*Herpes Simples-హెర్పిస్ సింప్లెక్స్*
*నీటి పొక్కులే అనుకోవద్దు&కొందరికి తరచుగా పెదవి మీద, నోటి చుట్టూ నీటిపొక్కులు ఏర్పడుతుండటం చూస్తూనే ఉంటాం. హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఇన్‌ఫెక్షన్ మూలంగా...........*
*Herpes Simples-హెర్పిస్ సింప్లెక్స్--
*👉🏿హెర్పిస్ సింప్లెక్స్*. ఇది వైరస్ క్రిముల ద్వారా సంక్రమించే వ్యాధి. అంటువ్యాధి. పూర్తిగా నయం చెయ్యటం కష్టమే. వస్తూ పోతూ వుంటుంది. దీనికి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్-1 మరియు హెర్పిస్ వైరస్-2 కారణాలుగా గుర్తించారు. అత్యధిక కేసులు హెర్పిస్ వైరస్-2 కారణంగా సంక్రమిస్తున్నట్లు నిర్ధారించడం జరిగింది. అయినా ఈ రెండు రకాల వైరస్‌ల మూలంగా నోరు, జననేంద్రియాలకు హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి సంక్రమిస్తున్నట్లు నిర్ధారించారు.
చర్మానికి చర్మం తాకినందువల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. చర్మం మీద ఎక్కడా గుల్లలు కనిపించని కేసుల ద్వారా కూడా ఇన్ఫెక్షన్ సంక్రమిస్తున్నట్లు గుర్తించారు. స్త్రీలలో యోని నుండి వెలువడే స్రావాలలో (పైన గుల్లలు(blisters) లేనప్పటికీ) వైరస్ క్రిములున్నట్లు కనుగొనడం జరిగింది.
ఈ హెర్పిస్ సింప్లెక్స్ తీవ్రమైన అంటువ్యాధి. ఈ వ్యాధి సోకిన స్త్రీలు గర్భవతులైతే వైద్యుని తప్పనిసరిగా సంప్రదించాల్సి ఉంటుంది. కాన్పు సమయంలో ఈ వ్యాధి- పుట్టే బిడ్డకు సంక్రమించే అవకాశముంది. ఈ వైరస్ సోకి పుట్టే బిడ్డలకు కంటిచూపు పోయే ప్రమాదముంది. మెదడు వాపు లాంటి వ్యాధులు సంక్రమించి శిశువు ప్రాణాలకూ ప్రమాదం రావచ్చు. కనుక వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కాన్పు చేసే విషయం ఆలోచించవలసి వుంటుంది. యోని చుట్టూ గుల్లలు లేని సందర్భంలో మాత్రం యోని ద్వారా కాన్పు చేయడం ఆలోచించవచ్చు.
హెర్పిస్ వైరస్ మెదడులోని నాడీ కణాలలో దాగి వుండి దేహరక్షణ వ్యవస్థకు తెలియకుండా నిద్రాణంగా ఉండిపోవచ్చు. మధ్యమధ్యలో ఈ క్రిములు విజృంభించి జననేంద్రియాల వద్ద గుల్లల(blisters)కు కారణమవుతుండొచ్చు. రోగనిరోధక వ్యవస్థ ఒత్తిళ్ళకు గురైన సందర్భంలో ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ. అలాగే వ్యాధి మూలకంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడిన సందర్భంలోనూ వైరస్ క్రిములు విజృంభించొచ్చు.
మూతిమీద 'కోల్డ్ సోర్స్' ఉన్న వ్యక్తులను ముద్దాడడం ప్రమాదకరం. వారు వాడిన తువ్వాలు మొదలైన వాడిని వాడరాదు. వారితో సెక్స్‌లో పాల్గొనటం కూడా ప్రమాదకరమే. కండోమ్‌లు వాడినా ముప్పు పొంచే ఉంటుంది. ఎందుకంటే కండోమ్ వెలుపల ప్రదేశంలో ఇన్ఫెక్షన్‌తో కూడిన గుల్లలుండొచ్చు.
హెర్పిస్ వైరస్ వలన రెండు ఇతరత్రా ప్రమాదకర వ్యాధులు సంప్రాప్తించే అవకాశం ఉంది. ఇది ఉంటే ఎయిడ్స్‌కారక హెచ్‌ఐవీ తేలికగా సోకే అవకాశం ఉంది. మరొకటి హ్యూమన్ పాపిలోమా వైరస్. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఏటువంటి పరిస్థితులలో ఇది మళ్ళి మళ్ళీ కనిపించును :
సాధారణ అనారోగ్య సుస్థి చేసినప్పుడు ,
బాగా అలసటకు గురిచేసే వృత్తిపనులవారిలో(Fatigue),
అధిక శారీరక లేదా మానసిక శ్రమ ఉన్నపుడు ,
వ్యాధినిరోధక శక్తి తగ్గించే రోగాలు తో బాధపడుతున్నపుడు,
పొక్కులు లేదా గుళ్ళలు ప్రదేశములో రాపిడి కలిగినపుడు ,
బహిస్ట సమయాలలోనూ ఇది వ్యాపించే అవకాశమున్నది ,
లక్షణాలు లేదా సింప్టమ్‌స్ :
గుల్లలు లేదా పుల్లు - ఇవి మూతి చుట్టూ , జననేంద్రియాల చుట్టూ కనిపిస్తాయి .చాలా నొప్పితో ఉంటాయి. చిన్నగా జ్వరము , శరీరం నొప్పులు ఉంటాయి.
పరీక్షలు :
ఈ వ్యాధిని గుర్తించడానికి ఏ ల్యాబ్ పరీక్షలు అవసరము లేదు . పొక్కులు లేదా గుల్లలు (blisters) చూసి పోల్చ వచ్చును . సాధారణము గా Lab Tests ...DNA, - or PCR , virus culture మున్నగునవి చేస్తారు.
చికిత్స :
చాలా మంది చికిత్స లేకుండానే మామూలు గానే తిరిగేస్తారు. పూర్తిగా ఈ వైరస్ ని శరీరమునుండి సమూలముగా లేకుండా చేయలేము .
యాంటి వైరల్ *👉🏿మందులు(antiviral drugs ) :*
ఉదా:
1-acyclovir and valacyclovir can reduce reactivation rates.
2-Aloe Vera జెనిటల్ హెర్పీస్ లో కొంతవరకు పనిచేస్తున్నట్లు అదారాలు ఉన్నాయి.
3-నొప్పిగా ఉంటే ... tab. ultranac-p రోజుకి 2-3 మాత్రలు 5-7 రోజులు వాడాలి.
4-దురద , నుసి ఉంటే : tab . cetrazine 1-2 మాత్రలు 3-4 రోజులు వాడాలి.
ఇంకా ప్రాబ్లెమ్ ఉంటే లోకల్ డాక్టర్ కలవాలి
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి అందరికి ఉపయోగపడే సులభమైన ఆరోగ్య సలహాలు ! కనుక తప్పక షేర్ చెయ్యండి అవసరం ఉన్న వారికీ ఉపయోగపడవచ్చు.
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
https://m.facebook.com/story.php?story_fbid=2282601865338019&id=1536735689924644

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి