే ఆహరం తీసుకోవడం వలన కాలేయంలో ఫ్యాటీ లివర్ ఏర్పడి తరువాత లివర్ సిరోసిస్ గా మారుతుంది. హేపీటైటిస్ వ్యాధులైన పచ్చ కామెర్లు ,హేపీటైటిస్ బి,సి లాంటి వ్యాధులు సక్రమించినప్పుడు సరైన చికిత్స చేయించినట్లు అయితే ఆ తరువాత వాటి దుష్పలితం గా లివర్ వ్యాధి గ్రస్తమై ,లివర్ సిరోసిస్ వస్తుంది. రసాయనాలు కలిగిన మందులు అతిగా వాడడం వలన, అతిగా మద్యం సేవించటం వలన ,మధుమేయం నియంత్రణలో లేని వారిలో లివర్ సిరోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. ఆల్కహాల్ అలవాటు లేకపోయినా ,శరీరం అధిక బరువు కారణంగా స్టేతో హేపీటైటిస్ వచ్చేవారిలో లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం ఉంది. ఒకేసారి అధిక బరువు తగ్గిన ,పోషకాహారలోపం వలన కూడా లివర్ సిరోసిస్ రావచ్చు. ఆడవారిలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లోపం వలన కూడా లివర్ సిరోసిస్ అవకాశం ఉంది.
లక్షణాలు
లివర్ సిరోసిస్ వ్యాధి సక్రమించినప్పుడు లక్షణాలు ఒకొకటి నిదానంగా బయట పడతాయి. శరీరం మీద అక్కడక్కడా రాతి మచ్చలు ఏర్పడతాయి. ఛాతీపై భాగంలో సాలెగూడులా ఉబ్బెత్తున కనిపిస్తాయి. శరీరం పాలిపోయినట్లుగా ఉంటుంది. దురదలు,నల్లబడటం ,బాగా నీరసంగా ఉండటం ,పెదాల రంగు మారటం ,కడుపు కుడి భాగంలో నొప్పి రావటం తరుచుగా జవరం ,చలి ఉంటాయి. ఆకలి క్రమంగా తగ్గిపోవడం ,క్రమంగా బరువు తగ్గిపోవడం, అజీర్తి, మలబాధకం, ఒళ్ళంతా నొప్పులు, మలం రంగులో తేడాలు,ముదురు రంగులో మూత్రం ముఖం, పొట్ట, కాళ్ళు, వాపులు కనిపించవచ్చు. రక్తపు వాంతులు అవ్వవచ్చు. కడుపులో కి నీరు చేరి కడుపు ఉబెతుగా మారుతుంది. కడుపు అంత ఉబ్బరంగా ఉంటూఉంది. శరీరం రంగు మారి పొడి బారి నట్లుగా ఉంటుంది. రక్తహీనత ఏర్పడుతుంది. కాలేయ కణజాలం దెబ్బతిన్న కారణంగా హార్మోనుల ఉత్పత్రిలో తేడాలు వచ్చి పురుషులలో రొమ్ములు పెరగవచ్చు. వృనాలు కుచించుకుపోవచ్చు .సెక్స్ కోరికలు తగ్గి నపుంసక లక్షణాలు ఏర్పడవచ్చు.
వ్యాధి నిర్ధారణ ;-లివర్ సిరోస్ వ్యాధి ని కచ్చితంగా నిర్ధారిండానికి పలు రకాల పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది. ముందుగా లివర్ పంక్షన్ టెస్టు చేయించాలి. దీనిని ల,ప్,ట్,అని అంటారు. సీరం ఎనాలిసిస్ ,సీరం బిలుర్బిన్ ,n జి,ఓ ,టి , ఎస్,జి ,పి టి, గా మా జి టి ,ఈటెస్టుల్లో ఒక్కటి అయినా పాజిటివ్ వస్తే ,లివేసిరోస్ గుర్తించవచ్చు. ఎండోస్కోపీ ద్వారా కాలేయంలో దెబ్బ తిన్న కాలేయపు కణజాలాన్ని చిన్న ముక్కతీసి బయప్స్ అనే పరీక్షా చేసి వ్యాధి నిర్ధారించవచ్చు.
సంరక్షణ ;-
ప్రివెన్షన్ బెటర్ థన్ క్యూర్ రోగం వచ్చాక బాధపడటం కంటే రోగం రాకుండా జాగ్రత్త పడడంచాలా ఉత్తమం. లివర్ సిరోసిస్ వ్యాధి రావడానికి ప్రధాన కారణం స్తూలకాయం మరియు కొవ్వు కలిగిన ఆహారపదార్ధాలను ఎక్కువుగా తీసుకోవడం వలన కాలేయం లో కొవ్వు పేరుకుపోయి లివర్ సిరోసిస్ వ్యాధి వస్తుంది. కాబట్టి కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని బాగా తగ్గించి తీసుకోవాలి. మద్యపానం ఎటువంటి పరిస్థితులలో తీసుకోరాదు. మధుమేయం ఉంటే ఎప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. ఎన్నో రకాల ఆహార పదార్ధాలకు కొవ్వు ముఖ్య కారణం .కాబట్టి ,కొన్ని రకాల ఆహారాలు అలవాట్లు శరీరంలో కొవ్వును పెంచుతాయి. కనుక శరీరంలో కొవ్వును పెరగకుండా జాగ్రత్త పడితే జీవితాంతం లివర్ సిరోసిస్ బారిన పడకుండా ఉండవచ్చు.
లివర్ సిరోసిస్ -ఆయుర్వేద చికిత్స
ఏ లివర్ సిరోసిస్ వ్యాధి ని సకాలంలో గుర్తించి ,చికిత్స చేయనట్లు అయితే ,తరువాత లివర్ కాన్సర్, అసైటిస్మొదలగు ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుంది.లివర్ సిరోసిస్ వలన కాలేయపు కణజాలం బాగా దెబ్బత్తింటే ,ఆధునిక వైద్య విధానంలో ,కాలేయ మార్పిడి తప్ప, పర్మినెంటు క్యూర్ చేయగల ఔషధాలు ఇంకా కనుగొనబడలేదు. అయితే మన ప్రాచీన సంప్రదాయం భారతీయ వైద్య విధానంలో లివర్ సిరోసిస్ వలన దెబ్బతిన్న కాలేయపు కణజాలాన్ని పూర్తి బాగుచేయగలిగిన అత్యంత అద్భుతమైన మూలికలు ఉన్నాయి. ఏవి రోగి తత్వాన్ని బట్టి పని చేస్తాయి. లివర్ సిరోసిస్ లో ఉపయోగపడే మూలికలు ఈ విధంగా ఉన్నాయి.. అనుభతయోగం ,ఫిల్లఅంతాన్నిరూరి, ఖలామెకి బెర్బరీస్ అరిస్టాట,ధారుహరిద్రా, కటుక రోహిణి ,పునర్నవ, ఆకుపత్రి, పెన్నేరు, శతావరి కోడిసపాల, బృగరాజ్ ,పుష్కరములం ,దాతుకి పుష్ప, ఛవ్యము ,చలువ మిరియాలు, నల్లపసుపు, నల్లజీలకర్ర, దేవదారు, అతిభల, అతిమడఁజూరం మొదలగు వానిని సమానంగా తీసుకొని దంచి, వస్త్ర గాలితం,గావించి,త్రీపల కాషాయం తో ముప్పై ఆరు సార్లు భావన మడ్డనలు గావించి,శెనగలు వలె మాత్రలు చుట్టి, కలబంద రసం అనుపానం గా ఉదయం సాయంత్రం నాలుగు మండలాలు సేవించిన,గట్టిబడిన కాలేయ కణజాలం మెత్త బడి పూర్వపు స్థితికి వచ్చి లివర్ సిర్రోసిస్ పూర్తిగా నిర్ములించబడుతుంది
ఆయుర్వేద శాస్రియ ఔషధాలు ;
చింతామణి చతుర్ముఖరసం ,బృంగరాజసవం, కుమార్యాసవం, పిప్పలీఆసవం,గుడూచిసత్వం, పంచాతిక్తక్యాధచూర్ణం ,సురాశారాకాసిసభస్మం, పునర్న వాది మందిరం, సప్తామృత లోహం,సీలాదిత్యది-లోహం మొదలగు ఔషధాలు ,మంచి నిపుణత కలిగిన వైద్యుని పర్యవేక్షణలో ఉపయోగించాలి. వినితో పాటు వాతాహర చికిత్సలు భజోవార్ధక్యాచికిస్థలు, అగ్నివర్ధక చికిత్సలు ,ధాతువర్ధక చికిత్సలు పంచకర్మ చికిత్సలు, చేయిస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి లివర్ సిరోసిస్ కూడా నివారణ కాబడుతోంది. గావించి, త్రిఫల కషాయం తో ముప్పే ఆరు సార్లు భావన మర్దనలు కావించి ,సనగలవలె మాత్రలు చుట్టి కలబంద రసం అనుపానం గా ఉదయం సాయంత్రం నాల్గు మండలాలు సేవించిన ,గట్టి బడిన కాలేయ కణజాలం మెత్తబడి పూర్వపు స్థితికి వచ్చి లివర్ సిరోసిస్ పూర్తిగా నిర్ములించబడుతుంది. .
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి