29, నవంబర్ 2019, శుక్రవారం

అమ్మాయిలు భద్రతా కోసం కొత్త యాప్ 112

మహిళలకు గమనిక:

మీ మొబైల్‌లో అర్జెంటుగా 112 నెంబర్‌ని సేవ్ చేసుకోండి. అది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఆ కాంటాక్ట్ హోమ్ స్క్రీన్‌‌లో షార్ట్ కట్ పెట్టుకోండి. కొన్ని మొబైల్స్‌లో Panic Button ఉంటుంది. పోలీస్, ఫైర్, హెల్త్, ఉమెన్ సేఫ్టీ, ఛైల్డ్ ప్రొటెక్షన్‌ వంటి అన్ని సర్వీసులకి సంబంధించిన ఎమర్జెన్సీ నెంబర్ ఇది.

మీ ఫోన్లో Panic Button ప్రెస్ చేయాలంటే.. పవర్ బటన్‌ని మూడుసార్లు వెంటవెంటనే ప్రెస్ చేస్తే చాలు.. అది 112కి కనెక్ట్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ కాకుండా నార్మల్ ఫోన్ వాడే వారు.. తమ కీప్యాడ్ మీద 5 లేదా 9 బటన్లని లాంగ్ ప్రెస్ చేస్తే పానిక్ బటన్ యాక్టివేట్ అవుతుంది. 2018కి ముందు కొన్న ఫోన్లలో ఈ సదుపాయం ఉండదు. అలాంటప్పుడు 112 నెంబర్ సేవ్ చేసుకుని, ప్రమాదంలో ఉన్నప్పుడు దానికి డయల్ చెయ్యాలి. లేదా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 112 India అనే ఈ లింకులోని మొబైల్ యాప్‌ని మీ ఫోన్లో ఇన్‌స్టాల్ చేసి కూడా సహాయం పొందొచ్చు. https://play.google.com/store/apps/details?id=in.cdac.ners.psa.mobile.android.national

- Nadiminti  Naveen
           మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

కామెంట్‌లు లేవు: