అశ్వగంధ "కింగ్ అఫ్ ఆయుర్వేదం" వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ఫలితాలు..?నవీన్ నడిమింటి సలహాలు
సమస్త మానవాళికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం అశ్వగంధ.. ఎందుకంటే అశ్వగంధలో ఎన్నో రకాల అద్భుతమైన ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి.. అందుకే దీన్ని “కింగ్ అఫ్ ఆయుర్వేద” అని అంటుంటారు.. ఈ మూలికను తక్కువ పరిమాణంలో తీసుకుంటే మన ఆరోగ్యం, మనస్సు మీద ఎఫెక్టివ్ గా ప్రభావాన్ని చూపుతుంది.
అందుకే కొన్ని వందల సంవత్సరాల నుంచి అశ్వగంధను హెర్బల్ ఔషధంగా వాడుతున్నారు.. కేవలం మన దగ్గరే కాకుండా అమెరికా, ఆఫ్రికా దేశాల్లో కూడా 'యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందుగా' దీన్ని ఉపయోగిస్తున్నారు.. మరి ఇన్ని అద్భుత ప్రభావాలు కలిగిన దీన్ని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, అపోహలు మరియు వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయుర్వేద వైద్యపరంగా అశ్వగంధి లేహ్యం గురించి తెలియని వారుండరంటే అతిశ యోక్తి కాదు.. అశ్వగంధి మత్తు కలిగించే ఔషధంగాను, మంచి పుష్టినీ బలాన్ని చేకూర్చేదిగాను, ఉదరసంబంధవ్యాధులకు దివౌషధంగాను, జ్ఞాపక శక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగాను,ఎంతగానో ఉపయోగపడుతుంది.. అంతేకాకుండా, కేన్సర్‌కి దీనిని మించిన ఔషధం మరొకటి లేదంటే, ఆశ్చర్యపడనక్కర్లేదు.
ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కుంటున్న ఒత్తిడిని నివారించడంలో దీనికిదే సాటి. నీరసాన్ని, నిస్సత్తువను దరిచేరకుండా చేస్తుంది.. కండరాల వ్యాధులకి ఎంతగానో ఉపయోగపడుతుంది.. విషాన్ని హరించే శక్తి దీనికి అమితంగా ఉంది.
అశ్వగంధ పొడిని చక్కెరతో కలిపి నెయ్యితో తీసుకుంటే నిద్రలేమి తగ్గి మంచి నిద్ర పడుతుంది.
స్థూలకాయాన్ని నియంత్రిస్తుంది.. డీహైడ్రేషన్‌ని తగ్గిస్తుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. పళ్లని గట్టి పరచడంతోపాటు దంత క్షయం రాకుండా చూస్తుంది.
వెూకాలు నొప్పులకి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.వృద్ధాప్య లక్షణాలను దరిచేరకుండా చేసే యాంటీ ఏజింగ్ గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.. ఇందులో ఉండే సహజ సిద్ధ స్టెరాయిడ్‌లు నొప్పులు మరియు వాపులను తగ్గిస్తాయి.. కీళ్ల నొప్పులను మటుమాయం చేస్తాయి.
ఇది స్త్రీలలో రక్తాన్ని శుభ్రపరిచి, రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.. పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.. శరీర ధారుఢ్యాన్ని పెంపొందించ డంలో దీనికిదే సాటి.. జీర్ణశక్తిని పెంపొంది స్తుంది.. లివర్ సంబంధవ్యాధుల్ని అరికడు తుంది.. కేన్సర్ మరియు అల్సర్ వంటి వ్యాధుల్ని సమూలంగా నిర్మూలిస్తుంది.
అనేక ఔషధ గుణాలకు నిలయంగా ఉన్న అశ్వగంధ మొక్క వేర్లు, ఆకులు, పండ్లు మరియు విత్తనాలు అన్నీ ఏదో ఒక విధంగా మనకు ఉపయోగపడతాయి.. జ్ఞాపకశక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగా అశ్వగంధ పేరుగాంచింది.. కోల్పోయిన జ్ఞాపకశక్తిని వృద్ధి చేసే గుణం దీనికి ఉందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
ఈ రోజుల్లో చాలామంది పని ఒత్తిడి మరియు మానసిక ఆందోళనతో సెక్స్ లైఫ్ కు దూరమవుతున్నారు.. ఒక వేళ ప్రయత్నించినా కూడా దంపతుల మధ్య సంత్రుప్తికరమైన సుఖం దక్కటం లేదని వాపోతుంటారు.. అయితే మనకు తెలిసిన ఇంటి వైద్యంతో సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.
ఆయుర్వేదం ప్రకారం, అశ్వగంధ మనిషిలో సెక్స్ కోరికలను తీర్చటమే కాకుండా మంచి శక్తిని కూడా అందిస్తుందని వారు సూచిస్తున్నారు.. అశ్వగంధ పౌడర్ ను 3, 4 గ్రాములు తీసుకుని, అదే క్వాంటింటీ పంచదరాను కూడా పాలలో మిక్స్ చేసి ప్రతి రోజూ త్రాగడం వల్ల పురుషుల్లో నపుంసకత్వాన్ని నివారిస్తుంది.
ఇన్ని సుగుణాలున్న అశ్వగంధకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉండటం చేత వాణిజ్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది.. ఆయుర్వేద వైద్య విధా నాల్లో తయారవుతున్న అశ్వగంధారిష్టం, అశ్వగంధాది లేహ్యం, అశ్వగంధి లక్సడి మొదలైనవి.. ఏనాటినుంచో మంచి ప్రాచుర్యం పొంది, అధిక సంఖ్యలో ఎగుమతి అవుతు న్నాయి.
ముఖ్య విషయం ఏమిటంటే దీనిని ఎక్కువ మోతాదులో ఏక్కువ రోజులు వాడితే మాత్రం గుండెపైన, అడ్రినల్ గ్రంధుల పైన చెడుప్రభావము చూపుతుంది.. అలాగే థైరాయిడ్ గ్రంధి ని ఉత్తేజ పరిచి "హైపో థైరాయిడ్" జాబ్బుకి దారితీయవచ్చు.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి