19, నవంబర్ 2019, మంగళవారం

నడుము మెడ నొప్పులు యోగ వాళ్ళు తగ్గుతుంది

*నడుము నొప్పి, సయాటికా, మెడనొప్పి  ఆయుర్వేదం ,హోమియోపతీ ఆక్యుప్రెషర్ మార్గాలునిపుణు మీ Naveen Nadiminti అవగాహనా కోశం ఓన్లీ*

1. బోర్లా పడుకోండి .
2. చేతులను మడచి  తలను  చేతులపై పెట్టుకుని పడుకోండి . 3. కాళ్ళను దగ్గరకు చేర్చండి . 4. మీ అరచేతులు  నేలకు తగిలేలా ఉంచండి . ఈ సారి మీ మోచేతులను కూడా పైకి ఎత్తాలి 
5. తలను . చాతీని బొడ్డు వరకూ పైకి ఎత్తండి .
6. మీరు ఉండగలిగినంత సేపు  ఆసన స్థితి లో ఉండండి .
దీనిని  భుజంగాసనం అంటారు .
*👉🏿ప్రధానమైన ఆసనాలు*
నడుము నొప్పితో సతమతమయ్యేవారు ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని ముందుగా పవనముక్తాసనం, ఆ తర్వాత నడుము వికాస క్రియలను కొద్దిసేపు సాధన చెయ్యాలి. దీంతో నడుము యోగాసనాలకు సిద్ధంగా తయారవుతుంది. తర్వాత మేరుదండాసనం, భుజంగాసనం, మార్జారాసనం, నాభిఆసనం సాధన చెయ్యాల్సి ఉంటుంది. సేతుబంధాసనం, వక్రాసనం, మత్సే్యంద్రాసనం కూడా వీరికి ఉపకరిస్తాయి. ఏ ఆసనాన్నైనా శరీరం సహకరించిన మేరకే చెయ్యాల్సి ఉంటుంది.
 *👉🏿భుజంగాసనం*
  1. బోర్లా పడుకొని రెండు పాదాల బొటనవేళ్లు, మడమలు తాకేలా చూసుకోవాలి. అరచేతులను ఛాతీకి రెండు వైపులా నేలకు ఆనించి శ్వాస పీలుస్తూ మోచేతుల మీద శరీరాన్ని పైకి లేపాలి. తల నుంచి బొడ్డు పైభాగం వరకు పడగలా పైకి ఎత్తాలి. ముఖం ఆకాశం వైపు చూస్తుండాలి. కొద్దిసేపయ్యాక శ్వాసను వదులుతూ యథాస్థితికి రావాలి.  2. దీన్ని అరచేతులను నేలకు ఆనించి తలను, ఛాతీని పైకెత్తుతూ కూడా చేయాలి. శ్వాసను పీలుస్తూ ఛాతీతో పాటు చేతులనూ పైకెత్తాలి. శ్వాస వదులుతూ కిందికి దించాలి.  3. రెండు చేతులను తిన్నగా పక్కకు చాచాలి. కుడి చెయ్యిని పైకెత్తి తలను కుడివైపు తిప్పుతూ శ్వాసను పీలుస్తూ ఎత్తిన కుడిచేతిని చూడాలి. శ్వాస వదులుతూ కిందికి తీసుకురావాలి. ఇలాగే ఎడమ చేయిని పైకెత్తుతూ చేయాలి. తర్వాత రెండు చేతులను పక్కలకు చాచి శ్వాస పీలుస్తూ.. వీలైనంత వరకు తలను, ఛాతీని పైకెత్తాలి.
*👉🏿నడుము వికాస క్రియలు*
  1. రెండు చేతులను పక్కలకు చాచాలి. శ్వాస వదులుతూ కుడి పక్కకు తిరిగి వెనకవైపు చూడాలి. శ్వాస పీలుస్తూ శరీరాన్ని మధ్యకు తేవాలి. అదే విధంగా ఎడమ పక్కకు కూడా చేయాలి.
2. చేతులను పక్కలకు చాచాలి. ఎడమ వైపు పక్కకు వంగుతూ శ్వాసను వదులుతూ కుడి చేతితో ఎడమ చెవిని తాకాలి. ఇలాగే రెండో వైపునా చేయాలి.
3. రెండు పిడికిళ్లు బిగించి ఛాతీ దగ్గర ఉంచి.. శరీరాన్ని రెండు వైపులా గబగబా తిప్పుతూ వెనక్కు చూడాలి.
- ఈ మూడింటిని 10-15 సార్లు చేయాలి.
మార్జారాసనం
  1. ముందుగా రెండు పాదాలను పిరుదుల కిందికి తెచ్చి వజ్రాసనంలో కూచోవాలి. శరీరాన్ని ముందుకు వంచుతూ రెండు మోకాలు, రెండు అరచేతులను నేలకు ఆనించాలి. నడుమును పైకెత్తి తలను కొద్దిగా కిందికి దించాలి. శ్వాసను వదలాలి.  2. నడుమును కిందికి వంచుతూ తలను పైకెత్తి శ్వాస పీల్చుకోవాలి.
  * బోర్లా పడుకొని నమస్కారం చేస్తున్నట్టుగా రెండు చేతులను తల ముందు వైపునకు చాచాలి. రెండు కాళ్ల మడమలను కలపాలి. శ్వాసను తీసుకుంటూ.. చేతనైనంత వరకు చేతులు, కాళ్లు, తల, ఛాతీని పైకెత్తాలి. 2-5 సెకండ్ల తర్వాత శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి. 3-5 సార్లతో ఆరంభించి క్రమేపీ పెంచుకోవచ్చు.
నడుంనొప్పి ’ఉంటే పశ్చిమోత్తానాసనం వంటి ముందుకు వంగే ఆసనాలు, సూర్య నమస్కారాలు చేయరాదు.
మెడ నొప్పులకు ‘సూక్ష్మం’లో పరిష్కారం

1. శ్వాస వదులుతూ తలను నెమ్మదిగా కిందికి వంచాలి. పీలుస్తూ పైకి ఎత్తాలి.
3. శ్వాస వదులుతూ తలను కూడివైపు వంచాలి. శ్వాస పీలుస్తూ తలను మధ్యకు తేవాలి. ఇలాగే ఎడమవైపూ చెయ్యాలి.
4. శ్వాస వదులుతూ.. కుడి అరచేతిని కుడి బుగ్గకు ఆనించి అదుముతూ.. ఆ ఒత్తిడికి అభిముఖంగా తలను కుడివైపు తిప్పాలి. తిరిగి శ్వాసను పీలుస్తూ మధ్యకు తేవాలి. అలాగే ఎడమ చేతితో ఎడమ బుగ్గను నొక్కుతూ తలను ఎడమవైపు తిప్పాలి.
5. రెండు అరిచేతులతో పైకి నెడుతూ.. గడ్డాన్ని కిందికి అదమాలి. ఇలా నాలుగైదుసార్లు చెయ్యాలి.
6. తలను కొద్దిగా వంచి కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి గుండ్రంగా తిప్పాలి.
కారణాలు
వెన్ను నొప్పి, మెడ నొప్పికి పలు కారణాలు దోహదం చేస్తాయి.
* శారీరక శ్రమ చేయకపోవటం: రోజంతా ఎలాంటి పని చేయకుండా కూర్చుని ఉండిపోయే వారికి వెన్ను నొప్పి వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
* బరువులు సరిగా ఎత్తకపోవటం: మోకాళ్లను వంచకుండా వెన్నును ముందుకు వంచి బరువులు ఎత్తటం వల్ల వెన్ను, మెడనొప్పి రావొచ్చు.
* సరిగా కూచోకపోవటం: గంటల తరబడి కుర్చీల్లో ఎలాపడితే కూర్చుండిపోవటం, సరైన భంగిమలో కూచోకపోవటం వెన్నునొప్పికి దారితీస్తుంది.
* ప్రమాదాలు: రోడ్డు ప్రమాదాలు, కాలుజారి పడటం, ఆటల్లో కొన్ని హఠాత్‌ కదలికల (జర్క్స్‌) వంటివీ వెన్నెముక సమస్యలను తెచ్చిపెడతాయి.
* పడక, దిండు సరిగా లేకపోవటం: పడక ఎగుడు దిగుడుగా ఉండటం, దిండు సరిగా లేకపోవటం వల్ల వెన్నెముక, మెడపై విపరీతంగా ఒత్తిడి పడుతుంది. ఇది వెన్ను, మెడనొప్పికి దారితీస్తుంది.
* ఇతర సమస్యలు: ఆర్థ్రయిటిస్‌, కిడ్నీలో రాళ్లు, ప్రోస్టేట్‌ వ్యాధి వంటి ఇతర సమస్యలూ వెన్నునొప్పికి దారితీస్తాయి.
ధన్యవాదములు🙏
మి నవీన్ నడిమింటి
ఇంకా హెల్త్ సమాచారం  కొరకు మా లింక్స్ లో చుడండి  చుడండి
 https://www.facebook.com/1536735689924644/videos/559309104808250/

కామెంట్‌లు లేవు: