మొదట్లో స్పష్టంగా ఉన్నందున మూత్రంలో రక్తస్రావం గుర్తించబడదు. ఇది గమనించినప్పుడు, వెంటనే తనిఖీ చేసి, కారణాన్ని కనుగొనండి. నివేదికను చూసిన తరువాత, దానికి కారణమేమిటి మరియు ఎంత ప్రాణాంతకం అని వైద్యుడు నిర్ణయిస్తాడు. హెమటూరియాకు స్పష్టమైన కారణం లేదు. ఈ సమస్యను కౌమారదశ నుండి ఎనభైల వరకు ఏ వయసులోనైనా అనుభవించవచ్చు. రండి, దీనిపై మరింత సమాచారం చూద్దాం….
మీ మూత్రంలో రక్తం కనపడడాన్ని వైద్యపరంగా హెమటూరియా అని పిలుస్తారు. మరియు ఈ రకమైన సమస్యకు వివిధరకాల ఆరోగ్య పరిస్థితులు మరియు వ్యాధులు కారణం కావచ్చు. వీటిలో కాన్సర్, మూత్రపిండ వ్యాధి వంటి అరుదైన రక్త రుగ్మతలు మరియు అంటురోగాలు కూడా ఉన్నాయి. మూత్రంలో కనిపించే రక్తం మూత్రపిండాలు, గర్భాశయం, మూత్రాశయం లేదా మూత్రాశయ ప్రారంభ ప్రాంతమైన యురెత్రా నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాసం హెమటూరియా యొక్క రకాలు, కారణాలు మరియు లక్షణాల గురించిన వివరాలతో కూడుకుని ఉంటుంది.
హేమాటూరియా అనేది ఎర్ర రక్త కణాలు (ఆర్‌బిసి) మూత్రంలో కనిపించే పరిస్థితి. మన శరీరంలో రక్తం రక్త నాళాల ద్వారా మాత్రమే ఒక వైపు నుండి మరొక వైపుకు ప్రవహించాలి. మంచి రక్తాన్ని మోసే మరియు రక్తాన్ని తీసుకువెళ్ళే ఇతర నాడీ వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి సాధారణ పరిస్థితులలో మూత్రం లేదా ఇతర అవయవాలకు రక్త స్రావం జరుగుతుంది. అయినప్పటికీ, కొన్ని సమస్యల కారణంగా ఎర్ర రక్త కణాలు కొన్ని ముఖ్యమైన అవయవాల నుండి లీక్ కావచ్చు.
1. స్థూల హెమటూరియా - మీ మూత్రం పింక్ లేదా ఎరుపు రంగులో కనిపిస్తుంది. అలాకాకుండా రక్తం యొక్క చాయలు కలిగి ఉంటే, దానిని గ్రాస్ హెమటూరియా అని పిలుస్తారు.
2. మైక్రోస్కోపిక్ హెమటూరియా - ఈరకం హెమటూరియాలో, మూత్రంలో రక్తం యొక్క నిల్వలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, కంటికి కనిపించదు. ఇది సూక్ష్మదర్శినిలో మాత్రమే కనిపిస్తుంది.
1. మూత్రపిండాలు లేదా మూత్రాశయంలో రాళ్ళు
2. మూత్ర మార్గ సంక్రమణ
3. పైలోనెఫ్రిటిస్ (కిడ్నీ ఇన్ఫెక్షన్)
4. పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి
5. మూత్రాశయ క్యాన్సర్
6. ప్రోస్టేట్ గ్రంథి యొక్క అధిక వాపు
7. అధిక శారీరక వ్యాయామం
8. మూత్రాశయంలో రాళ్ళు
9. కాథెటర్ చొప్పించడం వల్ల కలిగే గాయం నుండి రక్తం కారుతుంది
10. వంశపారంపర్య కారణాలు
11. సికిల్ సెల్ అనీమియా వంటి కిడ్నీ వ్యాధులు
12. సైక్లోఫాస్ఫామైడ్, పెన్సిలిన్, ఆస్పిరిన్ మొదలైన మందులు.
మూత్రంలో రక్తం కనపడుటకు గల కారణాలు ప్రధానంగా మూత్రాశయం లేదా మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం. మూత్రంలో ఖనిజాలు స్ఫటికీకరించినపుడు కిడ్నీ లేదా మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడతాయి. ఈ రాళ్ళు మూత్రపిండాలు మరియు మూత్రాశయాలలో అడ్డుపడడం మూలంగా హెమటూరియా సంభవించవచ్చు, క్రమంగా మూత్రనాళంలో నొప్పి కలిగే అవకాశాలు ఉన్నాయి.
హెమటూరియా యొక్క మరొక సాధారణ కారణంగా మూత్రపిండ వాపు వ్యాధి లేదా మూత్రపిండ వ్యాధి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్య స్వతహాగా మూత్రపిండాలలోనే ఏర్పడడం, లేదా, మధుమేహం వలన సంభవించడం జరుగుతుంది.
మూత్రపిండం లేదా మూత్రాశయ సంక్రమణ అనేది బ్యాక్టీరియా, యురెత్రాలో చేరినప్పుడు సంభవిస్తుంది. యురెత్రా, మూత్రాశయం ద్వారా మూత్రాన్ని శరీరం నుండి బయటకు పంపడానికి దోహదం చేస్తుంది. ఇక్కడ బ్యాక్టీరియా మూత్రాశయంలోకి మరియు మూత్రపిండాలలోనికి తరలడం ద్వారా సంక్రమణలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇది అతిమూత్రవిసర్జన మరియు మూత్రంలో రక్తపు చాయలకు కారణమవుతుంది.
మధ్య వయస్కులు లేదా పెద్దవాళ్ళు ఎక్కువగా విస్తరించిన ప్రొస్టేట్ కలిగి ఉంటారు. ప్రొస్టేట్ గ్రంధి కేవలం మూత్రాశయం మరియు యురెత్రా సమీపంలో ఉంటుంది. కాబట్టి, గ్రంధి పెద్దదిగా మారినప్పుడు, అది యురెత్రా అణిచివేతకు గురవుతుంది. క్రమంగా ఇది మూత్రవిసర్జన సమస్యలకు కారణమవుతుంది మరియు మూత్రాశయం పూర్తిగా విసర్జించడo నిరోధించవచ్చు. తద్వారా మూత్రనాళాల సంక్రమణ సంభవిoచి, మూత్రంలో రక్తం చాయలు కనపడవచ్చు.
మూత్రంలో రక్తం కలిగించే కొన్ని మందులుగా పెన్సిలిన్, ఆస్పిరిన్, హెపారిన్, వార్ఫరిన్ మరియు సైక్లోఫాస్ఫామైడ్ ఉన్నాయి.
మూత్రాశయ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు మూత్రపిండాల క్యాన్సర్ కూడా మూత్రంలో రక్తంకనపడుటకు కారణాలుగా ఉన్నాయి.
ఇతర సాధారణ కారణాలలో మూత్రాశయం, మూత్రపిండము లేదా ప్రొస్టేట్ ప్రాంతాలలో కణితి ఏర్పడడం, సికిల్ సెల్ అనీమియా మరియు సిస్టిక్ కిడ్నీ వ్యాధి, ఏదైనా ప్రమాదం మరియు తీవ్రమైన వ్యాయామాల కారణంగా మూత్రపిండాల గాయం వంటి సంక్రమిత వ్యాధులు ఉన్నాయి.
ఒక స్పష్టమైన లక్షణంగా మీ మూత్రంలో రక్తం కనపడడం మరియు సాధారణ పసుపు రంగు లేకపోవడంగా ఉన్నాయి. క్రమంగా మీ మూత్రం యొక్క రంగు ఎరుపు, గులాబీ లేదా గోధుమ-ఎరుపు కావచ్చు.
మీరు కిడ్నీ ఇన్ఫెక్షన్ భాదితులుగా ఉంటే, జ్వరం, చలి మరియు వెన్నునొప్పి ఉండే అవకాశాలు ఉన్నాయి.
మూత్రపిండ వ్యాధి కారణంగా హెమటూరియా విషయంలో, సంబంధిత లక్షణాలుగా శారీరిక బలహీనత, శరీర వాపు మరియు అధిక రక్తపోటు ఉన్నాయి. మరియు మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడడం వలన హెమటూరియా ప్రధాన లక్షణంగా పొత్తికడుపు నొప్పి కూడా ఉండవచ్చు.
మీరు మీ మూత్రంలో రక్తం గుర్తించిన వెంటనే వైద్య సంరక్షణను తీసుకోవలసి ఉంటుంది. అలాగే, మీరు తరచూ మూత్రవిసర్జన చేస్తుంటే, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, లేదా పొత్తికడుపు నొప్పిని ఎదుర్కోవడం కూడా హెమటూరియా యొక్క సూచనగా ఉంటుంది.
శారీరిక పరీక్షలలో భాగంగా, మొదటిసారిగా మీ వైద్యుడు మీ గత వైద్య చరిత్ర గురించి అడగడం పరిపాటి. క్రమంగా యూరినాలసిస్ అనే మూత్రపరీక్ష జరుపబడుతుంది, దీని ద్వారా, రక్తం స్థితిగతులు, కారణాలు తేటతెల్లమవుతాయి.
ఇమేజింగ్ పరీక్షలైన సి.టి లేదా ఎం.ఆర్.ఐ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్, సిస్టోస్కోపీ మరియు మూత్రపిండాల బయాప్సీలను కూడా సిఫారసు చేయబడుతాయి.
మీరు లక్షణాలను విస్మరించినట్లయితే, చికిత్సకు అందుబాటులో కూడా ఉండని పరిస్థితులు దాపురించవచ్చు. మరియు సమయానికి చికిత్స అందని పక్షంలో, మూత్రపిండ వైఫల్యానికి సైతం దారితీస్తుంది. సరైన సమయంలో చికిత్స, లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
మూత్రపిండ సంబంధిత సమస్యలు మరియు మూత్రపిండాలలో రాళ్ళను నిరోధించడానికి ప్రతిరోజూ తగినంత నీటిని పుష్కలంగా శరీరానికి అందిస్తుండాలి.
లైంగిక సంభోగం తర్వాత, అంటువ్యాధులను నిరోధించడానికి తక్షణమే మూత్ర విసర్జన చేయడం మంచిది. ఇరుపక్కల ఆరోగ్యకర వాతావరణం ఉన్నప్పుడు సమస్యలేదు కానీ, సక్రమంకాని, మరియు తెలియని వ్యక్తులతో లైంగిక కార్యకలాపాలు, వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది.
మూత్రపిండాలలో మరియు మూత్రాశయాలలో రాళ్లను నివారించడానికి అధిక సోడియం గల ఆహారాన్ని నివారించండి.
మూత్రాశయ క్యాన్సర్ నిరోధించడానికి ధూమపానానికి, కాలుష్య కోరల జీవనానికి వీలైనంత దూరంగా ఉండేలా ప్రణాళికలు అవసరం.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి