3, జూన్ 2020, బుధవారం

కళ్ల నుండి నీరు కారడం సమస్య పరిష్కారం మార్గం



కళ్ళ నుండి నీళ్లు కారడం ఏమిటి?

కళ్ళ నుండి నీళ్లు కారడం అనేది సాధారణంగా అంతర్లీన సమస్య యొక్క లక్షణం. ఇది చాలా అధికంగా కన్నీరు ఉత్పత్తి కావడం వలన లేదా కన్నీరు సరిగా ఇంకక పోవడం (not drained) వలన సంభవిస్తుంది. కళ్ళ నుండి దుమ్ము వంటి బయటి పదార్దాలను తొలగించడంలో కన్నీళ్లు సహాయం చేస్తాయి మరియు మన కళ్లను తేమగా ఉంచుతాయి. అయితే, కంటి నుండి అధిక మరియు అనియంత్రిత నీరు కారడం అనేది కొన్ని కంటి సమస్యల లేదా అలెర్జీల వల్ల కావచ్చు. కన్ను శరీరం యొక్క ఒక సున్నితమైన మరియు కీలకమైన/ముఖ్యమైన భాగం అందువల్ల ఇటువంటి సమస్య ఏర్పడిన సందర్భంలో వెంటనే ఒక వైద్యుణ్ణి సంప్రదించడం సరైన మార్గం.

దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కళ్ళ నుండి నీళ్లు కారడానికి సంబంధించిన లక్షణాలు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

అత్యంత సాధారణ కారణం కళ్ళు పొడిబారడం, ఎందుకంటే కళ్ళు పొడిబారడం వలన అది దురదను కలిగిస్తుంది ఆ దురదను తగ్గించడానికి కళ్ళు నీళ్లను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. ఇతర కారణాలు:

  • కండ్లకలక
  • ఇన్ఫెక్షన్
  • కన్నీటి వాహిక (tear duct) నిరోధించబడడం
  • కనురెప్పలు లోపలికి లేదా బయటికి తిరిగిపోవడం
  • దుమ్ము మరియు బూజు వలన  అలెర్జీ
  • ప్రకాశవంతమైన వెలుతురు
  • కంటిలో ధూళి బయటి పదార్థం ఉండడం
  • చికాకు లేదా గాయం
  • కనురెప్ప వెంట్రుకలు లోపలి దిశలో పెరగడం
  • చుట్టుప్రక్కల రసాయనాల యొక్క ఉనికి

కొన్నిసార్లు నవ్వడం, ఆవలింతలు, వాంతులు మరియు కళ్ళు ఒత్తిడికి గురైనప్పుడు కూడా కళ్ళ నుండి నీళ్లు అధికంగా కారుతాయి.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు కొన్ని లక్షణాల సంబంధిత ప్రశ్నలను అడగడం మరియు కంటి పరీక్షను నిర్వహించడం ద్వారా కళ్ళ నుండి నీళ్లు కారడానికి గల కారణాన్ని విశ్లేషిస్తారు. కంటికి మరియు చుట్టూ ఉన్న మృదు కణజాలాల (soft tissues)ను తనిఖీ చేయటానికి వైద్యులు కంటికి పెన్ లైట్ (penlight) పరీక్షను నిర్వహిస్తారు. రోగ నిర్ధారణను ధ్రువీకరించడానికి వైద్యులు కొన్ని నిర్దిష్ట కంటి పరీక్షలను కూడా సిఫారసు చేయవచ్చు.

చికిత్స పూర్తిగా కళ్ళ నుండి నీళ్లు కారడం యొక్క కారణం మీద ఆధారపడి ఉంటుంది. నీళ్ళు కారడం కొన్ని కంటి సమస్యల వలన ఐతే, చాలా వాటి చికిత్సకు ప్రస్తుతం వివిధ ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కారణం ఒక అలెర్జీ ప్రతిచర్య ఐతే, అలెర్జీకి చికిత్స చేయడం అనేది నీళ్ళు కారడాన్ని తగ్గిస్తుంది.

కంటిలోని ఏదైనా బయటి వస్తువు (నలక) ఉండిపోతే నేత్ర వైద్యులు దానిని తొలగించవచ్చు. పొడి కళ్ళకు లూబ్రికెంట్ కంటి చుక్కలు (Lubricant eyedrops) సూచించబడతాయి. బాక్టీరియల్ సంక్రమణ కోసం యాంటిబయోటిక్ కంటి చుక్కలు ఇవ్వవచ్చు. నిరోధించబడిన కన్నీటి వాహిక మరియు కనురెప్పల సమస్యలు వంటి వాటి కోసం శస్త్రచికిత్స అవసరం కావచ్చు.

కళ్ళ నుండి నీళ్లు కారడం కొరకు మందులు


Medicine NamePack Size
KetorolKetorol DT Tablet
Lotepred TLotepred T Eye Drop
Schwabe Ranunculus repens CHSchwabe Ranunculus repens 1000 CH
LotetobLotetob Eye Drops
TobaflamTobaflam Eye Drop
Raymoxi LRAYMOXI L EYE DROP 5ML
CadolacCadolac 10 Tablet
CentagesicCentagesic Eye Drop
KetKet 10 Mg Tablet
KetanovKetanov Drop
KetoflamKETOFLAM T4 TABLET
Schwabe Ambrosia artemisiaefolia MTSchwabe Ambrosia artemisiaefolia MT
Ketolac LdKetolac Ld Eye Drop
KetorocinKetorocin 0.5 Mg Eye Drops
KetorocinlsKetorocinls Eye Drops
KetorolacKetorolac Dt 10 Mg Tablet
KtKt Eye Drops
Kt LsKt Ls 4 Mg Eye Drops
LokatLokat 0.4% Eye Drops
NatoNato 10 Mg Tablet
RolacRolac Eye Drop
TolarTolar Eye Drop
Tolar LxTolar Lx Eye Drop
Tolar MxTolar Mx Eye Drop
TorolacTorolac 0.5% Eye Drops

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


కామెంట్‌లు లేవు: