30, నవంబర్ 2019, శనివారం

అస్తమాను ను నివారణ కు తీసుకోవాలిసిన జాగ్రత్త లు

*చలి కాలం లో ఆస్థమాకి తీసుకోవలసిన ఆహారం మరియు యోగ & ఆయుర్వేద చికిత్స నవీన్ నడిమింటి అవగాహనా కోసం*.

       ఆస్థమా  ఒక ఊపిరి తిత్తులకు సంబంధించిన  దీర్ఘ వ్యాధి.  కనీసం రెండు కోట్ల మంది భారతీయులు ఈ ఆస్త్మా వ్యాధి తో సతమతం అవుతున్నారు.   ఇది దీర్ఘ కాల వ్యాధి అయినా కూడా , తరచుగా అంటే వాతావరణంలో చలి పెరిగిన్నప్పుడు  లక్షణాలు ఉధృతం అవుతూ ఉంటాయి. అప్పుడు ఆ పరిస్థితిని  ఆస్త్మా ఎటాక్ అని అంటారు.

 *👉🏿ఆస్థమాకి గల కారణాలు:*
1. -అలర్జీ కలిగించేపదార్థాలు, వాతావరణంలోని దుమ్ము, ధూళి, చల్లని మేఘావృత వాతావరణం, అధిక తేమ, పువ్వులలోంచి వచ్చే పుప్పొడి రేణువులు; బొగ్గు, సిమెంటు వంటి కొన్ని రసాయన ద్రవ్యాలు, కొన్ని తినుబండారాలు, ఉదాహరణకు కొన్ని నూనెలు, రంగులు, వాసనలు, నూనె మరుగుతున్నప్పుడు వెలువడే పొగ. వారసత్వం ద్వార కూడా సంక్రమించవచ్చు. మానసిక ఒత్తిడి, భయం, ఆందోళన, అభద్రతాభావం, చింత, శోకం వంటి వ్యతిరేక ఉద్వేగాలు.

శిశువు, పిండ దశ లో ఉన్నపుడు కానీ , లేదా శిశువు జన్మించాక ,పెరుగుతూ ఉన్నపుడు కానీ ,  ఇంట్లో ఉండే వారు ఎవరైనా స్మోకింగ్ చేస్తూ ఉంటే కూడా ఆస్త్మా  శిశువుకు వచ్చే రిస్కు హెచ్చు గా ఉంటుంది.  ఎందుకంటే కనీసం మూడు వేల రకాలైన విష పదార్ధాలు పొగాకు పొగ లో ఉంటాయి.  ఆ విషతుల్య పదార్ధాలు పిండం లో కానీ పెరుగుతున్న శిశువు రక్తం లో కానీ ప్రవేశించితే , పెరుగుదల దశలో ఎక్కువగా  ఆస్త్మా  రిస్కు ఎక్కువ అవుతుంది.

*2.-ఆస్త్మా తగ్గించే ఆహారం*
            కిస్‌మిస్, వాల్‌నట్స్, బొప్పాయి, ఆపిల్, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, అరటి, మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఇ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరును నియంత్రించడం, మెరుగుపరడచంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

*బేక్‌ఫాస్ట్‌లో...*
      పండ్లు, తేనె, కిస్‌మిస్, బెర్రీ వంటి పండ్లు, భోజనంలో... క్యారట్, బీట్‌రూట్ (పచ్చిగా తినగలిగినవి), తాజా కాయగూరలు ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, బాదం, సోయా, కొవ్వు తీసిన పాలు రోజూ తీసుకోవచ్చు.

ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాదినుసులు ఆస్త్మా తీవ్రతను తగ్గిస్తాయి.

*3.-ఇలా కూడా తీసుకోవచ్చు...*
పసుపు కలిపిన పాలు తాగాలి. పావు స్పూన్ పసుపులో స్పూన్ తేనె కలిపి పరగడుపున తీసుకోవాలి. ఇది ఆస్త్మా నివారణి కూడ. - పాలు లేదా టీలో అరస్పూన్ అల్లం పొడి లేదా మిరియాల పొడి వేసి తాగాలి.

*4-తీసుకోకూడని ఆహారం*
        పెరుగు, అరటిపండు, కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, కూల్‌డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు, గుడ్లు, రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహారం, బ్రెడ్, ఆవుపాలు. ఉప్పు తగ్గించాలి.

‘బాల్యంలో ఆహారపుటలవాట్లు పెద్దయ్యాక ఆస్త్మా రావడానికి కారణమవుతున్నాయి’ అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చేయాలి.

*👉ఆస్థమాకి ఆయుర్వేద చికిత్స..!*
 A.-చిన్న పిల్లలు కు జలుబు దగ్గర ఉంటే
     Syrp Clavam , syrp Livocet M, syrp Medamol 250mg
B.-పెద్ద వాళ్ళు కు జలుబు దగ్గు తగ్గాక పొతే
 
    Laxmi vilasa ras మాత్రలు, కఫకేసరి టానిక్ వాడండి
C.-జలుబు వల్ల గురక రాకూడవుండలంటే
 
    బరువు తగ్గే ప్రయత్నం చెయ్యండి.ఉదయం ప్రాణాయామం చెయ్యండి.dee snoor టానిక్ వాడండి

ఆస్త్మాను నివారించడానికి ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా ‘ *అగస్త్య హరీతకీ రసాయన’ లేహ్యాన్ని కప్పు పాలతో చప్పరించాలి*.
         ఈ లేహ్యాన్ని వాడడానికి ప్రత్యేకమైన నియమాలు అవసరం లేదు,  ఎక్కువ కాలం వాడినా ఇబ్బందులు ఉండవు. కాబట్టి జీవితాంతం తీసుకుంటుండవచ్చు.

*4.-ఆస్త్మా తక్షణ నివారణకు:*
 మూడు చెంచాల ‘
*కనకాసవ’ ద్రావకాన్ని మూడు చెంచాల గోరువెచ్చటి నీటితో రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి.*

 *శ్వాసకుఠారరస మాత్రలు  ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తీసుకోవాలి.*
    నేను చెప్పిన మందులు అన్ని మీ ఫ్యామిలీ డాక్టర్ సలహా మేరకు వాడాలి లేదు అంటే ఇబ్బంది రావచ్చు ఒక్క ఆరోగ్యం నిపుణుడు నవీన్ నడిమింటి గా సలహా
   *ఆమలకీ (ఉసిరికాయ) రసాన్ని ఒక చెంచా తేనెతో రోజూ తీసుకుంటే (ఎంతకాలమైనా తీసుకోవచ్చు) ఉబ్బసంతో పాటు ఎన్నో రకాల వ్యాధులు దరిచేరవు.*

రోజుకు రెండుపూటలా ఖాళీకడుపున ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులకు అమోఘమైన శక్తి పెరిగి ఎన్నో రకాల అలర్జీలనుంచి నివారణ కలుగుతుంది.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి

మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

కామెంట్‌లు లేవు: