29, జూన్ 2020, సోమవారం

చర్మం పై దురద నివారణకు పరిష్కారం మార్గం



సారాంశం

దురద (కొన్ని ప్రాంతాలలో దురదను నవ, తీట అని పిలుస్తారు) చర్మం మీద ఏదో ఒక భాగంపై  గీరుకోవాలని అనిపించే ఇంద్రియ / స్పర్శజ్ఞానానికి సంబంధించిన ప్రక్రియ. దురద అలెర్జీ లక్షణాలను కలిగి ఉంటుంది. కొన్ని సమస్యలకు  అతీతమైనది. కొన్ని చికిత్సల పర్యవసానంగా ఏర్పడే దుష్ప్రభావం (సైడ్ ఎఫెక్ట్స్) కారణంగా ప్రబలుతుంది..ఇది ఆరోగ్య స్థితిగతులలో ఒకటిగా పేర్కొనబడుతుంది. దురదలలో పెక్కు రకాలు ఉన్నాయి. దురదలను అవి కనిపించే తీరు ఆధారంగా లేదా కారణం వల్ల గుర్తించవచ్చు. సాధారణంగా కనిపించే దురదలు దద్దుర్లు లేదా ర్యాషెస్,  హైవ్స్, ఫంగల్ నవ, కీటకాలు కుట్టడంగా పేర్కొనబడతాయి. ఎండు చర్మం కలిగిన వారిలో దురద సామాన్యంగా కనిపిస్తుంది.. ఇవి బాహాటంగా ఎరుపుచర్మం,  మంట, వాపు, బొబ్బల విస్పోటనం లా కనిపిస్తాయి. దురద సాధారణంగా తీవ్రత కలిగించే జబ్బు కాదు. అయితే చాలా కాలం పాటు చికిత్స జరపకపోతే ఇది వివిధ తీవ్రమైన జబ్బులకు వీలుకల్పిస్తుంది. అవి మూత్రపండాల జబ్బు, కలేయం సరిగా పనిచేయకపోవడానికి దారితీయవచ్చు. దురదకు కారణం నిర్ధారించిన తర్వాత, చికిత్సకు పెక్కు ఫలప్రదమైనట్టి మార్గాలు ఉన్నాయి. వాటిని అమలు చేయవచ్చు.  ఈ ప్రయత్నంలో భాగంగా సమయోచితమైనట్టి ఆయంట్ మెంట్లు లేదా చర్మానికి పూసే ఇతర  మందులను వాడవచ్చు. ఇంటి వైద్యం కూడా కొంతవరకు పనిచేస్తుంది.

దురద అంటే ఏమిటి? 

వైద్యశాస్త్రంలో ప్యూరిటస్ పేరుతో పిలువబడే దురద అసౌకర్యం కల్పించే స్పర్శ తతంగం. ఇది గోక్కోవడానికి దారితీస్తుంది, చర్మంపై ఎర్పడిన దురదకై గోకుడు ప్రారంభిస్తారు.  దురదకు చాలా కారణాలు ప్రస్తావింపబడ్డాయి. అయితే హెచ్చు కారణమైనది పొడిచర్మం . పొడిచర్మం లేదా  పొలుసుల వల్ల ఏర్పడే చర్మం దురద కల్పించి గోకుడు కారణంగా వచ్చిన మండేస్పర్శకు వీలు కల్పిస్తుంది. దురదకు గల కారణం బట్టి దానిని అనుభవిస్తున్న వ్యక్తి ఇతర ఇబ్బందులను ఎదుర్కొనవచ్చు. అవి చేర్మం ఎర్రగా కావడం, బొబ్బలు ఏర్పడటం, ర్యాష్ లు కలగడం, రక్తస్రావం  ( హెచ్చుగా గోకడం వల్ల ఏర్పడేది)  జరుగుతాయి కొందరిలో పూర్తిగా మేలుకానట్టి మరియు కొనసాగుతున్న దురద విపత్కర ఆరోగ్య స్థితిగతులకు దారితీస్తుంది. అవి మూత్రపిండాల జబ్బు, సోరాసిస్, గర్భం మరియు చాలా అరుదుగా కేన్సర్ గా ఉండవచ్చు. చక్కెరవ్యాధి, అలెర్జీలు, ఆస్త్మా వంటి వివిధ జబ్బు కలిగినవారు హెచ్చుగా దురదను ఎదుర్కొంటారని కనుగొనబడింది వయసు మళ్లినవారు కూడా దురదకు హెచ్చుగా గురవుతుంటారు. దీనికి కారణం వయసు పెరిగినకొద్దీ వారి చర్మంలో సహజమైన తేమ తగ్గిపోతుంటుంది. 

దురద యొక్క లక్షణాలు 

దురదకు సంబంధించి స్పర్శ లేదా ఇంద్రియ జ్ఞానం సర్వసాధారణమైనది మరియు  సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. ఇది చాలా కాలం వరకు కొనసాగవచ్చు లేదా కొద్దిపాటిగా గోక్కోవడంతో సరిపోవచ్చు. అయితే దురదకు కారణం ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటే, దురద అవుతున్న చోట గోకడంతో మాత్రమే సరిపెట్టలేము. దురద వీటితో ముడిపడి ఉంటుంది.

  • చర్మం ఎరుపు కావడం
  • మంట
  • జలదరింపు లేదా శరీరం మండుతున్నట్లు అనుభూతి
  • గడ్దలు కనిపించడం
  • ఎండు చర్మం
  • తునకలు
  • చర్మం పై రక్షణ నిర్మాణం
  • చర్మం ఊడిరావడం
  • బొబ్బలు

దురద శరీరంలో విభిన్న స్థలాలపై ఎదురు కావచ్చు.  మోచేతులు, తలమీద, వీపుపై లేదా మర్మాంగం వద్ద దీని ప్రభావం ఉంటుంది

దురద యొక్క చికిత్స 

దురదకు కారణం నిర్ధారించిన తర్వాత, చికిత్స క్రింది విధంగా ఉంటుంది

  • కార్టికోస్టీరాయిడ్ క్రీములు
    ఈ వైద్యపరమైన క్రీములు   చర్మానికి హాయి కల్పిస్తూ చర్మానికి ఎదురవుతున్న దురదను నయం చేస్తుంది. ఇవి ఎండిన చర్మం  మారేలా చేస్తాయి. పైగా చర్మం పై దురదను తొలగిస్తాయి. ఇవి సాధారణంగా 1% హైడ్రోకార్టిసన్ ను కలిగి ఉంటుంది. స్టీరాయిడ్ క్రీమును డాక్టరు ఔషధసూచిక లేకుండా డాక్టరును సంప్రతించకుండా  ఉపయోగించకూడదు.
  • క్యాల్షిన్యూరిన్ ఇన్ హిబిటర్స్
    ఈ మందును నిర్ణీతస్థలంలో ఎదురయ్యే దురద నివారణకు వాడవచ్చు
  • యాంటీ డిప్రెసెంట్స్
    యాంటీ డిప్రెసెంట్స్ శరీరంలోని హార్మోన్లపై ప్రభావం కలిగి ఉంటాయి. దీనితో దురద నివారణకు సహకరిస్తాయి.
  • జెల్స్
    సాధారణమైన అలోవెరా లేదా కలబంద తేమ కలిగించేదిగా సిఫార్సు చేయబడింది. ఇది దురద కలిగించే చర్మానికి హాయి కలిగిస్తుంది పైగా పొడిచర్మాన్ని మారిస్తుంది కూడా.
  • యాంటీహిస్టామైన్స్
    యాంటీహిస్టామైన్స్ మందులు ( సాధారణంగా  మౌఖికంగా తీసుకొనబడుతాయి) అలెర్జీ ప్రతిక్రియలను అదుపుచేయడంలో చక్కగా పనిచేస్తాయి. ఇవి మంటను నివారించి  తద్వారా దురదను కూడా నివారిస్తుంది 
  • లైట్ థెరపీ
    లైట్ థెరపీ క్రింద  చక్కగా నిర్ధారింపబడిన తరంగధైర్ఘ్యం లేదా వేవ్ లెంగ్త్  కలిగిన యు వి  కిరణాలను ఉపయోగిస్తారు. ఇది చర్మంపై ఎదురయ్యే దురదను అదుపు చేస్తుంది. ఈ ప్రక్రియను ఫోటొథెరపీ అని కూడా పేర్కొంటారు. దీర్ఘకాలిక ప్రయోజనాల  కోసం పెక్కుమార్లు లైట్ థెరపీ తీసుకొనవలసి ఉంటుంది
  • అంతర్లీనమైన ఆరోగ్య స్థితులకు చికిత్స
    ఆరోగ్య స్థితిగతులను నిర్ధారించే  మూత్రపిండాలు, కాలేయం లేదా రక్తంలో చక్కెరస్థాయికి చికిత్స కల్పించడం ద్వారా దురదను నివారించవచ్చు. ఈ జబ్బులకు కల్పించే చికిత్స  వీటి రోగలక్షణాలను కూడా మార్చుతుంది

జీవన సరళిలో మార్పు

కొన్నిరకాల జీవన విధానాలు లేదా జీవన సరళులు దురదను కల్పించే చర్మం నిర్వహణణకు సహకరిస్తాయని రుజువు కాగలదు.

  • చర్మంపై దురదకు దారితీసే అలంకరణ సామగ్రిని, పదార్థాలను వాడకండి
  • చర్మంపై దురద కలిగిస్తున్న ప్రాంతంలో వైద్యపరమైనట్టి లోషన్లను పూయండి.  మందుల దుకణాలలో అవి సులభంగా లభిస్తాయి. ఈ లోషన్లు పొడిచర్మం, దురద కలిగించే చోట హాయి కల్పిస్తుంది
  • చర్మంపై దురద హెచ్చుగా ఉన్నచోట గోకటాన్ని  మానివేయండి.  అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు  దురద చర్మాన్ని పాడుచేస్తుంది. పైగా చర్మంపై ఇతర ప్రాంతాలకు వ్యాపించేలా చేస్తుంది. గోకడం కారణంగా గోళ్ల ద్వారా క్రిములను ఇతర చొట్లకు వ్యాపింపజేస్తుంది ఇలా చేయడం వల్ల మంట హెచ్చవుతుంది..
  • ఒత్తిడి స్థాయిని తగ్గించుకోండి. హెచ్చయిన మానసిక ఒత్తిడి  రోగనిరోధక వ్యవస్థ అదుపు తప్పించి దురద పెరగడానికి లేదా ఇతర అలెర్జీ కారకాలకు దారితీస్తుం

గజ్జల్లో దురదకు 9 ముఖ్యమైన కారణాలు, నివారణ మార్గాలు

గజ్జల్లో దురదకు చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఈ సూచనలు పాటించండి.

how-to-never-ever-have-smelly-balls-740x500-1-1509021167
  
జ్జల్లో దురద ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలిసిందే. పదే పదే అక్కడ చేతులు వేయడం వల్ల ఎవరైనా ఏమైనా అనుకుంటారనే భావన మనసులో ఉంటుంది. గజ్జల్లో దురదకు ఎన్నో కారణాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా వైద్యులను సంప్రదించి, తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ దురదకు గల 9 కారణాలను ఇక్కడ చూడండి. 

వృషణాలు లేదా గజ్జల్లో దురదకు ముఖ్యమైన కారణాలివే:
1. క్లమిడియా: ఇదోరకమైన వైరస్ ఉన్నాదనే సంగతి చాలామందికి తెలీదు. ఇది కూడా లైంగికంగా సంక్రమించిన అంటువ్యాధి(STI). 25 ఏళ్లలోపు వయస్సు ఉన్న 10 మంది వ్యక్తుల్లో ఏడుగురికి ఇది సోకుతుంది. ఇది సోకితే వృషణాలు వాచి నొప్పి పెడతాయి. మూత్రం పోసినప్పుడు కూడా మంట పడుతుంది. ఈ ఇన్ఫెక్షన్‌ను యాంటిబయోటిక్స్ ద్వారా అరికట్టవచ్చు.

2. జననేంద్రియ మొటిమలు (Genital warts): ఇవి మర్మాంగం లేదా దాని చుట్టుపక్కల ఏర్పడతాయి. ఇది కూడా లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్. హ్యుమన్ పపిల్లోమా వైరస్ (HPV) వల్ల ఇది ఏర్పడుతుంది. అయితే, మొటిమలు నొప్పి పుట్టవు. ప్రమాదకరం కూడా కాదు. కానీ, కొంతమందికి దీనివల్ల దురద పుడుతుంది. వీటిని తగ్గించేందుకు క్రీములు అందుబాటులో ఉన్నాయి. లేదా లేజర్ ట్రీట్మెంట్‌తో కూడా అరికట్టవచ్చు. 

3. సలిపి (Herpes): చల్లదనం వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఇది ఏర్పడితే నొప్పిగా ఉంటుంది. వృషణాలు, దాని చుట్టుపక్కల దురద ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఎక్కువ రోజులు తిష్ట వేస్తుంది. మధ్యలో తగ్గినా మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనికి చికిత్స కూడా అందుబాటులో లేదు. వైద్యులు సూచించే ఔషదాలు ఉపయోగించడం ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. 

4. గోనేరియా (Gonorrhoea): ఇది లైంగికంగా సంక్రమించే వ్యాధి. మార్మాంగం, యోని నుంచి విడుదలయ్యే ద్రవాల వల్ల ఇది ఏర్పడుతుంది. మూత్రం పసుపు పచ్చగా వచ్చినట్లయితే ఈ వ్యాధి సోకినట్లు గుర్తించాలి. దీనవల్ల అంగం, వృషణాల వద్ద దురద ఏర్పడతుంది. మూత్రం పోసినప్పుడు మంటగా ఉంటుంది. మర్మాంగం ముందు చర్మం ఉబ్బుతుంది. ఇది ప్రోస్టేట్ గ్రంధిపై కూడా ప్రభావం చూపుతుంది. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే.. సంతాన సమస్యలు ఏర్పడతాయి. వైద్యులు రాసే యాంటిబయోటిక్స్ ద్వారా దీన్ని అరికట్టవచ్చు. 

5. ఫంగల్ ఇన్ఫెక్షన్: పరిశుభ్రత లేకున్నా, సెక్స్ తర్వాత మర్మాంగాలను శుభ్రం చేసుకోకుండా వదిలేసినా.. ఫంగస్ ఏర్పడే ప్రమాదం ఉంది. తరచుగా వచ్చే ఈ ఇన్ఫెక్షన్‌ను కాన్డిడియాసిస్ అని కూడా అంటారు. మన శరీరంపై నివసించే కాన్డిడిడా ఫంగీ వల్ల ఇది ఏర్పడుతుంది. ఇది సోకితే వృషణాల దురద తీవ్రంగా ఉంటుంది. మూత్రం పోసినప్పుడు మంటగా ఉంటుంది. దుర్వాసన వస్తుంది. మార్మాంగం, వృషణాలు పొడిబారతాయి. Canesten వంటి యాంటీ ఫంగల్ క్రీమ్‌లతో ఈ ఫంగస్‌ను అరికట్టవచ్చు. 

6. జాక్ (Jock itch): ఇది కూడా ఒక రకమైన ఫంగస్. డెర్మటోఫైట్ అనే ఈ ఫంగస్ వల్ల తీవ్రమైన దురద వస్తుంది. వ్యాయామం ఎక్కువగా చేసేవారికి ఇది సోకుతుంది. ఇది దాదాపు తామర వ్యాధిలా ఉంటుంది. ఇది సోకితే మర్మాంగాలు, వృషణాలు ఎర్రగా మారి దురద పుడతాయి. శరీరంపై సాధారణంగా ఈస్ట్ ఉంటుంది. అది ఎక్కువైతే ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఇది ఏర్పడినప్పుడు వృషణాల వద్ద తేమ ఏర్పడుతుంది. చర్మం మూలల్లో తెల్లగా మారుతుంది. దీనికి యాంటీ ఫంగల్ క్రీమ్‌ల ద్వారా దీని నుంచి ఉపశమనం పొందవచ్చు. 

7. క్రాబ్స్, ప్యూబిక్ లైస్: మానవ శరీరంపై ఉండే వెంట్రుకల్లో నివసించే అతి సూక్ష్మ పేనులు ఈ దురదుకు కారణం అవుతాయి. సెక్స్ సమయంలో ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. కొన్ని వారాల తర్వాత వీటి లక్షణాలు బయటపడతాయి. అప్పటి నుంచి వృషణాల వద్ద దురద మొదలవుతుంది. ఇవి చర్మాన్ని కొరుకుతాయి. రాత్రి వేళ్లలో ఈ బాధ మరింత ఎక్కువ ఉంటుంది. ఆ సమయంలోనే ఆ పేనులన్నీ యాక్టివ్‌గా ఉంటాయి. క్రిమిసంహాకరక షాపు లేదా క్రీమ్ ద్వారా వీటిని అరికట్టవచ్చు. వైద్యుల సూచనతో వాటిని తీసుకోవాలి. 

8. డిటర్జెంట్స్: వాషింగ్ ఫౌడర్, బట్టల సబ్బుల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఇందులో ఉండే NHS వల్ల శరీరం ఎర్రగా, పొడిగా అవుతుంది. ఎలర్జీలు కలిగించే డిటర్జెంట్స్‌‌ మర్మాంగాల వద్ద ఉపయోగిస్తే ఈ సమస్య ఎక్కువై దురద పడుతుంది. ఈ సమస్య ఏర్పడితే వెంటనే మీ సబ్బును, వాషింగ్ ఫౌడర్‌ను మార్చండి. 

9. దుస్తుల వల్ల: మీ అండర్ వేర్ పరిశుభ్రంగా లేకున్నా, లేదా బిగువుగా ఉన్నా ఈ సమస్య ఏర్పడుతుంది. అండర్‌వేర్‌తో వృషణాలు రాపిడి జరిగినప్పుడు కూడా ఇది ఏర్పడుతుంది. అలాగే, అక్కడ ఎక్కువ చెమట పట్టిన దురద ఏర్పడుతుంది. చర్మం ఎక్కువగా పొడిబారినా ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య తీరాలంటే

దురద కొరకు మందులు

Medicine NamePack Size
Grilinctus CDGrilinctus CD Syrup
KolqKolq Capsule
WikorylWikoryl 60 Syrup
AlexAlex Cough Lozenges Lemon Ginger
EkonEkon 10 Mg Tablet
Solvin ColdSolvin Cold AF Oral Drops
Tusq DXTusQ DX Liquid
GrilinctusGrilinctus Paediatric Syrup
Febrex PlusFebrex Plus AF Oral Drops
BetnesolBetnesol 4 Tablet
AllercetALLERCET TABLET 10S
ActACT G CAPSULE
NormoventNormovent Syrup
CetezeCeteze Tablet
Alday AmAlday Am 5 Mg/60 Mg Tablet
Parvo CofParvo Cof Syrup
PropyzolePropyzole Cream
Ceticad PlusCeticad Plus Tablet
AmbcetAmbicet Syrup
PhenkuffPhenkuff Syrup
Propyzole EPropyzole E Cream
CetipenCetipen Tablet
Ambcet ColdAmbcet Cold Tablet
Phensedyl CoughPhensedyl Cough Linctus
Canflo BnCanflo Bn 1%/0.05%/0.5% Cream

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

*సభ్యులకు విజ్ఞప్తి*

******************

ఈ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: