బట్టతల సమస్యకు విశాఖ కెజిహెచ్ చెక్:ఖరీదైన చెక్ పీఆర్పీ చికిత్స ఫ్రీ
బట్టతల సమస్య పరిష్కారం కోసం ఎంత డబ్బయినా ఖర్చు పెట్టేందుకు ఇల్లూఒళ్లు గుల్ల చేసుకుంటున్నవారికి ఇక ఆ పరిస్థితి లేకుండా అభయహస్తం అందిస్తోంది. బట్టతల ప్రాబ్లెమ్ కు చెక్ చెప్పే ఖరీదైన,మేలిమి చికిత్స ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా (పీఆర్పీ) ను విశాఖ కెజిహెచ్ ఆస్పత్రి ఉచితంగా అందజేస్తోంది. ఇలా నెలకు 60 మందికి ఈ పిఆర్పీ ట్రీట్ మెంట్ అందిస్తూ వారి పాలిట దైవస్వరూపంగా భాసిల్లుతోంది.
బట్టతల సమస్యతో బాధపడే ప్రతిఒక్కరూ వారు ఎంత డబ్బయినా ఖర్చు పెట్టి ఆ సమస్య లేకుండా చేసుకోవాలని తహతహలాడుతుంటారు. అయితే ఇందులో చాలామంది ఆర్థిక సమస్య కారణంగా అటు చికిత్స చేయించుకోలేక, ఇటు మనసును సర్థుబాటు చేసుకోలేక తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతుంటారు. మరోవైపు బట్టతల బాధితుల ఈ బలహీనతను ‘క్యాష్' చేసుకొనేందుకు అనేక సంస్థలు వారికి వివిధ రకాలుగా వల విసురుతూ ఉంటాయి. అందులో అనేకం బోగస్ సంస్థలు కూడా ఉంటుంటాయి. ఈ సంస్థల వల్ల అటు డబ్బు పోయి శని పట్టినట్లు అవుతుంటుంది బట్టతల బాధితుల పరిస్థితి.
అయితే ఇలాంటి విపత్కర సమయంలో అలాంటి బట్టతల బాధితుల పట్ల ఆపద్భాంధవుడిలా అవతరించింది విశాఖ కెజిహెచ్ ఆస్పత్రి చర్మ వ్యాధుల విభాగం. ఈ సమస్యకు చక్కటి పరిష్కారమైన పిఆర్పీ చికిత్సను రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తూ వారి జీవితంలో నూతన వెలుగులు నింపుతోంది. జుట్టు రాలిన చోట ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా (పీఆర్పీ) చికిత్సతో మళ్లీ వెంట్రుకలను మొలిపించడమే ఈ ట్రీట్ మెంట్ విధానం. ఈ చికిత్సకు బయట మార్కెట్‌లో సొమ్ములు భారీగానే వసూలు చేస్తారు. కానీ ఈ ఖరీదైన ట్రీట్ మెంట్ ను కేజీహెచ్‌లో నెలకు 60 మందికి ఉచితంగానే చేస్తున్నారు.
చికిత్స ఎలాగంటే?...ఇందుకోసం ముందుగా రోగి నుంచి రక్తాన్ని సేకరించి సెంట్రిఫ్యూజ్ అనే యంత్రం సాయంతో పీఆర్పీని విడదీస్తారు. ఆపై జుట్టు రాలిపోయిన చోట దానిని ఇంజెక్ట్ చేస్తారు. కొన్నివారాల తర్వాత నెమ్మదిగా వెంట్రుకలు రావడం మొదలవుతుంది. సమస్య తీవ్రత బట్టి రోజుల వ్యవధిలో 10 నుంచి 20 ఇంజెక్షన్లు చేస్తారు. వైద్యులు సూచించే కొన్నిరకాల మందులు వాడాల్సి ఉంటుంది. అయితే అందరికీ ఈ చికిత్స సత్ఫలితాలు ఇవ్వదని తెలుస్తోంది. అదొక్కటే ఇందు డ్రా బ్యాక్. అందుకోసమే ఈ ట్రీట్ మెంట్ చేయబోయే వ్యక్తికి రక్తం, షుగర్, హార్మోన్స్, కొవ్వుశాతం, లోకల్ పరిస్థితి, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ వంటి పరీక్షలు చేస్తారు. ఆ ఫలితాల ఆధారంగానే చికిత్స మొదలుపెట్టి జట్టు మెలిచేలా చేస్తారు.
ఇటీవలికాలంలో మారిపోతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, నిద్రలేమి, ఒత్తిడితో కూడిన ఉద్యోగాలే జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం. ఈ సమస్యకు కెజిహెచ్ లో అత్యాధునిక చికిత్స అందిస్తున్నామని ఇక్కడ చర్మవ్యాధుల విభాగాధిపతి డాక్టర్ బాలచంద్రుడు మీడియాకు వివరించారు. పీఆర్పీ చికిత్సకు బయట భారీగానే ఖర్చు అవుతుందని...ఒక్కో ఇంజెక్షన్‌కు రూ.2వేలు వసూలు చేస్తారని ఈ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ గురుప్రసాద్ తెలిపారు. అలా కనీసం 5 నుంచి 15 సిట్టింగ్‌లు ఈ ట్రీట్ మెంట్ కు అవసరం అవుతుందని...కానీ తాము కెజిహెచ్ లో ఈ ట్రీట్ మెంట్ ను ఉచితంగానే అందిస్తున్నామని...మెరుగైన ఫలితాలే వస్తున్నాయని డాక్టర్ గురుప్రసాద్ వెల్లడించారు.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
మన గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి