19, నవంబర్ 2019, మంగళవారం

అమ్మాయి లో బెస్ట్ క్యాన్సర్ పై అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు

*బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకోండి.. నలుగురికీ చెప్పండి అవగాహనా కోసం*

బ్రెస్ట్ క్యాన్సర్.. స్త్రీలు ఎదుర్కొనే ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి. ఈ క్యాన్సర్ పురుషులకు కూడా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. మహిళల్లో వచ్చే అవకాశాల రెట్టింపు ఎక్కువ. చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఈ సమస్య ముదిరి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.
        ఈ లక్షణాలను త్వరగా గుర్తించి, సరైన చికిత్సను అందించడం ద్వారా ఈ సమస్యను నివారించే అవకాశం ఉంది.

*రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఇవే..👇*

1. రొమ్ములపై చర్మం ముడతపడడం, గట్టిగా మారడం.
2. రొమ్ము భాగంలో వాపు రావడం.
3. రొమ్ముల్లో, చంకల్లో గడ్డలుగా ఉండడం.
4. చనుమొనల్లో నుంచి స్రావాలు రావడం..
5. పాలిండ్లలో నొప్పి, పాలిండ్లు లోపలికి వెళుతుండటం.
6. రొమ్ముపైగల చర్మం ఎరుపపెక్కడం.. నారింజ పండు రంగులోకి మారడం.. గట్టిపడటం.
కొన్ని సార్లు రొమ్ము క్యాన్సర్‌ని ప్రారంభంలో గుర్తించడం కష్టం. రొమ్ముల్లో గడ్డలు ఏర్పడినా.. ఏదైనా అసాధారణ లక్షణాలు లేదా పైన వివరించిన లక్షణాలలో ఏవైనా కనిపిస్తే వెంటనే దగ్గరలోని వైద్యుడ్ని సంప్రదించాలి.

*బ్రెస్ట్ క్యాన్సర్ కారణాలు..👇*

రొమ్ము కాన్సర్ ఎందుకు వస్తుందో ఇప్పటికీ సరైన కారణం తెలియలేదు. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం రొమ్ములోని కొన్ని కణాలు అసాధారణంగా పెరగడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ వస్తుంది. ఈ కణాలు ఇతర కణాల కంటే త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఇలా వ్యాప్తి చెందిన కణాలన్నీ ఒక గడ్డలాగా మారతాయి. ఈ గడ్డ మెలిమెల్లిగా రొమ్ములో వ్యాప్తి చెందుతూ శరీరంలోని ఇతర భాగాలకు పాకుతుంది. మనదేశంలో ఇలాంటి వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందాయి.
* పాశ్చాత్య సంస్కృతిని అనుకరించడం వల్లనే రొమ్ము క్యాన్సర్‌ రేటు పెరిగిందని కొందరి అభిప్రాయం.
* నగరీకరణ, వ్యాయామం చేయకపోవడం, అధికంగా ఆహారం తినడం, జంక్‌ ఫుడ్ పై సరైన అవగాహన లేకపోవడం వంటివి ప్రధాన కారణాలు.
* ధూమపానం, మద్యపానం, స్థూలకాయం, పిల్లలకు పాలివ్వకపోయినా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు అవసరo
*  బ్రెస్ట్ లావుగా ఉన్నవారిలో రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది.
* తల్లికి రొమ్ము క్యాన్సర్‌ ఉంటే పిల్లలకూ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
* మహిళల్లో BRCA1/BRCA2 జీన్ మ్యుటేషన్ ఉన్నా వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
*జాగ్రత్తలు తప్పనిసరి👇*

వైద్యంతోపాటు ఆహార పదార్థాలతో కూడా ఈ వ్యాధిని అదుపు వేయవచ్చు. సరైన ఆహారం, వ్యాయామం ఉంటే రొమ్ము క్యాన్సర్‌ బారినుండి తమకు తాము రక్షించుకోవచ్చు. దీనికితోడు ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
*బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించే ఆహార పదార్థాలు..👇*

*👉🏿బ్రకోలిని పచ్చిగా తినాలి*. ఇది ట్యూమర్‌ కణాలను హతమార్చి శరీరానికి కావలసిన పోషకాలను ఇస్తుంది.
*👉పచ్చి వెల్లుల్లిని ముక్కలు చేసి, వాటిని పొడిచేసుకుని తినండి*. ఇది రోగనిరోధక శక్తిని పెంచి యాంటీ క్యాన్సర్ లా పనిచేసి వ్యాధిని ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది.
*👉🏿ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ ను ఎదుర్కొనేందుకు* బీన్స్ మంచి ఔషధంగా పనిచేస్తుంది. సోయాబీన్స్‌లో ఉండే ఐసోఫ్లావోన్స్‌ ట్యూమర్‌ ఎదుగుదలను నిర్మూలించి వ్యాధిని ఎదుర్కొనే శక్తిని శరీరానికి అందిస్తుంది.
* గోధుమ పిండితో తయారైన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. దీనిలో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధిని నిర్మూలించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతే కాకుండా గోధుమ పిండి తినడం వల్ల గుండెజబ్బుల నివారణకు కూడా పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
*👉🏿ఈ వ్యాధి లక్షణాలు* ఉన్నవారు, వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే హర్బల్‌ గ్రీన్‌ టీ తాగడం వల్ల శరీరం శాంతంగా మరియు యాంటీ ఇన్‌ఫ్లామెటరీ గా పనిచేస్తుంది. అందువల్ల తరచూ గ్రీన్ టీ తాగడం మంచిది
Source: నవీన్ నడిమింటి
* వ్యాధిని నిర్మూలించడంలో ద్రాక్ష పళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి వ్యాధి ఉన్నవారు తరచూ ద్రాక్షపళ్లను తీసుకోవడం మంచిది.
*ధన్యవాదములు 🙏*

   *సభ్యులకు విజ్ఞప్తి*
  ******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: