చర్మ వ్యాధులు మరియు చికిత్స నివారణ నవీన్ నడిమింటి సలహాలు
దీర్ఘ కాలంగా వేధిస్తూ శారీరక బాధతోపాటు మానసిక బాధని కలిగించేవి చర్మ వ్యాధులు.ఈ వ్యాధులకు మూలకారణం తెలుసుకోకుండా ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు.ఎక్కువగా వచ్చే చేరుమా వ్యాధులు
1 సోరియాసిస్
2 ఎగ్జిమా
3 హెర్పిస్
4 రింగ్ వామ్
5 అక్నే వల్గారిస్
1 సోరియాసిస్ ::
ప్రారంభ దశలో అంత తీవ్రత లేని ఈ వ్యాధి రాను రాను నరకప్రాయం గా మారుతుంది ఏ పాపం చేస్తే ఈ వ్యాధి నన్నుఇంతలా వేధిస్తోంది అన్నంతగా రోగి విలవిలలాడటం జరుగుతుంది.బయటకు బట్టలు,క్రీములు పూసుకొని మేనేజ్చేసినా,వ్యాధి తీవ్రత మనిషిని లోలోపల శారీరకంగా,మానసికంగా కలిసి వేస్తుంది.రోగనిరోధక శక్తిలో వచ్చేమార్పులు ఈ వ్యాధికి మూలకారణం. చర్మం ఎర్రగా మారటం,అటు పిమ్మట తెల్లటి పొలుసు రాలుట,ఆపై విపరీతమైన దురద వంటి లక్షణాలు కనపడతాయి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ వ్యాధి తీవ్రత లో హెచ్చుతగ్గులు సంభవిస్తుంటాయి.దీనిలో క్రానిక్ ప్లేక్ ,గట్టెడ్,పేస్టులర్,నెయిల్ సోరియాసిస్,అర్ద్రోపతి సోరియాసిస్ ఇలాఅనేక రకాల సోరియాసిస్ లు ఉన్నాయి.ఈ వ్యాధి ఎక్కువకాలం కొనసాగితే కీళ్లలో వాపు,నొప్పి వంటివి కలిగి తీవ్రంగా భాదపెడుతుంది.కాబట్టి ఈ స్టేజి కి రాకుండా జాగ్రత్త పడాలి
ఎగ్జిమా
సోరియాసిస్ తోపాటు పొక్కులు ఎక్కువగా రావడం చర్మం పొడిబారటం ,విపరీతమైన దురద తోపాటు రక్తం కారటం ఈ వ్యాధి లక్షణాలు.వీటిలో ఆటోపిక్ ఎగ్జిమా అనేది వంశపారంపర్యంగా జన్యు కారణంగా వచ్చేది.తల,మీద,మోచేతులు,పిరుదులు వంటి ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది.కాంటాక్ట్ డెర్మటైటిస్ అనేది కొన్ని కాస్మొటిక్స్ పడని కారణంగా వస్తుంది.
ఆటోపిక్ ఎగ్జిమా వచ్చిన వారికీ కాంటాక్ట్ డెర్మటైటిస్ లో మొదటిరకమైన ఇరిటెన్ట్ కాంటాక్ట్ డెర్మటైటిస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.చెర్మం ఎర్రబారటం ,పొడిబారటంతో పాటు చెర్మం కాలినట్టుగా అవుతుంది.
ఇక ఇందిలో రెండవది అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్. అలర్జీ మూలంగా వస్తుంది.అలాగే సెబారోయిస్ ఎగ్జిమా అనేది అరుదుగా తలపైన, ముఖం పైన వస్తుంది. అలాగే ఎరోటిక్ ఎగ్జిమా అనేది డ్రైస్కిన్ నుంచి మారుతుంది. ఫై లక్షణాలతో పాటు చర్మం పగిలిపోయినట్లు చేయడం దీని ప్రధాన లక్షణం. ముఖంతోపాటు మెడ, కనుబొమ్మలు, ముక్కు ప్రక్క భాగాల్లో ఇది విస్తరిస్తుంది.
హెర్పిస్
రోగ నిరోధక శక్తి తగ్గిపోయిన వారిలో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంది. వైరస్ వల్ల సంక్రమించే హెర్పిస్, సింప్లెక్స్ టైప్ 1 టైప్ 2 లు ఈ వ్యాధికి మూల కారణం. దీని కారణంగా మెదడు కూడా దెబ్బ తినే ప్రమాదం ఉంది.
రింగ్వామ్
ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా చర్మం పైనే కాకుండా జుట్టుపై, గోళ్ళ వద్ద గుండ్రంగా బిళ్లలుగా వస్తుంది. వేసవికాలంలో ఎక్కువగా వచ్చే ఈ వ్యాధి సోకిన దుస్తులను వాడటం వలన కూడా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ వ్యాధి సోకినవారు తమ దుస్తులను వేడినీటితో ఉతికితే ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా సహాయపడినవారవుతారు.
అక్నే వల్గారిస్
సెబాసియస్ గ్రంధి లో వచ్చే మార్పుల కారణం గా ఈ సమస్య వస్తుంది.చర్మం ఎర్రగా మారటంతో పాటు బ్లాక్ హెడ్స్ ,వైట్ హెడ్స్,మొటిమలు వీటి లక్షణాలు.జన్యుపరంగా కూడా సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి