అరికాళ్లకు పగుళ్లుకు- ఆయుర్వేద పరిష్కారం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
శీతాకాలంలో పాదాలు ఎక్కువగా పగులుతాయి. పాదాల పగుళ్ళు సాదారణంగా పొడి చర్మము ఉన్న వాళ్ళకి, మధుమేహ వ్యాధి గల వారికి ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు..కారణాలు తెలుసుకొందాం..
కారణాలు:
1. శరీరములో అధిక వేడి, పొడి చర్మం, ఎక్కువ సేపు నిలబడి పనిచేయువారికి సాదారణంగా వస్తుంటాయి.
కఠిన నేలపై నడవడం కూడా ఒక కారణమే. ఎత్తైన చెప్పులు ధరించి నడవడంతో పాదల వద్ద రక్తప్రసరణ సరిగా జరగదు. అలాగే అధిక బరువు కలిగిఉండడం, పోషకాహార లోపము పాదాల పగుళ్ళకు కారణమౌతున్నాయి...అలాంటి వారు కొన్ని నివారణోపాయాలు పాటిస్తే పాదాల సౌందర్యం మీసొంతం అవుతుంది.
నివారణోపాయాలు:
1. ఇంటిపని, వంటపని చేస్తున్నప్పుడు మెత్తని స్పాంజ్ తో తయారు చేసిన స్లిప్పర్స్ వాడాలి.
2. రోజూ నిద్రించటానికి ముందు కాళ్ళను శుభ్రపరుచుకుని తుడుచుకోవాలి.
3. పగుళ్ళపై కొబ్బరి నునేతో మృదువుగా మర్దన చేసి మందంగా ఉండే సాక్సులు ధరించాలి.
4. వారానికి ఒక్కసారి శుభ్రంగా పాదాలను సబ్బుతో కడగాలి. ఒక చెంచా క్యుటికల్ క్రిము లేదు రెండు చెంచాలా ఆలివ్‌ఆయిల్, రెండు చెంచాల నిమ్మరసం లేదా ఐదు చుక్కుల గ్లిజరిన్ బాగా కలిపి చేతులకు పాదాలకు రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటిలో హెర్బల్ షాంపు వేసి 15 నిమిషాల పాటు నాన బెట్టాలి. ఇలా చేయడం ద్వారా పాదాలమీద వున్న మురికి అంతా మెత్తబడి తొలగిపోతుంది.
5. ప్రతిరోజూ ఉదయం పాత బ్రష్ తో రుద్ది గోరువెచ్చని నీటిలో కడిగితే మురికి, మ్రుతకనలు పోయి నున్నగా తయారవుతాయి.
6. అరటిపండును ముద్దగా చేసుకొని పగుళ్ళ పై రాసి పదినిముషాలు వుంచి తరువాత నీటితో శుభ్రపరచుకుంటే పాదాలు మెట్టబడతాయి.
7.గోరువెచ్చని నీటిలో కొంచెము నిమ్మరసం వేసి అందులో పాదాలను వుంచి పది నిముషాలు తరువాత మామూలు నీటితో శుభ్రపరచుకుంటే పగుళ్ళ నొప్పి తగ్గుతుంది.
8. ప్రతి రోజు సాయంత్రం రోజ్ వాటర్ ను పళ్ళెం లో వేసి పది నిముషాలు పాదాలు ముంచి ఉంచితే మృదువుగా తయారవుతాయి.
9. నిమ్మరసం వ్యాజ్ లైన్ వేసిన గోరువేచ్చని సబ్బుద్రావనం లో పాదాలను పెట్టి 10 నిముషాలు అయ్యాక పొడి వస్త్రంతో తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్ రాయాలి .
10. రోజూరాత్రిపూట హేండ్ క్రీమ్ కొద్దిగా నిమ్మరసంతో కలిపి పాదాలకు రాసుకుంటే మృదువుగా నునుపుగా ఉంటాయి. కాలిమడమలో తీవ్రమైన పగుళ్ళు ఉంటే నైట్ పెట్రోలియం జెల్లీ రాసుకుని పాదాలకు సాక్సుధరించి నిద్రించడం మంచిది.
అరికాళ్లకు పగుళ్లుకు- ఆయుర్వేద పరిష్కారం
కాళ్ళపగుళ్ళు - పాదదారి
ఇది అతిసాధారణ వ్యాధి. స్త్రీలలో ఎక్కువగా కనిపించే వ్యాధి. ఎలాంటి పాదరక్షలు లేకుండా తిరగడము వలన కాళ్ళు ఒత్రిడికి లోనై చాలా కఠినముగా మారటం లేదా పగుళ్లు ఏర్పడటము, అలాగే నీళ్లలో కాళ్ళు అధికముగా నానటం వలన కాళ్ళసందుల్లో పాచి ఏర్పడటం జరుగుతుంది. కొన్నిసార్లు కాళ్లతో పాటు చేతులు కూడా ఈవిధంగా మార్పుచెందుతాయి. దీనినే పాదదారి అంటారు. ఇది వాతప్రకోపం వలన కలిగే వ్యాధి.
వ్యాధి లక్షణాలు
1 .చర్మము దళసరిగా మారటం కొన్నిసార్లు చర్మము పగిలి మొరటుగా, గరుకుగా మారటం.
2 .కాళ్లలో పగుళ్లు
3 .దురద, మంట మరియు చర్మము కందిపోయి కనిపించుట మొదలైనవి వ్యాధి లక్షణాలు.
నిరంతరం త్రోవ నడిచేవారికి, వాతం ప్రకోపించి, రూక్షమగు పాదములందు పగులున్నట్లు చేయును
చికిత్స
1 .గందాకా రసాయనం - 500 మి.గ్రా నీళ్లు లేక పాలతో లేక పంచదారతో కలిపి రోజుకు మూడుసార్లు భోజనం తర్వాత సేవించాలి.
2 .షడ్గున సిందూరం - 100 మి. గ్రా రోజుకు 2 సార్లు తేనే కలిపి పైపూతగా రాయాలి.
3 .పిండతైలం - పైకి లేపనం చెయ్యాలి.
4 .పేటెంట్ ఔషదాలు - కట్ఫర్, క్కుటెక్స్ ఆయింట్మెంట్ పైపూతగా రాయాలి.
5 .క్షారతైలం - రసోత్తమాధిలేపం పగుళ్లు ఉన్నచోట రాయాలి.
6 .సిందూరాదిలేపనం - పగుళ్లు ఉన్నచోట రాయాలి.
7 .హిమాలయా ఫుట్ కేర్ క్రీం - రాత్రి పడుకునే ముందు రాసిన కాలిపగుళ్ళు తగ్గిపోతాయి.
ఆయుర్వేద మూలికలతో ఇంట్లోనే చేసుకునే విధానం
1 .రెండు చెంచాలు జెముడుపాలు, రెండు చెంచాలు నువ్వులనూనె కలిపి దానిలో కొంచెం సైన్ధవలవనం కలిపి పైకి రాస్తే అతిభయంకరమైన కాళ్ళ పగుళ్లు నిస్సంశయంగా తగ్గిపోతాయి.
2 .ఉప్పుచందనము, తెల్లగుగ్గిలము, తేనే మైనం నెయ్యి, మహిసాక్షి గుగ్గిలము, బెల్లం, కావిరాయి, మంగకాయ వీటిని కలిపి బాగా మర్దించి రోజుకు ఒకసారి చొప్పున లేపనం చేస్తే ఏడు రోజుల్లో కాళ్ళపగుళ్ళు పోవును
3 . మంగకాయ చూర్ణం, తేనే మైనం, ఉప్పు అనువానిని గేదెవెన్నతో మర్దించి ఏడురోజులు లేపనం చేస్తే కాళ్ళపగుళ్ళు నశించి తామరపువ్వులాగా మృదువుగా తయారవుతాయి.
4 .తేనే మైనం, మంజిష్టా, తెల్లగుగ్గిలం, అతిమధురం, సుగంధిపాలు, నువ్వులనూనె లేదా ఆముదంతో తయారుకాబడిన పిండతైలం, కాళ్ళపగుళ్లలకు రాయవచ్చును. ఆంధ్రప్రదేశ్ నందలి చాలా ఫార్మశీలు ఈ తైలాన్ని తయారుచేసి విక్రయిస్తున్నాయి.
5 .వేపనూనె తేనే మైనం కలిపి వేడిచేసి పసుపును వేసి త్రిప్పుతూ చల్లారిన తరువాత పైకి లేపనము చెయ్యాలి.
6 .ఊరుగుఆకులరసంగాని, మర్రిపాలుగాని పైకి పూస్తే పగుళ్లు శమిస్తాయి.
7 .వసపొడిని తేనే మైనం, నేతితో కలిపి పైకి పూయాలి.
గృహ వైద్య చిట్కాలు
కాళ్ళను వేప మరియు పసుపు కలిపి తయారుచేసిన కషాయంతో కడగాలి. తర్వాత క్షారతైలం లేదా పిండతైలమును రాయాలి.
జీలకర్రను మూకుడులో వేసి మాడ్చి చూర్ణం చేసి, వస్త్రగాలిత మొనర్చి, ఆ చూర్ణం పూటకు అరతులం చొప్పున, రోజూ రెండు పూటలా సేవించుచుండిన, కాళ్ళు పగులుట, చీము, రక్తముకారుచుండుట హరించిపోవును.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి