మెదడులో రక్తస్రావం (బ్రెయిన్ హేమరేజ్) అనేది మెదడులో రక్తనాళం చిట్లిపోవడమో లేక పగిలిపోవడం వలన ప్రధానంగా సంభవిస్తుంది. దీన్నే “మెదడు రక్తస్రావం” (brain bleed) అని కూడా అంటారు.
మెదడులో కలిగే రక్తస్రావం మెదడులో ఒత్తిడిని పెంచుతుంది, ఆక్సిజన్ స్థాయిని తగ్గిస్తుంది మరియు తద్వారా మెదడు కణాలను చంపుతుంది. మెదడులో రక్తస్రావం యొక్క లక్షణాలు పొడజూపిన వెంటనే వైద్యసంరక్షణను తక్షణమే కల్పించడం అత్యగత్యం.
మెదడులో రక్తస్రావం అనేది మెదడులోని ఏ భాగంలో ఏర్పడిందో దాని ఆధారంగా, నాలుగు రకాల మెదడు రక్త స్రావాలున్నాయి:
- ఎపిడ్యూరల్ హేమరేజ్
- సబ్ డ్యూరల్ హేమరేజ్
- సుబారచ్నయిడ్ హేమరేజ్
- ఇంట్రాసిరెబ్రెల్ హేమరేజ్
మెదడులో రక్తస్రావం ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మెదడు లోపల రక్తస్రావం ఉన్నప్పుడు తలనొప్పి ఉండదు, ఎందుకంటే మెదడు కణాలు సంభవించిన ప్రమాదాన్ని నమోదు చేయలేవు కాబట్టి. అయినప్పటికీ, మెదడు నాడీమండలాన్ని కప్పే పొర (meninges-మెదడును కప్పి ఉంచే పోర పరిధులు) లోపల రక్తస్రావం ఏర్పడ్డప్పుడు తీవ్రమైన తలనొప్పి చాలా సాధారణ లక్షణం.
మెదడులో రక్తస్రావం యొక్క ఇతర లక్షణాలు ఇలా ఉన్నాయి
- బలహీనత లేదా జలదరింపు లేదా తిమ్మిరి (ఒక వైపు)
- మాట్లాడడంలో తొందరలు
- సంతులనం యొక్క నష్టం
- బలహీనమైన దృష్టి
- స్పృహ కోల్పోవడం
- మూర్చ
మెదడులో రక్తస్రావానికి ప్రధాన కారణాలు ఏమిటి?
అనేక కారణాల వల్ల మెదడులో రక్తస్రావం సంభవిస్తుంది. కొన్ని కారణాలు:
- అఘాతం (ట్రామా) లేదా మెదడుకు గాయం
- మస్తిష్క ధమని యొక్క బలహీనత లేదా ధమని చిట్లడం
- రక్త కణాల్లో లోపం (ప్లేట్లెట్ల లోపం) వంటి రక్తస్రావ రుగ్మతలు
- సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధులు
- అధిక రక్త పోటు
- మెదడు కణితి
పెరిగిన రక్తపోటు మెదడు రక్తస్రావం యొక్క అతి సాధారణ కారణం. పెరిగిన రక్తపోటు పెద్ద మెదడు యొక్క రక్తనాళాల్ని దెబ్బ తీస్తుంది, ఇది ఆఘాతానికి (స్ట్రోక్ కు) దారితీస్తుంది. మొత్తం ఆఘాతాల్లో 13% మెదడులో రక్తస్రావం కారణంగా సంభవిస్తాయి.
గాయం కారణంగా రక్తం స్రవించినపుడు అది కణజాలాన్ని ప్రకోపిస్తుంది, తద్వారా వాపు దాపురిస్తుంది. ఈ వాపును “సెరెబ్రల్ ఎడెమా” అని పిలుస్తారు. స్రవించిన రక్తం మడుగై గడ్డ కడుతుంది, ఇది సమీప మెదడు కణజాలంపై ఒత్తిడిని పెంచుతుంది మరియు మెదడు కణాలకు ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది. ఇది, మెదడు కణాల మరణానికి దారితీస్తుంది.
మెదడులో రక్తస్రావాన్ని ఎలా నిర్ధారిస్తారు, దీనికి చికిత్స ఏమిటి?
వ్యాధి లక్షణాల ఆధారంగా, డాక్టర్ రక్తస్రావం మెదడులోని ఏభాగంలో ఏర్పడిందో గుర్తించడానికి ఒక MRI లేదా CT స్కాన్ చేయించామని అడుగుతారు. ఇందుకవసరమయ్యే ఇతర పరీక్షలు:
- యాంజియోగ్రాం- మెదడులో రక్తస్రావం యొక్క ఖచ్చితమైన భాగాన్ని గుర్తించేందుకు మెదడు నరాల్లో (ధమనుల్లో) ఒక రంగు (dye)ను ప్రవేశపెట్టబడుతుంది
- కంప్యూటెడ్ టోమోగ్రఫీ ఆంజియోగ్రఫీ
- సెరెబ్రోస్పానియల్ ద్రవం పరీక్ష
- వెన్నుపూస పంక్చర్ (cerebrospinal fluid test)
మెదడులో రక్తస్రావం సంభవించిన ప్రారంభంలో కొన్ని గంటలు చాలా కీలకమైనవి గనుక రోగికి ఈ సమయంలో నిశితమైన వైద్య పర్యవేక్షణ చాలా ముఖ్యం. ఈ వైద్య పర్యవేక్షణ రోగి పరిస్థితి స్థిరంగా కుదురుకునేంతవరకూ కీలకమైనది. రక్తపోటు మరియు శ్వాస స్థిరీకరణ అనేది మొట్టమొదటి దశ, అవసరమైతే శస్త్రచికిత్స చేయాలనే నిర్ణయంతో వైద్య పర్యవేక్షణ అనుసరించబడుతుంది.
“బ్రెయిన్ పాత్” శస్త్రచికిత్స అనేది ఒక నవీన చికిత్సా పద్ధతి మరియు సంప్రదాయ శస్త్రచికిత్సతో పోలిస్తే ఇది తక్కువ పుంటి మచ్చల్ని (scarrings) మాత్రమే కగిలిస్తుంది మరియు త్వరగా కోలుకునేందుకు తోడ్పడుతుంది.
మెదడులో రక్తస్రావంవల్ల మెదడును చుట్టుముట్టిన రక్తాన్ని వైద్యులు తీసివేసి రోగికి పీడనం నుంచి ఉపశమనం కలిగిస్తారు.
రక్తపోటు, అనారోగ్యం మరియు తలనొప్పిని నియంత్రించడానికి రోగికి మందులు ఉపయోగిస్తారు. మెదడులో రక్తస్రావం యొక్క లక్షణాలను నిర్వహించడంలో అంతర్లీన కారణాన్ని సరిచేయడం చాలా ముఖ్యం.
చికిత్సకు ప్రతిస్పందన రక్తస్రావం యొక్క పరిధి మరియు అది మెదడులోని ఏభాగంలో ఏర్పడిందన్న దాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
కొన్ని సమయాల్లో, మెదడులో రక్తస్రావానికి తక్షణ వైద్య చికిత్స కల్పించినప్పటికీ మరణం సంభవిస్తుంది.
మొత్తంమీద, రోగ నిరూపణ నిర్దిష్టమైంది కాదు. మెదడులో రక్తస్రావానికి చికిత్స అయిన తర్వాత అనేకమంది రోగులు బాగా మనుగడ సాగిస్తారు, మరి కొంతమంది చికిత్సానంతరం ఎక్కువకాలం బతకరు, ఎందుకంటే రక్తస్రావం మెదడులోని కొన్ని ప్రాంతాల్లో భారీగా ఉంటుంది కాబట్టి. కొంతమంది చికిత్సానంతరం దీర్ఘకాలంపాటు బతుకుతారు, అయితే నిరంతరం కొనసాగే దీర్ఘకాల బలహీనత, జ్ఞానేంద్రియ సమస్యలు, మూర్ఛలు, తలనొప్పులు లేదా జ్ఞాపకశక్తి సమస్యలు బాధిస్తూ ఉంటాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి