6, జూన్ 2020, శనివారం

చర్మం పై బొల్లి మచ్చలు నివారణకు పరిష్కారం మార్గం లింక్స్ చూడాలి



బొల్లి మచ్చలు అంటే ఏమిటి?

బొల్లి (లుకోడెర్మా) మచ్చలు అనేది ఒక జన్యుపరమైన రుగ్మత. ఈ రుగ్మత సంభవించినపుడు చర్మం దాని రంగును కోల్పోయి తెలుపు రంగులోకి మారుతుంది. ఇది అంటువ్యాధి కాదు. బొల్లి శరీరంపై కొన్ని ప్రదేశాలకు మాత్రం పరిమితమై ఉండవచ్చు లేదా శరీరం మొత్తానికి విస్తృతంగా వ్యాపించి కూడా ఉండచ్చు. బొల్లి రుగ్మతలో అరుదైన విశ్వవ్యాప్త రకం ఉంది, దీనిలో మొత్తం శరీరం నుండి సహజమైన చర్మంరంగు (మెలనిన్) అదృశ్యమవుతుంది (బొల్లి రుగ్మత యొక్క తెల్లరంగు సంభవిస్తుంది.) ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో బొల్లి 1% -4% మందికి ఈ బొల్లిమచ్చలవ్యాధి సంభవిస్తోంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

దీని సంకేతాలు మరియు లక్షణాలు:

నెత్తిమీది జుట్టు రంగును, మరియు కనురెప్ప వెంట్రుకలు, కనుబొమ్మలు మరియు మగాళ్ళలో గడ్డం వంటి ఇతర భాగాలను ఈ బొల్లిమచ్చల రుగ్మత దెబ్బ తీస్తుందని గమనించబడింది. ఇది కళ్ళు మరియు పెదవులు వంటి శరీర భాగాలను కూడా దెబ్బతీస్తుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఎక్కువగా, ఈ రుగ్మత పుట్టిన తర్వాత వచ్చేదే, కానీ కొన్నిసార్లు ఇది ఒక జన్యు మూలాన్ని కలిగి ఉంటుంది. చర్మం నుండి అలాంటి ప్రతిస్పందనను ప్రేరేపించగల గుర్తించబడని పర్యావరణ కారకాలు ఉన్నాయి. బంధువుల్లోనే బొల్లమచ్చల రోగంతో ఉండేవాళ్ళు 25% -30% వరకూ ఉండే అవకాశాలు ఉన్నాయి మరియు కుటుంబంలోనే సోదరులు లేదా సోదరీమణులు మధ్య బొల్లిమచ్చల రుగ్మత 6% ఉండే అవకాశం ఉంది. ఈ రుగ్మత ఎక్కువగా స్వయంరక్షక వ్యాధులతో (ఆటో ఇమ్యూన్ డిజార్డర్లతో) ఉన్నవాళ్లలో కనిపిస్తుంది, వాళ్ళ నుండి వారి సంతానానికి కూడా ఈ బొల్లమచ్చల వ్యాధి ప్రాప్టించవచ్చు.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

మీ వైద్యుడు మిమ్మలను భౌతికంగా పరిశీలించి మీ వ్యాధిలక్షణాల గురించి అడగవచ్చు. బొల్లమచ్చల వ్యాధికి సంబంధించి మీ కుటుంబంలో ఎవ్వరికైనా ఉందా లేదా కుటీరంభంలో వ్యాధి గత చరిత్రను వైద్యుడు అడగవచ్చు. ప్రయోగశాల పరీక్షలను ఇలా నిర్వహిస్తారు:

  • పూర్తి రక్త గణన పరీక్ష
  • థైరాయిడ్ పరీక్షలు
  • ఇతర స్వయం ప్రతిరక్షక రుగ్మతల్ని శోధించడానికి యాంటీబాడీ పరీక్షలు
  • ఫోలేట్ లేదా విటమిన్ B12 పరీక్ష
  • విటమిన్ D స్థాయిల పరీక్ష

చికిత్స పద్ధతుల్లో కొన్ని మందులున్నాయి, కాంతిచికిత్స ( phototherapy) మరియు శస్త్ర చికిత్సలు ఉన్నాయి. వ్యక్తి చర్మం రంగుతో పాచ్ రంగును పోల్చడానికి మైక్రోపిగ్మెంటేషన్ చేయబడుతుంది. చర్మ రక్షణకుగాను చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా సన్స్క్రీన్లను (క్రీములు) ఉపయోగించడం మంచిది. ఆత్మవిశ్వాసం తగ్గడం వలన కొంతమంది రోగులలో కుంగుబాటు (డిప్రెషన్) ఏర్పడవచ్చు. సరైన సలహా సంప్రదింపులు మరియు వ్యక్తి యొక్క మద్దతు సమూహాలు ఒత్తిడి మరియు నిస్పృహల్నిఅధిగమించడానికి సహాయపడవచ్చు.

బొల్లి మచ్చలు కొరకు మందులు

Medicine NamePack Size)
MelbildMelbild Solution
Macsorlen XMacsorlen X Tablet
Alamin SEAlamin SE Infusion
Bjain Psoralea corylifolia Mother Tincture QBjain Psoralea corylifolia Mother Tincture Q
Schwabe Psoralea corylifolia MTSchwabe Psoralea corylifolia MT
Bjain Psoralea corylifolia DilutionBjain Psoralea corylifolia Dilution 1000 CH
KuvadexKuvadex 10 Mg Tablet
MelacylMelacyl Tablet
BenoquinBENOQUIN CREAM 20GM
Meladerm (Inga)Meladerm 10 Mg Tablet
MelanMelan 10 Mg Tablet
MelanexMelanex 10 Mg Tablet
MelcylMELCYL 1% LOTION 30ML
MacsoralenMACSORALEN DROPS 15ML
MelanocylMelanocyl Solution
OctamopOctamop 0.75% Lotion
Dsorolen ForteDsorolen Forte 25mg Tablet
Soralen ForteSoralen Forte 25mg Tablet
Trioxen ForteTrioxen Forte Tablet
Neosoralen DragesNeosoralen Drages 5mg Tablet
Sensitex 25mgSensitex 25mg Tablet

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


కామెంట్‌లు లేవు: