14, జూన్ 2020, ఆదివారం

సెర్వికల్ నొప్పి (మెడ నొప్పి )నివారణకు పరిష్కారం మార్గం



సెర్వికల్ నొప్పి (cervical (neck) pain) అంటే ఏమిటి?

మెడ నొప్పి పురుషులు మరియు మహిళలు అనుభవించే ఒక సాధారణ బాధాకరపరిస్థితి.  సాధారణంగా మధ్య వయస్కుల్లో వస్తుంటుందిది. ఈ నొప్పి ‘సెర్వికల్ వెర్టెబ్రయీ’ అనే మెడ భాగంలో పుడుతుంది, కాబట్టి దీన్ని ‘సెర్వికల్ నొప్పి’ అని కూడా పిలుస్తారు. మెడ నొప్పి సాధారణంగా కండర-కంకాళాల రుగ్మత వలన వస్తుంది. మెడ చుట్టూ ఉన్న కండరాలలో ఓ తేలికపాటి నొప్పి ఉంటుంది మరియు దీనివల్ల మెడ యొక్క సాధారణ కదలికలు కష్టమవుతాయి. మెడనొప్పివల్ల, మెడ యొక్క ఎగువ అవయవాలలో స్పర్శ జ్ఞానం కూడా కోల్పోవడం జరుగుతుంది. .

దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మెడ నొప్పి తీవ్రమైన లేదా దీర్ఘకాలిక బాధాకర పరిస్థితి కావచ్చు. మెడ నొప్పికి సంబంధించిన కొన్ని సాధారణ లక్షణాలు:

  • మెడ కండరాలలో పెడసరం లేక బిర్రబిగుసుకుపోవడం
  • మెడ కదలికల్లో పరిమితి
  • మెడ పైభాగం అవయవాలలో జలదరింపు లేదా తిమ్మిరి
  • మెడ ప్రాంతంలో నొప్పి
  • భుజాలు నొప్పి మరియు ఎగువ అవయవాలలో నొప్పి

మీరు అనుభవించే అరుదైన లక్షణం పార్శ్వపు తల నొప్పి. దీర్ఘకాల నొప్పి విషయంలో, కొన్ని నరాల సమస్యలు తలెత్తవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

మెడ నొప్పి వివిధ కారణాల వలన రావచ్చు. సాధారణ కారణాలు:

అరుదుగా, మెడ ప్రాంతంలో పెరుగుతున్న కణితి మెడ నొప్పికి కారణం అవుతుంది..

దీన్నిఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?

క్షుణ్ణమైన వైద్య చరిత్ర పరిశీలన మరియు భౌతిక పరీక్ష ఆధారంగా మెడ నొప్పి కారణాన్ని నిర్ధారణ చేస్తారు. రోగ నిర్ధారణ చేయడానికి క్రింది విశ్లేషణ సాధనాలు ఉపయోగించబడతాయి:

మెడ నొప్పికి చికిత్స ఇలా ఉంటుంది:

  • ఫిజియోథెరపీ - స్వల్పకాలికంగా కీలును కదల్చకుండా పెట్టి ఉంచడం.  
  • మెడ వ్యాయామాలు
  • పల్సెడ్ విద్యుదయస్కాంత క్షేత్ర చికిత్స
  • నొప్పి నుండి ఉపశమనం పొందటానికి స్టెరాయిడ్ కాని శోథ నిరోధక మందులు మరియు కండరాల సడలింపులతో చికిత్స
  • వేడి కాపాడాలు (హాట్ కంప్రెసెస్)

దీర్ఘకాలిక నొప్పిని కిందివాటి ద్వారా చికిత్స చేయవచ్చు:

  • కండరాలను బలపరిచే మరియు ఓర్పు వ్యాయామాలు
  • ఫిజియోథెరపీ మరియు డైయాథర్మీ
  • నొప్పినివారిణులు (అనాల్జెసిక్స్), మంట, నొప్పిని ఉపశమింపజేసే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) మందులు మరియు కండరాల సడలింపు
  • కౌన్సెలింగ్
  • ఆక్యుపంక్చర్ వంటి ప్రత్యామ్నాయ చికిత్సలు
  • నరాల సమస్య ఉంటే శస్త్రచికిత్స,

మొత్తానికి, మెడ నొప్పి మెడ భాగం (cervical area) నుండే  ఉద్భవిస్తుంది. ఈ మెడ నొప్పి కండరాల నొప్పి నుండి నాడీ సంబంధిత సమస్యలు వరకు ఉంటుంది. మెడనొప్పికి  ఫిజియోథెరపీ, వ్యాయామం మరియు మందులతో చికిత్స చేయవచ్చు.బాధాకరమైన ఈ మెడనొప్పి పరిస్థితిని నిరోధించడానికి పనిచేసే చోట సరైన భంగిమలో (కూర్చోవడమో లేక నిల్చోవడమూ) పని చేయడం మరియు సరైన వ్యాయామం సహాయపడు

సెర్వికల్ నొప్పి కొరకు మందులు


Medicine NamePack Size
BrufenBrufen Active Ointment
CombiflamCOMBIFLAM PAED SUSPENSION
Ibugesic PlusIbugesic Plus Oral Suspension
TizapamTizapam 400 Mg/2 Mg Tablet
Espra XNEspra XN 500 Tablet
LumbrilLumbril Tablet
TizafenTizafen Capsule
EndacheEndache Gel
FenlongFenlong 400 Mg Capsule
Ibuf PIbuf P Tablet
IbugesicIbugesic 200 Tablet
IbuvonIbuvon Suspension
Ibuvon (Wockhardt)Ibuvon Syrup
IcparilIcparil 400 Tablet
MaxofenMaxofen Tablet
TricoffTricoff Syrup
AcefenAcefen 100 Mg/125 Mg Tablet
Adol TabletAdol 200 Mg Tablet
Dr. Reckeweg Gossypium Herb. QDr. Reckeweg Gossypium Herb. Q
BruriffBruriff Tablet
EmflamEmflam 400 Injection
Fenlong (Skn)Fenlong 200 Mg Tablet
FlamarFlamar 3D Tablet

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

      అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


కామెంట్‌లు లేవు: