నిత్య జీవితంలో కొందరు అమ్మాయిలు చేసే కామన్ మిస్టేక్స్ అవి ఏమిటో తెలుసా..నవీన్ నడిమింటి సలహాలు
నిత్య జీవితంలో చాలా మంది చాలా తప్పులను చేస్తుంటారు. వాటి వల్ల అనేక పర్యవసానాలను వారు ఎదుర్కొంటూ ఉంటారు. కొందరు చిన్న తప్పులు చేసి కొంత కాలం పాటు బాధపడతారు. మరికొందరు చేయరాని తప్పులు చేసి జీవితాంతం శిక్షలు అనుభవిస్తారు. అవి రకరకాలుగా ఉంటాయి. అయితే నిర్దిష్టంగా అమ్మాయిల విషయానికి వస్తే కేవలం వారు మాత్రమే తమ జీవితంలో చేసే కొన్ని రకాల పొరపాట్లు, తప్పులు ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. శృంగారంలో పాల్గొన్నప్పుడు లేదా నగ్నంగా ఉన్నప్పుడు కొందరు అమ్మాయిలు తీసుకునే ఫొటోలు లేదా వీడియోలను వారు ఇంటర్నెట్‌లోకి అప్‌లోడ్ చేస్తారు. వాటిని డిలీట్ చేసినా కొన్ని సార్లు అవి షేర్ అయితే అప్పుడు చేసేదేం ఉండదు.
2. తనకు పరిచయం అయిన లేదా తనను ప్రేమించే ప్రతి యువకుడు తనతో సెక్స్ కావాలని కోరుకుంటారని అమ్మాయిలు భావిస్తారు. నిజానికి యువకులందరూ అలా ఉండరు. కేవలం కొందరు మాత్రమే అమ్మాయిల నుంచి సెక్స్ ఆశిస్తారు. కనుక అమ్మాయిలు ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది.
3. ఎలాగూ పెళ్లి చేసుకున్నాక భర్తకు సేవలు చేస్తూ ఇంట్లోనే పడుండాలి కదా. ఇక చదవడం ఎందుకు. అని కొందరు అమ్మాయిలు చదువును నిర్లక్ష్యం చేస్తారు. కానీ అది మంచిది కాదు. భర్తకు సేవ చేస్తూ ఇంట్లో గృహిణిగా మారాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ప్రతి అమ్మాయి కచ్చితంగా చదువుకోవాలి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు కదా.
4. కొందరు అమ్మాయిలు తమ అందంపై తమకు తామే ఓవర్‌గా ఊహించుకుంటారు. అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు.
5. కొందరు అమ్మాయిలు తమ పట్ల జరిగే లైంగిక దాడుల గురించి ఎవరికీ చెప్పరు. భయపడతారు. అలా ఉండరాదు. సంఘటన జరిగిన వెంటనే ఫిర్యాదు చేయాలి. న్యాయం కోసం పోరాడాలి.
6. మీకు ఇష్టం లేని పని ఎవరైనా చేయాలని చూస్తే మర్యాదగా నో చెప్పండి. అంతేకానీ చూస్తా, చూద్దాం.. అని అనకండి.
7. కొందరు అమ్మాయిలు పెళ్లి కాగానే కెరీర్‌కు గుడ్‌బై చెబుతారు. అందుకు అనేక మంది ఒత్తిడే ప్రధాన కారణం అయి ఉంటుంది. కానీ అలా చేయరాదు.
8. అందంగా ఉన్నామని చెప్పి కొందరు అమ్మాయిలు మరీ దూకుడుగా ఉంటారు. అది పనికిరాదు.
9. కొందరు అమ్మాయిలు అబ్బాయిలను మరీ గుడ్డిగా నమ్మేస్తారు. అది మానేయాలి.
10. కొందరు అమ్మాయిలు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఇమేజ్‌లను పదే పదే పోస్ట్ చేస్తుంటారు. అది అంత మంచిది కాదని గుర్తుంచుకోవాలి.
11. కొందరు అమ్మాయిలు పెళ్లికి ముందే సెక్స్ చేయాలని ఆసక్తి చూపుతారు. అది మంచిది కాదు.
12. కొందరు అమ్మాయిలు ప్రేమించిన అబ్బాయిలను కాకుండా తల్లిదండ్రుల బలవంతం మేరకు వేరే అబ్బాయిలను పెళ్లి చేసుకుని తమ జీవితాన్ని తామే చేజేతులా నాశనం చేసుకుంటారు. అలా చేయకూడదు.
13. కొందరు అమ్మాయిలు తమ స్నేహితులు చెప్పే మాటలను నమ్మి మోసపోతారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
14. జీరో సైజ్ కోసం కొందరు అమ్మాయిలు తిండి కూడా మానేస్తారు. అది పనికిరాదు. తిండి సరిగ్గా తినకపోతే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి.
15. కొందరు అమ్మాయిలకు అబ్బాయిలపై ప్రేమ కలుగుతుంది. కానీ దాన్ని ఎప్పటికీ అణచివేస్తారు. అలా చేయరాదు.
16. వక్షోజాల్లో గడ్డలు రావడం, రుతు సమయంలో అధిక రక్తస్రావం అవడం, పీరియడ్స్ మిస్ అవడం, వైట్ డిశ్చార్జి అవడం.. లాంటి వన్నీ మహిళలకు కామన్‌గా కలిగే అనారోగ్య సమస్యలు. కొందరు అమ్మాయిలు వీటిని నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయరాదు. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
17. కొందరు అమ్మాయిలు కేవలం అందం లేదా డబ్బు మాత్రమే చూసి మంచి గుణాన్ని చూడకుండా అబ్బాయిలను పెళ్లి చేసుకుంటారు. అది మంచి నిర్ణయం కాదని గుర్తు పెట్టుకోవాలి.
18. కొందరు అమ్మాయిలు పెళ్లయ్యాక అత్త వారింట్లో ఆడపడుచులు, మరుదుల ప్రవర్తనను అంతగా అంచనా వేయలేకపోతారు. ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.
19. కొందరు అమ్మాయిలు కేవలం తమకు మాత్రమే తెలిసిన లేదా తమకు చెందిన కొన్ని రహస్యాలను మోసం చేసే ఇతరులకు చెబుతారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
20. ఉద్యోగం చేసే అమ్మాయిలు తమకు ఫేవర్ చేయమని ఉన్నత స్థాయిలో ఉన్న పురుష ఉద్యోగులతో శృంగారంలో పాల్గొంటారు. ఇది మంచిది కాదు.
21. కొందరు అమ్మాయిలు పెళ్లి అయ్యాక భర్తలు పెట్టే టార్చర్‌ను మౌనంగా భరిస్తారు. కానీ బయటకు చెప్పరు. ఇలా ఉండరాదు.
22. కొందరు యువతులు తమ పెళ్లి అయ్యాక తమ తల్లిదండ్రులనే కాదు, భర్త తల్లిదండ్రులను కూడా లెక్క చేయరు. ఈ పద్ధతి మంచిది కాదు.
23. కాస్మొటిక్స్, ఫోన్లు, దుస్తులు, ఇతర యాక్ససరీల కోసం కొందరు అమ్మాయిలు డబ్బును దుబారా చేస్తుంటారు. ఇది మంచిది కాదు.
24. పురుషులకు తాము ఎంత మాత్రం తక్కువ కాదు అన్న భావనలో కొందరు యువతులు మద్యం సేవించడం, పొగ తాగడం చేస్తారు. ఇది మంచిది కాదు. స్త్రీలైనా, పురుషులైనా ఆ వ్యసనాలు ఉంటే చెడిపోతారు తప్ప బాగుపడరు అనే విషయాన్ని ఎవరైనా గుర్తు పెట్టుకోవాలి.
25. కొందరు యువతులకు అబ్బాయిల పట్ల కేవలం ఆకర్షణ మాత్రమే కలుగుతుంది. కానీ దాన్ని లవ్ అనుకుంటారు.
26. కొందరు అమ్మాయిలు ఆడవాళ్లమన్న అహంభావంతో ఒక్కోసారి పురుషులను అవమానిస్తారు. అలా చేయరాదు.
27. రోజూ ప్రపంచంలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను, వారు ఎదుర్కొంటున్న వేధింపులను కొందరు అమ్మాయిలు పట్టించుకోరు. లేదా వాటి గురించి ఆలోచించరు.
28. కొందరు అమ్మాయిలు తమకు ముఖంపై వచ్చే మొటిమలను నలిపేస్తారు. అది మంచిది కాదు.
29. కొందరు యువతులు తమకు అబ్బాయిలతో ఉండే రిలేషన్‌షిప్ పట్ల కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ అవుతారు. లేదా కొన్ని సార్లు అస్సలు వారు ఆ ఆలోచనకే రారు. ఈ రెండు విధానాలు మంచివి కావు.
30. గర్భంతో ఉన్న మహిళలు అయితే పోషక పదార్థాలను తీసుకోవడం పట్ల అస్సలు శ్రద్ధ చూపించరు. ఇలా చేయరాదు. కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా చక్కని ఆహారం తీసుకోవాలి
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి