4, జూన్ 2020, గురువారం

బరువు తగ్గాలి అంటే ఇవి తప్పనిసరిగా పాటించండి నవీన్ డైట్ ప్లాన్


బరువు తగ్గాలా..? అయితే ఒక్క ఏడు రోజులు ఇలా చేయండి..నవీన్ నడిమింటి డైట్ ప్లాన్ ?

మారిన ఆహారపు అలవాట్లుజీవనశైలి కారణంగా ఇటీవల చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. లావు తగ్గడానికి ఎలాంటి డైట్‌ తీసుకోవాలి అంటూ ప్రతీది ప్రయత్నిస్తుంటారు. నిజానికిబరువు పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. అవి ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటాయి. ఎందుకంటే అందరికీ ఒకే విధమైన ఆహారం పడకపోవచ్చు. ఎవరికి వారు తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహార నియమాలు పాటిస్తూబరువు తగ్గే ప్రయత్నం చేయాలసి ఉంటుంది. త్వరగా బరువు తగ్గాలనుకునే వారికి నిపుణుల సూచన ప్రకారం ఒక ఏడు రోజుల డైట్‌ ప్రణాళిక పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయట.. ఎంతోమందికి లాభం చేకూర్చి పెట్టే ఈ ఏడు రోజుల ప్రణాళిక మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం..!

మొదటి రోజు
సరిపడినన్ని నీరు తాగుతూ కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి.. ఒక్క అరటి పండు తప్ప అన్ని పండ్లూ తీసుకోవచ్చు.. కావాలంటే గంట గంటకూ తీసుకోవచ్చు..

రెండవ రోజు
కేవలం కూరగాయలు మాత్రమే తీసుకోవాలి.. ఉదయాన్నే అల్పాహారంలో ఒక మాదిరి సైజు బంగాళాదుంపను ఉడక బెట్టి తీసుకోవాలి.. తరువాత గంట గంటకూ కూరగాయలు ఉడకబెట్టినవి కానీపచ్చివి కానీ కొద్దిగా ఉప్పుమిరియాల పొడినిమ్మరసం ఉపయోగించి తీసుకోవచ్చు..

మూడవ రోజు
పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలి. ముఖ్యంగా అరటి పండుబంగాళదుంప మాత్రం తీసుకోరాదు. ఈ మూడు రోజులు అయ్యేసరికి ఒంట్లో ఉన్న ఎక్సెస్‌ వాటర్‌ బయటకు వెళ్లిపోతుంది. అలా అదనపు నీరంతా వెళ్ళిపోవడంతో పాటుమలబద్ధకం పోయి శరీరం కాస్త తేలిక పడుతుంది. పండ్లుకూరగాయల్లో బోలెడన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్లశరీరం రిపేర్‌ అయ్యికాంతిమంతంగా కనపడతారు..

నాలుగవ రోజు
ఆరు అరటి పళ్ళుదానితో పాటు మూడు గ్లాసుల పాలు తీసుకోవాలి.. వీటిని మూడు భాగాలుగా చేసి తీసుకోవచ్చు.. ఉదాహరణకు రెండు అరటి పండ్లువాటితో పాటు ఒక గ్లాస్‌ పాలు చొప్పున ఉదయం అల్పాహారంలోమధ్యాహ్నం భోజనంలోఅలాగే రాత్రి డిన్నర్‌లో తీసుకోవాలి. మధ్యమధ్యలో క్యాబేజీ మరిగించిన నీరు లేదా సూప్‌ తీసుకోవాలి..

ఐదవ రోజు
నాన్‌ వెజ్‌ తినేవారైతేఅరకిలో చికెన్‌ఎనిమిది టొమాటోలు కలిపికొద్దిగా మసాలా దినుసులుఉప్పుమిరియాలు వేసి బాయిల్‌ చేయాలి.. ప్రతి రెండు గంటలకూ కప్పు చొప్పున తీసుకోవాలి.. శాకాహారులైతే చికెన్‌కు బదులుగా సోయా పన్నీర్‌ 300గ్రాముల వరకు తీసుకోవచ్చు..

ఆరవ రోజు
అయిదో రోజు లాగానే తీసుకోవాలి. కానీటొమాటోల బదులుగా తాజా కూరగాయలు ఉపయోగించాలి..

ఏడవ రోజు
బ్రౌన్‌ రైస్‌ ఒక కప్‌ + గ్రీన్‌ పీస్‌ కర్రీ + ఒక కప్‌ బత్తాయి రసం (పంచదార లేకుండా). ఇవే మూడు పూటలూ తీసుకోవాలి..

ముఖ్య సూచనలు
ఈ డైట్ సమయంలో ధూమపానంమద్యపానం మరియు జంక్ ఫుడ్ మానేయటం ఉత్తమం..
నాలుగో రోజు నుండి క్యాబేజ్‌ క్లియర్‌ సూప్‌ తీసుకోవచ్చు..
అయిదు
ఆరో రోజుల్లో నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి.. 
బ్లాక్‌ టీ
కాఫీలు చక్కెర లేకుండా తీసుకోవచ్చు..
అప్పుడప్పుడు పల్చటి మజ్జిగ
కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు..
ఏడు రోజుల డైట్‌ అయిన తరువాత
రెగ్యులర్‌ డైట్‌లో కొంత నియంత్రణ పాటిస్తేతగ్గిన 
బరువును నిలుపుకోగలుగుతారు లేదంటే మళ్ళీ మొదటికే వస్తారు..
ముఖ్యంగా బీపీ
షుగర్‌ ఉన్నవాళ్ళుఇతర జబ్బులున్నవాళ్ళు ఈ డైట్‌ పాటించకూడదు. 
మహిళలు ఋతుస్రావ సమయంలో ఈ డైట్‌ను పాటించకూడదు.. 
ఇలా నెలకు ఒక్కసారి ఈ డైట్‌ చేయడం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారు..

కామెంట్‌లు లేవు: