2, జూన్ 2020, మంగళవారం

కడుపులో మంట నివారణకు పరిష్కారం మార్గం



కడుపుల్లో మంట  వ్యాధి అంటే ఏమిటి?

కడుపులో మంట లేక పేగుల్లో మంట వ్యాధి (Inflammatory bowel disease-IBD) అనేది జీర్ణశయాంతర లేక జీర్ణనాళం యొక్క దీర్ఘకాలిక అనారోగ్యం. ఇది వాపు లేదా మంటలతో కూడుకున్న జీవితాంత దశలవారీ వ్యాధి లక్షణాలతో అపుడపుడూ ఉపశమిస్తూ ఉంటుంది.   సుదీర్ఘకాలంపాటు కొనసాగే “కడుపులో మంట” జీర్ణానాళాన్ని (GI ట్రాక్ట్) దెబ్బ తీస్తుంది. క్రోన్స్ వ్యాధి మరియు అల్సరేటివ్ కొలిటిస్ అనేవి కడుపులో మంట వ్యాధి (IBD)లోనే సంభవించే రెండు రకాల మంట నమూనాలు.  పెద్ద  పెగ్గులో పుండ్లు (ulcerative colitis) పెద్దప్రేగులనే దెబ్బతీస్తుంది. అయితే క్రోన్'స్ వ్యాధి నోటి నుండి జీర్ణాశయం యొక్క ఏ భాగాన్నైనా  దెబ్బతీస్తుంది.

కడుపుల్లో మంట వ్యాధి ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఎక్కువగా, 15 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారికి IBD వ్యాధితో  బాధపడుతుంటారు. వ్యాధి లక్షణాలు వ్యక్తుల్లో మారుతుంటాయి. కొన్ని లక్షణాలు క్రింద పేర్కొనబడ్డాయి:

  • నొప్పి లేదా కడుపులో తిమ్మిరి.
  • బరువు నష్టం.
  • అలసట.
  • రక్తం లేదా చీముతో కూడిన అతిసారం లేదా రక్తం-చీము లేకుండా పునరావృతమయ్యే అతిసారం.
  • మలవిసర్జనకు తక్షణమే వెళ్లాల్సిన పరిస్థితి.
  • వ్యాధి క్రియాశీల దశలో జ్వరం.

IBD నిరంతరంగా ఉన్నప్పటికీ, కడుపులో మంట తీవ్రతపై ఆధారపడి వ్యాధి లక్షణాలు సాధారణంగా వస్తుంటాయి మరియు పోతుంటాయి. మంట తీవ్రంగా ఉన్నప్పుడు, వ్యాధి క్రియాశీల దశలో ఉంటుంది మరియు మంట తగ్గిపోయినప్పుడు, ఈ వ్యాధి తేలికపాటి లక్షణాలతో ఉపశమనం కలిగి ఉంటుంది.

ప్రధాన కారణాలు ఏమిటి?

కడుపులో మంట యొక్క నిజమైన కారణం తెలియదు, కానీ ఈ క్రింది కారణాలు కడుపులో మంట వ్యాధిని  కల్గించేందుకు కారణం అవుతున్నాయి.

  • జనుపరమైన (Genetic) కారణాలు
    మీరు గనుక కడుపులో మంట వ్యాధికి సానుకూల కుటుంబ చరిత్రను కల్గిఉంటే మీరు ఈ వ్యాధిబారిన పడి బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
  • బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ
    సాధారణంగా, మీ శరీరం వైరస్లు లేదా బ్యాక్టీరియా వంటి విదేశీ జీవులపై దాడి చేస్తుంది. పర్యావరణ లేదా ఇతర కారకాలకు ప్రతిస్పందనగా రోగనిరోధక వ్యవస్థ శరీర కణజాలం, ప్రత్యేకంగా పేగు యొక్క కణజాలం, విరుద్ధంగా ప్రతిస్పందించినపుడు జీర్ణనాళ వాపుకు దారితీస్తుంది.

కడుపులో మంటను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

భౌతిక పరీక్ష మరియు వివరణాత్మక చరిత్ర తీసుకోవడం కాకుండా కడుపులో మంట వ్యాధి సాధారణంగా ఎండోస్కోపీ లేదా కోలొనోస్కోపీ మరియు ఇమేజింగ్ స్టడీస్ కలయికతో కూడిన పరీక్షలతో గుర్తించబడుతుంది. ఇమేజింగ్ స్టడీస్ లో MRI, CT స్కాన్ మరియు కాంట్రాస్ట్ రేడియోగ్రఫీ ఉన్నాయి. మల పరీక్ష మరియు రక్త పరీక్షలను కడుపులో మంట రోగనిర్ధారణను స్థిరీకరించేందుకు చేస్తారు.

చికిత్స యొక్క ప్రధాన లక్ష్యం పేగుల్లో కలిగే మంటను తగ్గించడం మరియు వ్యాధి లక్షణాల నుండి ఉపశమనం అందించడమే. వ్యాధి ఒకసారి నియంత్రణలోకొస్తే, వ్యాధి పునఃస్థితిని నిరోధించడానికి మరియు ఉపశమనం కాలాన్ని పొడిగించేందుకు మందులసేవనం కొనసాగించబడుతుంది. దీనినే “నిర్వహణ చికిత్స”గా పిలుస్తారు. వ్యాధి తీవ్ర సందర్భాల్లో శస్త్రచికిత్స అవ

కడుపు నొప్పి ఆయుర్వేదం లో  (Stomach Pain)

  • ఒక అర చెంచా జీలకర్ర లేదా వాము బాగా నమిలి మింగితే కాసేపటికి కడుపు నొప్పి తగ్గిపోతుంది.
  • పెసర గింజంత ఇంగువ మింగినా కడుపు నొప్పి తగ్గిపోతుంది.
  • ఒక కప్పు వేడినీటిలో టీ స్పూన్ తేనెను కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది.
  • విరిగిన పాలలోని నీటిని ఒక కప్పు తాగితే కడుపునొప్పి తగ్గిపోతుంది.
  • నీరుల్లిపాయ ఒకటి తిన్నా కడుపు నొప్పి తగ్గిపోతుంది.
Medicine NamePack Size
FormonideFormonide 0.5 Respules 2 Ml
BudamateBudamate 200 Transcaps
ForacortForacort 0.5 Mg Respule
BudecortBudecort 200 Inhaler
Airtec FBAirtec FB 100 Instacap
BudetrolBudetrol 200 Inhaler
Combihale FBCombihale FB 100 Redicaps
SymbicortSymbicort 160/4.5mcg Turbuhaler
Vent EcVent Ec Capsule
Vent FBVent FB 100 Ease Capsule
Budamate ForteBudamate Forte 12 Mcg/400 Mcg Transcaps
Budetrol ForteBudetrol Forte Capsule
Digihaler FbDigihaler FB 200 Inhaler
Fomtide NFFomtide NF 12 Mcg/100 Mcg Inhaler
FomtideFomtide 12 Mcg /200 Mcg Inhaler
Peakhale FbPEAKHALE FB 100MG DPI CAPSULE 30S
ADEL 49 Apo-Enterit DropADEL 49 Apo-Enterit Drop
Quikhale FbQUIKHALE FB 100MG ROTACAP 30S
SymbivaSymbiva 100 Capsule
Schwabe Okoubaka MTSchwabe Okoubaka MT
ADEL 73 Mucan DropADEL 73 Mucan Drop
IbinideIbinide 200 Nexcap
Ibinide RIbinide R Nexpule
SBL Citrus vulgaris Mother Tincture QSBL Citrus vulgaris Mother Tincture Q
Nebulair RespulesNEBULAIR RESPULES 2ML
 

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


కామెంట్‌లు లేవు: