22, నవంబర్ 2019, శుక్రవారం

కీళ్ల నొప్పులు నివారణ కు

*కీళ్లనొప్పులు తగ్గడానికి ఇంట్లో ఉండేది మందులు నవీన్ నడిమింటి సలహాలు*
****************
ఆముదం ఆకు,
ఉమ్మేత్త ఆకు
పారిజాతం ఆకు
వావిలాకు
జిల్లేడు ఆకు
మునగాకు,
చింతాకు
వెల్లుల్లి

           వీటిలో ఎన్నిదొరికితే అన్ని సమంగా తీసుకొని మెత్తగా దంచి  ఆవాల   నూనెలో ఉడికించి ముద్దను గుడ్డలో చుట్టి వేడికాపడం పెట్టుకుంటుంటే కీళ్ళ నొప్పులు వాపులు,మోకాళ్ళనొప్పులు,అన్నీనొప్పులు తగ్గిపోతాయి.

🌼  రాళ్ల ఉప్పును వేయించి గుడ్డలో మూటగట్టి కాపడం ఇస్తుంటే వాతం నొప్పులు కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

🌼  నీళ్లలో వావిలి ఆకులు వేసి మరిగించిన నీళ్ళతో స్నానం చేస్తుంటే బాడీపెయిన్స్ తగ్గుతాయి

*కీళ్ల నొప్పులతో బాధపడేవారు.. చింతపండును.. ఇలా ఉపయోగిస్తే?*

కీళ్ల నొప్పులతో బాధపడేవారు.. చింతపండును.. ఇలా ఉపయోగిస్తే?
           
 కూరల్లో లేదా రసంలో చింతపండును ఉపయోగించేటప్పుడు పండును మాత్రం తీసుకుని గింజలను పారేస్తుంటాం. చింతపండు వలన మాత్రమే కాకుండా చింత గింజల వలన కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటి ప్రయోజనాలు తెలిస్తే మీరు పారవేయరు.

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం. సాధారణంగా అధిక బరువు వలన లేదా వయస్సు మీదపడటం వలన మోకాళ్లలో కీళ్లు అరిగిపోయి నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు చింత గింజల పొడిని తీసుకుంటే మంచిది.

పుచ్చులు లేని చింతగింజలను తీసుకుని పెనం మీద బాగా వేయించాలి. చల్లారిన తర్వాత వాటిని నీటిలో రెండురోజుల పాటు నానబెట్టాలి. రోజూ రెండు పూటలా నీటిని మార్చాలి. నానిన గింజల పొట్టు తీసివేసి, పొడి చేసి సీసాలో భద్రపరుచుకోవాలి. ఆ పొడిని రోజుకు రెండు సార్లు అర టీస్పూన్ చొప్పున పాలలో లేదా నీళ్లలో వేసి చక్కెర లేదా నెయ్యి కలిపి తీసుకోవాలి.

ఇలా రోజూ చేస్తే రెండు మూడు నెలల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. చింతగింజల చూర్ణం కీళ్ల నొప్పులకే కాక డయేరియా, డయాబెటిస్, గొంతులో ఇన్ఫెక్షన్లు ఇంకా దంత సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

కామెంట్‌లు లేవు: