4, జూన్ 2020, గురువారం

సెక్స్ పవర్ పెరగడం కోసం ఆహారం నియమాలు

లైంగికవాంఛ (లిబిడో) అంటే ఒక వ్యక్తి యొక్క సెక్స్ డ్రైవ్ లేదా శృంగారం చెయ్యాలనే కోరిక కలగడాన్ని సూచిస్తుంది. ఇది మెదడులోని సెక్స్ హార్మోన్లు మరియు వాటి సంబంధిత కేంద్రాల ద్వారా ప్రభావితమవుతుంది. ఇది సాధారణమైనదిగా అనిపించవచ్చు కానీ, లైంగికవాంఛ మీ ఆహారం మరియు భాగస్వామి పట్ల మీ ప్రేమతో సహా అనేక ఇతర అంశాల వలన కూడా ప్రభావితమవుతుంది. మీ భాగస్వామితో కలతలు కూడా సెక్స్ డ్రైవ్ను ప్రభావితం చేయవచ్చు.

స్త్రీలలో యోని పొడిబారడం లేదా బాధాకరమైన లైంగిక చర్య వంటి కొన్ని వైద్య పరిస్థితుల వలన కూడా లిబిడో ప్రభావితమవుతుంది. కుంగుబాటు, ఆత్మ విశ్వాసం లేకపోవడం, నిద్రలో కలతలు మరియు కొన్ని రకాల మందులు కూడా ప్రభావితం చేస్తాయి. చాలావరకు ఈ సమస్యలు సరైన చర్యలు తీసుకోవడం మరియు మంచి పద్ధతిలో లైంగిక చర్యలను/శృంగారాన్ని  చెయ్యడం ద్వారా నిర్వహించబడతాయి.

(మరింత సమాచారం: నిద్రలేమి నిర్వహణ)

అయితే, లైంగికవాంఛ తగ్గిపోవడం అనేది సాధారణం కాదని మీరు తెలుసుకోవాలి. కొందరు వ్యక్తులకు సహజంగానే ఇతరుల కన్నా ఎక్కువగా లైంగికవాంఛ ఉంటుంది. అయితే, ఈ వ్యాసంలో చర్చించిన విషయాల పై చర్యలను తీసుకోవడం ద్వారా మీరు ఖచ్చితంగా ప్రభావితమవుతారు. ఈ వ్యాసం మగవారు మరియు ఆడవారు ఇద్దరిలో లైంగిక వాంఛ పెరిగేందుకు కొన్ని గృహ చిట్కాలను  వివరిస్తుంది, కామోద్దీపన (aphrodisiacs) గురించి కూడా వివరిస్తుంది.

కాబట్టి, కామోద్దీపన అంటే ఏమిటి? తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

మగవారిలో మరియు స్త్రీలలో లైంగిక కోరికలను మెరుగుపర్చడానికి మరియు లైంగిక పనితీరును మెరుగుపరచే సామర్థ్యాన్ని కలిగి ఉండే కొన్ని ఆహారాలు మరియు ఔషధాలు కామోద్దీపన లేదా సెక్స్ డ్రైవ్ ను సూచిస్తాయి. కామోద్దీపన ఆహారాలు ఒక వ్యక్తి యొక్క లైంగిక స్వభావాన్ని ప్రేరేపించడం మరియు ప్రోత్సహించడం ద్వారా అలా చేస్తాయి. ఇది వినడానికి కొంచెం సంక్లిష్టముగా ఉన్నపటికీ, ప్రతిరోజూ తినే ఆహార పదార్ధాలలో ఈ 'ఔషదాలు (డ్రగ్స్)' సహజంగానే ఉంటాయి, దానిమ్మ మరియు కాఫీతో సహా. ఇతర ఆహార పదార్దాలను, లైంగిక పనితీరు పెంచడానికి సులభంగా ఆహారంలో చేర్చవచ్చు. ఈ ఆహారాల జాబితాను ఒకసారి పరిశీలించి, మహిళలు మరియు పురుషలకు ఉత్తమమైనవి ఏవని ఎంపిక చేసుకోవచ్చు.

  • చాక్లెట్లు
  • నత్త గుల్లలు
  • మాంసం
  • చికెన్
  • సాల్మోన్ మరియు ట్యూనా వంటి చేపలు
  • పాలు
  • చీజ్
  • రెడ్ వైన్
  • అవోకాడో
  • ఎండుద్రాక్ష
  • ఖర్జురం
  • జల్దారు (ఆప్రికాట్లు)
  • ఆక్రోటు కాయలు
  • బచ్చలి కూర మరియు ఇతర ఆకుకూరలు
  • అరటిపళ్ళు
  • పీనట్ బట్టర్
  • కాలే
  • బీన్స్
  • కాఫీ

ఈ ఆహారాల యొక్క కామోద్దీపన ప్రభావాలను తెలియజేసే అధరాలు

  • చాక్లెట్లు ఒక బాగా తెలిసిన కామోద్దీపనకరమైన తిండ్లు/తిళ్ళు  మరియు మహిళల్లో లైంగిక కోరికను పెంచి మరియు లైంగిక ఆనందాన్ని మెరుగుపరుస్తాయి. స్త్రీలపై జరిపిన అధ్యయనంలో చాక్లెట్లు తినని మహిళలతో పోలిస్తే తినే మహిళలలో అధిక ఫిమేల్ సెక్సువల్ ఫంక్షన్ ఇండెక్స్ (FSFI) ఉన్నట్లు తెలిసింది.
  • నత్త గుల్లలు, మాంసం, చికెన్ మరియు చేపలు జింక్ అధికంగా ఉండే ఆహారాలు, వీటిలో లోపం మగవారిలో లైంగిక పరిపక్వత (sexual maturatio) ఆలస్యం కావడం మరియు  నపుంసకత్వంతో ముడిపడివుంది. కాబట్టి, పురుషుల లైంగిక పనితీరును మెరుగుపరచడం ద్వారా లిబిడోను పెంచడంలో అవి పరోక్ష ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
  • మాంసం, పాలు మరియు చీజ్ లో కార్నిటైన్ అధికంగా ఉంటుంది, ఇది పురుషుల యొక్క సంతాన సామర్థ్యం మరియు లైంగిక కోరికలతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. కార్నిటైన్ అనేది వీర్య సంబంధమైన ద్రవం (సెమినల్ ఫ్లూయిడ్) యొక్క ఒక భాగం, ఇది ఎక్కువ ఉండడం వలన వీర్యకణాల సంఖ్య (స్పెర్మ్ కౌంట్) మరియు వాటి చలనంతో ముడి పడి ఉంటుంది. కాబట్టి, అది ముఖ్యంగా పురుషుల లైంగికవాంఛ మరియు సెక్స్ డ్రైవ్ను మెరుగుపరడంలో సహాయపడవచ్చు.
  • రెడ్ వైన్ ఒక ముఖ్యమైన కామోద్దీపనకారి, అనేక అధ్యయనాలు మహిళల్లో దాని సమర్థతను సూచించాయి. ఈ అధ్యయనాలలో రెడ్ వైన్ ఒక మోస్తరు పరిమాణంలో తీసుకోవడం అనేది అధిక FSFI స్కోర్తో సంబంధం కలిగి ఉందని కనుగొన్నారు, ఇది మహిళల్లో లైంగిక కోరిక మరియు మెరుగైన లైంగిక పనితీరును సూచిస్తుంది. రెడ్ వైన్ వినియోగం మెరుగైన లైంగిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పరిశోధనా ఆధారాలు సూచించాయి.
  • అవోకాడో, ఎండుద్రాక్ష,ఖర్జురం  మరియు ఆప్రికాట్లు వంటి డ్రై ఫ్రూట్స్ బోరాన్ యొక్క గొప్ప వనరులు. బోరాన్ యొక్క సప్లిమెంట్లు పురుషులు మరియు మహిళలు ఇద్దరిలో సెక్స్ స్టెరాయిడ్ల స్థాయిలను పెంచే అవకాశం ఉందని పరిశోధన అధరాలు సూచించాయి. పురుషులు, ముఖ్యంగా పెద్దవయసు వారిలో, బోరాన్ సప్లిమెంటేషన్ ద్వారా గణనీయమైన ప్రయాజనాలు పొందే అవకాశం ఉంది.
  • ఆకుకూరలు మరియు అరటిపండ్లు మెగ్నీషియంలో అధికంగా ఉంటాయి, అది లైంగిక చర్యలలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం యొక్క లోపం అంగస్తంభన లోపం మరియు లిబిడో తగ్గిపోవడంతో సంబంధం కలిగి ఉంటుంది, కాబట్టి శరీరంలో మెగ్నీషియం స్థాయిలను పెంచుకోవడం అనేది సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

లైంగికవాంఛ తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి, అవి పురుషులు మరియు స్త్రీలలో వివిధ రకాలుగా ఉంటాయి. ఈ కారకాలలో కొన్ని ఇప్పటికే పైన ఇవ్వబడ్డాయి, ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటిగా ఎలా నిర్వహించవచ్చో చర్చిద్దాం

పురుషులలో టెస్టోస్టెరోన్ స్థాయిలు పెంచడం 

పురుషులలో, సెక్స్ డ్రైవ్ ఎక్కువగా మేల్ సెక్స్ హార్మోన్ లేదా టెస్టోస్టెరోన్ ద్వారా ప్రభావితమవుతుంది, అంటే ఈ హార్మోన్ స్థాయిల పెరుగుదల వారి సెక్స్ డ్రైవ్ తో ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగి ఉంటుంది. పురాతన కాలం నుండి లైంగిక సామర్ధ్యాన్ని పెంచుకోవడం కోసం, లైంగిక పనితీరును మెరుగుపరచుకోవడం, సెక్స్ వ్యవధిని పెంచుకోవడం లేదా సున్నితత్వాన్ని మెరుగుపరచుకోవడం కోసం పురుషులు సహజ ఆహార పదార్ధాలను తీసుకుంటున్నారు.

(మరింత సమాచారం: టెస్టోస్టెరాన్ స్థాయిలు పెంచడానికి గృహచిట్కాలు)

ఈ ఆహారాలలో ఎక్కువ భాగం సాధారణంగా రోజువారీ తినే ఆహారం పదార్దాలలోనే ఉంటాయి మరియు మిగిలినవి ప్రత్యేక ఆయుర్వేద పదార్థాలు, అవి తర్వాత చర్చించబడతాయి. పురుషుల్లో టెస్టోస్టెరోన్ స్థాయిలు మెరుగుపర్చడంలో అధిక సమర్థత కలిగిన అటువంటి ఒక ఆహార పదార్థం అల్లం. దాని యొక్క ప్రత్యేకమైన రుచి మరియు వాసన రసాయన సమ్మేళనాలతో ముడిపడి ఉన్న కారణంగా, మగవారిలో లిబిడోను మెరుగుపరిచే సామర్థ్యం అల్లానికి ఉంటుంది.

ఇది మంచి సెక్స్ డ్రైవ్ కు దారితీసే లైంగిక శక్తిని మరియు పురుషుల టెస్టోస్టెరోన్ స్థాయిలను పెంచుతుందని అధరాలు ఉన్నాయి. ఇది వీర్య పరిమాణం మరియు ఎజెక్షన్లను పెంచుతుంది, మరియు వీర్య కణాల సంఖ్య మరియు వీర్య కణాల చలనాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి,లైంగిక శక్తిని పెంచుకోవడానికి ఆహారంలో అల్లం చేర్చవచ్చు.

దానిని అల్లం టీ, అల్లం నీరు రూపంలో తీసుకోవచ్చు లేదా ఆహారంలో ఉపయోగించవచ్చు.

మహిళల్లో యోని భాగపు నొప్పిని తగ్గించడం 

కొంతమంది మహిళలు లైంగిక సంభోగ సమయంలో డిస్స్పారెనియా లేదా సంభోగ సమయ నొప్పిని ఎదుర్కొంటారు, ఇది సాధారణంగా వారి సెక్స్ డ్రైవ్ను తగ్గిస్తుంది, శృంగారాన్ని ఒక బాధాకరమైన అనుభవంగా చేస్తుంది. దీనికి  చికిత్స చేసే ముందు సమస్యను గుర్తించడం, అంటే అది మానసికపరమైనదా లేదా ఏదైనా రుగ్మత సంబంధితమైనదా అని అసలు కారణాన్ని తెలుసుకోవడం అవసరం.

సాధారణంగా, సెక్స్ తర్వాత వేడి నీటి స్నానం చేయడం మరియు సెక్స్ సమయంలో లూబ్రికెంట్ను వినియోగించడం వంటివి నొప్పిని తగ్గించగలవు. ఒక మూలికా పరిష్కారం వాలె అల్లం సారాన్ని కూడా ఇవ్వవచ్చు, ఇది నొప్పిని తగ్గిస్తుంది. అదనంగా, అల్లం ఒక సహజ కామోద్దీపనకారి మరియు దీర్ఘకాలిక ఉపయోగం వలన ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు.


మహిళల్లో యోని యొక్క పొడిదనాన్ని తగ్గించడం 

యోని యొక్క పొడిదనం మహిళల్లో ఒక సాధారణ సమస్య, ఇది బాధాకరమైన శృంగారానికి కారణం కావచ్చు, మరియు వారి లిబిడోను కూడా తగ్గించవచ్చు. ఈ పొడిదనం అంతర్లీన ఇన్ఫెక్షన్ లేదా హార్మోన్ల వలన కావచ్చు. పొడిదనానికి గల కారణాన్ని గుర్తించడం మరియు చికిత్స చేయడానికి అవసరం, సెక్స్ సమయంలో యోని లూబ్రికెంట్లను మరియు వజైనల్  మాయిశ్చరైజర్లను ఉపయోగించడం దీనికి సహాయపడవచ్చు.

(మరింత సమాచారం: యోని ఈస్ట్ సంక్రమణకు గృహ చిట్కాలు)

బిడ్డ జననం మహిళల్లో లిబిడోను తగ్గిస్తుంది 

ప్రసవం తర్వాత మహిళలు, ప్రత్యేకించి చనుబాలు ఇచ్చే సమయంలో, అదనపు బాధ్యతలతో, అలసట కలగడం వలన లైంగికవాంఛ తగ్గిపోయే సమస్యను ఎదుర్కొంటారు. ఇది కాకుండా, ఈ దశలో తరచుగా మహిళలు సెక్స్ కు వెనుకాడుతారు మరియు లైంగిక ప్రేరణల వలన రొమ్ములలో నొప్పి కూడా అనుభవించవచ్చు. కాబట్టి, ఈ సమయంలో భాగస్వామి పట్ల అత్యంత సున్నితముగా మరియు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. సెక్స్ సమయంలో, ముఖ్యంగా ఛాతీ తాకినప్పుడు సున్నితముగా వ్యవహరించాలని సూచించబడుతుంది.


ముందుగా చర్చించినట్లుగా, అనేక కారణాల వలన పురుషులు మరియు మహిళలు ఇద్దరూ తక్కువ లైంగికవాంఛను అనుభవిస్తుంటారు. ఇది మీ శృంగార జీవితం మరియు మీ భాగస్వామి పై కూడా గణనీయమైన ప్రభావం చూపుతుంది. పైన పేర్కొన్న సహజ కామోద్దీపనలు మరియు ఆహారాలు లైంగికవాంఛను పెంచడంలో పాత్రను కలిగి ఉన్నప్పటికీ, సెక్స్ డ్రైవ్లో కావలసిన ప్రభావాలను త్వరగా సాధించడానికి కేవలం వాటి వినియోగం మాత్రమే సరిపోదు. అందువల్ల, మేము కొన్ని లైంగికవాంఛను పెంచే మరియు ఆయుర్వేదం మరియు మూలికా శాస్త్రంలో పరీక్షించబడిన కొన్ని చిట్కాల మరియు మూలికల జాబితాను తయారు చేశాము. లైంగికవాంఛను పెంచే చర్యలో ఇవి నిర్దిష్టంగా ఉండడం వలన, ఈ చిట్కాల ఉపయోగం సెక్స్ డ్రైవ్ కోసం మంచి ఫలితాలను అందిస్తుంది

లైంగికవాంఛ కోసం మెంతులు - Fenugreek for libido 

మెంతులు అనేవి భారతీయ ఆహార విధానంలో ఒక సాధారణ పదార్ధంగా చెప్పవచ్చు, దాని మెంతివిత్తనాలు/మెంతులను మరియు మెంతికూర/ఆకులను వంట కోసం ఉపయోగిస్తారు. ఇది ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇటీవలి అధ్యయనం ప్రకారం, ఈ మూలికను ఇవ్వడం వలన మగవారిలో లిబిడో 28% మేర పెరిగిందని తెలిసింది. మెంతులలో ఉండే 'సెపోని న్స్' దానికి కారణం అని చెప్పవచ్చు, ఎందుకంటే అవి లైంగిక హార్మోన్ల ఉత్పత్తిని, ముఖ్యంగా టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి.

మీకు దాని రుచి ఇబ్బంది కలిగిస్తే,  ఆహారంలో దానిని నేరుగా చేర్చడం బదులుగా, మెంతులను సప్లిమెంట్ల రూపం తీసుకోవచ్చు. టెస్టోఫెన్ (Testofen) సప్లిమెంట్ యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి నిర్వహించిన అధ్యయనంలో, అది మగవారి సెక్స్  డ్రైవ్ మీద సానుకూల ప్రభావాన్ని చూపిందని తెలిసింది. ఇది టెస్టోస్టెరాన్ యొక్క సాధారణ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది, తద్వారా లిబిడోను నిర్వహిస్తుంది.

మెంతులుస్త్రీలకు కూడా సమానంగా ఉపయోగపడతాయి. ఇవి రొమ్ము పరిమాణాన్ని పెంచుతాయి మరియు రొమ్ము కణజాలం యొక్క ఆరోగ్యాన్ని నిర్వహిస్తాయి, ఇది స్త్రీ యొక్క లైంగిక ప్రేరేపణలో పాత్ర కలిగి ఉండవచ్చు.

మాకా లైంగికవాంఛ పెంచుతుంది 

పెరూ లో స్థానికంగా ఉండే, మాకా సప్లీమెంట్లుగా మరియు పౌడర్ గా అందుబాటులో ఉంటుంది దానిని మిల్క్ షేక్లు మరియు స్మూతీలలో సులభంగా కలుపుకుని తినవచ్చు. ఇది పరంపరంగా లైంగిక శక్తిని పెంచే మూలిక వలె ఉపయోగించబడుతుంది మరియు సంతానోత్పత్తి రుగ్మతల చికిత్సకు సప్లీమెంట్గా ఉపయోగించబడుతుంది. ఒక సంతానోత్పత్తి కారకంగా మరియు లైంగిక కోరికను పెంచే ముందుగా ఉండటంతో పాటు, మకా పురుషులలో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుందని కూడా ప్రసిద్ది చెందింది.

అశ్వఘాంధ లైంగిక కోరికను మెరుగుపరుస్తుంది - Ashwagandha improves libido 

అశ్వఘాంధ  అనేది భారతదేశంలో సాధారణంగా దాని యొక్క ప్రయోజనాలకు ఉపయోగించే ఒక ప్రధాన మూలిక, దాని ప్రయోజనాలలో ప్రధానమైనది లైంగిక జీవితాన్ని మెరుగుపరచడం. అశ్వఘాంధ మగవారు, ఆడవారు ఇద్దరిలో హార్మోన్లను సమతుల్యం చేయగల సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది లైంగిక కోరిక, లిబిడో, లైంగిక పనితీరు మరియు ఆనందం పొందడం వంటి వాటిని కూడా నిర్వహిస్తుంది. అశ్వఘాంధరక్తంలో లైంగిక హార్మోన్ల స్థాయిలను పెంచడం మరియు వాటిని సమతుల్యం చేయడం ద్వారా లైంగిక ప్రయోజనాలను కలిగిస్తుంది.

పురుషులలో, లైంగిక శక్తిని పెంచుటకు ఇది ఉపయోగించబడుతుంది, ఇది వారికి దీర్ఘకాలం పాటు సహాయపడుతుంది. వీర్యం యొక్క నాణ్యత మరియు పరిమాణాన్ని నిర్వహించడంలో కూడా అశ్వఘాంధ  మంచి పాత్రను కలిగి ఉంటుంది మరియు దీనిని పురుషుల్లో నపుంసకత్వానికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

అశ్వగంధ సారం తీసుకోవడం వలన ఆడవారిలో లైంగిక పనితీరు మెరుగుపడుతుంది, ఇది వారి లైంగిక వాంఛను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు.

అశ్వగంధ పొడి రూపంలో లభ్యమవుతుంది, అలాగే ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో దాని యొక్క తాజా వేర్లను కూడా ఉపయోగించవచ్చు.

మెరుగైన లైంగికవాంఛ కోసం కాటువాబా బెరడు 

భారతీయ పురుషులలో  లైంగిక వాంఛను మెరుగుపర్చడానికి మరియు లైంగిక ప్రేరేపణను పెంచడానికి కాటువాబా బాగా ప్రసిద్ధి చెందినది. ఇది ఒక ప్రేరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, అది లైంగిక కోరికలను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఇది జననేంద్రియ అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, తద్వారా అంగస్తంభన యొక్క వ్యవధిని పెంచుతుంది మరియు పురుషులలో మెరుగైన లైంగిక ఉత్సాహాన్ని మరియు భావప్రాప్తిని కలిగిస్తుంది. కాటువాబాను నేరుగా చెట్టు బెరడు నుంచి సేకరించవచ్చు, వైద్యుడిని ఒకసారి సంప్రదించిన తరువాత దానిని సప్లిమెంట్ గా ఉపయోగించవచ్చు.

పెద్ద వయసువారిలో యార్సా గుంబా లైంగికవాంఛను మెరుగుపరుస్తుంది 

పురుషుల లైంగిక ప్రేరేపణలో దీనికి కొనియాడదగ్గ ప్రయోజనాలు ఉండడం వల్ల యార్సా గుంబా (Cordyceps) ను 'హిమాలయన్ వయాగ్రా' గా కూడా పిలుస్తారు. ఇది పర్వత ప్రాంతాలలో పెరిగే ఒక ఫంగస్ జాతి. పెద్దవయసు వారిలో లైంగిక ఆసక్తిని మరియు పనితీరును మెరుగుపర్చడానికి ఇది సహాయపడుతుంది, అలాగే వయసుతో పాటు వారి సంతానోత్పత్తి తగ్గుతుంది దీనిని సరిచేయడంలో కూడా  యార్సా గుంబా ఉపయోగపడుతుంది.

టెస్టోస్టెరోన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా, ఇది వీర్యకణాల నాణ్యతను మరియు వాటి చలనము మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల ఇది లైంగిక ఆసక్తి-సంబంధిత సమస్యలకు భారతదేశంలో ఒక ప్రసిద్ధ గృహ చిట్కాగా ఉపయోగించబడుతుంది.   

యార్సా గుంబాను జానపద ఔషధంలో ఉపయోగిస్తారు మరియు లైంగిక కోరికలు కోసం భారతదేశంలో ప్రాచీన కాలం వారు కూడా దీనినిఉపయోగించారు.

మెరుగైన ఫలితాల కోసం స్త్రీ పురుషులిద్దరూ ఒక గ్లాసు పాలులో యార్సా గుంబా సారాన్ని తీసుకోవచ్చని సిఫారసు చేయబడింది. ఇది లైంగిక శక్తి మరియు కోరికలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఆధునిక జీవితాలలో ఒత్తిడి కారణంగా కుంగుబాటు మరియు ఆందోళన సాధారణ రుగ్మతులుగా మారాయి. ఇవి లైంగిక కోరిక పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి మరియు లిబిడోను తగ్గించడానికి దారితీయవచ్చు, ఇది పురుషులు మరియు స్త్రీలు ఇద్దరిలోను సంభవించవచ్చు. కుంగుబాటు కారణంగా ఒత్తిడితో ముడిపడి ఉండే డిహెచ్ఇఏ (DHEA, లైంగిక కోరికను ప్రభావితం చేసే హార్మోన్) స్థాయిలు తగ్గిపోతాయి అది లిబిడో తగ్గిపోవడానికి కారణమవుతుంది.

డిహెచ్ఇఏ స్థాయిలు వయసు పెరగడంతో పాటు కూడా తగ్గిపోతాయి, సాధారణంగా ఇదే  పెద్ద వయసు వారిలో సెక్స్ డ్రైవ్కు తగ్గిపోవడానికి బాధ్యత వహిస్తుంది. తమని తాము తక్కువగా అంచనా వేసుకోవడం మరియు ఆత్మ విశ్వాసం తక్కువగా ఉండడం కూడా లిబిడోను ప్రభావితం చేసే సాధారణ సమస్యలు. ఈ విభాగం వాటిని నిర్వహించడానికి కొన్ని చిట్కాలను అందిలి 

లైంగికవాంఛను మెరుగుపర్చడానికి ధ్యానం - Meditation to improve

ధ్యానం ఒత్తిడిని తగ్గించడానికి మరియు మనస్సును శాంతపరచడానికి సహాయం చేస్తుంది. ముఖ్యంగా మహిళల్లో, తక్కువ లైంగికవాంఛను నిర్వహించడంలో మైండ్ ఫుల్ నెస్ - ఏంహాన్సమెంట్ టెక్నిక్స్ (mindfulness-enhancement techniques) సహాయపడతాయని పరిశోధకులు గుర్తించారు.

ధ్యానం కొంతమంది  మహిళలలో శృంగారానికి  సంబంధించిన మానసిక బాధను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది, ఇది వారి లిబిడోను మెరుగుపర్చడంలో సహాయపడవచ్చు. ఇది కాకుండా, ధ్యానం మంచి ఆత్మ  విశ్వాసాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది వ్యక్తి యొక్క సెక్స్ డ్రైవ్ పై లాభదాయకమైన ప్రభావాలను కలిగి ఉంటుంది.

ధ్యానం ద్వారా విడుదలయ్యే  ఎండోర్ఫిన్స్ విడుదల లేదా 'హ్యాపీ హార్మోన్లు' కూడా సహాయపడతాయి.

మెరుగైన సెక్స్ డ్రైవ్ గురించి యోగా సాధన చేస్తున్నప్పుడు, రిలాక్సేషన్ (ఉపశమనం) కోసం శ్వాస వ్యాయామాలు మరియు ఇమాజినేటివ్  వ్యాయామాలు అంటే సంచలనాలను మరియు స్పర్శలను ఊహించడం వంటివి సిఫారసు చేయబడతాయి.

లైంగికవాంఛను మెరుగుపర్చడానికి మానసిక చికిత్స 

భావోద్వేగ మరియు ప్రవర్తనా క్రమరాహిత్యాలను చికిత్స చేయడానికి ఉపయోగించే  ఔషధరహిత పద్ధతి అయిన మానసిక చికిత్సనే, తరచూగా లైంగిక వాంఛ రుగ్మతలకు కూడా చికిత్సగా ఉపయోగిస్తారు. మానసిక చికిత్స (సైకోథెరపీ) వ్యక్తికి తక్కువ లైంగిక వాంఛ యొక్క ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడంలో సహాయం చేస్తుంది, తద్వారా దానికి చికిత్స చేయవచ్చు.

లైంగిక వాంఛను మెరుగుపర్చడానికి బరువు తగ్గుదల 

బరువు మరియు బిఎంఐ (BMI)లో పెరుగుదల శరీరం యొక్క హార్మోన్ల సమతుల్యతకు ఆటంకం కలిగిస్తుంది, ఇది సెక్స్ హార్మోన్లు ప్రభావితం చేయవచ్చు. దీనిని నిరోధించడానికి, ఆరోగ్యకరమైన ఆహార విధానం మరియు జీవనశైలిని అనుసరించవచ్చు. ఇది లైంగిక హార్మోన్ల సాధారణ స్థాయిలకు సహాయపడుతుంది మరియు లిబిడోపై ప్రభావం చూపుతుంది.

ఇంకోరకంగా ఇది మీ ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడం ద్వారా మీ భాగస్వామితో మెరుగైన లైంగిక జీవితానికి సహాయపడే మరో మా

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660
        అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.



కామెంట్‌లు లేవు: