తిప్పతీగను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారుచేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి బాగా ఉపయోగపడతాయి. తిప్పతీగను కషాయంలా చేసుకుని తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. తిప్పతీగలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
1. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడగలవు. అలాగే శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ బాగా పని చేస్తుంది.
2. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగల శక్తి తిప్పతీగకు ఉంటుంది. కాస్త తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే చాలు... అజీర్తి సమస్య పోతుంది.
3. తిప్పతీగ హైపోగ్లైకేమిక్ ఏజెంట్‌గా పని చేస్తుంది. తిప్పతీగలో మధుమేహాన్ని నివారించే గుణాలున్నాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు.
4. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి తిప్పతీగ మందులు బాగా పని చేస్తాయి. దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి.
తిప్పతీగ ఎక్స్రాక్ట్ కరోనాకు అద్భుతంగా పనిచేస్తుందని భారతీయ వైద్య విధాన సంస్థలు తెలియజేస్తున్నాయి..
దీనినే అమ్రృతవల్లి అంటారు.. పతంజలి షాపుల్లో దొరుకుతుంది..
5. ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తిప్పతీగను ఉపయోగిస్తే చాలా మంచిది. కీళ్లవ్యాధులను తగ్గించే గుణాలు తిప్పతీగలో చాలా ఉన్నాయి. తిప్పతీగ పొడిని కాస్త వేడి పాలలో కలుపుకుని తాగితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యల బారి నుంచి బయటపడొచ్చు. ఆ పాలలో కాస్త అల్లం కలుపుకుని కూడా తాగొచ్చు.
తిప్పతీగ ఎక్స్రాక్ట్ కరోనాకు అద్భుతంగా పనిచేస్తుందని భారతీయ వైద్య విధాన సంస్థలు తెలియజేస్తున్నాయి..
దీనినే అమ్రృతవల్లి అంటారు.. పతంజలి షాపుల్లో దొరుకుతుంది..
6. తిప్పతీగ వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు. అలాగే ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉంటాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తిప్పతీగతో తయారుచేసిన మందులను వాడకూడదు
తిప్పతీగ ఉపయోగాలు ఆయుర్వేదం:
తిప్పతీగ పది మీటర్లు వరకు పెరిగే తీగ. దీని కాండాన్ని నరికి పాతితే దాని నుంచి తిరిగి మొక్కవస్తుంది. అందుకే దీనికి “ఛిన్నరుహ” అను మరియొక సంస్కృతం పేరు కూడా పేర్కొనడమైనది. ఆకులు కనుపునకు ఒకటి చొప్పున గుండె ఆకారంలో ఏమాత్రం నూగు లేకుండా ఉంటాయి. స్త్రీ, పురుష పుష్పాలు తిగేలపై వచ్చి ఆకుపచ్చ కలిసిన లేత పసుపు రంగులో ఉంటాయి. కాయలు గుండ్రంగా ఎర్రగా ప్రతి పువ్వుకు ఒకటి నుండి మూడు వరకు వస్తాయి. విత్తనాలు కోలగ గట్టిగ ఉంటాయి. తూర్పు గోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో మరొక తీగను కూడా “తిప్ప తీగ” గా వ్యవహరిస్తున్నారు. దీని లేత కొమ్మలు, ఆకులు నూగు కలిగిఉంటారు. దీనిని tinospora sineusis (liur.) merr అను లాటిస్ పేరులో పిలుస్తారు. తిప్పతీగే సమూలంగా దంచి నీటిలో వేసి పిసికి ఆ నీరు కదపకుండ ఉంచితే పాత్ర అడుగు భాగానికి పిండి లాంటి పదార్థం చేరుతుంది. దీనినే తిప్ప సత్తు అంటారు. జ్వరము, కిళ్ళ వాపులు మొదలగు వ్యాధులలో తిప్ప సత్తువను ఎక్కువగా వాడుతుంటారు. ఎండిపోయిన తీగకంటే పచ్చిది చికిత్సలలో వాడవలెను.
ఉపయోగాలు:
1. తిప్పతీగా రసము (30 మి. లీ.) రోజుకు 2 సార్లు వారం రోజులు సేవిస్తే దీర్గకాలంగా వచ్చే మలేరియా శమిస్తుంది.
2. తప్పతీగా ఆకును మెత్తగా నూరి ఉసిరికాయంత ప్రయాణంలో మజ్జిగతో రోజుకు రెండుసార్లు సేవిస్తూ చప్పిడి పథ్యం చేస్తే కామెర్ల 6 రోజులలో శమిస్తాయి.
3. తిప్ప తీగా రసం (2 చెంచాలు) రోజుకు 3 – 4 సార్లు సేవిస్తే స్త్రీల ఎర్రబట్ట శమిస్తుంది.
4. వాతరక్తం (కీళ్ళవాతం) తగ్గాలంటే తిప్పతీగా, అముదపువేరు, వాసా (అడ్డరసం) వేరు వీనియొక్క కాషాయం, ఏరండ తైలం (ఆముదం) లో కలిపి సేవించాలి.
5. కీళ్ళనొప్పులకు శొంటితో కలిపి సేవిస్తే కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
6. మూత్రదోషం తగ్గాలంటే తిప్పతీగా రసమును తేనే చేర్చి సేవించాలి. కామెర్ల కూడా తగ్గుతాయి.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
*సభ్యులకు సూచన*
*************
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి