*We spoke to a few people who live with OCD and what life has been like for them.*పదే చేసిందే చేయడం, చెప్పిందే చెప్పడం, ఎక్కువ సమయం స్నానం, పూజ, పరిశుభ్రం చేయడం లాంటి లక్షణాలను" ఒసిడి" అంటాము. ఈ రుగ్మతకు కారణాలు పరిష్కార మార్గాలపై అవగాహన కోసం ఈ వీడియో చూడండిఅవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు .*
*👉 గ్రూపులో సభ్యులు కు నాకు అడిగిన కొన్ని సమస్య కు సమాధానము*
అతిశుభ్రత ఛాదస్తం కాదు..!
1.-నా భార్య వయ స్సు 39ఏళ్లు. పెళ్లైనప్పటి నుంచి శుభ్రత మీద విపరీతమైన ధ్యాస. ప్రతీది శుభ్రంగా ఉండాలంటుంది. మొదట్లో దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ప్రతి విషయంలో అతి శుభ్రత, అతి జాగ్రత్త చూపిస్తుంటుంది. ఇంట్లో పాత వస్తువులు పడేయటానికి ఇష్టపడదు. ఎప్పుడో ఒకప్పుడు పనికి వస్తాయని అంటుంది. తను శుభ్రంగా ఉండటమే కాకుండా మా శుభ్రతపై కూడా శ్రద్ధపెడుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యులే కాక, ఇంటికొచ్చిన కోడళ్లు కూడా ఇబ్బందిపడుతున్నారు. అతిశుభ్రత నుంచి నా భార్య విముక్తి పొందే మార్గముందా? తెలుపగలరు.
శోభారాణి , విశాఖపట్నం
శుభ్రత ముఖ్యమే. కానీ అతిశుభ్రత మానసిక రుగ్మతలాంటిది. దీన్నే వైద్యపరిభాషలో 'ఓసిడి' (అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్) అంటారు. అబ్సెషన్స్ అంటే చేసిన పనే మళ్లీ మళ్లీ చేయడం. నాలుగైదు సార్లు శుభ్రంచేస్తేగానీ వారికి తృప్తి ఉండదు. దీనివల్ల ఆమెకే కాకుండా కుటుంబసభ్యులపై ఆ ప్రభావం ఉంటుంది. ఇప్పటికే మీరు ఆలస్యం చేశారు. అతి శుభ్ర తను ఛాదస్తమని వదలేయకుండా చికిత్స చేయించాలి. సైకియాట్రిస్ట్‌ను సంప్రదించండి.
*2.-మా బాబు వయస్సు 7 ఏళ్లు. ఇదివరకు స్కూలుకు బాగానే వెళ్లేవాడు. ఇప్పుడు వేసవి సెలవుల తర్వాత స్కూలంటే విపరీతమైన భయం ఏర్పడింది. స్కూలుకు వెళ్లనని మారాం చేస్తున్నాడు. గత సంక్రాంతి అప్పుడు కూడా ఇలాగే చేశాడు. ఈ సారి కూడా ఇలాగే జరుగుతుందేమోనని ఆందోళనగా ఉంది. బాబుకు ఈ సమస్య ఎందుకొచ్చింది? దీనికి పరిష్కారముందా?*
శ్రీనాథ్, మహబూబ్‌నగర్
పిల్లలకు 'స్కూల్ ఫోబియా' అనేది సాధారణంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనను శాశ్వతంగా వదిలేస్తారేమోననే, పట్టించుకోరేమోననే పిల్లలు భయాందోళనలకు గురవుతారు. ఇది మామూలుగా ఉంటే స్కూల్ ఫియర్ అని, ఎక్కువగా ఉంటే స్కూల్ ఫోబియా అని అంటారు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇదేం పెద్ద సమస్య కాదు. ఏ కారణంతో బాబు భయపడుతున్నాడో తెలుసుకోవాలి. స్కూలులో టీచర్లు కఠినంగా వ్యవహరిస్తున్నారా? తోటి విద్యార్థులు ఇబ్బందిపెడుతున్నారా? కొడు తున్నారా? మీరు అతిగారాబం చేస్తున్నారా? కావాల్సి నవన్నీ కొనివ్వడం వల్ల స్కూలుకు వెళ్లడం లేదా? అనే కారణాలు విశ్లేషించాలి. భయం మరీ ఎక్కువుంటే 'స్కూల్ రీ ఇంటిగ్రేషన్' పద్ధతిని ఫాలో అవ్వాలి. అంటే...పిల్లాడు రోజుకు గంట మాత్రమే క్లాసులో కూర్చుంటాడు. తర్వాత రెండు గంటలు, ఆ తర్వాత మూడు గంటలు ఇలా క్రమంగా స్కూలుకు వెళ్లడం అలవాటు చేయాలి. మీరు దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌ను సంప్రదించండి.
*3.-మా అమ్మాయి వయస్సు 13 ఏళ్లు. ఇటీవలే పుష్పవతి అయ్యింది. ఇప్పటికీ పక్కతడుపుతోంది. అయినా ఈ అలవాటు తగ్గలేదు. చలికాలంలో మరీ ఎక్కువ. ఆ సమయంలో నిద్రలేపినా కూడా స్పందించదు. ఏం చేయాలో మాకు అర్థంకావడం లేదు. ఈ అలవాటును ఎలా మాన్పించాలో సలహా ఇవ్వగలరు.*
అశోక్ కుమార్ గోపు టీవీ షోరూం , హనుమికొండ
మీ అమ్మాయి ఎదుర్కొంటున్న సమస్యను 'నాక్‌టర్నల్ ఎన్యురిసిస్' అంటారు. మెదడులో మెచ్యురిటీ స్థాయికి, మూత్రాశయ మెచ్యురిటీ స్థాయికి తేడా ఉంటుంది. దీంతో సిగల్ ట్రాన్సిమిషన్ సరిగ్గా జరగదు. అందుకే ఈ సమస్య వస్తుంది. పక్కతడిపే అలవాటు పిల్లలకు సర్వసాధారణం. ఇది వయస్సుతోపాటు తగ్గిపోతుంది. 14 ఏళ్లకు పక్క తడిపే అలవాటు పూర్తిగా తగ్గుతుంది. ముఖ్యంగా ఆడపిల్లల్లో ఈ అలవాటు మగపిల్లలతో పోలిస్తే ఆలస్యంగా తగ్గుతుంది. దీన్ని మూడురకాలుగా నివారించే వీలుంది. ప్రతీరోజు రాత్రి పడుకునే ముందు అమ్మాయిని టారులెట్‌కు వెళ్లేలా అలవాటు చేయాలి. సాయంత్రం ఆరుగంటల తర్వాత ఎలాంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా చూడాలి. నీళ్లు తాగాలనిపిస్తే గ్లాసుతో తాగించకుండా, స్ట్రా వేసి తాగించాలి. దీనివల్ల ఎక్కువ నీళ్లు తాగడం తగ్గుతుంది. ఇలా రెండు నెలలు ప్రయ త్నించాలి. కొంతకాలం అయ్యాక అలారంపెట్టి తెల్లవారు జామున 4 గంటలకు నిద్రలేపి టారులెట్‌కు తీసుకెళ్లాలి. ఈ ప్రయత్నాలన్నీ చేసినా పక్కతడిపే అలవాటు తగ్గకుంటే సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి.
*3.-నా భార్య వయస్సు 27 సంవత్సరాలు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లాలంటే భయం. బస్సులో ఒంటరిగా ప్రయాణించాలన్నా, సినిమా థియేటర్‌కు ఒంటరిగా వెళ్లాలన్న టెన్షన్ పడుతుంది. ఊపిరాడనట్లు ఉంటుందంటుంది. లిఫ్ట్‌లో వెళ్లడానికి కూడా భయమే. దీనివల్ల ఆమె కేరీర్ దెబ్బతింటోంది. రావాల్సిన ప్రమోషన్ రావడం లేదు. ఈ సమస్య నుంచి బయటపడేదెలా? తెలుపగలరు.*
- విజయబాబు, హైదరాబాద్
మీ భార్య ఎదుర్కొంటున్న సమస్యను ఎగరోఫోబియా అంటారు. ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేరు, ఊపిరాడనట్లు ఉంటుంది. ఆందోళన, ఒత్తిడి ఉంటుంది. చనిపోతాననే నెగెటివ్ ఆలోచనలు వస్తాయి. చమటలు పడతాయి. గుండెలో దడగా ఉంటుంది. దీనివల్ల ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. మానసిక రుగ్మతల్లో బాగా చికిత్స చేయగలిగేది ఎగరోఫోబియా. దీన్ని 100 శాతం వరకూ నయం చేయవచ్చు. అయితే దీనికి మందులతోపాటు కౌన్సిలింగ్ కలిపి ఇవ్వాలి
*👉ఓసీడీ వ్యాధితో ఒకింత జాగ్రత్త....అనుమానం అనుకోవాలా? భయమనుకోవాలా?*
వేసిన తాళాన్ని పదే పదే లాగి చూడటం ఎందుకు? అడి గిన అడ్రసునే మళ్లీ మళ్లీ అడగడం ఎందుకు? అరచేతుల్నీ, అరికాళ్లనూ అన్నిసార్లు కడగడం ఎందుకు? సబ్బు ప్రభావంతో చేతివేళ్ల మధ్య కాలివేళ్ల మధ్య పగుల్లొచ్చి సొనలు కారుతున్నా ఆ కడగడం మానుకోరు ఎందుకని? తుడిచిందే తుడిచి, కడిగిందే కడిగి చివరికి శరీరమే తుడిచిపెట్టుకు పోతుందా అనిపించేటంతగా ఏమిటా శ్రమ? అయినా వాళ్లు, ఆత్మీయులు ఇదేమిటని ఎన్ని సార్లు నిలదీసినా వీళ్లలో మార్పు రాదెందుకని? ఎందుకంటే అలా చేయడం వారి మానసిక దౌర్భల్యం కాబట్టి. తమ మనసును నియంత్రించుకోవడం వాల్ల చేతుల్లో ఉండదు కాబట్టి. ఇలా అనివార్యంగా జరిగిపోయే మానసిక బలహీనతను ఓసిీడీ ( ఆబ్సెస్సివ్ క ంపల్సివ్ డిజార్డర్) అంటారు. ఒక పనిని పదే పదే చేయడం ద్వారా అది తన మనసును ఎంతటి ఒత్తిడికి గురిచేస్తుందో వారికి తెలుస్తూనే ఉంటుంది. శరీరాన్ని ఎంత ప్రయాసకు గురిచేస్తుందో కూడా వారికి తెలుస్తుంది. అయినా అలా చేయకుండా ఉండడం వారి వల్ల కాదు. ఇదొక మానసిక రుగ్మత. ఈ వ్యాధి రావడానికి నాడీ వ్యవస్థకు సంబంధించిన కొన్ని కారణాలు ఉంటాయనేది లోకమెరిగిన సత్యమే. అయితే నాడీవ్యవస్థకు ఆవల మరో బలమైన కారణం కూడా ఉంది. అది ప్రతిదీ నూటికి నూరు పాళ్లు సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఉండాలని పెద్దలు నియంత్రించడమో లేదా తామే అలా అనుకోవడమో కారణం.
తెలియకుండానే అంతా...!
తల్లిదండ్రులు కావచ్చు. అయిన వాళ్లూ, ఆత్మీయులు కావచ్చు. టీచర్లు కావచ్చు. చేసే పని నూటికి నూరు పాళ్లూ పరెఫెక్ట్‌గా ఉండాలని ఎవరైతే ఒత్తిడి చేస్తారో వాళ్లు ఓసిీడీ రావడానికి కొంత మేరకు కారణమవుతారు. వాళ్లు చెప్పిన పనిని పర్‌ఫెక్ట్‌గా చేసేదాకా కొందరు వదిలిపెట్టరు. అవతలి వాళ్ల గురించి పిల్లల్లో ఆ భావన ఒకసారి స్థిరపడిపోతే, వారి మనసంతా దాన్ని పర్‌ఫెక్ట్‌గా చేయాలనే భావనతోనే నిండిపోతుంది. అది ఇతరులు తమను ఆదేశిస్తున్న విషయాల్లోనే కాదు. తమకు తాముగా అనుకున్న పనుల్లోనూ అలాగే ఉండాలనే తత్వం వారిలో పాతుకుపోతుంది. ఆ దోరణి పెరుగుతూ పోతే ఒక దశలో వీళ్లు మనసులో వారి శరీరం, మనసు తీవ్రమైన ఒత్తిడికి, హింసకు గురవుతున్నా దాన్ని వాళ్లు పట్టించుకోరు. అసలు తాము ఆ ఒత్తిడికీ, హింసకూ గురవుతున్నామన్న స్పృహ కూడా వారికి ఉండదు.
క్రమంగానే ఏదైనా
ఎంత మనసు పెట్టినా, దానికోసం అహోరాత్రులూ పనిచేసినా మనం చేసే పని నూటికి నూరు పాళ్లు పర్‌ఫెక్ట్‌గా ఉంటుందా? అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఒక పని పూర్తయ్యేదాకా మనలో ఉన్న ఆశలూ, అంచనాలన్నీ ఆ పని పూర్తి కాబోతుందనగానే రెట్టింపవుతాయి. అనుకున్న లక్ష్యం అప్పటిదాకా ఎంతో గొప్పగానే అనిపించినా అది కొద్ది వ్యవధిలో పూర్తి కాబోతోందని తెలియగానే లక్ష్యం పరిధులు హఠాత్తుగా పెరిగిపోతాయి. దాని విస్తృతి పది రెట్లకు పెరిగిపోతుంది. అందుకే నూటికి నూరుపాళ్లు పరిపూర్ణత సాధించామన్న సంతృప్తి వారికి ఏ నాడూ కలగదు. సంతృప్తి మనిషిని ఎదగనివ్వదనేది వాస్తవమే అయినా, వాస్తవికంగా ఆలోచించలేని అసంతృప్తికి తీవ్రమైన అశాంతికీ, మానసిక రుగ్మతకు గురిచేస్తుంది. ప్రత్యేకించి ఓసిీడీ సమస్యకు లోను చేస్తుంది. అయితే ఈ సమస్య దిగులూ ఆందోళనతో మొదలైనా ఒక దశలో వీరు తీవ్రమైన డిప్రెషన్‌కు లోనవుతారు. తాము అనుకున్న పనిని ఏ స్థాయిలో చేసినా అది వారికి కనీస సంతృప్తిని కలిగించకపోవడమే కారణం. ఆ ఒత్తిడికి ఆ హింసకూ తట్టుకోలేక కొన్ని సార్లు బోరున ఏడ్చేస్తారు కూడా. పరిస్థితి ఇంకా అలాగే విషమిస్తూ పోతే వీరిలో కొందరు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేస్తారు. అందుకే ఓసిీడీ వ్యాధిని నిర్లక్ష్యం చేయడం అంటే అది ప్రాణాపాయాన్ని కొని తెచ్చుకోవడమే. ఆ స్థితి రాకుండా ఉండాలంటే విధిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏమిటా జాగ్రత్తలు
ఓసిీడీ సమస్య యువతీ యువకుల్లో ప్ర«ధానంగా టీనేజ్ పిల్లల్లోనే ఎక్కువగా వస్తుంది. దీనికంతా వాళ్లు చే సే పని నూటికి నూరు పాళ్లు పర్‌ఫెక్ట్‌గా ఉండాలని పసితనం నుంచే వాళ్ల మీద ఒత్తిడి పెంచే తల్లిదండ్రులు కారణ ం కావచ్చు. లేదా టీచర్లు కారణం కావచ్చు. ఏ సబ్జెక్ట్‌లోనైనా పరిపూర్ణత సాధించాల్సిందే కానీ ఆ ఆ స్థాయి క్రమానుగతంగా రావాలే తప్ప హఠాత్తుగా కాదు. పైగా పర్‌ఫెక్ట్‌గా చేయడానికి అనుసరించాల్సిన విధానాలేమీ చెప్పకుండా ఊరికే ఒత్తిడి పెంచడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఒకవేళ అప్పటికే ఆ వ్యాధి మొదలై ఉంటే వెంటనే సైకియాట్రిస్టును సంప్రదించి అవసరమైన వైద్య చికిత్సలు అందించడం ఎంతో అవసరం.
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....
https://vaidyanilayam.blogspot.com/

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి