3, నవంబర్ 2019, ఆదివారం

సైనస్ మైగ్రేన్ తలనొప్పి నివారణ కోసం

*మైగ్రెయిన్‌& సైనస్ కు తలనొప్పికు  యోగ నుండి ఎలా నివారణ పరిష్కారం మార్గం  నవీన్ నడిమింటి సలహాలు అవగాహనా కోసం*
          ఎన్ని రకాల మందులు వాడినా మైగ్రెయిన్ ఓ పట్టాన తగ్గదు అన్నది తెలిసింది
        ఈ చలికాలం వచ్చింది అంటే ...  పరిస్థితి చెప్పనవసరం లేదు .. అంత దారుణం గా ఉంటుంది .
*👉🏿సైనస్!*
    ఒక ఇబ్బంది కరమైన పరిస్థితి !
ఏమీ చెయ్యనివ్వదు . మనసు మనసులో ఉండదు . చిరాకు , బద్ధకం , తలనొప్పి . ముఖం వాపు , నొప్పి ఇవన్నీ ఎదురవుతాయి
పరిష్కార మార్గాలు :
మీకు తాత్కాలిక ఉపశమనం కోసం బాబా రామ్ దేవ్ గారి " *💊దివ్య ధారా " అనే రోలర్ లభిస్తుంది . దాని ఖరీదు 20 రూపాయలు* . ఇది మీరు పై పూతగా వాడండి . లేదంటే పతంజలి " పెయిన్ బామ్ " కూడా వాడ వచ్చు
*👉🏿శాశ్వతంగా పోగొట్టడానికి ;*
1) ప్రాణాయామం మీరు అరగంట నుండి గంట వరకూ చేస్తే పూర్తి విముక్తి పొందొచ్చు .
( ఇందులో కపాల భాతి ప్రాణాయామం అద్భుతం గా పని చేస్తుంది )
2) జల నేతి నేర్చుకుని చెయ్యండి . ( సైంధవ లవణం వేసిన గోరువెచ్చని నీటితో )
ఇందుకోసం మీరు యు ట్యూబ్ సహాయం తీసుకోండి
( మీకు దగ్గరలో నేర్పే వారు ఉంటె ప్రత్యక్షంగా నేర్చుకోండి . మెడికల్ సామాను అమ్మే షాప్స్ లో ఈ పాత్రలు లభిస్తాయి )
3. బాబా రామ్ దేవ్ గారి " షట్ బిందు తైల్ " కొనండి . రెండు ముక్కుల లోనూ వెల్లకిలా పడుకుని , తలను వంచి , వేసుకోండి . మీ ముక్కులో , నుదురులొ , కళ్ళ కింద జమ ఐ ఉన్న కఫం బయటకు వస్తుంది .
4) ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు రెండు ముక్కుల లోనూ 5-5 చుక్కలు చొప్పున దేశ వాళీ ఆవు నెయ్యి వేసుకోండి . దీని వలన మీకు నిద్ర బాగా పడుతుంది . మీ కఫం బయటకు వస్తుంది .
మీరు ఈ విధంగా చేసిన తరువాత మీరు పొందిన ఫలితాన్ని ఇతరులకు చెప్పండి .
*👉🏿డిప్రెషన్ ను సహజంగా అధిగమిచడానికి సైన్స్ ప్రూవ్ చేసిననవీన్ నడిమింటి  చెప్పిన  9 మార్గాలు*
         తరచూ, మనం డిప్రెషన్ అనే పదాన్ని ఎవరో ఒకరి నుంచి వింటూనే ఉంటాం. తలనొప్పిలాగా డిప్రెషన్ అని అనడం చాలా కామన్ గా మారింది.

 డిప్రెషన్ ని తేలికగా తీసుకోకూడదు. ఇది చాలా ప్రమాదకరమైన మానసిక వ్యాధి. వివిధ రకాల డిప్రెషన్లతో సతమతమయ్యే వారిలో ఎక్కువ మందిలో ఆత్మహత్య ధోరణులు కనిపిస్తాయి.

        డిప్రెషన్ ని తగ్గించడానికి ఇచ్చే మెడికేషన్స్ కొన్ని సమయాలలో సైడ్ ఎఫెక్ట్స్ ను కూడా కలుగచేస్తాయి. అందువల్ల, ఇక్కడ డిప్రెషన్ ని సహజంగా సురక్షిత మార్గాల ద్వారా ఎలా ట్రీట్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

*1. ప్రియమైన వారితో తరచూ మాట్లాడండి:*
      మీరు మీకు ప్రియమైన వ్యక్తులతో తరచూ సంభాషించండి. వారితో సంభాషించడం ద్వారా మీకు ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. అధ్యయనాల ప్రకారం, నచ్చిన వారితో సమయాన్ని గడపడం వలన బ్రెయిన్ లో సెరోటోనిన్ అనేది సరైన మోతాదులో ఉత్పత్తి అవుతుంది. ఆహ్లాదకరమైన సంఘటనలను ప్రియమైన వారితో పంచుకుంటూ నవ్వుతూ, ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపడం ద్వారా ఒత్తిడి దూరమవుతుంది.

 *2. పెంపుడు జంతువును కలిగి ఉండండి:*
 ప్రకారం పెంపుడు జంతువుతో లేదా స్నేహితుల యొక్క పెంపుడు జంతువులతో గడిపే కాస్త సమయం కూడా బ్రెయిన్ లోని సెరోటిన్ స్థాయిలను అభివృద్ధి పరుస్తుంది. తద్వారా ఫీల్ గుడ్ ఫాక్టర్ అభివృద్ధి అవుతుంది. దాంతో, డిప్రెషన్ లక్షణాలు సహజంగా తగ్గిపోతాయి.
*3. మంచి మసాజ్ తెరపీని ఆస్వాదించండి:*
         మసాజులంటే ఇష్టపడేవారికొక గుడ్ న్యూస్. డిప్రెషన్ ను సహజసిద్ధంగా తగ్గించేందుకు మసాజ్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. బ్రెయిన్ లోన్ కోర్టిసాల్ స్థాయిలను తగ్గించి సెరోటోనిన్ స్థాయిలను పెంచేందుకు మసాజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్ల, డిప్రెషన్ ను దూరం చేసుకోవాలనుకునేవారు మసాజ్ లను ప్రిఫర్ చేయాలి.

*4. ఒక కప్ కాఫీ లేదా టీ తీసుకోండి:*
      ఉదయాన్ని కాఫీ లేదా టీ తాగే అలవాటు లేని వాళ్ళు ఈ అలవాటును తక్షణమే పెంపొందించుకోవాలి. ఇటీవలి అధ్యయనం ప్రకారం, ప్రతి రోజూ కాఫీ లేదా టీ తీసుకునే వాళ్లలో సెరోటోనిన్ స్థాయి ఉత్పత్తి ఆశాజనకంగా ఉండడంతో వారిలో డిప్రెషన్ లక్షణాలు దూరం అవుతాయని తెలుస్తోంది.

*5. మనస్సుని ఆహ్లాదపరిచే ఆహారాలనే ఎంచుకోండి:*
        ఆరోగ్యకరమైన, మూడ్-బూస్టింగ్ ఫుడ్స్ ని ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా డిప్రెషన్ యొక్క లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు. నట్స్, అరటిపండ్లు, కివీలు, బెర్రీస్, పాలకూర, టమోటాలు, చేప వంటివి డిప్రెషన్ ని సహజంగా అధిగమించడానికి తోడ్పడతాయి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల బ్రెయిన్ లోని సెరోటోనిన్ స్థాయిలు అభివృద్ధవుతాయి.

 6. ఒమేగా 3 యొక్క మోతాదును పెంచండి:

అవొకాడో, నెయ్యి, కొబ్బరి నూనె వంటివి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ చేరతాయి. తద్వారా, డిప్రెషన్ ని సహజసిద్ధంగా అధిగమించవచ్చు.

*7. తల బెడ్ కి అంచున వచ్చేలా ఉండండి:*
     ప్రతి ఉదయం, మీరు నిద్రలేవగానే, మీ తలను మంచానికి ఎడ్జ్ లో ఉంచేలా కాసేపు ఉండండి. అలా చేయడం వలన, బ్రెయిన్ కు ఆక్సీజనేటెడ్ బ్లడ్ సరఫరా అవుతుంది. తద్వారా సెరోటోనిన్ స్థాయిలు పెరుగుతాయి.

*8. వీకెండ్ ట్రిప్స్ కు వెళ్ళండి:*
 ఒత్తిడితో కూడుకున్న డైలీ రొటీన్ నుంచి కాస్త విరామం తీసుకోండి. వీకెండ్ టిప్స్ ను ప్లాన్ చేసుకోండి. మీకిష్టమైన హాబీస్ కోసం సమయాన్ని కేటాయించుకోండి. ఇలా చేయడం వలన ఒత్తిడిని తగ్గించుకున్న వారవుతారు.

9. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామానికి కేటాయించాలి:

వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. డిప్రెషన్ ని అధిగమించడానికి వ్యాయామం తనదైన సహాయం చేస్తుంది. ప్రతిరోజూ, కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామానికి కేటాయించాలి. యోగా, జిమ్, జుంబా వంటివేదైనా సరే శరీరానికి అలసట అవసరం. తద్వారా సెరోటోనిన్ స్థాయిలు పెరిగి డిప్రెషన్ సమస్య తొలగిపోతుంది.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
 అందరికి ఉపయోగపడే సులభమైన ఆరోగ్య సలహాలు ! కనుక తప్పక షేర్ చెయ్యండి అవసరం ఉన్న వారికీ ఉపయోగపడవచ్చు.

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: