22, నవంబర్ 2019, శుక్రవారం

పిల్లలు ఎప్పుడు సెల్ ఫోన్ చుట్టు ఆహారం తీసుకోని వాళ్ళు కు

*పిల్లలు సరిగా ఆహారం తినడం లేదా?  ఎలాంటి ఆహారం పెట్టాలి సెల్ ఫోన్ నుండి దూరం ఎలా వుంచాలి ?అవగాహనా కోసం నవీన్ నడిమింటి*

           పిల్లల పెరుగుదలలో అతి కీలకమైన 1-5 సంవత్సరాల్లో అంటే ప్రీ స్కూలు పిల్లల్లో పెరుగుదల అన్నది వారు తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది.
మా బాబు ఏదీ తినడు ఆకలవడానికి ఏదైనా మంచి టానిక్‌ రాసివ్వండి, మా పిల్లవానికి పెరుగు వాసన కూడా గిట్టదండి, పెరుగన్నం తినకపోతే వేడి చేయదా డాక్టర్‌ గారూ అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఏడాది నిండేటప్పటికి పిల్లలకు దాదాపు నడక వచ్చేస్తుంది. అక్కడి నుండి తనంతట తానుగా తిరుగుతూ, ఎక్కడేమేమి ఉన్నా చక్కబెడుతూ, ఆటలలో మునిగిపోయే పిల్లలు తిండి విషయంలో పేచీ పెట్టడం సహజమే. ఓ పట్టాన దేనికీ లొంగరు. మూడేళ్ల వయసులో పిల్లల్లో ప్రీస్కూల్లో చేర్చడంతో అక్కడ తోటి పిల్లల అలవాట్లను అనుకరించడం, వాళ్లు తినేవి బాగున్నట్లు, తనకి పెట్టినవి బాగోలేదని అనిపించడం ప్రారంభమవుతుంది. ఇవన్నీ ఏయేటికాయేడు మారే అలవాట్లే మినహా వాటి గురించి ఆందోళన చెందనక్కరలేదు. ఇక కొన్ని రుచులు, వాసనలు పడకపోవడమన్నది పిల్లలకైనా, పెద్దవారికైనా అది వారి సహజ లక్షణంగా గుర్తించాలి. అవి, ఇవి తినేలా ఒత్తిడి చేసే బదులు వారు ఇష్టపడే రీతిలో అదే సమయంలో పోషకాలు అందేలా ఆహారాన్ని తయారు చేసి పెట్టాలి. తినిపిస్తే ఎక్కువ తింటాడని, బిడ్డ నేనే తింటానని మొరాయిస్తున్నా బలవంతంగా నోటిలో కుక్కే ప్రయత్నం చేయరాదు. కొంత ఆహారం వేస్ట్‌ అయినా వాళ్లంతట వాళ్లు తింటామంటే ప్రోత్సహించాలి. అలాంటప్పుడే కొత్త కొత్తవి రకరకాల ఆహార పదార్థాలను పెట్టి తినమంటే వాళ్లు ఓ ఆటలాగా తింటారు.
*👉పెరుగుదల సరిగా లేకపోవడం :* తినే ఆహారంలో శక్తినిచ్చే పదార్థాలు తగినంతగా లేకపోతే పెరుగుదల సరిగా వుండదు. పిల్లలు అంత చలాకీగా ఉండరు. పిల్లలకు పాలు, పండ్ల రసాలు చాలా ఎక్కువగా ఇస్తూ, ఘనాహారాన్ని చాలా పరిమితంగా పెట్టడం.
సూక్ష్మపోషకాల లోపం : వివిధ రకాల ఆహార పదార్థాలు లేకుండా ఒకే మూసలో ఉండే ఆహారం పెట్టడం వల్ల పిల్లలకు ఎ విటమిన్‌, ఐరన్‌, డి విటమిన్‌, బి- కాంప్లెక్స్‌ విటమిన్‌ లోపాలు ఏర్పడతాయి.
*👉ఇన్‌ఫెక్షన్లు, అంటు వ్యాధులు :* బయటికి వెళ్లి ఆటలాడుకుంటారు, కానీ మంచి చెడు అర్థంకాని పిల్లలు తరచుగా జబ్బు పడుతుంటారు. తేలికగా అంటువ్యాధులు సోకుతుంటాయి. అందువల్ల పరిశుభ్రమైన రకరకాల ఆహార పదార్థాలను పిల్లలకు పెట్టాలి.
ఇవీ మార్గదర్శకాలు # ప్రీ స్కూల్‌ పిల్లలకు తిండి కూడా ఓ ఆట వస్తువులానే వుంటుంది. అలాగే ఊహ తెలియకపోయినా ఇష్టం, అయిష్టం ఉంటాయని గుర్తించాలి.
*వయస్సు ఉండాల్సిన ఎత్తు (సెం.మీలలో) ఉండవలసిన బరువు (కిలోల్లో)*
పుట్టినప్పుడు 50 - 3
ఏడాదికి 74 - 8.5
రెండేళ్లకు 81.5 - 10
మూడేళ్లకు 89 - 12
నాలుగేళ్లకు 96 - 13.5
అయిదేళ్లకు 102 - 15
అమ్మాయిలు
*👉వయస్సు ఉండాల్సిన ఎత్తు (సెం.మీలలో) ఉండవలసిన బరువు (కిలోల్లో)*
పుట్టినప్పుడు 50 - 3
ఏడాదికి 72.5 - 8
రెండేళ్లకు 80 - 9.5
మూడేళ్లకు 87 - 11
నాలుగేళ్లకు 94.5 - 13
అయిదేళ్లకు 101 - 14.5
కేలరీలు : ఏడాది వయసులో బిడ్డ బరువు కిలోకు వంద కిలో క్యాలరీలు అవసరం కాగా ఐదేళ్ల వయసులో 80 కిలో క్యాలరీలు కావాలి.
ఏడాది వయసు వచ్చేటప్పటికి బిడ్డ రోజుకు మూడు పూట్ల భోజనంతో పాటు ఉదయం పూట అల్పాహారం, సాయంత్రం స్నాక్స్‌ తినేలా చూడాలి.
ఆ వయసులో తల్లి పాలు కానీ పోత పాలు కానీ వారికి అవసరమైన శక్తిలో పావు వంతు మాత్రమే అందించగలవు. అంటే అంత వరకు అనుబంధ ఆహారంగా ఉన్నది ఇక ముఖ్య ఆహారం కావాలి.
పాలు, పండ్లు కూరగాయలు, చిక్కుడు జాతి గింజలు, గుడ్లు, మాంసం, చేపలు తదితరాలు తగు మొత్తాలతో ఉన్న సమతులాహారం బిడ్డకు అందేలా చూడాలి.
*👉🏿పిల్లలకు ఏమాత్రం ఖాళీ దొరికినా సెల్ ఫోన్ కే పరిమితమైపోతున్నారు.* ఆండ్రాయిడ్ ఫోన్లలో గేములు, వీడియోలుకే  బయట పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లేందుకు కూడా ఇష్టపడడం లేదు. స్నేహితులు కంటే ఫోనునే అంతలా ఇష్టపడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఫోనుకు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఫోను నిత్యవసరమైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఫోనేను వాడడం మానుకోలేక,  పిల్లలు అంతలా ఇష్టపడే ఫోను కేవలం పిల్లల మనో వికాసానికి అవసరమైన సలహాలు, ఆటలు వచ్చి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిదిగా ఉంటే ఎంతబావుంటుందో కదా..! నవీన్ సలహా,,
*👉పిల్లలు కు జలుబు&దగ్గు ఎక్కువ ఉంటే*  దగ్గు తగ్గదు తక్కువ
తలిసాది చూర్ణం అర స్పూన్ మూడు పూటలా తేనెతో ఇవ్వండి
 మజ్జిగ, perugu, బీర, దోసకాయ ఆపండి
*👉పిల్లలకుపొట్టలో ఉన్న worms పడిపోవడానికి మా ర్గం*
విదంగా సావ టానిక్ రెండు పూటలు 5 రోజులు వాడండి. దొరకపోతే వాయువిదంగాలు చూర్ణం రెండు పూటలు వాడండి
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
 *సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..
https://www.facebook.com/naveenk3/videos/10214666684877293/

కామెంట్‌లు లేవు: